మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య మరో వివాదం చెలరేగింది.
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య మరో వివాదం చెలరేగింది. పరిటాల వర్గీయులు చేపట్టిన విద్యుత్ కేబుల్ పనులను ఎమ్మెల్యే సూరి వర్గంవారు అడ్డుకున్నారు. దీంతో పరిటాల, సూరి వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు పరిటాల వర్గీయులకు గాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కాగా సూరి వర్గీయులు పోలీసుల ద్వారా కేబుల్ పనులను ఆపేందుకు యత్నించారు. దీంతో పోలీసులతో మంత్రి పరిటాల వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. కేబుల్ పనులు కొనసాగించి తీరుతామని పరిటాల వర్గీయులు స్పష్టం చేశారు.