ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రాజేంద్రనగర్: విడాకులు ఇచ్చిన భర్త వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అవుతుండటం, కుమారుడిని తీసుకువెళ్లి పంపకపోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం హుడా కాలనీకి చెందిన షహజాబేగం(25), ఎంఎం పహాడీకి చెందిన షేక్ ఇమ్రాన్(29)తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. షేక్ ఇమ్రాన్ స్థానికంగా హార్డ్‌వేర్ దుకాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇతడికి బంధువుల మహిళతో అక్రమ సంబంధం ఉంది. సంవత్సరం క్రితం షహజాబేగం రెడ్‌హ్యాండ్‌గా పట్టుకొని నిలదీసింది.
అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం షేక్ ఇమ్రాన్ పాలల్లో గుర్తు తెలిని క్రిమి సంహారక మందు కలిపి షహజాబేగంతో తాగించాడు. దీంతో అస్వస్తతకు గురైన షహజాబేగంను ఆసుపత్రికి తరలించగా వారం రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయింది. ఈ సమయంలో భర్తపై రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. వీరికి ఇద్దరు సంతానం. స్థానిక పెద్దల జోక్యంతో కేసు విత్‌డ్రా చేసుకున్న షహజాబేగం అమ్మగారి ఇంటి వద్దే ఉంటోంది. మూడు నెలల క్రితం విడాకులు తీసుకుంది.
చదవండి: సెల్ఫీ కోసం రైలు బోగీ పైకి.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలడంతో
కాగా పది రోజుల క్రితం షేక్ ఇమ్రాన్ కుమారుడిని చూస్తానని ఇంటికి తీసుకువెళ్లాడు. తిరిగి షాజాహబేగంకు అప్పగించలేదు. తరచూ స్థానికులతో అసత్య ప్రచారాన్ని చేపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెందిన షాహజాబేగం ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. బుధవారం రాత్రి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా
Comments
Please login to add a commentAdd a comment