సాక్షి, వైఎస్సార్ జిల్లా: భూవివాదం విషయంలో సెల్ఫీ వీడియో తీసుకున్న కుటుంబం వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కుటుంబ సమస్య పరిష్కారమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన అక్బర్ బాషాకు సంబంధించిన పొలం వివాదం ఉంది. తనకు న్యాయం చేయాలని అక్బర్ కుటుంబంతో కలిసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు.
చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్
అతడి సమస్యపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో సమస్యను 48 గంటల్లోనే పరిష్కారమైంది. ఆ పొలం వివాదం సమసిపోయింది. ఈ విషయాన్ని బాధితుడు అక్బర్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపాడు. తమకు సీఎం జగన్ న్యాయం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి సమష్టి కృషితో సమస్య పరిష్కారమైందని వివరించాడు. తమ పొలం సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని ప్రకటించాడు.
చదవండి: బ్యాంక్‌కు నిద్రలేని రాత్రి.. అర్ధరాత్రి పాము హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment