
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత ముఖ్య అనుచరుడి భూ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేత, రామగిరి మాజీ ఎంపీపీ బాలరంగయ్య ధర్మవరంలో 3 కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో 8.5 సెంట్ల మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. నకిలీ పత్రాలతో తన పేరిట రిజిస్టర్ చేయించుకున్న బాలరంగయ్య, పరిటాల సునీతకు ప్రధాన అనుచరుడు. బాలరంగయ్య ఇచ్చిన నకిలీ పత్రాలతో మున్సిపల్ స్థలాన్ని అప్పటి సబ్ రిజిస్టర్ చేశారు. కాగా ఈ అక్రమాలను గుర్తించిన ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున మున్సిపల్ స్థలాన్ని అక్రమంగా రిజస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. బాల రంగయ్య, సబ్ రిజిస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘ప్రజలను ఆ కుటుంబం మోసం చేసింది’
Comments
Please login to add a commentAdd a comment