ధర్మవరంలో కొనసాగుతున్న 144 సెక్షన్
Published Thu, Oct 27 2016 11:09 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM
ధర్మవరం: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో పోలీసు నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. దీపావళిని పురస్కరించుకుని మంత్రి పరిటాల సునీత వర్గీయులు పట్టణంలో ఏర్పాటు చేసిన పోస్టర్‌లో స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ ఫొటో లేకపోవటంతో బుధవారం ఆయన వర్గీయులు గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో డీఎస్పీ వేణుగోపాల్ 144వ సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి పట్టణంలో 120 మంది పోలీసు సిబ్బంది పహారా కాశారు. గురువారం ఉదయం ప్రశాంత పరిస్థితులు ఏర్పడటంతో ఇద్దరు సీఐలు, 20 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల నిర్వహణలో ఉన్నారు. నవంబర్ 2వ తేదీ వరకు 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని డీఎస్పీ తెలిపారు.
Advertisement
Advertisement