ఏఎస్ రావు నగర్లో మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో బంగారు ఆభరణాలు మాత్రమే చోరీకి గురైనట్లు అల్వాల్ డీజీపీ నవదీప్ సింగ్ తెలిపారు.
హైదరాబాద్ : ఏఎస్ రావు నగర్లో చోరీకి పాల్పడిన మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో దుండగులు కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే దోచుకు వెళ్లినట్లు అల్వాల్ డీజీపీ నవదీప్ సింగ్ తెలిపారు. నగదు చోరీ కాలేదని ఆయన చెప్పారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. గ్రిల్స్ తొలగించి దుండగులు బ్యాంకులోకి చొరబడినట్లు ఆయన తెలిపారు. మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో ఈరోజు తెల్లవారుజామున భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే.
ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన సిబ్బంది షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని నమోదు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మల్కాజ్గిరి డీసీపీ గ్రేవాల్ సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.