
ఎలుక పిల్ల బయటపడిన నూనె ప్యాకెట్.......నూనె ప్యాకెట్లో ఎలుక పిల్ల
కందుకూరు: నూనె ప్యాకెట్‌లో మృతి చెందిన ఓ ఎలుక పిల్ల బయటపడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గౌరీశంకర్.. కందుకూరు చౌరస్తాలోని ఓ కిరాణా షాపు నుంచి పామ్‌డిలైట్ పేరుతో ఉన్న పామోలిన్ నూనె ప్యాకెట్‌ను ఇటీవల కొనుగోలు చేసి ఇంటికి తెచ్చాడు.
ఆదివారం ఇంట్లో వంట చేయడానికి నూనె ప్యాకెట్‌ను కొద్దిగా కత్తిరించి గిన్నెలోకి వంపుతుండగా తేడా కన్పించడంతో ప్యాకెట్‌ను మొత్తం కత్తిరించి చూశాడు. అందులో మృతిచెందిన ఓ ఎలుక పిల్ల కనిపించింది. దీంతో ఆయన ఆశ్చర్యానికి గురై విషయాన్ని మీడియాకు తెలిపాడు.