రాజేంద్రనగర్లో కాల్పుల కలకలం
హైదరాబాద్: రాజేంద్రనగర్లో మంగళవారం తెల్లవారుజామున ఆగంతకులు జరిపిన కాల్పులు స్థానికంగా కలకలం సృష్టించాయి. రాజేంద్రనగర్ ఏజీ కాలనీలోని రహదారిపై వెళ్తున్న వాహనంపై ఆగంతకులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. అనంతరం ఆగంతకులు అక్కడినుంచి పరారైయ్యారు. దాంతో కారులో ప్రయాణిస్తున్న రియాల్టర్ షాబుద్దీన్ నేరుగా రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. తన వాహనంపై ఆగంతకులు కాల్పులు జరిపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాబుద్దీన్ తో పాటు పోలీసులు కాల్పులు జరిగిన ప్రదేశానికి వచ్చి స్థానికులను విచారిస్తున్నారు.