YSRCP MLA Vidadala Rajini Shows Her Humanity by Giving Money in Karimnagar - Sakshi
Sakshi News home page

అభిమానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని అండ

Published Sat, Sep 18 2021 12:17 PM | Last Updated on Sat, Sep 18 2021 6:29 PM

YSRCP MLA Vidadala Rajini Shows Her Humanity By Giving Money In Karimnagar - Sakshi

చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రజిని అభిమాని. ఆమె ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాలను ఫాలో అవుతూ.. ఎమ్మెల్యే చేపట్టే కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. 3 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో అనిల్‌కు కాలు విరిగింది.

సాక్షి, కరీంనగర్‌: చామన్‌పల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దూడం అనిల్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రజిని అభిమాని. ఆమె ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాలను ఫాలో అవుతూ.. ఎమ్మెల్యే చేపట్టే కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. 3 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో అనిల్‌కు కాలు విరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ఎమ్మెల్యేకు తెలుపగా రూ.10 వేలు ఆర్థికసాయం అందించారు. అప్పటినుంచి ఆమెకు వీరాభిమానిగా మారాడు.

ఇటీవల చేతిపై ఎమ్మెల్యే రజిని చిత్రాన్ని టాటూ వేయించుకున్నాడు. ఈ ఫొటోను ఆమెకు పోస్టు చేయగా ప్రత్యక్షంగా కలవాలని సూచించారు. దీంతో శుక్రవారం చిలుకలూరిపేట వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. టాటూ చూసి ఇలాంటి పనులు చేయవద్దని చెప్పారు. కాసేపు అనిల్‌తో మాట్లాడి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భోజనం పెట్టి, సన్మానించారు. తన స్వగ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నానని అనిల్‌ చెప్పగా మొదటి దఫాగా రూ.50 వేల చెక్కు అందజేశారు. మరింత సహాయం చేస్తానని, అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  

చదవండి:  నా భర్తను వెతికి పెట్టండి: కెనడాలో తెలుగు మహిళ ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement