నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ కేబుల్ పనుల నిర్వహణ నేపథ్యంలో శ్రీనగర్‌కాలనీ రోడ్–నిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రెడ్ రోజ్ హోటల్ మధ్య మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ ఇన్చార్జ్ కొత్వాల్ డీఎస్ చౌహాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి గురువారం నుంచి 43 రోజుల పాటు అమలులో ఉంటాయని, వాహనచోదకులు సహకరిం చాలని ఆయన కోరారు. భారీ వాహనాల తో పాటు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులకు మాత్ర మే ఈ మళ్లింపులు వర్తించనున్నాయి.
⇔ సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు వైపు నుంచి పంజగుట్ట వైపు వచ్చే వాహనాలను కూకట్పల్లి వై జంక్షన్ నుంచి నర్సాపూర్ చౌరస్తా, బాలానగర్, ఫిరోజ్‌గూడ, బోయిన్పల్లి జంక్షన్, తాడ్‌బండ్ జంక్షన్, లాలమ్రాయ్, సీటీఓ, ప్యారడైజ్ చౌరస్తా, ఎంజీ రోడ్, రాణిగంజ్ జంక్షన్, కర్బాలా మైదాన్, అప్పర్ ట్యాంక్‌బండ్, అంబేడ్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్, సెక్రటేరియేట్ పాత రోడ్డు, ఏజీ ఆఫీస్, రవీంద్రభారతి మీదుగా పంపిస్తారు.
⇔ పటాన్చెరు, మియాపూర్, కూకట్పల్లి వైపు నుంచి అమీర్‌పేట, పంజగుట్ట మీదుగా ఏపీ, రాయలసీమల్లోని గమ్య స్థానాలకు వెళ్ళే ప్రైవేట్ బస్సులను ఎస్సార్‌నగర్‌లోని గౌతమ్ డిగ్రీ కాలేజీ పాయింట్ నుంచి కూకట్పల్లి వైపు పంపిస్తారు.
⇔ పటాన్చెరు, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వచ్చే సిటీ బస్సులు, భారీ వాహనాలను ఎస్సార్‌నగర్ చౌరస్తా నుంచి కమ్యూనిటీ హాల్, ఆర్ అండ్ బి సిగ్నల్, సోనాబాయ్ టెంపుల్, అమీర్‌పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, డీకే రోడ్ జంక్షన్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప ఐలాండ్, సోమాజిగూడ రోడ్, రాజ్‌భవన్ రోడ్ మీదుగా పంపిస్తారు.
⇔ ఇదే మార్గంలో వచ్చే ఆర్టీసీ బస్సులను అమీర్‌పేట జంక్షన్ నుంచి మాతా టెంపుల్, డీకే రోడ్ జంక్షన్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్, మొనప్ప ఐలాండ్, సోమాజిగూడ రోడ్, రాజ్‌భవన్ రోడ్ మీదుగా పంపిస్తారు.
⇔ కృష్ణనగర్ నుంచి శ్రీనగర్‌కాలనీ రోడ్ మీదుగా ఖైరతాబాద్ వైపు వచ్చే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను షాలిమార్ జంక్షన్ నుంచి శ్రీనగర్‌కాలనీ జీహెచ్ఎంసీ పార్క్, ఎంజే ఇంజినీరింగ్ కాలేజీ, నాగార్జున సర్కిల్, జీవీకే వన్ మాల్, తాజ్ కృష్ణ జంక్షన్, కేసీపీ జంక్షన్, చీఫ్ ఇంజనీర్స్ ఆఫీస్ మీదుగా మళ్లిస్తారు.
⇔ కృష్ణనగర్ నుంచి శ్రీనగర్‌కాలనీ రోడ్ మీదుగా బేగంపేట/ఎస్సార్‌నగర్ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని షాలిమార్ జంక్షన్ నుంచి కృష్ణనగర్ చౌరస్తా, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్, యూసుఫ్‌గూడ బస్తీ, కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్‌నగర్, వెంగళ్రావు నగర్, ఎస్సార్‌నగర్ మీదుగా పంపిస్తారు.