Gas cylinder explosion
-
గ్యాస్ సిలిండర్ పేలుడు.. పోలీసులు సహా 30 మందికి గాయాలు
పాట్నా: బిహార్ ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనంలో భారీ మంటలు చెలరేగాయి. వీటిని ఆర్పేందుకు వచ్చిన ఏడుగురు పోలీసులు సహా మొత్తం 30 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒడియా గలి సమీపంలోని అతిచిన్న వీధిలో ఈ ఘటన జరగడంతో సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు తలెత్తాయి. ఛట్ పూజ సన్నాహాల్లో భాగంగా ఓ మహిళ ప్రసాదం తయారు చేస్తుండగా.. గ్యాస్ లీకై ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం క్షణాల్లోనే మంటలు భవనమంతా వ్యాపించాయి. చదవండి: కోర్టులో మహిళా లాయర్ల సిగపట్లు.. వీడియో వైరల్.. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
ముంచంగిపుట్టు: బంగారుమెట్ట పంచాయితీ వదనపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఇంటిలో ఉన్న వారు ప్రమాదాన్ని గ్రహించి వెంటనే పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులు అందించిన వివరాలిలా ఉన్నాయి. వదనపల్లిలో కొర్రా సన్యాసిరావు ఇంటిలో సాయంత్రం అతని భార్య బాలబుడి టీ పెట్టడం కోసం గ్యాస్ స్టౌ వెలిగించింది. అప్పటికే గ్యాస్ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించకపోవడంతో స్టౌ వెలిగించిన వెంటనే సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సన్యాసిరావు, అతని భార్య బాలబుడి, మనవరాలు భవానీతో బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే ఇంట్లో మంటలు వ్యాప్తి చెంది, గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి ఇంటిపై కప్పు రేకుల నుంచి బయటకు వచ్చి పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్తులంతా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఇంట్లో కాలుతున్న పలు వస్తువులను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కాలి బూడిదయ్యాయి.రూ.90వేలు డబ్బులతో పాటు 10 ధాన్యం బస్తాలు. 3 చోడి బస్తాలు, దుస్తులు, రేషన్ కార్డు, గృహోపకరణ వస్తువులు కాలిపోయి నిలువ నీడలేనివారయ్యారు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు సన్యాసిరావు, బాలబుడి తెలిపారు. తహసీల్దార్ నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కొండమ్మ, వైఎస్సార్సీపీ మండల నేత జగన్నాథం, వీఆర్వో రమేష్‌లు గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి, దగ్ధమైన ఇంటిని పరిశీలించారు.జరిగిన నష్టంపై వివరాలను సేకరించారు. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులకు రేషన్ సరుకులు అందించారు. (చదవండి: ప్లాస్టిక్ నిషేధం తక్షణ అవసరం) -
అనంతపురం: ములకలేడులో పేలిన గ్యాస్‌సిలిండర్.. పేలుడు ధాటికి కుప్పకూలిన ఇళ్లు
-
కాకినాడ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం
సాక్షి, కాకినాడ: కాకినాడ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న ఓ టీకొట్టులో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. భారీ శబ్దం రావడంతో మత్స్యకారులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదానికి సమీపంలోనే హార్బర్ పెట్రోల్ బంక్ ఉంది. కానీ, ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. -
‘నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారా’
సాక్షి, ధర్మారం(ధర్మపురి): గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకొడుకు సజీవ దహనం అయిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో విషాదం నింపింది. అర్ధరాత్రి ఘటన చోటుచేసుకోవడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు..దొంగతుర్తి గ్రామానికి చెందిన గొట్టె నారాయణ మొదటి భార్య మృతిచెందగా, రెండోభార్యకు విడాకులు ఇచ్చి, యశోదను మూడోపెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం యశోద(45)తో కలిసి ఉంటున్నాడు. వీరికి కుమారుడు రాహుల్(18)కుమార్తె రాణి ఉన్నారు. రాహుల్ ధర్మారంలో ఇంటర్ చదువుతుండగా, రాణి గోదావరిఖనిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో తొమ్మిదోతరగతి చదువుతోంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ ఇంటికే పరిమితమయ్యాడు. యశోద కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. యశోద, ఆమె భర్త, కొడుకు రాత్రి భోజనం చేసి యశోద, రాహుల్ ఒక గదిలో, నారాయణ మరోగదిలో నిద్రపోయారు. (తల్లీ, కొడుకు సజీవదహనం!) ఘటనలో ధ్వంసమైన ఇల్లు అర్ధరాత్రి భారీ పేలుడు.. అర్ధరాత్రి 11:30 గంటలకు నారాయణ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. యశోద, రాహుల్ నిద్రిస్తున్న గదిలో పేలుడు సంభవించడంతో ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే నారాయణ తలుపులు తీసుకుని కేకలు వేస్తూ బయటకు పరిగెత్తాడు. గ్రామస్తులు అక్కడకు చేరుకొని యశోద, రాహుల్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. మంటలకు గదిలో ఉన్న యశోద, రాహుల్ పూర్తిగా కాలిపోయారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు, ఫైర్‌సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పేశారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్, ధర్మపురి సీఐ ప్రదీప్‌కుమార్ ఘటనపై విచారణ జరిపారు. మృతదేహాలను పరిశీలించారు, గొట్టె నారాయణ, గ్రామస్తులు, యశోద బంధువులతో మాట్లాడారు. వివరాలు నమోదు చేసుకున్నారు. గ్యాస్ లీకై ఘటన.. నారాయణ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని ఏసీపీ హబీబ్‌ఖాన్ తెలిపారు. గ్యాస్ లీకైన వాసన రావడంతో యశోద లేదా రాహుల్ గుర్తించి ఉంటారని పేర్కొన్నారు. అప్పటికే గ్యాస్ గదిలో నిండిపోయి ఉండడం లైట్ ఆన్‌చేసి ఉండడంతో భారీ పేలుడు జ రిగి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై అనుమానాలు.. నారాయణ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్లుగా నారాయణ, యశోదకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయి. యశోదనే కొడుకు, కూతురు బాగోగులు చూసేదని స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి సిలిండర్ పేలిన సంఘటన విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనపై అనుమానాలు ఉన్నాయని యశోద సోదరి గమ్మటి కమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించామని చెప్పారు. గుండెలు పగిలేలా రోదించిన కూతురు ‘నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారా’ అంటూ కూతురు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తల్లి, సోదరుడు మంటల్లో కాలిపోయిన విషయం తెలుసుకున్న రాణి హాస్టల్ నుంచి గ్రామానికి చేరుకుంది. ఇంటి వద్ద శ్మశాన వాతావరణం, మంటల్లో కాలి బూడిదైన తల్లి యశోద, సోదరుడు రాహుల్ మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా రోదించింది. -
తల్లీ, కొడుకు సజీవదహనం!
పెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తిలో తీవ్ర విషాదం నెలకొంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తల్లీ, కొడుకు సజీవదహనమయ్యారు. మృతులను గొట్టే యశోద, (45), గొట్టే రోహన్ (18) గా పోలీసులు గుర్తించారు. సిలిండర్ పేలుడుతో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారు. -
రవి కుటుంబాన్ని ఆదుకోండి..
సాక్షి, హైదరాబాద్: ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. గ్యాస్ సిలిండర్ పేలుడు రూపంలో మృత్యువు కుటుంబ పోషకుడిని పొట్టన పెట్టుకుంది. ఒంటి చేత్తో సంసారాన్ని నెట్టుకొస్తున్న యువకుడిని అకాల మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురు చూస్తోంది. శుక్రవారం కాప్రాలో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో యలగండ్ల రవి (33) అనే వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ఇంటి నుంచి స్కూటర్ మీద షాపుకు వెళుతున్న రవికి పేలుడు ధాటికి ఎగిరిపడ్డ సిమెంట్ పెళ్ల వచ్చి తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. (చెల్లాచెదురైన జీవితాలు) రవి మరణవార్త విని అతడి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు ఊహించని విధంగా మరణిచడంతో రవి తల్లి పద్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గర్భిణిగా ఉన్న రవి భార్య మాధవిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. పోస్ట్‌మార్టం తర్వాత శుక్రవారం సాయంత్రం రవి భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. రవి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలని అతడి బంధువులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం వెంటనే అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రవి కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే... పేరు: యలగండ్ల పద్మ (రవి తల్లి) బ్యాంకు అకౌంట్ నంబర్- 62140845968 ఐఎస్ఎఫ్సీ కోడ్- ఎస్బీఐఎన్ 0021041 ఆదిత్యనగర్ కాలనీ బ్రాంచ్ (డాక్టర్ ఏఎస్రావు నగర్) -
కాప్రాలో పేలిన సిలిండర్.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కాప్రాలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడుతో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి ఆ భవనం పాక్షికంగా కూలిపోయింది. భవనం కూలడంతో చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడికి జనం భారీగా చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గలా కారణాలపై విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముగ్గురి సజీవ దహనం
ఆత్మకూరు(పరకాల): తన తండ్రితో ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ మహిళపై అతడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమెతోపాటు అడ్డుకోబోయిన అతడి తండ్రి సజీవ దహనమయ్యారు. అదే సమయంలో మంటలు ఎగిసిపడి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో యువకుడి నానమ్మ కూడా సజీవ దహనమైంది. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కంఠాత్మకూరులో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కంఠాత్మకూరుకు చెందిన మామిడి కుమారస్వామి(50) భార్యాపిల్లలతో హన్మకొండలో ఉంటూ ప్లంబర్ పనిచేసుకుంటున్నాడు. ఈ క్రమంలో కంఠాత్మకూరుకు సమీప గ్రామమైన పులుకుర్తికి చెందిన పోతరాజు సుమలతతో కుమారస్వామికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. సుమలతతో ఉంటూ కుమారస్వామి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతడి కుమారుడు కార్తీక్ కక్షపెంచుకున్నాడు. ఆదివారం రాత్రి తన తండ్రి సుమలతతో కంఠాత్మకూరులోనే ఉన్నాడని తెలుసుకొని నేరుగా ఇంటికి పెట్రోల్ డబ్బాతో వెళ్లి సుమలతపై పెట్రోల్ చల్లాడు. కుమారస్వామి అడ్డుకోబోగా అతడిపై కూడా పెట్రోల్ పడింది. వెంటనే సుమలతకు కార్తీక్ నిప్పంటించగా, మంటలార్పే ప్రయత్నంలో కుమారస్వామికి కూడా అంటుకొని సజీవ దహనమయ్యారు. అదే సమయంలో మంటల కారణంగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో కుమారస్వామి తల్లి మామిడి రాజమ్మ(70) కూడా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో కుమారస్వామి తండ్రి లింగయ్య తప్పించుకొని స్వల్పగాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. కుమారస్వామి సోదరి కోమల ఫిర్యాదు మేరకు ఎస్సై మోహన్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాజస్థాన్‌లో గ్యాస్ పేలి ఐదుగురు మృతి
-
ప్లాస్టిక్ సిలిండర్లతో పేలుడుకు చెక్
- బెంగళూరు సంస్థ తయారీ - త్వరలో మార్కెట్లోకి.. సాక్షి, బెంగళూరు: గ్యాస్ సిలిండర్ల పేలుడు ప్రమాదాల్లో అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంటుంది. ఈ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు పేలుడు స్వభావం లేని అత్యాధునిక ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండోగ్యాస్ సంస్థ అభివృద్ధి చేసింది. సిలిండర్‌లో మొదట హైడెన్సిటీ పాలిమర్ ఎథీన్‌తో కవచం చేసి దానిపై గ్లాస్ ఫైబర్ వైండింగ్ ద్వారా మరో కవచంతో తయారైన సిలిండర్‌కు మరికొన్ని రసాయనాలు కలిపి వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద దశలవారీగా వేడి చేసి దృఢంగా రూపొందించారు. సిలిండర్లను గుజరా త్‌లోని పంచమహల్ జిల్లా చంద్రాపురం లోని మరో కంపెనీలో ప్రస్తుతం తయా రు చేస్తున్నారు. 5, 10, 12, 15 కిలోల పరిమాణంలో తయారవుతున్నాయి. అన్ని పరీక్షలు ముగిసిన తర్వాత ఈ సిలిండర్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. వీటి సామర్థ్యం పరిశీలించాల్సిందిగా అన్ని ప్రభుత్వ ఎల్పీజీ సంస్థలకు తయారీ సంస్థ ఈ సిలిండర్లను అందజేసింది. అమెరికా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో వీటిని వాడుతున్నారు. ఎందుకు పేలవంటే...: ప్రస్తుత సిలిండర్ల లోపల పీడనం ఎక్కువైన ప్పుడు అందులోని గ్యాస్ ఒక్కసారిగా బయటికి చొచ్చుకొస్తుంది. గ్యాస్‌ను బంధించి ఉంచిన లోహం దీన్ని అడ్డు కోవడంతో పేలుడు సంభవిస్తుంది. ప్లాస్టిక్ సిలిండర్ల తయారీలో వాడిన పదార్థాలు, చేసిన విధానం వల్ల దాని లోపల ఎక్కువ వేడి లేదా పీడనం ఏర్పడినప్పుడు లోపలి కవచాలు కరిగి పోవడంమొదలవుతుంది. దీంతో గ్యాస్ బయటికి వస్తుందే తప్ప పేలుడు సంభ వించదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ ఆరుగురికి గాయలు
-
టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్
-
గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
లక్నో: గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ లోని హర్డోయ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హర్డోయ్ జిల్లా ఆసుపత్రి ఎదుట నేటి మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఓ గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో సమీపంలో ఉన్న గ్యారేజీలో కారు రిపేర్ చేస్తున్న ఇద్దరు వర్కర్లు, వాహన యజమాని గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం రాజధాని లక్నోలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించినట్లు వివరించారు. -
సిలిండర్ పేలిన ఘటనలో చికిత్స పొందుతూ ముగ్గురి మృతి
కృష్ణాజిల్లా కైకలూరులో ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన ఐదుగురిలో ముగ్గురు ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తోట నాగరాజు, అడపా సుబ్బలక్ష్మీ, సరోజినిలు మృతి చెందారు. ఈ నెల11వ తేదీన కైకలూరులో వంట వండుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి సిలండర్ పేలింది. ఆ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలన నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో వారిని వైద్య సహయం కోసం విజయవాడ తరలించగా, అక్కడ చికిత్స పొందుతు మంగళవారం తెల్లవారుజామున మరణించారు.