
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలోని దువ్వూరు మండలం చింతకుంట సమీపంలోని కడప-కర్నూలు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు. వివరాలు.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కడప జిల్లా మైదుకూరు వైపు వెళుతున్న సిమెంట్ లారీ రహదారి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో లారీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్ మంటల దాటికి తట్టుకోలేక సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment