వడదెబ్బ; కాప్రా టీపీఎస్‌ మృతి | GHMC Kapra TPS Died Due To Sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బ; కాప్రా టీపీఎస్‌ మృతి

Published Sat, May 25 2019 8:54 PM | Last Updated on Sat, May 25 2019 9:01 PM

GHMC Kapra TPS Died Due To Sunstroke - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల విధుల్లో భాగంగా వడదెబ్బకు గురైన జీహెచ్‌ఎంసీ కాప్రా సర్కిల్‌ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ అశోక్‌ కుమార్‌ శనివారం మృతి చెందారు. రేపు నాగోల్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలు... గురువారం వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అశోక్‌ కుమార్‌ బోగారంలోని హోళీ మేరీ కళాశాలలో విధులు నిర్వహించారు. ఇందులో భాగంగా అక్కడే వడదెబ్బ తగిలి అక్కడే కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయనను గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా ఏకధాటిగా వాంతులు, విరేచనాలు కావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

కాగా అశోక్ కుమార్ ఇంతకుముందు అళ్వాల్‌లో పనిచేసి కొన్ని నెలల క్రితమే బదిలీపై కాప్రాకు వచ్చారు. ఎక్కడ పనిచేసినా అక్కడి ప్రజలతో సత్సంబంధాలు కలిగి, సక్రమంగా విధులు నిర్వహిస్తూ మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన అకాల మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement