గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం | Three injured in gas cylinder explosion incident | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం

Published Thu, Dec 3 2015 4:49 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

Three injured in gas cylinder explosion incident

లక్నో: గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ లోని హర్డోయ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హర్డోయ్ జిల్లా ఆసుపత్రి ఎదుట నేటి మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఓ గ్యాస్ సిలిండర్ పేలింది.

దీంతో సమీపంలో ఉన్న గ్యారేజీలో కారు రిపేర్ చేస్తున్న ఇద్దరు వర్కర్లు, వాహన యజమాని గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం రాజధాని లక్నోలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement