
చిన్నారికి మట్టి విగ్రహాన్ని అందిస్తున్న సునీల్
కాప్రా: మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సినీ నటుడు సునీల్ అన్నారు. సుధ ఫౌండేషన్, యూత్ ఫర్ సేవ, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఎంటర్‌ప్రిన్యూర్స్ సహకారంతో గ్రీన్ సైనిక్‌పురి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం కాప్రా చెరువు వద్ద మొలకెత్తే విత్తనాలతో చేసిన మట్టి వినాయకుల పంపిణీ చేపట్టారు.
ముఖ్యఅతిథిగా సినీ నటుడు సునీల్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ...పర్యావరణ పరిరక్షణలో తాము సైతం అంటూ గ్రీన్ సైనిక్‌పురి సంస్థ మట్టి వినాయకులను పంపిణీ చేయడం, వాటిని తయారు చేసే పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.