రవి కుటుంబాన్ని ఆదుకోండి.. | LPG Cylinder Blast Victim Family Seek Help | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 19 2019 7:48 PM | Last Updated on Sat, Jan 19 2019 7:50 PM

LPG Cylinder Blast Victim Family Seek Help - Sakshi

పేలుడు ఘటనలో మృతిచెందిన యలగండ్ల రవి భార్యతో (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు రూపంలో మృత్యువు కుటుంబ పోషకుడిని పొట్టన పెట్టుకుంది. ఒంటి చేత్తో సంసారాన్ని నెట్టుకొస్తున్న యువకుడిని అకాల మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురు చూస్తోంది. శుక్రవారం కాప్రాలో గ్యాస్‌ సిలిండర్ పేలిన దుర్ఘటనలో యలగండ్ల రవి (33) అనే వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ఇంటి నుంచి స్కూటర్‌ మీద షాపుకు వెళుతున్న రవికి పేలుడు ధాటికి ఎగిరిపడ్డ సిమెంట్‌ పెళ్ల వచ్చి తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. (చెల్లాచెదురైన జీవితాలు)

రవి మరణవార్త విని అతడి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు ఊహించని విధంగా మరణిచడంతో రవి తల్లి పద్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గర్భిణిగా ఉన్న రవి భార్య మాధవిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. పోస్ట్‌మార్టం తర్వాత శుక్రవారం సాయంత్రం రవి భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. రవి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలని అతడి బంధువులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం వెంటనే అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

రవి కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే...
పేరు: యలగండ్ల పద్మ (రవి తల్లి)
బ్యాంకు అకౌంట్‌ నంబర్‌- 62140845968
ఐఎస్‌ఎఫ్‌సీ కోడ్‌- ఎస్‌బీఐఎన్‌ 0021041
ఆదిత్యనగర్‌ కాలనీ బ్రాంచ్ ‌(డాక్టర్‌ ఏఎస్‌రావు నగర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement