పెద్ద వడుగూరు(అనంతపురం): జాతీయ రహదారిపై రోజురోజుకీ ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం తెల్లవారుజామున కాళేశ్వరీ ట్రావెల్స్ బస్సు, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలం మిడతూరు వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని గుత్తి ఆస్పత్రికి తరలించారు.హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లారీని ఢీకొన్న బస్సు: ముగ్గురికి గాయాలు
Published Wed, Jun 3 2015 8:17 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement