అమెరికాలో మళ్లీ స్కూల్లో కాల్పులు కలకలం రేపాయి. ఓరెగావ్ రాష్ట్రంలో ఓ హైస్కూల్ వెలుపల జరిగిన కాల్పుల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది మాఫియా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపినవాళ్లు వెంటనే అక్కడినుంచి పారిపోవడంతో వాళ్లను పట్టుకోడానికి గాలింపు మొదలైంది. గాయపడిన వాళ్లలో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వాళ్లంతా స్పృహలోనే ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.
ఉత్తర పోర్ట్లాండ్ లోని రోజ్మేరీ ఆండర్సన్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గాయపడిన వాళ్లు వెంటనే స్కూల్లోకి పరుగులు తీశారని, వెంటనే కాల్పులు జరిపినవాళ్లు పారిపోయారని తెలిపారు. మామూలు హైస్కూళ్లలో ఫీజులు కట్టి చదువుకునే స్థోమత లేని పిల్లల కోసం సమాజంలో ఉన్నవాళ్ల విరాళాలతో ఈ పాఠశాల నడుస్తుంటుంది. కాల్పులు జరిపినవాళ్లకు మాఫియా గ్యాంగులతో సంబంధం ఉండి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అమెరికా స్కూల్లో కాల్పులు.. ముగ్గురికి గాయాలు
Published Sat, Dec 13 2014 9:00 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement