రెండు కార్లు ఢీకొని ఇద్దరు మృతి | Two die in Road accident | Sakshi
Sakshi News home page

రెండు కార్లు ఢీకొని ఇద్దరు మృతి

Published Thu, Jul 23 2015 3:52 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Two die in Road accident

పశ్చిమ గోదావరి (తాడేపల్లిగూడెం) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆటోనగర్ వద్ద జాతీయరహదారిపై గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న మహీంద్రా వాహనం అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన తాడేపల్లిగూడెంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement