duvvuru
-
YSR Pension Kanuka: ఒక పోస్ట్‌మాస్టర్ పెన్షన్ కథ!
నాపేరు తబ్బిబ్బు మహానందప్ప. నా వయసు 84 సంవత్సరాలు. నేను ఉమ్మడి కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో జన్మించాను. ఆ కాలంలోనే అంటే 1961 లో పీయూసీ చదివి కర్నూల్ మెడికల్ కాలేజీలో 1961–63 సంవత్సరాలలో 3 సంవత్సరాల కాంపౌండర్ కోర్సు, 1965లో హిందీ ప్రవీణ ప్రచారక్ కోర్సులను పూర్తి చేశాను. ఆ తర్వాత 1970లో గ్రామంలోనే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగం రావడంతో ఆ ఉద్యోగం చూసుకుంటూ స్వగ్రామంలోనే స్థిరపడ్డాను. పోస్ట్ మాస్టర్ ఉద్యోగం అదనపు శాఖా ఉద్యోగం (ఈడీ) కావడంతో జీతం చాలా తక్కువ వచ్చేది. ఉద్యోగం ప్రారంభంలో నా జీతం 30 రూపాయలు మాత్రమే. అలవెన్సు కింద మరో 15 రూపాయలు ఇచ్చేవారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌గా 36 ఏళ్ళు పనిచేసి 2006 సంవత్సరంలో పదవీ విరమణ చేశాను. తపాలా శాఖ కేంద్ర ప్రభుత్వం అధీనంలోనిదే అయినా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పదవీ విరమణ తర్వాత ఎలాంటి పెన్షన్ లేదు. పోస్ట్ మాస్టర్‌గా సుదీర్ఘ కాలం పని చేసినప్పటికీ కంటి తుడుపుగా గ్రాట్యుటీ పేరుతో కేవలం 48 వేల రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి సాగనంపారు. ఆ డబ్బులు కనీస అవసరాలను కూడా తీర్చలేక పోయాయి. అరకొర జీతంతోనే మా బ్రాంచ్ పోస్టాఫీసు పరిధిలోని తొమ్మిది గ్రామాలకు సేవలను అందించాను. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు మా బ్రాంచ్ ఆదాయం నెలకు రెండువేల రూపాయలు ఉండేది. నేను రిటైర్ అయ్యే నాటికి ఆ ఆదాయం నెలకు 25 వేల రూపాయలకు పెరిగింది. నా జీతం మాత్రం ‘గొర్రె తోక బెత్తెడు’ అన్న చందాన పదవీ విరమణ నాటికి 2,800 రూపాయలే. గ్రామీణ ప్రజలకు తపాలా సేవలను అందించడంతోపాటు కాంపౌండర్‌గా శిక్షణ పొంది ఉండటంవల్ల వైద్యసేవలు కూడా అందించాను. పదవీ విరమణ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యం మాత్రమే కనబడింది. నా జీవన పోరాటంలో భాగంగా మైదుకూరులో నివాసం ఉంటూ ఈ వయసులో కూడా వైఎస్ఆర్ జిల్లా, దువ్వూరు మండలం, గుడిపాడులో ఒక ప్రైవేటు విద్యాసంస్థలో పార్ట్ టైం హిందీ బోధకుడిగా పనిచేస్తున్నాను. జగనన్న ప్రభుత్వం అందచేసే ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ కింద గత నెల దాకా 2,500 రూపాయలు అందించేవారు. తాజాగా ఈ మొత్తాన్ని మరో 250 రూపాయలు పెంచడం ఆనందదాయకం. పెరిగిన మొత్తంతో కలిపి 2,750 రూపాయలు జనవరి 1వ తేదీ కానుకగా అందుకున్నాను. మా వార్డ్ వాలెంటీర్ ‘యాష్మిన్’ అనే అమ్మాయి ప్రతి నెలా ఒకటో తేదీనే మా ఇంటి కొచ్చి ఠంచనుగా పింఛన్ అందచేస్తోంది. ఈ పింఛనే నా ఆత్మగౌరవాన్ని కాపాడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. (క్లిక్ చేయండి: అనారోగ్య అగ్రరాజ్యం.. బయటపడిన అమెరికా డొల్లతనం) – టి. మహానందప్ప, రిటైర్డ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, మైదుకూరు -
సీఎం జగన్ ప్రత్యేక చొరవ: 48 గంటల్లో భూవివాదం పరిష్కారం
-
సీఎం జగన్ ప్రత్యేక చొరవ: 48 గంటల్లో భూవివాదం పరిష్కారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: భూవివాదం విషయంలో సెల్ఫీ వీడియో తీసుకున్న కుటుంబం వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కుటుంబ సమస్య పరిష్కారమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన అక్బర్ బాషాకు సంబంధించిన పొలం వివాదం ఉంది. తనకు న్యాయం చేయాలని అక్బర్ కుటుంబంతో కలిసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ అతడి సమస్యపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో సమస్యను 48 గంటల్లోనే పరిష్కారమైంది. ఆ పొలం వివాదం సమసిపోయింది. ఈ విషయాన్ని బాధితుడు అక్బర్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపాడు. తమకు సీఎం జగన్ న్యాయం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి సమష్టి కృషితో సమస్య పరిష్కారమైందని వివరించాడు. తమ పొలం సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని ప్రకటించాడు. చదవండి: బ్యాంక్‌కు నిద్రలేని రాత్రి.. అర్ధరాత్రి పాము హల్చల్ -
కడప-కర్నూలు హైవేపై రోడ్డుప్రమాదం
-
ఘోర ప్రమాదం; ఇద్దరు సజీవ దహనం
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలోని దువ్వూరు మండలం చింతకుంట సమీపంలోని కడప-కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. వివరాలు.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కడప జిల్లా మైదుకూరు వైపు వెళుతున్న సిమెంట్ లారీ రహదారి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్ మంటల దాటికి తట్టుకోలేక సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు. -
7వరోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, దువ్వూరు : ఏడోరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం 8.30 గంటలకు దువ్వూరు శివారు నుంచి పాదయాత్రను ఆరంభించారు. ఎంకుపల్లి, జిల్లెల, కనగూడూరు, ఇడమడకల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. కానగూడూరులో జెండా ఆవిష్కరణతో పాటు బీసీ నాయకులతో వైఎస్ జగన్ ముఖాముఖీ కానున్నారు. అలాగే చాగలమర్రి శివారులో ఆయన ఇవాళ రాత్రి బస చేస్తారు. -
పిల్లల చదువుతోనే అభివృద్ధి
-
దువ్వూరులో వైఎస్ జగన్‌కు జననీరాజనం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఏమాత్రం లేదని, ప్రాజెక్టుల్లో లంచాలు ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన పరిపాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఆరోరోజు ఆదివారం సాయంత్రం మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు చేరుకున్నారు. దువ్వూరులో అశేష జనవాహిని జననేత వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు పాదయాత్రకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. తనపట్ల చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయత, ప్రేమాభిమానాలు చూపుతున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఇక్కడికి వచ్చేటప్పుడు మన పొలాల్లో నాట్లు పడే విషయాన్ని గమనించాను దివంగత నేత, వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో ఆగస్టు 20వ తారిఖు కల్లా కేసీ కెనాల్ ద్వారా రైతులకు నీళ్లు వదిలేవారు. ఆగస్టు కల్లా నాట్లు పడేవి. కానీ, ఇవాళ నవంబర్ వచ్చింది ఇప్పుడు నీళ్లు వదులుతున్నారు. ఇప్పుడిప్పుడు నాట్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది టీడీపీ నాలుగేళ్ల పరిపాలనలో ఏ ఒక్కసారైనా ఇక్కడ రెండు పంటలు పండాయా? రాజశేఖరరెడ్డి పరిపాలనలో ఇదే కేసీ కెనాల్ మీద రెండు పంటలు పండాయి ఇవాళ రైతులను, పేదలను, విద్యార్థులను, వృద్ధులను పట్టించుకునే పరిస్థితిలో ఈ చంద్రబాబు ప్రభుత్వం లేదు పత్తి కిలోకి రూ. 30 కూడా ధర పలకడం లేదు. ఉల్లి, టమాట, పసుపు ఇలా అన్ని పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాట ధర లభించడం లేదు కేవలం పేదవాని భూములు లాక్కునేందుకు.. లంచాలు పుచ్చుకొని ఎలా భూములు కంపెనీలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు కేబినెట్ మీటింగ్‌లు జరుపుతున్నారు రాయలసీమ ప్రాంతంలో మైనస్ శాతం వర్షపాతం లోటు నమోదైంది. రైతులు పండించిన గిట్టుబాటు ధర లేదు. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు ఈ సమస్యలపై ఏనాడూ చంద్రబాబు కేబినెట్ మీటింగ్ పెట్టలేదు. చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా పనిచేస్తోంది కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజోలిబండ ప్రాజెక్టుకు దివంగత నేత వైఎస్సార్ తన హయాంలో రూ. 630 కోట్లతో అనుమతి ఇస్తే.. ఇవాళ చంద్రబాబు పాలనలో ఆ ప్రాజెక్టును పట్టించుకొనే దిక్కుదీవాణం లేదు. పక్కనే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా ఉంది శ్రీశైలం నిండుగా ఉన్నా మనకు నీళ్లు రావడం లేదు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని ప్రతి ప్రాజెక్టుకు నీళ్లు అందించాలని వైఎస్సార్ కలలు కన్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 85శాతం పనులు దివంగత నేత, నాన్నగారే పూర్తి చేశారు. కేవలం 15శాతం పనులు ఈ చంద్రబాబు ప్రభుత్వం తన నాలుగేళ్లకాలంలో పూర్తిచేయలేదు. ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచనతో చంద్రబాబు పాలన సాగడం లేదు కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో లంచాలు ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతోనే బాబు పాలన సాగుతోంది చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాలు మాఫీ కాలేదు చంద్రబాబు తన పాలనలో అన్ని వర్గాల వారిని మోసం చేశారు దువ్వూరులో వైఎస్ జగన్ ప్రసంగం -
ఘనంగా కేఎంసీ వజ్రోత్సవం
డాక్టర్ దువ్వూరు భాస్కరరెడ్డి విగ్రహాం ఆవిష్కరణ – గురువులకు ఘన సన్మానం – అలరించిన సాంస్క్రృతిక కార్యక్రమాలు కర్నూలు(టౌన్): కర్నూలు వైద్య కళశాల వజ్రోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక న్యూ బ్లాక్ లెక్చరర్ గ్యాలరీలో, న్యూ ఆడిటోరియంలో వజ్రోత్సవాలను పురస్కరించుకుని గురువులకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక న్యూ లెక్చరర్ గ్యాలరీలో వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, హైదరబాద్‌కు చెందిన ఏషియన్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు వైద్య కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎస్.రామప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామిలు ఘన స్వాగతం పలికారు. గ్యాస్ట్రో ఎంటారాలజి ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ శర్మ తయారు చేయించిన మాజీ ప్రిన్సిపాల్, పెథాలజి విభాగం మాజీ అధిపతి డాక్టర్ దువ్వూరు భాస్కర్‌రెడ్డి విగ్రహాన్ని ఆయన కుమారుడు పద్మభూషణ్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. వైద్య విజ్ఞాన సదస్సును జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం డాక్టర్ నాగేశ్వరరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎంఈ వెంకటేష్, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, మెడిసిన్ డిపార్టుమెంట్ హెచ్ఓడీ డాక్టర్ పి.సుధాకర్, కేఎంసీ అల్యుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎస్.వెంకటరమణ, గ్యాస్ట్రో ఎంటారాలజి హెచ్ఓడి డాక్టర్ శంకర్ శర్మ, డెర్మాటాలజి హెచ్ఓడి డాక్టర్ ఐ.సి. రెడ్డి, మాజీ డియంఇ సత్తార్, డాక్టర్ జయప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కళశాలతో ఉన్న అనుబంధాన్ని మరువలేను : డాక్టర్ నాగేశ్వరరెడ్డి కర్నూలు వైద్య కళశాలతో ఉన్న అనుబంధాన్ని మరువలేను. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో లెక్చర్ ఇచ్చినా... ఇక్కడికి రావడం సంతృప్తిగా ఉంటుంది. కర్నూలు వైద్య కళాశాలకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. గురువు చెప్పిన పాఠాలు, క్రమశిక్షణను అలవర్చుకుంటే ఉత్తమ వైద్య విద్యార్థిగా రాణించవచ్చు. ఎండోస్కోపి విభాగంలో అనేక నూతన మార్పులు వచ్చాయి. ఎప్పటికప్పుడు వైద్య విద్యార్థులు నూతన వైద్య విధానాలపై అవగాహన పెంచుకోవాలి. డయాబెటిక్ చికిత్సలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. చిన్నపేగు ద్వారా మధుమేహన్ని ఎండోస్కోపి చేసి నియంత్రించవచ్చు. ఘనంగా గురువులకు సన్మానం సాయంత్రం స్థానిక న్యూ ఆడిటోరియంలో కర్నూలు వైద్య కళశాలలో చదివి ఉన్నత పదవుల్లో పదవీ విరమణ పొందిన మాజీ ప్రొఫెసర్లు, వైద్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఎంఈ వెంకటేష్, కర్నూలు వైద్య కళశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ప్రభత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరస్వామి, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథరెడ్డి, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డాక్టర్ వెంకటరమణ తదితరుల పాల్గొన్నారు. అనంతరం సీనియర్ వైద్యులు, మాజీ కళశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లను ఘనంగా సన్మానించారు. వజ్రోత్సవాల సందర్భంగా కళశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
30 మంది స్మగ్లర్లకు రిమాండ్
మైదుకూరు టౌన్: 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లను మైదుకూరు కోర్టులో శుక్రవారం హాజరు పరచినట్లు మైదుకూరు, దువ్వూరు ఎస్ఐలు చలపతి, విద్యాసాగర్ తెలిపారు. మైదుకూరు, దువ్వూరు ప్రాంతాలలో ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడిన కడప, అనంతపురం జిల్లాలతోపాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారిని కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్ఐలు చెప్పారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు వివరించారు. -
ప్రత్యేక హోదా సాధన కోసం తిరుమలకు పాదయాత్ర
మైదుకూరు టౌన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి తనయుడు దువ్వూరు మాజీ ఎంపీపీ గోపాల్‌రెడ్డి ఆధ్వరంలో గురువారం దువ్వూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను తిరుపాల్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలకుల మనసులు మారి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కోసం ఈ పాదయాత్రను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 40 మందితో కలసి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. ఈ పాదయాత్రలో ఎం.రామ్‌నాథ్‌రెడ్డి, వీరారెడ్డి, శివానందరెడ్డి, యల్లారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర మైదుకూరు సమీపంలో కి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు గోశెట్టి లక్షుమయ్య, ధనపాల జగన్, రవీంద్రలు ఘన స్వాగతం పలికి సంఘీభావం పలికారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు : ముగ్గురికి గాయాలు
దువ్వూరు : కడప జిల్లా దువ్వూరు చెరువు సమీపంలో మంగళవారం కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన జ్యోత్స్న, బ్రహ్మయ్య, చాంద్‌బాషా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. డివైడర్లోకి దూసుకుపోయిన కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
దువ్వూరు (వైఎస్సార్ జిల్లా) : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 20 మంది స్మగ్లర్లు దువ్వూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పట్టుబడినవారంతా తమిళనాడుకు చెందినవారుగా గుర్తించారు. వారి నుంచి ఓ ఆటోను, రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
టవేరా బోల్తా:నలుగురు అయ్యప్ప భక్తుల మృతి
-
టవేరా బోల్తా:నలుగురు అయ్యప్ప భక్తుల మృతి
పొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలుకు చెందిన అయ్యప్ప భక్తులు టవేరా వాహనంలో శబరిమలై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దువ్వూరు సమీపంలోకి వచ్చిన తరువాత వారు ప్రయాణిస్తున్న టవేరా వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన ఇద్దరిని పొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.