kapra
-
సారొచ్చారు.. పేదల్లో భరోసా.. భూకాసురుల్లో దడ
జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములపై పట్టున్న తహసీల్దార్‌గా అతనికి పేరుంది. ముచ్చటగా మూడోసారి తమ ప్రాంత తహసీల్దార్‌గా రావడంతో నిరుపేదల నుంచి హర్షం వ్యక్తం అవుతుంటే... కజ్జాదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. గతంలో ప్రభుత్వ భూమిని కాపాడటంలో కీలక పాత్ర పోషించి జిల్లా అధికారులతో శభాష్ అనిపించుకున్నారు. అతనే గౌతమ్‌కుమార్. సాక్షి, హైదరాబాద్: కాప్రా మండలం కొత్తగా ఏర్పాటైన తర్వాత అక్టోబర్ 11, 2016న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌కుమార్ మండలంలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాల కోసం వినియోగించేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరి 25న రెండోసారి తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలతో పాటు కస్టోడియన్ భూములు, కార్పొరేషన్లో వందల ఎకరాలను కజ్జాదారుల చెర నుంచి కాపాడి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన అధికారిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఉప్పల్ మండల తహసీల్దార్‌గా కొనసాగుతున్న గౌతమ్‌కుమార్‌ను ప్రభుత్వం కాప్రా మండల ఇన్చార్జ్ తహసీల్దార్‌గా బుధవారం అదనపు బాధ్యతలను అప్పగించింది. అక్రమార్కుల గుండెల్లో గుబులు... ప్రభుత్వ భూములపై పట్టున్న అధికారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్‌కుమార్ మూడోసారి అదనపు బాధ్యతలు చేపట్టడడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. వాస్తవ రికార్డులకు అనుకూలంగా వ్యవహరించి పేదలకు న్యాయం చేకూర్చుతూనే... ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి కాపాడి ఉత్తమ తహసీల్దార్‌గా అవార్డు స్వీకరించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ►గతంలో ప్రభుత్వ భూములను రక్షించి సఫలీకృతమయ్యారు. గౌతమ్‌కుమార్ అదన పు బాధ్యతలు స్వీకరించడంతో తమకు న్యాయం జరుగుతుందని నిరుపేదలు గట్టిగా నమ్ముతున్నారు. కాని అక్రమార్కుల్లో మా త్రం అప్పుడే ఆందోళన మొదలైంది. అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్తున్న తహసీల్దార్ (ఫైల్) గతంలో సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట.. జవహర్‌నగర్‌లోని మల్కారం గుట్టల్లో అక్రమంగా రాత్రి వేళల్లో నడిపిస్తున్న మట్టి దందాపై గతంలో తహసీల్దార్ గౌతమ్‌కుమార్ ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ గుంతలు తవ్వుతూ సహజ వనరులను దొచుకెళ్తున్న వారిపై కొరడా ఝులిపించారు. ఒంటరిగా గుట్టల్లోకి తానే ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్లి సహజ వనరుల దోపిడీని నివారించడంలో సఫలీకృతుడయ్యారు. మరోమారు ఈ ప్రాంతాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. సమగ్ర విచారణ, బాధ్యులపై చర్యలు ప్రభుత్వ భూములను కాపాడి భవిష్యత్ తరాలకు ఉపయోగడేలా చర్యలు తీసుకోవడమే నా భాధ్యత. గతంలో రెండు పర్యాయాలు ఇక్కడ విధులు నిర్వర్తించా. నిజమైన నిరుపేదలకు న్యాయం చేసి కజ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్ల కజ్జాలు, మున్సిపాలిటీకి (ప్రజల అవసరాల కోసం) కేటాయించిన స్థలాలపై సమగ్ర విచారణ చేసి వాటి పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తా. సిబ్బంది తప్పులు చేస్తే వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – గౌతమ్‌కుమార్, కాప్రా ఇన్చార్జ్ తహసీల్దార్ -
విషాద ఘటన: దేశభక్తితో ప్రసంగిస్తూనే కుప్పకూలాడు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. దేశభక్తితో తండ్రి ప్రసంగిస్తుండగా, అతడిని వీడియోలో బంధిస్తున్న కూతురు. చుట్టూ పండుగ వాతవరణం. అప్పటిదాకా కోలాహలంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. ప్రసంగిస్తున్న వ్యక్తి.. ఉన్నట్టుండి కుప్పకూలాడు. అందరూ చూస్తుండగానే మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన కాప్రా, వంపుగూడలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాప్రా డివిజన్ వంపుగూడ లక్ష్మీవిల్లాస్‌లో పంద్రాగస్టు వేడుకలను నిర్వహిస్తున్నారు. కాలనీ అసోసియేషన్ సభ్యుడైన ఉప్పల సురేశ్ కూతురు మైత్రితో కలిసి స్వాతంత్ర వేడుకలకు వచ్చాడు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతున్నాడు. స్వాతంత్య్రోద్యమ చర్రితను చెబుతూ.. కుప్పకూలిపోయాడు. గుండెపోటు వచ్చి కూతురు చూస్తుండగానే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. సురేష్ అకస్మాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. బాగ్అంబర్పేట్ డీడీ కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సురేష్‌కు తల్లిదండ్రులు యాదగిరి, సరోజని, భార్య కరుణ, కూతురు మైత్రి, కొడుకు ధర్మపాల్ ఉన్నారు. తండ్రి యాదగిరి హైదరాబాద్‌లోని సీతాఫల్మండిలో ఉన్న వేదిక్ విద్యాలయ అధ్యక్షుడుగా ఉన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన యాదగిరి, కొడుకు మరణవార్త విని హుటాహుటిన ఇంటికి వచ్చాడు. విగతజీవిగా పడి ఉన్న కొడుకును చూసి ఆయన బోరున విలపించడం అందరిని కంటతడి పెట్టించింది. సురేశ్ కూతురు మైత్రి సీఏ చదువుతుండగా, కొడుకు ధర్మపాల్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులను చూసేందుకు ధర్మపాల్ రెండ్రోజుల క్రితమే బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. (క్లిక్: హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం) -
కూలీలకు సహాయంగా అనురాగ్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి విలువ తెలుస్తుందంటారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షలాది మందికి కష్టాలు తెచ్చిపెట్టింది. లాక్డౌన్ వలన ఎన్నో జీవితాలు అతలాకుతులమయ్యాయి. రెక్కాడితే కాని డొక్కాడని కూలీలకు చేయడానికి పని లేకుండా పోయింది. ఆకలి కష్టాల్లో ఉన్న కూలీలకు, భవన కార్మికులకు, వలస కూలీల బాధలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు చెందిన అనురాగ్ సంస్థ తనవంతు సాయంగా కాప్రాలో మార్చి 16 నుంచి 20 వరకూ కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అంతేగాక ఆ ప్రాంతంలో నివాసించే కూలీలకు, భవన కార్మికుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం శైలజ, సీఐ చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో అన్నం పొట్లాలు, కురగాయలను పంపిణీ చేసింది. (భారత్ నుంచి 1300 మంది వెనక్కి: అమెరికా) ఈ క్రమంలో కరోనా వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించడానికి వ్యక్తిగత శుభ్రత గురించి వివరించి మాస్క్‌లు, శానిటైజర్లు పంచి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ పిలుపు మేరకు దేశంలో అమలవుతున్న లాక్డౌన్ ద్వారా కరోనా మహమ్మారిని తరిమే ఉద్దేశంతో ‘బయటకు రావోద్దు- ఇల్లే ముద్దు’ అనే నినాదంతో ఈ సంస్థ ముందుకు వెళ్లింది. అంతేగాక కాప్రా పరిసర ప్రాంత భవన కార్మికుల ఇంటి ఇంటికీ వెళ్లి కురగాయలు, కిరణా సామగ్రిని అందించింది. ఈ పంపిణీ కార్యక్రమంలో డా. రామ్ సతిమణి బిందు, రాజు, రమ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. (దేశంలో 117కి చేరిన కరోనా మరణాలు) -
వడదెబ్బ; కాప్రా టీపీఎస్ మృతి
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల విధుల్లో భాగంగా వడదెబ్బకు గురైన జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ అశోక్ కుమార్ శనివారం మృతి చెందారు. రేపు నాగోల్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలు... గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అశోక్ కుమార్ బోగారంలోని హోళీ మేరీ కళాశాలలో విధులు నిర్వహించారు. ఇందులో భాగంగా అక్కడే వడదెబ్బ తగిలి అక్కడే కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయనను గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా ఏకధాటిగా వాంతులు, విరేచనాలు కావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కాగా అశోక్ కుమార్ ఇంతకుముందు అళ్వాల్‌లో పనిచేసి కొన్ని నెలల క్రితమే బదిలీపై కాప్రాకు వచ్చారు. ఎక్కడ పనిచేసినా అక్కడి ప్రజలతో సత్సంబంధాలు కలిగి, సక్రమంగా విధులు నిర్వహిస్తూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన అకాల మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
రవి కుటుంబాన్ని ఆదుకోండి..
సాక్షి, హైదరాబాద్: ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. గ్యాస్ సిలిండర్ పేలుడు రూపంలో మృత్యువు కుటుంబ పోషకుడిని పొట్టన పెట్టుకుంది. ఒంటి చేత్తో సంసారాన్ని నెట్టుకొస్తున్న యువకుడిని అకాల మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురు చూస్తోంది. శుక్రవారం కాప్రాలో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో యలగండ్ల రవి (33) అనే వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ఇంటి నుంచి స్కూటర్ మీద షాపుకు వెళుతున్న రవికి పేలుడు ధాటికి ఎగిరిపడ్డ సిమెంట్ పెళ్ల వచ్చి తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. (చెల్లాచెదురైన జీవితాలు) రవి మరణవార్త విని అతడి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు ఊహించని విధంగా మరణిచడంతో రవి తల్లి పద్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గర్భిణిగా ఉన్న రవి భార్య మాధవిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. పోస్ట్‌మార్టం తర్వాత శుక్రవారం సాయంత్రం రవి భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. రవి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలని అతడి బంధువులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం వెంటనే అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రవి కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే... పేరు: యలగండ్ల పద్మ (రవి తల్లి) బ్యాంకు అకౌంట్ నంబర్- 62140845968 ఐఎస్ఎఫ్సీ కోడ్- ఎస్బీఐఎన్ 0021041 ఆదిత్యనగర్ కాలనీ బ్రాంచ్ (డాక్టర్ ఏఎస్రావు నగర్) -
సిలిం'డర్'!
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులకు సిలిం‘డర్’ పట్టుకుంటోంది... ఇటీవల కాలంలో తరచుగా ‘గ్యాస్’ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి...గడిచిన రెండు నెలల్లోనే ‘గ్యాస్ బాంబ్’కు పలువురు బలయ్యారు. గత ఏడాది నవంబర్ 9న కొత్తగూడ షాగౌస్ హోటల్లో, డిసెంబర్ 27న ఫిల్మ్‌నగర్ పరిధిలోని బసవతారకానగర్లో, శుక్రవారం కాప్రా పరిధిలో గ్యాస్ సిలిండర్లు బీభత్సం సృష్టించాయి. ఏడాదికి 40 నుంచి 50 వరకు జరుగుతున్న ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం తక్కువగా ఉంటున్నా... ఆస్తి నష్టం మాత్రం భారీగా చోటు చేసుకుంటోంది. గ్యాస్ వినియోగంపై వినియోగదారులకు పూర్తి అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. ఏమిటీ గ్యాస్ సిలిండర్... గ్యాస్ సిలిండర్... ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉండే నిత్యావసర వస్తువు. మన వంటింట్లో ఉండే సిలిండర్‌లో బ్యూటేన్, ప్రొఫైన్ అనే రసాయిన వాయువులు కలిసి ఉంటాయి. ఎలాంటి వాసన ఉండని సహజవాయువుకు దానికోసం మరŠాక్యప్టెయిన్( కెమికల్)ను కలుపుతారు. దాదాపు 14.5 కేజీల బరువున్న ఈ వాయువులను అత్యధిక ఒత్తిడితో గ్యాస్ సిలిండర్‌లో ద్రవ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఈ బండ వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవగాహన కొరవడిగా సంభవించే ప్రమాదం బాంబు పేలుడుతో సమానం. ఏడు చోట్ల లీక్‌కు చాన్స్... సాధారణంగా స్టౌవ్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ... గ్యాస్ లీకేజ్ అనేది ఏడు ప్రాంతాల నుంచి జరిగే అవకాశం ఉంది. సిలిండర్, స్టౌవ్‌లను కలుపుతూ రబ్బర్ ట్యూబ్ ఉంటుంది. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టౌవ్‌కు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా స్టౌవ్‌కు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్ సాగే గుణం కోల్పోతుంది. ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండు సూది మొనంతం రంధ్ర ఏర్పడితే చాలు. దీని లోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్ లీక్ అవుతుంది. మెల్లమెల్లగా ఇల్లంతా వ్యాపిస్తుంది. మరోపక్క స్టౌవ్‌కు ఉండే నాబ్స్, రెండు నాబ్స్‌నూ కలిపే పైప్, కొత్త సిలిండర్ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్ నాబ్‌ల నుంచీ లీక్ అయ్యే అవకాశం ఉంది. ‘తెరిచి ఉన్నా’ ఫలితం నిల్... వంటింటికి కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే లీకైన గ్యాస్ వాటి నుంచి బయటకు వెళ్లిపోతుందనే భావన చాలా మందికి ఉంటుంది. ఇది కేవలం అపోహ మాత్రమే. వంట గ్యాస్‌లో ఉండే వాయువులు గాలి కన్నా చాలా బరువైనవి. అందుకే లీకైన తరవాత నేలపైకి చేరతాయి. నాలుగడుగుల కంటే తక్కువ ఎత్తులోనే వ్యాపిస్తాయి. దీంతో కిటికీలు తెరిచి ఉన్నా... వెంటిలేటర్లు ఉన్నా వాటి ద్వారా బయటకు పోయే అవకాశం ఉండదు. అగ్నికి ప్రేరణలు ఎన్నో... లీకైన గ్యాస్ అంటుకోవడానికి అనేక రకాలుగా ప్రేరణలు ఉంటాయి. గ్యాస్ వ్యాపించి ఉన్న గదిలో లైట్ వేసినా, అగ్గిపుల్ల, లైటర్ వెలిగించినా, ఏదైనా బరువైన వస్తువు ఎత్తుమీద నుంచి కిందపడినా వచ్చే స్పార్క్ వల్ల అంటుకుంటుంది. మరోపక్క మన ఇంట్లో ఉండే ఫ్రిజ్‌లు కూడా గ్యాస్ మండటానికి ప్రేరణలుగానే పని చేస్తాయి. ఫ్రిజ్‌లో కూలింగ్ పెరిగినప్పుడు ఆగిపోయి, తగ్గిన వెంటనే మళ్లీ స్టార్ట్ అయ్యే పరి/ê్ఞనం ఉంటుంది. దీన్నే రిలే మెకానిజం అంటారు. ఇలా రిలే జరిగేటప్పుడు ఫ్రిజ్ నుంచి ‘టక్’ మనే శబ్దం వస్తుంది. అందులో ఉత్పన్నమయ్యే స్పార్క్ వల్లే ఈ శబ్దం వెలువడేది. ఇంట్లో వ్యాపించిన గ్యాస్ దీనివల్లా అంటుకునే ప్రమాదం ఉంది. 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది... ఇల్లంతా వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్ ప్రమాదం చోటు చేసుకున్న చోట భారీ ఆస్తి నష్టం ఏర్పడుతుంది. తలుపులు, కిటికీలతో పాటు కాస్త బలహీనంగా ఉన్న గోడలు సైతం విరిగిపోతాయి. ఒక్కసారిగా గ్యాస్ అంటుకుని ఆరిపోవడం వల్ల భారీ ఆగ్నిప్రమాదం సైతం సంభవించదు. అయితే ఆ సమీపంలో ఉన్న వ్యక్తులు మాత్రం ప్రాణాలు కోల్పోవడమో, 50 శాతం వరకు కాలిపోవడమో జరుగుతుంది. కెమికల్ ఎక్స్ప్లోజన్గా పిలిచే ఈ ప్రమాదాల్లో సాధారణంగా గ్యాస్ సిలిండర్ చెదరదు. సిలిండర్ కూడా ఛిద్రం అయితే అది మెకానికల్ పేలుడు. -
ఉలిక్కిపడిన కాప్రా
కుషాయిగూడ: గ్యాస్ లీకై సిలిండర్ పేలిన ఘటనతో కాప్రా ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా జనం తేరుకోలేకపోయారు. శిథిల భవనాలు, పేలుడు ఆనవాళ్లు, రక్తపు మరకలు, పరిసర నివాసాల్లో చోటు చేసుకున్న విధ్వంసం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇద్దరు వ్యక్తులు మృతిచెందడం..మరికొందరు గాయపడడం విషాదం నింపింది. ఇక రాత్రి వరకు కూడా పేలుడు ప్రాంతంలో పోలీసులు, బాంబ్‌స్క్వాడ్ బృందాలు విచారణ జరిపాయి. పేలుడు చోటు చేసుకున్న పైఅంతస్థును పూర్తిగా తొలగించారు. సిలిండర్ పేలితే ఇంతటి విధ్వంసమేమిటో అర్థం కావడం లేదంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. భారీగా విన్పించిన పేలుడు శబ్ధంతో తాము ప్రాణాల మీద ఆశ వదులుకున్నామని కొందరు విలపించడం కన్పించింది. 200 మీటర్ల వరకు తీవ్రత కనిపించిన పేలుడు ఘటన...మరో గంట ఆలస్యంగా జరిగి ఉంటే మరింత ప్రాణ నష్టం వాటిల్లేదని స్థానికులు అన్నారు. ఉదయం 8 దాటిందంటే ఈ ప్రాంతామంతా రద్దీగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా: కలెక్టర్ కుషాయిగూడ: కాప్రా పేలుడు ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎక్సగ్రేషియా అందేలా చూడటంతో పాటుగా క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. ఘటన స్థలాన్ని సందర్శించి వెళ్లిన కలెక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం శిథిలాల ధాటికి మృతిచెందిన రవి కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలు అందించడంతో పాటు వారం రోజులు భోజన వసతిని కూడ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దేవుడి దయవల్లబతికి బయటపడ్డాం మేం పేలుడు జరిగిన ఇంటి పక్కనే ఉంటున్నాం. స్వల్ప గాయాలయ్యాయి. మేం నిజంగా దేవుడి దయవల్ల బతికి బయట పడ్డాం. పేలుడు ధాటికి ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడిపోయాయి. మంచంపై పడుకున్న నా భార్య కింద పడిపోయింది. ఏం జరిగిందో తెలియక వణికిపోయి...కొద్దిసేపు లోపలే ఉండిపోయాం. – కొప్పుల కుమార్ (స్థానికుడు) భయాందోళనకు గురయ్యాం భారీ పేలుడుతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యాం. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే సిలిండర్ వల్ల జరిగిందని అనిపించడం లేదు. బలమైన పేలుడు సంభవించి శ్లాబ్ పూర్తిగా విరిగిపడింది. మా ఇంట్లోని వస్తువులు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భయంతో బయటకు వస్తుండగా చందూలాల్ భార్య లీల కాలిన గాయాలతో అరుస్తూ కన్పించింది. మేం వెంటనే పైకి వెళ్లి మంటలు ఆర్పాం. – కమలాదేవి కనీస జాగ్రత్తలు అవసరం – డాక్టర్ వెంకన్న, క్లూస్ ఇన్చార్జ్ గ్యాస్ సిలిండర్ అనేది నిత్యావసర వస్తువే కాదు... దాదాపు ప్రతి ఇల్లు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటోంది. ప్రమాదాల బారినపడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని క్లూస్ టీమ్స్ ఇన్చార్జ్గా ఉన్న సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ వెంకన్న చెప్తున్నారు. కొన్నింటిని ఆయన ‘సాక్షి’కి వివరించారు. ♦ ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు స్టౌవ్తో పాటు రెగ్యులేటర్ సైతం ఆఫ్ చేయాలి. ♦ స్టౌవ్ దగ్గర ఉన్న ట్యూబ్‌ను అనునిత్యం పరిశీలిస్తూ పగుళ్లు వచ్చాయేమో గుర్తించాలి. ప్రతి ఆరు నెలలకు ట్యూబ్ తప్పనిసరిగా మార్చాలి. ♦ ట్యూబుకు పైన ఏ విధమైన తొడుగులు లేకుండా ఉన్నవే వాడాలి. లేదంటే దానికి వచ్చిన పగుళ్లు గమనించలేం. ♦ వీలైతే సిలిండర్‌ను నేలపైన కాకుండా... కనీసం అరడుగు లోతులో ఉంచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ♦ ఫ్రిజ్‌ను వంటగదిలో ఉంచకూడదు. వంటింటికి అందుబాటులో ఉండే మరో గదిలో పెట్టుకోవాలి. ♦ గ్యాస్ లీకైనట్లు అనుమానం వస్తే... ఆ గదిలో లైట్లు వేయడం, ఆర్పడం చేయకుండా రబ్బరు చెప్పులతో మాత్రమే ప్రవేశించి తలుపులు తీయాలి. నాబ్స్‌ను చాలా జాగ్రత్తగా ఆఫ్ చేయాలి. ఈ ప్రయత్నాల్లో ఎక్కడా ఘర్షణ చోటు చేసుకోవడానికి ఆస్కారం లేకుండా చూసుకోవాలి. ♦ మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ తీసుకువచ్చిన వారితో కేవలం బరువు మాత్రమే కాకుండా లీకేజ్‌లు కూడా చెక్ చేయమని చెప్పండి. ♦ ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా నిస్సంకోచంగా స్థానిక డీలర్‌ను సంప్రదించండి. మీకు సహాయ పడటం వారి విధి. ♦ వీలున్నంత వరకు గ్యాస్ సిలిండర్ వంటింట్లో లేకుండా బయట ఉండేలా, ఫ్రిజ్‌ను కిచెన్‌లో కాకుండా డైనింగ్ హాల్ లేదా హాల్లో ఉండేలా చూసుకోవాలి. ♦ ప్రతి వ్యక్తి నిద్రలో ఉండగా వాసన పసిగట్టే సామర్ధ్యం కోల్పోతాడు. అందుకే గ్యాస్ లీకైన విషయం ఉదయం లేచాక తెలుస్తుంది. అలాంటి అనుమానం వచ్చినా, సాధారణంగా అయినా ఉదయం లేచిన వెంటనే వంట గదిలో లైట్ వేయకూడదు. తలుపులు తీసిన తర్వాత కొంత సేపటికే ఆన్ చేసుకోవాలి. -
కాప్రాలో పేలిన సిలిండర్.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని కాప్రాలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడుతో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి ఆ భవనం పాక్షికంగా కూలిపోయింది. భవనం కూలడంతో చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలు కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడికి జనం భారీగా చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గలా కారణాలపై విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్ కాప్రాలో దారుణం
-
కాప్రాలో ఉద్రిక్తత
హైదరాబాద్: పట్టా చేసుకున్న భూమిని ప్రభుత్వ భూమి అంటూ అక్కడ నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తుండటంతో.. మనస్తాపానికి గురైన బాధితుడు వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొవడానికి యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటన మేడ్చల్ లోని కాప్రా వద్ద గురువారం వెలుగుచూసింది. గత పాతికేళ్లుగా పట్టా ఉన్న 6 ఎకరాల భూమిని ఈ రోజు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. దీనికి పట్టాదారుడు అడ్డుకున్నాడు. అయినా పై నుంచి ఆదేశాలు ఉన్నాయని అధికారులు అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
భవనంపై నుంచి పడి యువతి మృతి
హైదరాబాద్: కాప్రాలోని పల్లె పారడైజ్ అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందిపడి ఓ యువతి చనిపోయింది. ఆ అంతస్తులోని 46వ నంబర్ ప్లాట్‌లో ఉండే పనసారెడ్డి కూతురు ఐశ్వర్య(18) ఆదివారం రాత్రి బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం ఆమె మృతి చెందింది. -
మట్టి వినాయక పంపిణిలో హీరో సునిల్
కాప్రా: మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సినీ నటుడు సునీల్ అన్నారు. సుధ ఫౌండేషన్, యూత్ ఫర్ సేవ, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఎంటర్‌ప్రిన్యూర్స్ సహకారంతో గ్రీన్ సైనిక్‌పురి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కాప్రా చెరువు వద్ద మొలకెత్తే విత్తనాలతో చేసిన మట్టి వినాయకుల పంపిణీ చేపట్టారు. ముఖ్యఅతిథిగా సినీ నటుడు సునీల్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ...పర్యావరణ పరిరక్షణలో తాము సైతం అంటూ గ్రీన్ సైనిక్‌పురి సంస్థ మట్టి వినాయకులను పంపిణీ చేయడం, వాటిని తయారు చేసే పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. -
కుక్కల దాడిలో చిన్నారి మృతి
కాప్రా (హైదరాబాద్) : కుక్కలు వెంటపడగా పరుగెత్తిన చిన్నారి కిందపడి గాయాలతో మృతి చెందింది. ఈసీఐఎల్ ప్రాంతంలోని కాప్రాలోని యాదవకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన రంగారెడ్డి, అనూరాధ దంపతుల కుమార్తె సోని(7)గురువారం మధ్యాహ్నం రోడ్డు పక్కన నడిచి వెళుతోంది. అదే సమయంలో పోట్లాడుకుంటున్న రెండు వీధి కుక్కలు ఆమె వెంటపడ్డాయి. దీంతో భయపడిన సోని పరుగుతీసింది. ఆక్రమంలో కిందపడిపోగా తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలించేలోగానే పాప మరణించింది. దాంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
జనపథం - కాప్రా సర్కిల్
-
కుక్కలు బాబోయ్ కుక్కలు
-
స్కూటర్ డిక్కీలోంచి రూ.6.42 లక్షలు చోరీ
హైదరాబాద్: స్కూటర్ డిక్కీలో ఉంచిన రూ.6.42 లక్షలు చోరీకి గురయ్యాయి. కుషాయిగూడ పోలీసులు తెలిపి వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా సాయిప్రియ కాలనీకి చెందిన కె.వెంకటేష్ రీగల్ బార్లో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అతని బావ గణేష్ పౌల్ట్రీ ఫామ్‌కు సంబంధించిన రూ.6.42 లక్షలను బ్యాంకులో వేయమని ఇచ్చాడు. వెంకటేష్ ఏఎస్రావు నగర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్తుండగా, మార్గమధ్యలో బండి నిలిపి ఓల్డ్ కాప్రా షాపు వద్ద సెల్‌ఫోన్ రీఛార్జ్ చేయించుకున్నాడు. ఇంతలో డబ్బులు అకౌంట్లో వేయాల్సిన మహ్మద్ ఖాసిం అనే వ్యక్తి ఫోన్ చేసి, సదరు డబ్బును బ్యాంకులో వేయకుండా తన చేతికే ఇవ్వాలని కోరాడు. అందుకు గణేష్ అంగీకారం కూడా తీసుకున్న వెంకటేష్ రోడ్డుపక్కన స్కూటర్ నిలిపి ఖాసిం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు వచ్చి ఏదో చిరునామా అడిగి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత చూడగా, స్కూటర్ డిక్కీలో పెట్టిన నగదు కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, డబ్బులు ఎక్కడ పోయి ఉంటాయో వెంకటేష్ సరిగ్గా చెప్పలేక పోతున్నాడు.