స్కూల్ బస్సును ఢీకొట్టిన మరో బస్సు | Three injured in road accident in visakhapatnam | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సును ఢీకొట్టిన మరో బస్సు

Published Fri, Dec 4 2015 11:59 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three injured in road accident in visakhapatnam

విశాఖపట్నం : రహదారిపై ఆగి ఉన్న స్కూల్ బస్సును మరో స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్తోపాటు మరో వ్యక్తి గాయపడ్డాడు. రహదారిపై వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై చైతన్య స్కూల్ ఆగి ఉంది.  వెనక నుంచి వచ్చిన కృష్ణవేణి స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement