తిరుమలలో తొక్కిసలాట, ముగ్గురికి గాయాలు | Stampede at Tirumala Temple, 3 injured | Sakshi
Sakshi News home page

తిరుమలలో తొక్కిసలాట, ముగ్గురికి గాయాలు

Published Thu, Apr 10 2014 10:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM

Stampede at Tirumala Temple, 3 injured

తిరుమల : తిరుమలలో  అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. గర్భాలయంలోకి ప్రవేశించిన అనంతరం ధ్వజ స్థంభం వద్ద భక్తులు ఒక్కసారిగా తోసుకు రావటంతో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా యాదవేలుకు చెందినవారు.

చిత్తూరు జిల్లా నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తిరుమలకు చేరుకున్న కళాకారుల బృందాలకు టిటిడి బుధవారం స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసింది. ఈ కళాకారుల బృందాలను నిన్న సాయంత్రం శ్రీవారి దర్శనానికి అనుమతించారు. మహాద్వారం దాటి వెళ్లిన అనంతరం సిబ్బంది ఒక్కసారిగా భక్తులను వదలడంతో భక్తులు పరుగులు తీశారు.

ఈ సందర్భంగా వెండి వాకిలి వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో వారి వెంట ఉన్న చిన్నారులు స్వల్ప గాయాలకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. గాయపడిన పావని, జయలక్ష్మి, లోకేష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement