helping hand
-
Hyderabad: హాట్సాఫ్.. ఆడపడుచును ఎప్పటికీ గుండెల్లో నిలుపుకొనేందుకు!
కుటుంబంలో ఓ వ్యక్తి దూరమైతే కలిగే దుఃఖం ఎవరూ తీర్చలేనిది. కానీ, మన గుండెల్లోని దయాగుణం ఎదుటివారి మోములో చిరునవ్వుగా మారినప్పుడు శోకం కూడా సంతోషంగా మారుతుంది అంటారు సాజిదా. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ హుడా కాంప్లెక్స్‌లో ఉంటున్న సాజిదా ఖాదర్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావించినప్పుడు తన ఆడపడుచు పేరును తలచుకున్నారు. అనారోగ్యంతో తమకు దూరమైన ఆడపడుచు హసీనాను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటున్నామని బదులిచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘నా కూతురు ఏడాది వయసున్నప్పుడు మా ఆడపడచు హసీనా బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయింది. ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది హసీనా చనిపోయి. కానీ, ఇప్పటికీ తను మా కళ్లముందున్నట్టే ఉంటుంది. అందంగా నవ్వుతుండేది. పేదవారి పట్ల దయగా ఉండేది. మా ఇంట్లో అందరికీ హసీనా అంటే చాలా అభిమానం. ఆమె గుర్తుగా ప్రతి యేటా పేదలకు మాకు తోచిన సాయం చేసేవాళ్లం. ఉద్యోగాలు మాని, సొంతంగా వ్యాపారం చేసినప్పుడు, వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని హసీనా పేరున దానం చేసేవాళ్లం. దానిని ట్రస్ట్‌గా ఏర్పాటు చేసి, ఒక పద్ధతి ప్రకారం చేస్తే మరింత బాగుంటుందని ఆలోచన వచ్చి దానిని అమలులో పెట్టాం. అవసరమైన వారికి ఏం చేయగలమా అని ఆలోచించాం. అప్పుడే.. పేద పిల్లలకు చదువు, స్లమ్స్‌లోని వారికి వైద్యం అందించాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను అమలు చేశాం. అప్పటినుంచి పదిహేనేళ్లుగా మా చుట్టుపక్కల స్లమ్స్‌కి వెళ్లి అక్కడ అవసరమైనవారికి ప్రతీ నెలా రేషన్ ఇచ్చి రావడాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నాం. అలాగే వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడంలో భవన నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఐరన్ వంటివి ఇస్తూ వచ్చాం. మా భార్యాభర్తల ఇద్దరి ఆదాయం నుంచే ఈ సేవలు అందిస్తున్నాం. వేరే ఎవరి దగ్గరా తీసుకోవడం లేదు. ఎంత చేయగలిగితే అంతే చేస్తున్నాం. ఫ్యామిలీ కౌన్సెలర్‌గా మార్చిన డే కేర్ మా స్వస్థలం గుంటూరు. పాతికేళ్ల క్రితం పెళ్లి అయ్యాక ఇద్దరమూ హైదరాబాద్ వచ్చేశాం. మొదట్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండేవాళ్లం. డబుల్ డిగ్రీ చేసిన నేను ప్రైవేట్ టీచర్‌గా చేసేదాన్ని. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వారిని పగటి వేళ ఉంచడానికి సరైన కేర్ సెంటర్ కోసం చాలా ప్రయత్నించాను. కానీ, ఏదీ సరైనది అనిపించలేదు. దాంతో ఉద్యోగం మానేసి బేబీ కేర్ సెంటర్‌ను ప్రారంభించాను. దీంతో సెంటర్‌కు వచ్చే తల్లులు, కాలనీల వాళ్లు కొన్ని సందర్భాలలో తమ సమస్యలను చెప్పినప్పుడు, నాకు తోచిన సలహా ఇచ్చేదాన్ని. డే కేర్ సెంటర్ కొన్నాళ్లకు ఫ్యామిలీ కేర్ సెంటర్‌గా మారిపోయింది. న్యాయ సేవ వైపు అడుగులు.. కొన్ని సమస్యలు ఎంత కౌన్సెలింగ్ చేసినా పరిష్కారం అయ్యేవి కావు. అప్పుడు అక్కడ నుంచి పారా లీగల్ సేవలు వైపుగా వెళ్లాను. సామరస్యంగా సమస్యలను పరిష్కార దిశగా తీసుకెళ్లేదాన్ని. అలా చాలా కేసుల పరిష్కారానికి కృషి చేశాను. నా సర్వీస్‌ను గమనించి, జిల్లా న్యాయసేవా సదన్ వారు పారా లీగల్ వలంటీర్‌గా నియమించారు. అలా కొన్నాళ్లు కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాను. ఒక సందర్భంలో నటి జయసుధ దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడకు వచ్చిన వ్యక్తి ద్వారా హ్యూమన్ రైట్స్లోకి వెళ్లాను. మానవహక్కులను కాపాడటంలో ఎవరికీ భయపడలేదు. చాలాసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయవ్యవస్థ అండగా ఉండటంతో ఎన్నో కేసుల్లో విజయం సాధించాను. మహిళలకు ఉచిత శిక్షణ ఎన్ని పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా హసీనా ట్రస్ట్ మాత్రం వదల్లేదు. ఈ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య, వైద్యంతో పాటు వికలాంగులు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తున్నాం. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి కాలనీల్లో వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా టైలరింగ్, ఎంబ్రాయిడరీలలో శిక్షణ ఇప్పిస్తున్నాను. మా అమ్మాయి పేరు హుస్నా. కానీ, చాలా మంది తెలియక హసీనా మీ కూతురా అని అడుగుతుంటారు. నేను కూడా ‘అవును నా పెద్ద కూతురు’ అని సమాధానమిస్తుంటాను. సేవ అనేది చేస్తున్న ప్రతి పనిలో భాగమైంది. హసీనా మా సేవకు ఒక రూపు అయ్యింది. పేదల నవ్వుల్లో చెరగని దివ్వె అయ్యింది’ అని వివరించారు సాజిదా. – నిర్మలారెడ్డి -
అభిమానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని అండ
సాక్షి, కరీంనగర్: చామన్‌పల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దూడం అనిల్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రజిని అభిమాని. ఆమె ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలను ఫాలో అవుతూ.. ఎమ్మెల్యే చేపట్టే కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. 3 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో అనిల్‌కు కాలు విరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఎమ్మెల్యేకు తెలుపగా రూ.10 వేలు ఆర్థికసాయం అందించారు. అప్పటినుంచి ఆమెకు వీరాభిమానిగా మారాడు. ఇటీవల చేతిపై ఎమ్మెల్యే రజిని చిత్రాన్ని టాటూ వేయించుకున్నాడు. ఈ ఫొటోను ఆమెకు పోస్టు చేయగా ప్రత్యక్షంగా కలవాలని సూచించారు. దీంతో శుక్రవారం చిలుకలూరిపేట వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. టాటూ చూసి ఇలాంటి పనులు చేయవద్దని చెప్పారు. కాసేపు అనిల్‌తో మాట్లాడి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భోజనం పెట్టి, సన్మానించారు. తన స్వగ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నానని అనిల్ చెప్పగా మొదటి దఫాగా రూ.50 వేల చెక్కు అందజేశారు. మరింత సహాయం చేస్తానని, అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చదవండి: నా భర్తను వెతికి పెట్టండి: కెనడాలో తెలుగు మహిళ ఆవేదన -
చేతులెత్తి నమస్కరించిన న్యాయమూర్తి
ఖమ్మం క్రైం: మానవత్వం ఎల్లలు దాటింది.. గ్రామం, మండలం, జిల్లా దాటి పక్క రాష్ట్రాలకు చేరిన సేవా తత్పరుడికి అక్కడి ప్రజలు పాదపూజ చేశారు. ఏకంగా జిల్లా జడ్జి చేతులెత్తి నమస్కరించి.. సేవలను అభినందించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘అన్నం’ ఫౌండేషన్ కొనసాగుతోంది. దిక్కులేని వారినేగాక మతిస్థిమితం లేనివారికి ఆశ్రయం కల్పించి బాగు చేసే వరకు బాధ్యత తీసుకుంటారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా బోటియాపూరికి చెందిన చునీల్ గొగొయ్ నాలుగేళ్ల క్రితం, జార్ఖండ్ లోని ఖుర్దేగ్ జిల్లాకు చెందిన మర్కస్ ఖుజూర్ రెండేళ్ల క్రితం మతిస్థిమితం తప్పడంతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఖమ్మం చేరారు. శ్రీనివాసరావుకు అస్సాంవాసుల పాదపూజ వారిని అన్నం ఫౌండేషన్ చేరదీసింది. ఇటీవల వారి ఆరోగ్యం కుదుటపడింది. చునీల్ గొగొయ్ ఆశ్రమంలో వంటలు చేస్తూ ఉంటున్నాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా కొత్తగూడెం జిల్లా ఇల్లెందువాసి అయిన గుహవాటి ఐఐటీ ప్రొఫెసర్ నందకిషోర్ సహకారంతో కుటుంబీకుల సమాచారం తెలుసుకున్నారు. అలాగే ఖజూర్ వివరాలు కూడా తెలిశాయి. దీంతో ఈ నెల 3న శ్రీనివాసరావు, ఆశ్రమం బాధ్యులు వారిని తీసుకుని ఆ రాష్ట్రాలకు బయలుదేరారు. జార్ఖండ్ వెళ్లి అక్కడ ఖుజూర్‌ను జిల్లా జడ్జి సమక్షంలో ఆయన కుటుంబానికి అప్పగించారు. ఖుజూర్‌కు రూ.25 వేల నగదు అందించారు. ఫౌండేషన్ సేవలను తెలుసుకున్న జడ్జి శ్రీనివాస్‌రావుకు నమస్కరించారు. ఆపై గోలాగాట్ జిల్లా కేంద్రానికి 7న చేరుకుని జిల్లా జడ్జి ఎదుట చునీల్ గొగొయ్‌ను కుటుంబానికి అప్పగించారు. ఆయనకు కూడా రూ.50 వేల నగదు అందించారు. ఈ సందర్భంగా చునీల్ కుటుంబం శ్రీనివాసరావుకు పాదపూజ చేసింది. -
మేడిపల్లి వినయ్ రెడ్డి దాతృత్వం
హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్లో స్థానిక ప్రతినిధి మేడిపల్లి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో 400 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తున్న తరుణంలో వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దినసరి కూలీ పని చేసుకునే నిరుపేదలు నిత్యావసర సరుకులు దొరక్క అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థానిక నిరుపేదల ఇబ్బందులను తెలుసుకున్న వినయ్ రెడ్డి వారికి అండగా నిలుస్తూ దాతృత్వం ప్రదర్శించారు. తనవంతు సహాయంగా నిరుపేదలకు సహాయంగా ఆదివారం 400 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా కూడా పేదలకు సరుకులు పంపిణీ చేయించారు. పేదలకు సహాయం చేయాలని సహృదయంతో ఆలోచన చేసిన వినయ్ రెడ్డిని వారు అభినందించారు. ఆయన దాతృత్వాన్ని కొనియాడారు. పేదల ఆకలి తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ, ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
లాక్డౌన్ కాలంలో సాయం చేస్తున్న మహానుభావులు!
ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా కరోనా వైరస్ కాటుకు అన్ని దేశాలు బలవుతున్నాయి. ఎక్కడ చూసిన ప్రజలు కరోనా మహమ్మారి పేరు వింటేనే భయపడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా వైరరస్ ఒకరి నుంచి మరొకరికి నోటి తుంపర్ల ద్వారా వేగంగా విస్తరిస్తుండటంతో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. లాక్డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితమయ్యి పనులన్ని ఆగిపోవడంతో చాలా మంది పేదవారు నిత్యవసరాల కోసం, ఆహారం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చాలా మంది స్వచ్చందంగా వారికి అండగా నిలుస్తున్నారు. వారిలో కొంత మంది సాక్షికి వారు చేస్తున్న సేవ కార్యక్రమాలను తెలియజేశారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. హైదరాబాద్ మణికొండలోని నక్షత్ర గంగోత్రి అపార్ట్మెంట్స్, అలోక టౌన్షిప్ వారు వారికి దగ్గరలో ఉన్న రోజు వారి కూలీ కుటుంబాలకు 55 బ్యాగుల నిత్యవసర సరుకులను అందించి సాయంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నక్షత్ర అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ బాల్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ దిలీప్, నరేంద్ర పాల్గొన్నారు. అపార్ట్మెంట్లో ఉంటున్న స్థానికులు సహకారంతో పేదలకు సాయం అందించామని వారు తెలిపారు. కరోనావైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి డాక్టర్లు, పోలీసుల వారు ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వహిస్తున్నారు. అయితే ఎండలో పనిచేస్తున్న పోలీసు వారికి నిమ్మరసం అందించి మానవత్వం చాటుకున్నారు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఖమ్మం వాసి వెంకటరామిరెడ్డి. కరోనా కాలంలో చిన్నదో పెద్దదో తోటి వారికి ఏదో ఒక సాయం చేస్తూ చాలా మంది వారి సహృదయాన్ని తెలియజేస్తున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన ప్రతాప్‌రెడ్డి మూడు రోజుల నుంచి మినరల్ వాటర్, కూల్ వాటర్ పంపిణీ చేసి మంచి మనసు చాటుకుంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో పలు చోట్ల అనేకమంది అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ దినసరి కూలీలకు, వలసకూలీలకు, పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి అండగానిలుస్తున్నారు. బషీర్, ఉమేష్ తమ బృందానికి చెందిన కొంత మందితో కలిసి యల్బీ నగర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా కూకట్‌పల్లిలో సాంబిరెడ్డి, భాస్కర్, నర్సింగ్‌రావు, ఝన్సీ బృందం వారికి తోచిన సాయం చేశారు. పేదలకు సాయం అందించారు. కరోనా మహమ్మారి కారణంగా అనాధ శరణలయాలు, వృద్ధాశ్రమలు ఆహారం లేక విలవిలలాడుతున్నాయి. ఉప్పల్‌లోని అభిసాయి శత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధాశ్రమంలోని ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న గుప్తా కోట్ల వారికి సాయం అందించారు. తన స్నేహితుడు ప్రణీత్ మేరుగతో కలిసి హబ్సీగూడలో ఉంటున్న ప్రణీత్ 120 కేజీల కూరగాయలను అనాధాశ్రమానికి అందించారు. లాక్డౌన్ కారణంగా కొంతమంది తమ ఊరికి దూరంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారి సాయాన్ని అందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పూణేలో చిక్కుకుపోయిన జుట్టు సింహాచలం ఆంధ్రప్రదేశ్ సీఎం రీలీఫ్ ఫండ్‌కు 20 వేల రూపాయలు విరాళంగా ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. నెల్లూరు జిల్లా నందిగుంట మాజీ సర్పంచ్ శ్రీవాణి తన సొంత డబ్బులతో పేదలకు కూరగాయాలు, సోప్‌లు పంచిపెట్టారు. కరోనా సయంలో పేదలకు అండగానిలిచారు. కృష్ణజిల్లాకు చెందిన అగ్రీ పైప్‌లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి చేయూతనందించారు. నిత్యవసరవస్తువులు 500 కిట్లు నిరుపేదలకు, రోజువారి కూలీలకు, కార్మికులకు అందించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని దామోదర్, కారుపర్తి సాయికుమార్, గుబ్బల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతినగర్‌కు చెందిన శ్రీనిలయం ఓనర్స్ అసోసియేషన్ వారు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి 50 వేల రూపాయల విలువగల నిత్యవసర సరుకులను 300 మందికి పంపిణీ చేశారు. లోకల్ వాచ్మ్యాన్లు, సెక్యూరిటికీ 25కేజీల బియ్యం బ్యాగ్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతినగర్ యస్ఐ, శ్రీనిలయం యాజమాన్యం పాల్గొన్నారు. ఇలా ఎవరికి తోచిన సాయం వారు చిన్నదో పెద్దదో చేస్తూ కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు ఎందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటే మీరు సాక్షి.కామ్ ద్వారా ప్రపంచానికి తెలియజేయండి. మీరు వివరాలు పంపించాల్సిన మెయిల్ఐడీ: webeditor@sakshi.com -
అబ్బురపరిచిన వానరం!
‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అనే మంచిమాటను మనుషులు మర్చిపోతున్న పరిస్థితి. ఇక జంతువుల విషయానికొస్తే ఆపదను తెచ్చిపెట్టేవి అవే అయినా.. కొన్నిసార్లు ఆపద నుంచి రక్షించేవి కూడా అవే. ఈ క్రమంలో ఒరాంగుటాన్ అనే జంతువు మనిషి ప్రమాదంలో ఉన్నాడని భావించి అతనికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చి అందరినీ అబ్బురపరిచిన ఘటన బొర్నియాలో చోటు చేసుకుంది. బోలెడు తెలివి తేటలుండే ఒరాంగుటాన్ అనే వానరం కొన్ని విషయాల్లో మనిషిలాగే ప్రవర్తిస్తాయన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. తాజాగా బొర్నియా ప్రాంతంలో సంచరిస్తున్నన ఒరాంగుటాన్ బురద నీటిలో సగం వరకు మునిగి ఉన్న ఓ వ్యక్తిని గమనించి అతను ఆపదలో ఉన్నాడని భావించింది. వెంటనే అతన్ని సమీపించి చేయి చాచి సహాయం అందించింది. దీన్ని అనిల్ ప్రభాకర్ అనే వ్యక్తి ఫొటో తీయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతరించిపోతున్న జీవజాతుల కోసం పనిచేస్తున్న ‘బొర్నియో ఒరాంగుటాన్ సర్వైవల్ ఫౌండేషన్’ అనే సంస్థ ఈ అద్భుతమైన ఫొటోను గురువారం తమ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ‘మనుషుల్లో అడుగంటిపోతున్న మానవత్వాన్ని కొన్ని జంతువులు మనకు గుర్తు చేస్తున్నాయి’ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ ఫొటో ఎంతోమంది నెటిజన్ల హృదయాలను కరిగిస్తోంది. ‘ఆ జంతువు చూపిన ప్రేమకు మేం దాసోహమయ్యాం’ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పైన చెప్పుకున్న ఫౌండేషన్‌లో పని చేస్తాడు. కాగా ఆ నదిలో పాముందని సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని దాని కోసం వెదికానని ఆయన పేర్కొన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒరాంగుటాన్ తాను ప్రమాదంలో ఉన్నానని భ్రమించి సహాయం చేయడానికి వచ్చిందని తెలిపాడు. అయితే అది అడవు జంతువు కాబట్టి, దాని సహాయాన్ని తిరస్కరించానని తెలిపాడు. (మీ పిడకల వేట అదుర్స్) -
‘మా బిడ్డను ఆదుకోండి సారూ..’
సాక్షి, గొల్లపల్లి : ముద్దుగా ఉన్న పాపాయికి పెద్ద కష్టమొచ్చింది.ఆడుతూ పాడుతూ.. హాయిగా ఉండాల్సిన ఆ చిన్నారి కాలేయ సంబంధిత వ్యాధితో కొట్టుమిట్టాడుతోంది. ఆపరేషన్ చేయాల్సిందేనని హైదరాబాద్‌లోని వైద్యులు తేల్చగా ఆరోగ్యశ్రీకి వ్యాధి అర్హత లేక, డబ్బులు కట్టేందుకు ఆర్థికస్థోమత లేక కన్నోళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు. గుండె దిటవు చేసుకుని తమ బిడ్డను ఆదుకోవాలని దయార్థ హృదయులను వేడుకుంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన నిరుపేదలు షిండే శారద–నరేశ్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా నుంచి గొల్లపల్లి వలస వచ్చారు. ఇక్కడే నివాసం ఏర్పర్చుకుని ఓటుహక్కు, రేషన్‌కార్డు, ఆధార్ కార్డు కల్గి ఉన్నారు. పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. తల్లి శారద ఏడాది క్రితం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ పలు ఆసుపత్రులు చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో పాటు ఖరీదైన వైద్యం అందకపోవడం మృతి చెందింది. నాన్నే అన్నీ తానై వారిని సాకుతున్నాడు. నలుగురు పిల్లలను తల్లి లేని లోటు తీర్చేందుకు నమ్ముకున్న సీస కమ్మరి వృత్తితో వచ్చిన పదో పరకతో జీవనాన్ని సాగిస్తున్నారు. వీరిలో చిన్నదైన నాలుగేళ్ల కూతురు ఐశ్వర్య కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకట తరగతి చదువుతున్న ఈ బాలిక పుట్టిన రెండేళ్ల నుంచే ఈ జబ్బు తీవ్రతతో అస్వస్థతకు గురవుతుంది. వయస్సు పెరిగిన కొద్దీ జబ్బు పెరిగిపోతోంది. భార్య చనిపోయినప్పటి నుంచి భర్తకు వీరి ఆలనా పాలన కష్టంగా మారింది. కూతురుకు ఎలాగైనా వ్యాధి నయం చేయాలనే ఆ తండ్రి మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి రూ.లక్ష వరకు ఖర్చు చేసుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో చూపించగా, వెంటనే ఆపరేషన్ చేయాలని అందుకు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే వ్యాధిలో లేదని కార్డు వర్తించదని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల నుంచి ఐశ్వర్యకు మలమూత్ర విసర్జనలకు కూడా వెళ్లడం లేదని కడుపు ఉబ్బుతోందని వాపోయాడు. తన కూతురును ఎలా బతికించుకునేది అని నరేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. దాతలు, ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ స్పందించాలని వేడుకుంటున్నాడు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థికంగా చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరుతున్నాడు. చిన్నారిని ఆదుకునేందుకు ఆర్థికసాయం చేయాలనుకునే వారు ఫోన్ నంబర్ 9000404115కు కాల్ చేయాలని కోరారు. -
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు!
చిత్తూరు రూరల్ : ప్రార్థించే పెదాల కన్న సాయం చేసే చేతులు మిన్న అంటారు... అలాంటి చేతుల కోసం చేతులెత్తి ప్రాధేయపడుతోంది ఓ కుటుంబం. రెండేళ్లుగా మంచానపడ్డ అభాగ్యుడి వైద్యఖర్చులు ఆ కుటుంబానికి భారమవుతున్నాయి. దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని అభ్యర్థిస్తోంది ఆ కుటుంబం.చిత్తూరు నగరం సాంబయ్యకండ్రిగకు చెందిన నందకుమార్ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. 2017లో ఉన్నట్టుండి అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. చివరకు వెన్నుపూసలోని నరాలు తెగినట్లు వైద్యులు నిర్థారించారు. తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో నందకుమార్‌కు ఆపరేషన్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నడవలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఇతనికి తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు మగపిల్లలుకాగా, ఒకరు ఆరో తరగతి, ఇంకొకరు మూడో తరగతి చదువుతున్నారు. మరో అమ్మాయి వయస్సు మూడేళ్లు. భవిష్యత్‌పై మానసిక క్షోభ కుటుంబ యజమాని మంచమెక్కడంతో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. వైద్య ఖర్చులు తలకు మించిన భారమయ్యాయి. చేసేది లేక భార్య సుగంతి కూలికి వెళ్తోంది. భర్తకు కావాల్సిన మందులు, మాత్రల ఖర్చులు, కుటుంబపోషణ ఆమెకు కష్టంగా మారింది. ఈ క్రమంలో అప్పులు కూడా చేయాల్సి వస్తోంది. తల్లి వృద్ధాప్యంలో ఉండడం, భార్య కష్టపడడం, తాను మంచానికే పరిమితమయ్యాననే బాధలు అతన్ని కుంగదీస్తున్నాయి. చిన్న వయస్సులో ఉన్న పిల్లల భవిష్యత్ ఎలా అనే మానసిక క్షోభను అనుభవిస్తున్నాడు. దాతల సాయం కోసం అభ్యర్థన ఏ ఆధారం లేని నందకుమార్ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. నెలకు మందులు, మాత్రలకు రూ. 3 వేలు చొప్పున ఖర్చవుతోంది. శరీర భాగంలో అక్కడక్కడ పుండ్లు ఏర్పడడంతో మూడు రోజుల క్రితం తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వైద్యం చేయలేమని, రోజుకు బెడ్ చార్జి రూ. 2.500 కడితే చికిత్స చేస్తామని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో నందకుమార్ కుటుంబసభ్యులు వెనుదిరిగారు. చలించే హృదయాలు ముందుకొచ్చి ఆర్థికసాయం చేయాలని కోరుతున్నారు. దాతలు 8977038535 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా భర్తను ఆదుకోండి నా భర్త రెండేళ్లుగా మంచం మీదే ఉన్నాడు. చాలా కష్టపడుతున్నాం. ప్రతి నెలా చిత్తూరు నుంచి తిరుపతిలోని ఆస్పత్రికి రానుపోను ఛార్జీలకు రూ.2 వేలు, మందులు మాత్రలకు రూ. 3 వేలు ఖర్చవుతోంది. ఇప్పుడు డాక్టర్లు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోమంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చికిత్స చేయలేమంటున్నారు. బెడ్ చార్జి రూ. 2,500 కడితే ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తామన్నారు. చేతిలో డబ్బులు లేక వచ్చేశాం. ప్రస్తుతం బాడుగ ఇంట్లో ఉంటున్నాం. ప్రతి నెలా బాడుగ కట్టాలి, కుటుంబఖర్చులు చూడాలి, భర్తకు మాత్రలు.. మందులు కొని ఇవ్వాలి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. దయగల దాతాలు ముందుకొచ్చి ఆదుకోవాలని కోరుతున్నా. – సుగంతి -
రవి కుటుంబాన్ని ఆదుకోండి..
సాక్షి, హైదరాబాద్: ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. గ్యాస్ సిలిండర్ పేలుడు రూపంలో మృత్యువు కుటుంబ పోషకుడిని పొట్టన పెట్టుకుంది. ఒంటి చేత్తో సంసారాన్ని నెట్టుకొస్తున్న యువకుడిని అకాల మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురు చూస్తోంది. శుక్రవారం కాప్రాలో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో యలగండ్ల రవి (33) అనే వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ఇంటి నుంచి స్కూటర్ మీద షాపుకు వెళుతున్న రవికి పేలుడు ధాటికి ఎగిరిపడ్డ సిమెంట్ పెళ్ల వచ్చి తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. (చెల్లాచెదురైన జీవితాలు) రవి మరణవార్త విని అతడి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు ఊహించని విధంగా మరణిచడంతో రవి తల్లి పద్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గర్భిణిగా ఉన్న రవి భార్య మాధవిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. పోస్ట్‌మార్టం తర్వాత శుక్రవారం సాయంత్రం రవి భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. రవి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలని అతడి బంధువులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం వెంటనే అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రవి కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే... పేరు: యలగండ్ల పద్మ (రవి తల్లి) బ్యాంకు అకౌంట్ నంబర్- 62140845968 ఐఎస్ఎఫ్సీ కోడ్- ఎస్బీఐఎన్ 0021041 ఆదిత్యనగర్ కాలనీ బ్రాంచ్ (డాక్టర్ ఏఎస్రావు నగర్) -
చిన్నారి గుండెకు భరోసా
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆంధ్రా హాస్పిటల్, యూకేలోని హీలింగ్ లిటిల్ హార్ట్స్ చారిటీస్ ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఈ నెల 5 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించిన శిబిరంలో వైద్యులు అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలతో బాధపడుతున్న 20 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేశారు. వారిలో రెండు వారాల శిశువు నుంచి పదేళ్ల వయస్సు ఉన్న చిన్నారులు ఉన్నట్లు ఆంధ్రా హాస్పిటల్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు తెలిపారు. ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీకి చెందిన 11 మంది వైద్య బృందం ఐదు రోజుల పాటు ఆపరేషన్లు చేశారన్నారు. బృందం ఇప్పటివరకూ 12 సార్లు శిబిరాలు నిర్వహించి 250 మంది చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారన్నారు. అవగాహన పెరిగింది.. పిల్లల గుండె సమస్యల విషయంలో ప్రజల్లో అవగాహన పెరిగిందని ప్రవాసాంధ్రుడు, యూకే పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ ధున్నపునేని అన్నారు. రానున్న కాలంలో మరింత మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తామన్నారు. తెలంగాణాలో కూడా క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.శిబిరంలో యూకేకు చెందిన వైద్యులు అమల్‌బోస్, నవీన్‌రాజ్, పీటర్జిరాసెక్, కృష్ణప్రసాద్, కలైమణి, విక్టోరియా, మానులెలా, కార్ల థామస్, పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ విక్రమ్ కుడుముల, కార్డియాలజిస్ట్ శ్రీమన్నారాయణ, డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాలు నిలపరూ..?
వారిదో అందమైన కుటుంబం. జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు. పెళ్లై రెండేళ్లు అయింది. ఏడాది క్రితం కుమారుడు కూడా పుట్టాడు. ఆ సంతోషంలో విహరిస్తున్న ఆ కుటుంబాన్ని చూసి దేవుడికి ఆçసూయ వేసిందేమో. ఇంటి ఇల్లాలికి క్యాన్సర్ భూతం కబలిస్తోందన్న వార్త తెలిసింది. అంతే అప్పటి నుంచి తిరగని ఆస్పత్రి లేదు. పెట్టని ఖర్చు లేదు. ఇంత చేస్తున్నా ఏమాత్రం నయం కావడం లేదు. సరికదా రోజురోజుకు ఆరోగ్యం క్షిణిస్తోంది. ఇన్నాళ్లు ఎలాగో గుట్టుగా వైద్యం చేసిన ఇంటి పెద్ద ఆర్థిక స్థోమత సరిపోక దాతలు, విరాళాల కోసం ఎదురుచూస్తున్నారు. సాలూరు: సాలూరు పట్టణంలోని బోనుమహంతి వీధికి చెందిన బూసురోతు భారతి అనే మహిళకు రెండేళ్ల క్రితం భరత్‌రాజు అనే ఆటో డ్రైవర్‌తో వివాహం అయింది. ఉన్నదాంతో వారు సంతోషంగా జీవిస్తున్నారు. ఇంతలో బాబు కూడా పుట్టాడు. అయితే ఉన్నట్టుండి భారతి ఆరు నెలల క్రితం తీవ్ర అస్వస్థతకు లోనైంది. అప్పటి నుంచి వారు ఎన్ని ఆస్పత్రులకు తిరిగారో తెలియదు. నాలుగు నెలల కిందట మహాత్మాగాంధీ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి బ్లడ్ క్యాన్సర్‌గా నిర్ధారించారు. అయినా ఆస్పత్రులకు తిరుగుతున్నారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చూపితే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు. బెంగళూరులో నాటు వైద్యంతో నయమవుతుందని చెప్పడంతో అక్కడికి వెళ్లారు. ఇంతలో హైదరాబాద్ మహాత్మాగాంధీ ఆస్పత్రి వారు ఉచితంగా వైద్యం చేస్తారని తెలిసి అక్కడి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కొన్నాళ్లు ఆమె బాగానే ఉన్నారు. ఇక తగ్గిందనుకున్నారు అందరూ. ఇంతలోనే మళ్లీ.. ఇక బాధలు తగ్గాయి అనుకుంటున్న తరుణంలో రెండు వారాల క్రితం పిప్పిపన్ను రూపంలో మళ్లీ రోగం తిరగేసింది. ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించింది. ప్రస్తుతం తణుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు భారతి. అక్కడి వైద్యులు బోన్ మేరో ఆపరేషన్ చేసేందుకు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. దాంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక కుటుంబీకులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. భర్త భార్యను తిప్పుతు ఉండడంతో ఆటో వేసేందుకు కూడా సమయం లేకుండా పోయింది. మనసున్న మారాజులు ఆదుకోరూ..! విరాళాలు ఇచ్చి తన భార్యను ఆదుకోవాలని భరత్ రాజు, కూతురును కాపాడాలని భారతి తల్లి ఈశ్వరమ్మ దాతలను కోరుతున్నారు. మనసున్న మారాజులు ఆదుకోవాలని, ఎవరైనా డబ్బులు వేయాలనుకుంటే భారతి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయాలని సూచించారు. విరాళాలు ఇవ్వాలనుకున్న వారు ‘ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, సాలూరు, అకౌంట్ నంబర్: 7308917918–5, ఐఎఫ్ఎస్సీ కోడ్– ఎస్బీఐఎన్ జీరో ఆర్‌ఆర్‌ఏపీజీబీ’ డబ్బులు వేయాలని అర్ధిస్తున్నారు. ప్రాణాలు కాపాడాలని వేడుకోలు మా శక్తి అయిపోయింది. నా బిడ్డ ప్రాణాలను దాతలే రక్షించాలి. నా మనవడిని తల్లి లేని వాడుకాకుండా ప్రజలే చూడాలి. దాతలు ఎవరికి తోచిన సాయం వారు అందించి బిడ్డ ప్రాణాలు కాపాడరూ..!-భారతి తల్లి ఈశ్వరమ్మ -
చేయూత కోసం ‘చేయి’ ఆరాటం
అవలోకనం ఎన్నికల ప్రయోజనాల కోసమే స్వార్థ చింతనతో ఒక కులాన్ని ఆకర్షించడం ఏ రాజకీయ పార్టీకయినా అనుకున్నంత సులభమేమీ కాదు. అలా ఆకర్షించాలంటే వాళ్లకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమివ్వగలదు? బ్రాహ్మణ అభ్యర్థులకు ఆ పార్టీ టికెట్లయితే కేటాయించగలదు. తరువాత ఏమిటి? కాంగ్రెస్ రాజకీయాలు బ్రాహ్మణులను తన వైపు తిప్పుకుంటాయా? రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోబోతున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అనుసరించవలసిన వ్యూహం ఎలా ఉండాలి? ఉత్తరప్రదేశ్ అంటే దేశంలోనే పెద్ద రాష్ట్రం (21 కోట్ల జనాభా ఉన్న ఆ రాష్ర్టం దానికదే ప్రపంచంలో ఐదో పెద్ద దేశం). ఈ సమస్యను పరిష్కరించి ఒక మంచి ఎన్నికల పథకాన్ని రూపొందించి పెట్టడానికి భారతదేశంలోనే అతి సునిశిత రాజకీయ మేధావులలో ఒకరిగా పేర్గాంచిన ప్రశాంత్ కిశోర్‌ను నియమించుకున్నారు రాహుల్ గాంధీ. ఇంతకీ ఈ కిశోర్ ఎవరంటే 2014 ఎన్నికలలో నరేంద్ర మోదీకీ (చాయ్ పే చర్చ ఆలోచన ఈయనదేనన్నది సుస్పష్టం), తరువాత 2015లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమ యంలో నితీశ్ కుమార్కీ ఎన్నికల వ్యూహాలను రచించి పెట్టిన వ్యక్తే. ఆయనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావడానికి సంబంధించిన వ్యూహం ఆలోచించిపెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటిదాకా అందిన వార్తల ప్రకారం రెండు వ్యూహాలను కిశోర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచారు. అందులో మొదటిది- బ్రాహ్మణుల ఓట్ల కోసం వల వేయడం. రెండోది-ముఖ్యమంత్రి అభ్యర్థిగా గాంధీలలో ఒకరిని, అంటే రాహుల్ లేదా ప్రియాంక గాంధీల పేరును ప్రతిపాదించడం. రెండో వ్యూహం ఎంతమాత్రం ఆమోదించడానికి వీలుకానిది. ఒక ప్రాంతీయ నాయకుడి స్థాయికి దిగడానికీ, అలాంటి పదవి చేపట్టడానికీ గాంధీలకి అహం అడ్డువస్తుంది. నిజానికి గడచిన లోక్‌సభ ఎన్నికల సమయంలో అసలు నరేంద్ర మోదీతో రాహుల్‌ను పోల్చడానికే కాంగ్రెస్ వర్గాలు ససేమిరా అన్నాయి. ప్రాంతీయ నాయకుడైన మోదీ ఎక్కడ? జాతీయ నాయకుడైన రాహుల్ ఎక్కడ? అని ఆ పార్టీ చెమ్చాలు అహంకరించాయి. దీనికి మోదీ ఎంతో తెలివిగా ఇచ్చిన సమాధానం- నిజమే, రాహుల్ జాతీయ నాయకుడేమిటి; ఇటలీ సంబంధాలను బట్టి ఆయన అంతర్జాతీయ నాయకుడు కూడా, అని. కిశోర్ ప్రతిపాదించిన మొదటి వ్యూహమే చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ వెనుక యాదవులు ఉన్నట్టు, మాయావతి వెంట దళితులు నడుస్తున్నట్టు, అగ్రకులాలు బీజేపీకి మద్దతు పలుకుతున్నట్టు కాంగ్రెస్‌ను అంటిపెట్టుకున్న కులమంటూ ఏదైనా ఒకటి ఉందని చెప్పలేం. ఒక కులాన్ని మీ పార్టీ వైపు ఆకర్షించడం చాలా అవసరం. ఎందుకంటే విజయ సాధనలో అదే తొలి సోపానం కాబట్టి. ఇక, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందంటూ మీరు కల్పించిన భరోసాను విశ్వసిస్తే ముస్లింలు వంటి ఇతర వర్గాలు మీ రాజకీయ శిబిరంలోకి వస్తారు. ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణుల ఓట్లను (జనాభాలో వీరు దాదాపు పది శాతం ఉంటారు) సాధించడం కాంగ్రెస్‌కు సులభమేనన్నది కిశోర్ వినిపిస్తున్న తర్కం. ఎందుకంటే, గతంలో బ్రాహ్మణులు ఆ పార్టీ వెనుకే ఉన్నారు. ఆ మాటయితే నిజమే. గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎన్డీ తివారీ, కమలాపతి త్రిపాఠీ, గోవింద్‌వల్లభ్ పంత్, శ్రీపతి మిశ్రా వంటి వారు బ్రాహ్మణులే. అయితే ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో విజయం సాధించిన ఘటన మూడు దశాబ్దాల క్రితం మాత్రమే జరిగింది. నేనయితే ఆ రోజులను గుర్తుకు తెచ్చుకోగలను కానీ, చాలామందికి ఆ అవకాశం లేదు. భారత జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వయసు వాళ్లే. నా అంచనా ప్రకారం ఇప్పుడు ఉన్నవారిలో 1985 నాటి ఎన్నికలలో ఓటు వేసిన వారు ఐదు శాతం కంటే తక్కువే ఉంటారు. అంటే గాంధీలకి ఓటు వేసిన జ్ఞాపకం ఉన్నవారు చాలా పరిమితం. సమస్య అంతా ఇదే. దీనికి మించినదీ, రెండోదీ ఇంకో సమస్య ఉంది. ఎన్నికల ప్రయోజనాల కోసమే స్వార్థ చింతనతో ఒక కులాన్ని ఆకర్షించడం ఏ రాజకీయ పార్టీకయినా అనుకున్నంత సులభ మేమీ కాదు. అలా ఆకర్షించాలంటే వాళ్లకి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఏమివ్వగలదు? బ్రాహ్మణ అభ్యర్థులకు ఆ పార్టీ టికెట్లయితే కేటాయించ గలదు. తరువాత ఏమిటి? కాంగ్రెస్ రాజకీయాలు బ్రాహ్మణులను తన వైపు తిప్పుకుంటాయా? నేనయితే సాధ్యం కాదనే చెబుతాను. విధానపరమైన పరిభాషలో చెప్పాలంటే, మొన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల మీద దృష్టి పెట్టింది. అంటే కింది కులాల సంక్షేమం మీద దృష్టి పెట్టింది. ఇదే జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత వంటి వాటి ద్వారా రూపుకట్టింది. ఇలాంటి సంక్షేమ పథకాలు మధ్య తరగతి వర్గపు ఓటర్లను ఆకర్షించవు. అలాంటిది బ్రాహ్మణులను ఆకర్షిస్తుందంటే అసలు నమ్మకం కుదరదు. నిజానికి గడచిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి పడిన ఓట్లలో బ్రాహ్మణుల ఓట్ల శాతం బాగా తగ్గిందంటూ వచ్చిన అధ్యయనాల పునాదిగా వచ్చిందే కిశోర్ వినిపిస్తున్న ఆ తర్కం. 2002 ఎన్నికలలో 50 శాతం, 2007లో 44శాతం, 2012లో 38 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. అయినా బ్రాహ్మణులు బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఎందుకంటే హిందుత్వ సామాజికంగా సంప్రదాయవాదంతో ఉంటుంది. అలాగే బీజేపీ చెప్పే మత సంబంధ విషయాలు - ఆలయాల నిర్మాణం, గోవధ నిషేధం వంటివి వారిని ఆకర్షిస్తాయి. బీజేపీ, ఆరెస్సెస్ రిజర్వేషన్ పట్ల తరచుగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఇటీవల కాలంలో దళిత విద్యార్థుల పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తోంది. చాలా మంది బ్రాహ్మణులు బీజేపీకి సానుకూలంగా ఉండటానికి ఇది కూడా కారణమే. వీటిలో ఏవీ కూడా కాంగ్రెస్ చేయగలిగే స్థితిలో లేదు. ఉత్తరప్రదేశ్‌లో మిగిలిన బ్రాహ్మణుల ఓట్లు ములాయం సింగ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీల మధ్య 20 శాతం వంతున చీలిపోయాయి. ఈ చీలిక ఇలాగే కొనసాగవచ్చు. ఎందుకంటే మిగిలిన కులాల మాదిరిగానే బ్రాహ్మణులు కూడా ఓట్ల విషయంలో ఒకే తాటి మీద లేరు. అందులో చాలామంది శక్తిమంతమైన పార్టీల వైపు మొగ్గుతారు. ఎందుకంటే విజేతల వైపు ఉండాలని వారూ కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మొదట ఎలాంటి ఓటర్లను ఆకర్షించగలదో తన విధానాల వేదిక ద్వారా చూసుకోవాలి. అక్కడే దృష్టి పెట్టాలి. కిశోర్ సలహా మేరకు చేయలేకపోతే, కొత్త ఓటర్లను వెతుక్కోవాలి. తరువాత ఆ ఓటర్లకు అనుగుణంగా ఒక విధానం ఏర్పరుచుకోవాలి. కాంగ్రెస్ పేరు దారుణంగా దెబ్బతింది. అలాగే అవినీతికీ, అసమర్థతకీ, కుటుంబ పాలనకీ అది విలాసమైంది. ఇప్పుడు గాంధీలు చాలా విభిన్నమైన స్థితిలో ఉన్నారు. ఎమర్జెన్సీ తరువాత ప్రతిపక్షంలోనే ఉన్నప్పటికీ, నాటి కంటే విభిన్నమైన స్థితిలో ఇప్పుడు ఉన్నారు. ఇవాళ ఆ పార్టీ అంతిమ క్షణాలు లెక్కించుకునే స్థితికి చేరుకుంది. ఓటర్లు ఎవరూ, ఏ కులమూ, ఏ వర్గమూ కాంగ్రెస్ అంటే ఆసక్తి చూపడం లేదు. బ్రాహ్మణులను ఆకర్షించాలన్న ఈ వ్యూహం విజయవంతం కావడానికి కూడా అవకాశాలే లేవు. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
తమ్ముడూ మనకు దిక్కెవరు?
♦ ఆపన్న హస్తం కోసం చిన్నారుల ఎదురుచూపు ♦ పసిప్రాయంలోనే తల్లిదండ్రులు దూరమై నరకయూతన ఒంగోలు: అల్లారు ముద్దుగా అమ్మ చెంతన.. నాన్న రక్షణలో లోకాన్ని చుట్టేస్తూ హారుుగా గడిపేయాల్సిన ఆ పసికూనలకు ఆదినుంచే కష్టాలు ప్రారంభమయాయి. నానమ్మ చెంత బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అక్కే పెద్ద దిక్కై తమ్ముడిని చేరదీస్తోంది. అమ్మా,నాన్నలు ఏమయ్యారు... ఎందుకిలా మేం అనాథలుగా మిగిలామో కూడా తెలియని ఆ పసి హృదయూలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. వయసు మీద పడిన నాన్నమ్మ సపర్యలు చేస్తోంది. ‘నా తదనంతరం వీరి బతుకెలా’ అని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. పాలు తాగే ప్రాయంలోనే తల్లి మృతి.. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం రామాపురానికి చెందిన ముప్పూరి శేషమ్మ, వెంకటేశ్వర్లకు ఆరేళ్ల వయసున్న నాగచైతన్య, పదకొండేళ్ల వయసున్న నాగేశ్వరిల సంతానం. ఇద్దరూ కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పెద్దమ్మాయిని దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదివిస్తున్నారు. సాఫీగా సాగుతున్న వీరి బతుకుల్లో విషాదం చిమ్మింది. బహిర్భూమికి వెళ్లి వస్తుండగా గత ఏడాది జులై నెలలో తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అమ్మలేని తనాన్ని తలచుకొని కుటుంబం కుమిలిపోయింది. పసి పిల్లాడి రోదన ఆపడం ఎవరి తరం కాలేదు. ఎలానో ఆ బాధను మరిపించి తల్లిలేని లోటును తీర్చి కొత్త జీవితం వైపు అడుగులేయిస్తున్న ఆ తండ్రికి క్యాన్సర్ వ్యాధి కాటేసింది. ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చనిపోవడంతో నాన్నమ్మ కొండమ్మే దిక్కయింది. కోడలు, కొడుకు నీడన బతుకు ముగించాల్సిన వయసులో కొండంత కష్టం మీద పడిందని వాపోతోంది. వయసు మీరుతోంది ... తదనంతరం ఈ పిల్లల పరిస్థితేమిటని కళ్లనీళ్ల పర్యంతమవుతోంది ఆ పండుటాకు. దాతల సహాయం కోసం ఎదురు చూపు... దాతల సహాయం కోసం అనాధలు ఎదురు చూస్తున్నారు. అర్థంతరంగా చదువును ఆపేసి తమ్ముడు ఆలనా,పాలనా చూసుకుంటోంది నాగ చైతన్య. తన కష్టం ఎవరికీ చెప్పుకోలేని ఆ పసి హృదయాలను చేరదీసి ఓ మార్గం చూపించాలని పిల్లల నాన్నమ్మ వేడుకుంటోంది. స్పందించే హృదయాలు 94903 24964 నెంబర్‌కు ఫోన్ చేయాలని బాధితులు అభ్యర్థిస్తున్నారు. -
లైఫ్ లైన్: చిన్నారికి పెద్ద జబ్బు
-
ఎవ్లిన్ లేహకు సహాయం చేద్దాం!
-
అప్లాస్టిక్ ఎనీమియాతో భాదపడుతున్న అహ్మాద్ సిద్దిఖి