సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతి మరణం కలకలం రేపుతోంది. చింతల్‌మెట్‌లోని ఓ అపార్టుమెంట్ రూమ్ నంబర్ 201లో ఓ యువతి మృతదేహం వెలుగు చూసింది. స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసుల ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే వారం క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారని తెలిపారు. మృతురాలు సుమేర బేగంగా పోలీసులు గుర్తించారు. ఆమె బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెది హత్య? ఆత్మహత్య? అన్న విషయం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment