డివైడర్ను ఢీకొట్టిన కారు : ముగ్గురికి గాయాలు | three injured in road accident in ysr district | Sakshi
Sakshi News home page

డివైడర్ను ఢీకొట్టిన కారు : ముగ్గురికి గాయాలు

Published Tue, Aug 2 2016 8:15 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

three injured in road accident in ysr district

దువ్వూరు : కడప జిల్లా దువ్వూరు చెరువు సమీపంలో మంగళవారం కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన జ్యోత్స్న, బ్రహ్మయ్య, చాంద్బాషా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. డివైడర్లోకి దూసుకుపోయిన కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement