విధుల్లో కానిస్టేబుల్‌.. క్షణాల్లో దూసుకొచ్చిన బస్సు | Three Injured Severely In Kanchipuram Road Accident | Sakshi
Sakshi News home page

విధుల్లో కానిస్టేబుల్‌.. క్షణాల్లో దూసుకొచ్చిన బస్సు

Published Sun, Jan 20 2019 11:23 AM | Last Updated on Sun, Jan 20 2019 11:34 AM

Three Injured Severely In Kanchipuram Road Accident - Sakshi

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లున్న బస్సు

చైన్నై : తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ను అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌తో పాటు రోడ్డు పక్కన నిల్చున్న మరో ఇద్దరు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. గుడువాంజేరి పట్టణంలోని ఓ కూడలి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా నడిరోడ్డుపై నిల్చుని డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్‌ను బస్సు ఢీకొడుతున్న చిత్రాలు కూడలిలో ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అతివేగమే ఇంతటి ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. కాగా, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement