భవనంపై నుంచి పడి యువతి మృతి
హైదరాబాద్: కాప్రాలోని పల్లె పారడైజ్ అపార్టుమెంట్ మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందిపడి ఓ యువతి చనిపోయింది. ఆ అంతస్తులోని 46వ నంబర్ ప్లాట్‌లో ఉండే పనసారెడ్డి కూతురు ఐశ్వర్య(18) ఆదివారం రాత్రి బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి సోమవారం ఉదయం ఆమె మృతి చెందింది.