హైదరాబాద్: స్కూటర్ డిక్కీలో ఉంచిన రూ.6.42 లక్షలు చోరీకి గురయ్యాయి. కుషాయిగూడ పోలీసులు తెలిపి వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా సాయిప్రియ కాలనీకి చెందిన కె.వెంకటేష్ రీగల్ బార్‌లో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అతని బావ గణేష్ పౌల్ట్రీ ఫామ్‌కు సంబంధించిన రూ.6.42 లక్షలను బ్యాంకులో వేయమని ఇచ్చాడు.
వెంకటేష్ ఏఎస్‌రావు నగర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్తుండగా, మార్గమధ్యలో బండి నిలిపి ఓల్డ్ కాప్రా షాపు వద్ద సెల్‌ఫోన్ రీఛార్జ్ చేయించుకున్నాడు. ఇంతలో డబ్బులు అకౌంట్‌లో వేయాల్సిన మహ్మద్ ఖాసిం అనే వ్యక్తి ఫోన్ చేసి, సదరు డబ్బును బ్యాంకులో వేయకుండా తన చేతికే ఇవ్వాలని కోరాడు. అందుకు గణేష్ అంగీకారం కూడా తీసుకున్న వెంకటేష్ రోడ్డుపక్కన స్కూటర్ నిలిపి ఖాసిం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇంతలో ఇద్దరు ఆగంతకులు వచ్చి ఏదో చిరునామా అడిగి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత చూడగా, స్కూటర్ డిక్కీలో పెట్టిన నగదు కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, డబ్బులు ఎక్కడ పోయి ఉంటాయో వెంకటేష్ సరిగ్గా చెప్పలేక పోతున్నాడు.
స్కూటర్ డిక్కీలోంచి రూ.6.42 లక్షలు చోరీ
Published Mon, Jun 30 2014 11:34 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement