
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరించినట్టు తెలిసింది. నారం ఫాంహౌస్ వద్ద ఓ ఇంటి కాంపౌండ్‌లోకి చిరుత ప్రవేశించిన దృశ్యాలు, చిరుత కిటికీ ఎక్కి ఇంట్లోకి తొంగిచూస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. చిరుత సంచారంతో ఉద్యోగులు, స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఫాంహౌస్ వద్ద మరో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా, నాలుగు వారాల క్రితం బద్వేల్ సమీపంలో నడిరోడ్డుపై కనిపించిన చిరుత.. ఓ లారీ యజమానిపై దాడి చేసి పారిపోయింది. దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిరుత పాదముద్రల ఆధారంగా అది చిలుకూరు అటవీప్రాంతంలోకి వెళ్లిఉండొచ్చుని భావించారు. తాజాగా చిరుత మరోసారి ప్రత్యక్షం కావడంతో అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
(చదవండి: చిరుత చిక్కలే!)
Comments
Please login to add a commentAdd a comment