![2 Years Old Missing Boy In Rajendra Nagar Found Dead - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/28/kidnap12.jpg.webp?itok=dvDGkX1G)
సాక్షి, హైదరాబాద్: రాజేంద్ర నగర్‌లో కలకలం రేపిన బాలుడి మిస్సింగ్ విషాదాంతమైంది. జలాల్‌బాబానగర్‌లో శుక్రవారం ఉదయం రెండేళ్ల బాలుడు అబుబకర్ కిడ్నాప్‌నకు గురైన విషయం తెలిసిందే. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కలంతా గాలించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంతలోనే విషాద ఘటన వెలుగుచూసింది. ఇంటి సమీపంలోని స్మశాన వాటిక నీటి గుంటలో శనివారం బాలుడు శవమై తేలాడు. వెంటనే బాలుడి తల్లిదండ్రులు రాజేంద్ర నగర్‌లో పోలీసులకు సమాచారమివ్వడంతో బాలుడిది హత్యా లేక ప్రమాదమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. తమ చిన్నారి విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. బాలుడిని చంపేసి నీటి గుంటలో పడేసి ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment