ప్లాస్టిక్‌ సిలిండర్లతో పేలుడుకు చెక్‌ | Check to explode with plastic cylinders | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ సిలిండర్లతో పేలుడుకు చెక్‌

Published Thu, May 4 2017 2:32 AM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

ప్లాస్టిక్‌ సిలిండర్లతో పేలుడుకు చెక్‌

ప్లాస్టిక్‌ సిలిండర్లతో పేలుడుకు చెక్‌

- బెంగళూరు సంస్థ తయారీ
- త్వరలో మార్కెట్లోకి..


సాక్షి, బెంగళూరు: గ్యాస్‌ సిలిండర్ల పేలుడు ప్రమాదాల్లో అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంటుంది. ఈ ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు పేలుడు స్వభావం లేని అత్యాధునిక ప్లాస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండోగ్యాస్‌ సంస్థ అభివృద్ధి చేసింది. సిలిండర్‌లో మొదట హైడెన్సిటీ పాలిమర్‌ ఎథీన్‌తో కవచం చేసి దానిపై గ్లాస్‌ ఫైబర్‌ వైండింగ్‌ ద్వారా మరో కవచంతో తయారైన సిలిండర్‌కు మరికొన్ని రసాయనాలు కలిపి వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద దశలవారీగా వేడి చేసి దృఢంగా రూపొందించారు. సిలిండర్లను గుజరా త్‌లోని పంచమహల్‌ జిల్లా చంద్రాపురం లోని మరో కంపెనీలో ప్రస్తుతం తయా రు చేస్తున్నారు. 5, 10, 12, 15 కిలోల పరిమాణంలో తయారవుతున్నాయి. అన్ని పరీక్షలు ముగిసిన తర్వాత ఈ సిలిండర్లు త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి. వీటి సామర్థ్యం పరిశీలించాల్సిందిగా అన్ని ప్రభుత్వ ఎల్పీజీ సంస్థలకు తయారీ సంస్థ ఈ సిలిండర్లను అందజేసింది. అమెరికా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో వీటిని వాడుతున్నారు.

ఎందుకు పేలవంటే...: ప్రస్తుత సిలిండర్ల లోపల పీడనం ఎక్కువైన ప్పుడు అందులోని గ్యాస్‌ ఒక్కసారిగా బయటికి చొచ్చుకొస్తుంది. గ్యాస్‌ను బంధించి ఉంచిన లోహం దీన్ని అడ్డు కోవడంతో పేలుడు సంభవిస్తుంది. ప్లాస్టిక్‌ సిలిండర్ల తయారీలో వాడిన పదార్థాలు, చేసిన విధానం వల్ల దాని లోపల ఎక్కువ వేడి లేదా పీడనం ఏర్పడినప్పుడు లోపలి కవచాలు కరిగి పోవడంమొదలవుతుంది. దీంతో గ్యాస్‌ బయటికి వస్తుందే తప్ప పేలుడు సంభ వించదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement