
మాజీమంత్రి బాలరాజుకు తృటిలో తప్పిన ప్రమాదం
విశాఖ : మాజీమంత్రి బాలరాజు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలరాజు తలకు, కాలికి గాయాలు అయినట్లు సమచారం. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు గాయపడ్డారు. నర్సీపట్నం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.