Oil packets
-
నూనె ప్యాకెట్లో ఎలుక
కందుకూరు: నూనె ప్యాకెట్లో మృతి చెందిన ఓ ఎలుక పిల్ల బయటపడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గౌరీశంకర్.. కందుకూరు చౌరస్తాలోని ఓ కిరాణా షాపు నుంచి పామ్డిలైట్ పేరుతో ఉన్న పామోలిన్ నూనె ప్యాకెట్‌ను ఇటీవల కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాడు. ఆదివారం ఇంట్లో వంట చేయడానికి నూనె ప్యాకెట్‌ను కొద్దిగా కత్తిరించి గిన్నెలోకి వంపుతుండగా తేడా కన్పించడంతో ప్యాకెట్‌ను మొత్తం కత్తిరించి చూశాడు. అందులో మృతిచెందిన ఓ ఎలుక పిల్ల కనిపించింది. దీంతో ఆయన ఆశ్చర్యానికి గురై విషయాన్ని మీడియాకు తెలిపాడు. -
రోడ్డుపై నూనె : పలువురికి గాయాలు
రాజేంద్రనగర్ (రంగారెడ్డి) : ఓ ట్రాలీ ఆటో నుంచి నూనె ప్యాకెట్లు రోడ్డుపై పడి పగిలిపోవడంతో.. పలు వాహనదారులు జారి పడి గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. కాటేదాన్ నుంచి నార్సింగ్ వైపు వెళుతున్న ఓ ట్రాలీ ఆటో నుంచి 15 నూనె ప్యాకెట్ల బాక్స్‌లు రోడ్డుపై పడిపోయాయి. ప్యాకెట్లు పగిలి నూనె రోడ్డుపై కారిపోవడంతో.. అదే సమయంలో ఆ మార్గంలో వచ్చిన ముగ్గురు వాహనాదారులు అదుపు తప్పి కిందపడి గాయాలపాలయ్యారు. స్థానికులు స్పందించి రోడ్డుపై మట్టి వేసి ఇతర వాహనాదారులకు ప్రమాదాలు కాకుండా జాగ్రత్త తీసుకున్నారు.