ఓ ట్రాలీ ఆటో నుంచి నూనె ప్యాకెట్లు రోడ్డుపై పడి పగిలిపోవడంతో.. పలు వాహనదారులు జారి పడి గాయపడ్డారు.
రాజేంద్రనగర్ (రంగారెడ్డి) : ఓ ట్రాలీ ఆటో నుంచి నూనె ప్యాకెట్లు రోడ్డుపై పడి పగిలిపోవడంతో.. పలు వాహనదారులు జారి పడి గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. కాటేదాన్ నుంచి నార్సింగ్ వైపు వెళుతున్న ఓ ట్రాలీ ఆటో నుంచి 15 నూనె ప్యాకెట్ల బాక్స్‌లు రోడ్డుపై పడిపోయాయి.
ప్యాకెట్లు పగిలి నూనె రోడ్డుపై కారిపోవడంతో.. అదే సమయంలో ఆ మార్గంలో వచ్చిన ముగ్గురు వాహనాదారులు అదుపు తప్పి కిందపడి గాయాలపాలయ్యారు. స్థానికులు స్పందించి రోడ్డుపై మట్టి వేసి ఇతర వాహనాదారులకు ప్రమాదాలు కాకుండా జాగ్రత్త తీసుకున్నారు.