రెండు ఆర్టీసీ బస్సులు ఢీ; 40మందికి గాయాలు | Two rtc buses hitting at Tirumala ghat road | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ; 40మందికి గాయాలు

Published Sun, Jan 11 2015 6:05 AM | Last Updated on Tue, Aug 28 2018 5:55 PM

Two rtc buses hitting at Tirumala ghat road

తిరుమల: తిరుమల రెండో ఘాట్ లోని 11వ మైలురాయి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 40 మంది భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించినట్టు సమాచారం.

బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యం బస్సు నడపడంతోనే ఈ ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు ఆరోపిస్తున్నారు. రుయా ఆస్పత్రి వద్ద బస్సు డ్రైవర్ పై దాడి చేసేందుకు ప్రయాణికులు దాడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. గాయపడినవారంతా గుజరాత్ రాజకోట్ కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement