jayashankar agricultural university
-
సాగులో సాంకేతికత పెంచండి..
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవ సాయం వెన్నెముక లాంటిదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. రైతులకు మరింత చేరువయ్యేలా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రెండు రోజులపాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను చాన్స్‌లర్ హోదాలో శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు. వజ్రోత్సవాల మీనియేచర్ పైలాన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్యతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ గుర్తింపు పత్రా లని అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 2047 నాటికి వ్యవసాయ రంగంలో విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గడిచిన 60 ఏళ్లుగా వర్సిటీ అసమాన సేవలందిస్తూ.. సోనామసూరి, తెలంగాణ సోనా వంటి ఎన్నో కొత్త వంగడాలను అభివృద్ధి చేసిందని కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి అధునాతన సాంకేతికతలను వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మారేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు. ఉద్యానవన పంటల సాగు పెరగాలి: తుమ్మల రాష్ట్రంలో వరి, పత్తి, మిరప పంటల సాగును తగ్గించి.. కూరగాయలు, ఆయిల్‌పామ్, ఇతర ఉద్యాన పంటల సాగు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతాంగానికి సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో వ్యవసాయ పట్టభద్రులు రావాలని ఆకాంక్షించారు. శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు పంటల సాగును సూచించాలని కోరారు. ప్రతి వ్యవసాయ కళాశాల పరిధిలో ఒక ‘మోడల్ అగ్రికల్చర్ ఫార్మ్’ను అభివృద్ధి చేయాలని సూచించారు. నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల సౌకర్యం పెరగటంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగిందని.. అదే సమయంలో కూరగాయలు, ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు నాదెండ్ల భాస్కర్‌రావు, సమరసింహారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ బాల్‌రాజ్, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీకల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డి. రాజిరెడ్డి, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు చింతల వెంకటరెడ్డి, వై. వెంకటేశ్వర్రావు, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు రఘువర్ధన్ రెడ్డి, రాఘవరెడ్డి, పద్మరాజు, వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
కలుపు తీస్తుంది.. ఎరువు జల్లుతుంది!
సాక్షి, రంగారెడ్డిజిల్లా : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కిసాన్‌మేళాకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఈ స్టాళ్లను ప్రారంభించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతోపాటు పశు వైద్య విశ్వవిద్యాల యానికి చెందిన శాస్త్రవేత్తలు, విద్యార్థులు తమ పరిశోధనలను ప్రదర్శించారు. ఆగ్రో, బయోటెక్, ఫెర్టిలైజర్ కంపెనీలు తమ ఉత్ప త్తులు, యంత్రాలను ప్రదర్శించాయి. సంప్రదాయ చిరుధాన్యాలే కాకుండా వివిధ రకాల పండ్లు, వివిధ పంటల్లో వచ్చిన కొత్త వంగడాలు, యంత్ర పరికరాలతోపాటు కోళ్లు, కుందేళ్లు, పందులు, గొర్రెలు, పక్షుల పెంపకానికి సంబంధించిన స్టాళ్లు కూడా కొలువుదీరాయి. ‘ఈ కెనాన్’తో కోతులు పరార్ కోతులు, పందులు, ఇతర జంతు వుల నుంచి పంటలకు విముక్తి కల్పించేందుకు ‘సోలార్ ఆటోమేటిక్ ఈ కెనాన్’తోపాటు ఈ కెనాన్ (మంకీగన్)ను ప్రదర్శ నలో ఉంచా రు. సోలార్ ఆటోమేటిక్ ఈ కెనా న్ ధర రూ.26 వేలు. ఇది సోలార్ బ్యాట రీతో పనిచేస్తుంది. జంతువులు, పక్షులు పంటలపై దాడి చేయకుండా ఆటోమేటిక్‌గా సౌండ్స్ చేస్తాయి. ఈ సౌండ్స్ భయానికి అవి పారిపోతాయి. మంకీగన్ ధర రూ.3,500. క్యాల్షియం కార్బైడ్ దీనిలో నింపి, కొంచెం నీటిని వేయడం వల్ల గన్లోపల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ట్రిగ్గర్ నొక్కిన వెంటనే బాంబు పేలి న శబ్దం బయటకు వస్తుంది. ఈభారీ శబ్దానికి కోతులు, పందులు పారిపోతాయి. మంకీగన్ కొంటా.. మాకు 15 ఎకరాల భూమి ఉంది. పత్తి, మొక్క జొన్న వరిసాగు చేశాం. కోతుల బెడద ఎక్కువగా ఉంది. పండ్లు, కూరగాయలు ఏ పంట వేసినా చేతికి రావడం లేదు. కిసాన్‌మేళాలో మంకీగన్ చూశాను. ఖర్చు కూడా చాలా తక్కువే అనిపించింది. దీనిని కొనుగోలు చేసి కోతల బెడద నుంచి పంటను కాపాడుకుంటాను. – కల్యాణి, మహిళా రైతు, ఖమ్మం ఆహార వ్యర్థాల నుంచి వంటగ్యాస్ ఇంట్లో సహా హోటళ్లు, ఫంక్షన్ హాళ్లలో ఆహార పదార్థాలు, కూరగాయలు ఇతర వ్యర్థాలను వృథాగా పడేస్తుంటారు. ఇవి ఒకటి రెండు రోజుల్లోనే కుళ్లి, దుర్వాసన వెదజల్లుతాయి. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతాయి. ఈ ఆహార వ్యర్థాల నుంచి ‘నానో బయోగ్యాస్ ప్లాంట్’ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం కేరళలో విరివిగా వాడుతున్న ఈ నానో బయోగ్యాస్ ప్లాంట్‌ను కిసాన్ మేళాలో ప్రదర్శించారు.దీనికి పెద్ద శ్రమ అవసరం లేదు. ఖర్చుకూడా తక్కువే. దీని ధర రూ.28 వేలు. ఐదు లీటర్ల సామర్థ్యంతో ఏకధాటిగా రెండు గంటల పాటు వంట చేసుకోవచ్చు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఎలా చేయాలో తెలిసింది కొత్త టెక్నాలజీతో వ్యవసాయం ఎలా చేయాలో అర్థమైంది. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ పంట దిగుబడి ఎలా సాధించాలో తెలిసింది. వచ్చే సీజన్ నుంచి పూర్తిగా ఈ యాంత్రీకరణపైనే ఆధారపడి పనిచేయాలని నిర్ణయించుకున్నా. రైతులకు తోడుగా ఎన్ని రకాల యంత్ర పరికరాలు వచ్చాయో తెలిసింది. – ఎట్టయ్య, మనగల్ రైతు ‘ఫార్మ్రోబో ఆర్–1’తో గొర్రు, గుంటుక పొలంలో గొర్రుకు ఎద్దులను వాడుతుంటారు. రైతు కూడా రోజంతా పని చేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా ‘ఫార్మ్ రోబో ఆర్–1’ అందు బాటులోకి వచ్చింది. ఇది మనిషితో పనిలేకుండా పూర్తిగా రిమోట్ కంట్రోల్‌తో పని చేస్తుంది. కేవలం విద్యుత్ చార్జింగ్ బ్యాటరీల ద్వారా పనిచేస్తుంది. గుంటక, గొర్రు, రోటావేటర్గా పనిచేస్తుంది. ఎరువులను కూడా వెదజల్లుతుంది. చేలో ఏపుగా పెరిగిన కలుపు మొక్కలను కూడా తొలగిస్తుంది. రూ.4.25 లక్షలు దీని ధర. డ్రైవర్‌తో పనిలేదు. బ్యాటరీలను ఒకసారి చార్జింగ్ చేస్తే 3 – 4 గంటల పాటు పని చేస్తుంది. గంట వ్యవధిలోనే ఎకరం భూమిలో గుంటుక కొడుతుంది. పటాన్‌చెరుకు చెందిన సంస్థ దీన్ని ప్రదర్శనలో ఉంచింది. స్మార్ట్ వ్యవసాయానికి ‘స్మార్ట్ డ్రోన్లు’ చీడపీడల నివారణకు రైతులు చేతి పంపులు, పెట్రోల్ పంపులను వాడుతారు. ఇది అనేక వ్యయ ప్రయాసలతో కూడినది. రైతు శ్రమ, ఖర్చు తగ్గించేందుకు పవ్మెన్ ఏవియేషన్ కంపెనీ సహా మారుతి డ్రోన్స్ ఏజీ 335హెచ్, వ్యవసాయ డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇవి 120 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. క్రిమిసంహారక మందులను నేరుగా పంటపై వెదజల్లుతాయి. వీటి ధర రూ.4.15 లక్షలు. బ్యాటరీ బ్యాకప్‌తో పనిచేస్తుంది. పైలెట్‌కు సదరు సంస్థే శిక్షణ సహా లైసెన్స్‌ను కూడా ఇప్పిస్తుంది. పది లీటర్ల ట్యాంకు సహా రోజుకు కనీసం 25 నుంచి 30 ఎకరాలు పిచికారీ సామర్థ్యం ఉంది. -
డ్రోన్ సాగు సూపర్!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయమంటే దుక్కి దున్నడం నుంచి పంట కోత దాకా ఎన్నో పనులు.. తీరిక లేని శ్రమ.. కూలీల కొరత ఓ వైపు, సమయాభావం మరోవైపు ఇబ్బందిగా మారిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో రైతన్నలకు వ్యవ‘సాయం’ కోసం డ్రోన్లతో ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి పెట్టింది. కేవలం పురుగు మందులు పిచికారీ చేయడానికే పరిమితం కాకుండా.. విత్తనాలు, ఎరువులు చల్లడం.. పంటలో చీడపీడలు, తెగుళ్లను, పూత, కాత పరిస్థితిని గుర్తించేలా ఫొటోలు తీయడం.. దిగుబడి ఏ మేరకు వచ్చే అవకాశం ఉందనే అంచనా వేసేందుకు వీలైన సమాచారం సేకరించడానికి వీలుగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. డ్రోన్లను సరైన తీరులో వినియోగించడం ద్వారా.. సాగులో పురుగు మందులు, ఎరువుల వృధాను అరికట్టవచ్చని, కూలీల కొరతకు చెక్‌పెట్టవచ్చని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. వరిలో విత్తనాలు వెదజల్లేలా.. డ్రోన్ల ద్వారా వరి విత్తనాలను వెదజల్లి సాగు చేసే విధానాన్ని వ్యవసాయ వర్సిటీ అభివృద్ధి చేస్తోంది. దీనిపై పరిశోధన కొనసాగుతోందని, త్వరలో రైతులకు అందుబాటులోకి తెస్తామని వర్సిటీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వరి నారు పెంచడానికి కొన్ని రోజులు పడుతుందని, తర్వాత నారు తీసి నాట్లు వేయడానికి సమయం పడుతుందని.. ఇదే సమయంలో కూలీల కొరత, ఖర్చు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేస్తే బాగుంటుందని, దీనికి డ్రోన్ సాంకేతికతను వినియోగించేలా పరిశోధన చేస్తున్నామని వివరించారు. డ్రోన్‌తో రోజుకు ఏకంగా 30 ఎకరాల్లో ఐదు వరుసల్లో వరి విత్తనాలను వెదజల్లవచ్చని చెప్తున్నారు. దీనివల్ల రైతులకు కూలీల ఖర్చు తగ్గుతుందని, సమయం కలిసివస్తుందని అంటున్నారు. కలుపు మందును కూడా డ్రోన్ల సాయంతో చల్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటున్నారు. డ్రోన్లపై శిక్షణ కోసం అకాడమీ రాష్ట్రంలో నిరుద్యోగులకు, ఆసక్తి కలిగిన వారికి డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని.. ఇందుకోసం డ్రోన్ అకాడమీని నెలకొల్పాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర రంగాల్లో డ్రోన్లను ఎలా వాడాలో శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. 18 ఏళ్ల నుంచి 60ఏళ్ల మధ్య వయసున్న వారికి శిక్షణ అవకాశం ఉంటుందని.. ఇందుకోసం తప్పనిసరిగా పాస్‌పోర్ట్ ఉండాలని, కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని వెల్లడించారు. ఆరు రోజులపాటు సమగ్రంగా శిక్షణ ఇచ్చేందుకు రూ.45 వేలు ఫీజు ఖరారు చేశారు. ప్రధానంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఉంటుంది. పురుగు మందులు చల్లడంపై ప్రత్యేకంగా.. రాష్ట్రంలో ప్రధానంగా సాగు చేసే వరి, పత్తి, వేరుశనగ, కంది, పొద్దు తిరుగుడు, ఆముదం, సోయాబీన్ పంటల్లో డ్రోన్ల ద్వారా పురుగు మందులను చల్లడంపై ప్రత్యేక శిక్షణ ఉంటుందని వ్యవసాయ వర్సిటీ వెల్లడించింది. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను రూపొందించింది. ఉదాహరణకు డ్రోన్ల ద్వారా పురుగు మందు చల్లేటపుడు వాటి రెక్కల నుంచి వచ్చే గాలి వేగానికి వరి చేను విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎంత ఎత్తు నుంచి డ్రోన్లను ఉపయోగించాలి, ఎంత స్థాయిలో మందును విడుదల చేయాలన్నది నిర్ణయించారు. ► ఇక సాధారణ తైవాన్ స్ప్రేయర్ల ద్వారా ఎకరా పంటకు పురుగుమందు పిచికారీ చేయాలంటే 150 లీటర్ల నుంచి 200 లీటర్ల నీటిని వాడుతారు. అదే డ్రోన్ల ద్వారా అయితే కేవలం 20 లీటర్లతో పిచికారీ చేయొచ్చు. ఒక రోజులో ఏకంగా 30 ఎకరాల్లో మందును చల్లవచ్చు. ప్రత్యేక పరికరాలను అమర్చడం ద్వారా.. కాండం మొదట్లోకి పురుగు మందు చేరేలా చేయవచ్చు. ► కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన నానో యూరియాను కూడా డ్రోన్ల ద్వారా పంటలపై చల్లవచ్చని వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంగోపాల్ వర్మ తెలిపారు. పురుగు మందులను తక్కువ వ్యవధిలో, పొదుపుగా, సమర్థవంతంగా చల్లడానికి డ్రోన్లతో వీలవుతుందని వివరించారు. అదనపు పరికరాలను అమర్చి.. పంటలకు డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు చల్లడానికి సంబంధించి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని పంటలకు పైపైన స్ప్రే చేస్తే సరిపోతుంది. మరికొన్నింటికి కాండం మొదట్లో చల్లాల్సి ఉంటుంది. దీనితోపాటు పంట పరిస్థితి ఏమిటి? ఏవైనా చీడపీడలు ఆశించాయా? అన్నది తెలుసుకునేందుకు ఫొటోలు తీయాలి. వాటిని వ్యవసాయాధికారికి పంపాలి. ఈ క్రమంలోనే ఆయా అవసరాలకు అనుగుణంగా డ్రోన్లకు ప్రత్యేక పరికరాలను అమర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఇక పంటల పూత, కాత ఎలా ఉంది? దిగుబడి ఏమేరకు వచ్చే అవకాశం ఉంది వంటి ప్రతి అంశాన్ని సూక్ష్మస్థాయిలోనూ పర్యవేక్షించేలా డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. రైతులకు సబ్సిడీపై డ్రోన్లు రాబోయే రోజుల్లో గ్రామాల్లో సాగు కోసం డ్రోన్ల వినియోగం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా.. ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరి కోత యంత్రాలు వంటివి ఇవ్వగా.. భవిష్యత్తులో డ్రోన్లను అందజేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు మొదలుపెట్టింది. ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వాటిని ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులకు సబ్సిడీపై ఇవ్వాలని యోచిస్తున్నారు. డ్రోన్ల సాగులో దేశానికే మార్గదర్శకంగా.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికి సంబంధించి తెలంగాణ దేశానికే మార్గనిర్దేశం చేస్తోందని వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు. వివిధ పంటల్లో డ్రోన్ల వినియోగం, నిర్వహణకు సంబంధించి జయశంకర్ యూనివర్సిటీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక (ఎస్ఓపీ)నే కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించిందని అంటున్నారు. వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై సాధారణ మార్గదర్శకాలివీ.. ► నీటి వనరులు, నివాస ప్రాంతాలు, పశుగ్రాసం పంటలు, ప్రజా వినియోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ మొదలైన వాటికి దూరంగా డ్రోన్లను వినియోగించాలి. ► డ్రోన్ వాడకానికి సంబంధించి గ్రామ పంచాయతీ, సంబంధిత వ్యవసాయ అధికారి కనీసం 24 గంటల ముందుగా అనుమతి ఇస్తారు. ► డ్రోన్ మంచి స్థితిలో ఉందని, సురక్షితంగా ప్రయాణించడానికి సరిపోతుందని ముందే సరిచూసుకోవాలి. ► దానితో పిచికారీ చేసే సమయంలో ఆయా ప్రాంతాల్లోకి జంతువులు, వ్యక్తులు ప్రవేశించకూడదు. ► ఆపరేటర్లు డ్రోన్ ఆపరేషన్, సురక్షితమైన పురుగు మందుల పిచికారీ.. ఈ రెండింటిపై శిక్షణ పొంది ఉండాలి. ► ముందుగానే ప్రతిపాదిత ప్రాంతం, సరిహద్దు, అడ్డంకులు (గోడలు, చెట్లు)ను పరిశీలించి ఆ ప్రకారం డ్రోన్‌ను ఆపరేట్ చేయాలి. ► ప్రభుత్వ సంస్థలు, సైనిక స్థావరాలపై లేదా డ్రోన్లకు అనుమతి లేని జోన్ల మీదుగా ఎగురవేయవద్దు. అనుమతి ఇవ్వని ప్రైవేట్ ఆస్తులపైనా డ్రోన్ ఎగరవేయవద్దు. -
TS: క్వింటాల్ పత్తి రూ.8 వేలు!.. వరి, కంది ధరలు ఇలా..
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమవుతోంది. త్వరలో రాష్ట్రానికి రుతుపవనాలు రానున్నాయి. రైతులు సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విత్తనాలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ సీజన్లో ఏ పంటలు వేయాలన్న దానిపై రైతుల్లో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అవగాహన లేకపోవడం వల్ల ఏదో ఒక పంట వేసి నష్టపోతుంటారు. కొందరు సరైన అవగాహన, ప్రణాళికతో మంచి లాభాలు పొందుతుంటారు. కోతలు ముగిసే సమయానికి ఏ పంటకు ఎంత ధర ఉండే అవకాశం ఉందో ముందుగా అంచనా వేయగలిగితే.. రైతులు ఆ ప్రకారం పంటలు సాగు చేసుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో 15 నుంచి 21 ఏళ్ల నెలవారీ ధరలను విశ్లేషించింది. ఈ విశ్లేషణ ఫలితాలు, మార్కెట్ సర్వేలను పరిశీలించి 2023–24 వానాకాలం (ఖరీఫ్) పంటల ధరలు ఏ విధంగా ఉండవచ్చో అంచనా వేసింది. వరంగల్ ప్రధాన మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే నవంబర్–ఫిబ్రవరి మధ్య కాలంలో పత్తి ధర క్వింటాల్‌కు రూ.7,550 నుంచి రూ.8,000 వరకు ఉంటుందని తెలిపింది. దీనితో పాటు వరి, మిర్చి, కంది తదితర పంటల ధరలను కూడా అంచనా వేసింది. అయితే పంట రకం, నాణ్యత, అంతర్జాతీయ ధరలు, ఎగుమతి లేదా దిగుమతి పరిమితులపై ఆధారపడి అంచనా ధరల్లో మార్పు ఉండొచ్చని పేర్కొంది. కాగా వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం అంచనాల ప్రకారం..ఏయే పంటలు వేయాలో నిర్ణ యం తీసుకుని రైతులు సాగుకు సన్నద్ధం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవ సాయ విశ్వవిద్యాలయం సూచించింది. మద్దతు ధరల కంటే ఎక్కువే.. ఈ ఏడాది రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల నుంచి 70 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు రైతులకు సూచిస్తున్నారు. ఆ తర్వాత వరి ఎలాగూ భారీగానే సాగవుతుంది. కాబట్టి పత్తి తర్వాత కంది సాగును కూడా పెంచాలనేది సర్కారు ఉద్దేశం. కాగా ఖరీఫ్‌లో పత్తి, వరి, కంది పంటలకు మద్దతు ధరకంటే ఎక్కువ ధరలే లభిస్తాయని వ్యవసాయ మార్కెట్ ఇంటిలిజెన్స్ కేంద్రం అంచనా వేయడం గమనార్హం. పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,380గా ఉంది. అయితే 2021–22 వానాకాలం సీజన్లో పత్తి ధర మార్కెట్లో ఏకంగా రూ.12 వేల వరకు పలికింది. దీంతో రైతులు గత సీజన్లో అంత ధర వస్తుందని భావించారు. కానీ రూ. 7–8 వేలకు మించలేదు. దీంతో చాలామంది రైతులు మంచి ధర కోసం ఎదురుచూస్తూ పత్తిని ఇళ్లల్లోనే దాచుకున్నారు. అందులో చాలావరకు పాడైపోయింది. ఇక ఈసారి కూడా పత్తి ధర రూ.8 వేల వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రం ప్రకటించడంతో రైతులు పత్తి సాగుకు ఏ మేరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: నైరుతి రాక.. జూన్ రెండో వారం నుంచి వానలు! -
జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సృష్టి ‘ఆర్ఎన్ఆర్ 29235’.. సరికొత్త వరి వంగడం
వ్యవసాయ వర్సిటీ విడుదల చేసిన వరి వంగడాల్లో అత్యంత కీలకమైనది ‘ఆర్ఎన్ఆర్ 29235’ రకమే. ఇప్పటివరకు యాసంగిలో వేస్తున్న వివిధ రకాల వరి రకాల్లో నూక శాతం అధికంగా ఉంటోంది. ఇది ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కూడా కారణమైంది. ప్రస్తుతం యాసంగిలో వేస్తున్న వరి రకాలను మిల్లింగ్ చేసినప్పుడు 40% బియ్యం, 60% నూకలు వస్తున్నాయి. అదే తాజాగా విడుదల చేసిన ‘ఆర్ఎన్ఆర్ 29235’ రకం వరి అయితే బియ్యం దాదాపు 62%, నూకలు 38% వస్తాయని.. దీనివల్ల కొనుగోళ్ల వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందని వర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కొత్తగా విడుదల చేసిన అన్ని రకాల వరి వంగడాల ద్వారా అదనంగా 10% దిగుబడి వస్తుందని వివరించారు. ఇక వరి పంటకాలం ఇప్పటివరకు 135 రోజులుగా ఉండగా.. కొత్త రకాలు 125 రోజులకే కోతకు వస్తాయని వెల్లడించారు. సాక్షి, హైదరాబాద్: తక్కువ సమయంలో దిగుబడి రావడంతోపాటు మిల్లింగ్ చేసినప్పుడు నూకలు తక్కువగా వచ్చే సరికొత్త వరి రకాన్ని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ‘ఆర్ఎన్ఆర్ 29235’ పేరిట ఈ సరికొత్త వరి వంగడాన్ని తాజాగా విడుదల చేసింది. ఇతర రకాల వరితో పోలిస్తే దీనిద్వారా దిగుబడి కూడా పది శాతం ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. దీనితోపాటు మరో 9 రకాల వరి వంగడాలు, ఇంకో ఐదు ఇతర పంటల రకాలను వ్యవసాయ వర్సిటీ విడుదల చేసింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలను తట్టుకునేలా, తక్కువ కాలంలోనే దిగుబడి వచ్చేలా ఈ వంగడాలను అభివృద్ధి చేసినట్టు తెలిపింది. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. వచ్చే ఏడాది వానాకాలం సీజన్ నాటికి కొత్త రకాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. వీటితో రైతులకు లాభసాటిగా ఉండటంతోపాటు వినియోగదారులకూ ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో..: ప్రస్తుతం అభివృద్ధి చేసిన కొత్త వంగడాల్లో ఎనిమిదింటిని జాతీయ స్థాయిలో, ఏడింటిని రాష్ట్రస్థాయిలో విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీలో జరిగిన జాతీయ వంగడాల విడుదల, నోటిఫికేషన్ కమిటీ సమావేశంలో.. వరిలో ఐదు, పశుగ్రాస సజ్జలో రెండు, నువ్వుల్లో ఒక రకానికి ఆమోదం లభించింది. ఇక సెప్టెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయిలో కొత్త వంగడాల విడుదల ఉప కమిటీ సమావేశంలో ఐదు వరి రకాలు, మినుము, నువ్వు పంటల్లో ఒక్కో రకం చొప్పున ఏడు నూతన రకాలను ఆమోదించారు. మొత్తంగా ఈ 15 వంగడాలను వ్యవసాయ వర్సిటీ తాజాగా విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక 2014 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ వర్సిటీ మొత్తంగా 61 కొత్త వంగడాలను అభివృద్ధి చేసింది. ఇందులో 26 వరి రకాలు, 8 కంది రకాలు ఉన్నాయి. రైతుల ప్రయోజనమే లక్ష్యంగా: ఇన్చార్జి వీసీ రఘునందన్‌రావు రైతులకు మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం వ్యవసాయ శాఖ అనేక చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ కార్యదర్శి, వర్సిటీ ఇన్చార్జి వీసీ రఘునందన్‌రావు, రిజి్రస్టార్ ఎస్.సుధీర్ కుమార్, రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. పత్తిలో నూతన రకాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అధిక సాంద్రత పత్తిపై ప్రయోగాలు జరుగుతున్నాయని.. దానిని 8,500 ఎకరాల్లో సాగు చేస్తున్నామని వివరించారు. కొత్త వంగడాల అభివృద్ధికి గతంలో 8–10 ఏళ్ల సమయం పట్టేదని, స్పీడ్ బ్రీడింగ్ బయో టెక్నాలజీ వినియోగంతో ఐదేళ్లలో ప్రయోగం పూర్తవుతోందని తెలిపారు. ఇక జన్యుమారి్పడి వంగడాలపైనా వర్సిటీ దృష్టి సారించినట్టు తెలిపారు. ఇప్పటికే మొక్కజొన్న, వరిలో ఈ తరహా పరిశోధనలు చేపట్టామని.. పత్తికి సంబంధించి కేంద్రం అనుమతి కోరామని వెల్లడించారు. జాతీయ స్థాయిలో విడుదలైన రకాలివీ.. 1) వరి–1 (ఆర్ఎన్ఆర్ 11718): కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో పండించేందుకు సిఫార్సు చేశారు. ఖరీఫ్‌కు అనుకూలం. పంట కాలం 135 నుంచి 140 రోజులు. హెక్టారుకు 7 వేల నుంచి 8 వేల కిలోలు దిగుబడి వస్తుంది. చవుడు నేలల్లోనూ వేసుకోవచ్చు. 2) తెలంగాణ రైస్ 5 (ఆర్ఎన్ఆర్ 28362): ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలానికి అనుకూలం. పంట కాలం 130–135 రోజులు. దిగుబడి హెక్టారుకు 7,000–7,500 కిలోలు 3) తెలంగాణ రైస్ 6 (కేఎన్ఎం 7048): ఒడిశా, పశి్చమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల కోసం సిఫార్సు చేశారు. వానాకాలం అనుకూలం. పంట కాలం 115–120 రోజులే. దిగుబడి హెక్టారుకు 8000–8500 కిలోలు. ఇది దొడ్డురకం. 4) తెలంగాణ రైస్ 7 (కేఎన్ఎం 6965): ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు సిఫార్సు చేశారు. వానాకాలం పంట. 115–120 రోజుల్లో చేతికి వస్తుంది. దిగుబడి హెక్టారుకు 7500–8500 కిలోలు. ఇది పొడవు సన్నగింజ రకం. 5) తెలంగాణ రైస్ 8 (డబ్లు్యజీఎల్ 1487): వానాకాలం పంట. 125–130 రోజుల్లో.. హెక్టారుకు 5,600–6,000 కిలోల దిగుబడి వస్తుంది. మధ్యస్థ, సన్నరకం ఇది. ఫాస్పరాస్ తక్కువగా ఉన్న నేలలకు అనుకూలం. 6) నువ్వులు– తెలంగాణ తిల్–1 (జేసీఎస్ 3202): తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సిఫార్సు చేశారు. పంటకాలం 91–95 రోజులే. హెక్టారుకు 820–980 కిలోలు దిగుబడి వస్తుంది. 7) తెలంగాణ పశుగ్రాసపు సజ్జ–1 (టీఎస్ఎఫ్బీ 17–7): తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు వానాకాలం సీజన్‌కు సిఫార్సు చేశారు. పంటకాలం (5౦శాతం పూతదశ) 56–68 రోజులు. 8) తెలంగాణ పలుకోతల సజ్జ–1 (టీఎస్ఎఫ్బీ 18–1): పంటకాలం (5౦శాతం పూత దశ ) 56–68 రోజులు. రాష్ట్రస్థాయిలో విడుదలైన రకాలివీ.. 1) రాజేంద్రనగర్ వరి–3 (ఆర్ఎన్ఆర్ 15459): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలంలో 135– 140 రోజుల పంట. దిగుబడి హెక్టారుకు 4,000– 4,500 కిలోలు వస్తుంది. సువాసన గల అతి చిన్న గింజ రకం ఇది. సాంప్రదాయ చిట్టిముత్యాల రకం వరితో పోలి్చతే చేనుపై పంట పడిపోయే అవకాశం తక్కువ. 2) రాజేంద్రనగర్ వరి–4 (ఆర్ఎన్ఆర్ 21278): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలం, యాసంగి సీజన్లలో వేయవచ్చు. వానాకాలంలో 115–120 రోజుల స్వల్పకాలిక రకం. దిగుబడి హెక్టారుకు 6,500 కిలోలు వస్తుంది. అగ్గితెగులును మధ్యస్థంగా తట్టుకుంటుంది. పొట్టి గింజ రకం, చేనుపై పంట పడిపోదు. 3) రాజేంద్రనగర్ వరి–5 (ఆర్ఎన్ఆర్ 29235): రాష్ట్రంలో నీటి వసతి గల ప్రాంతాల్లో రెండు సీజన్లలో పండించొచ్చు. వానాకాలంలో 120–125 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. దిగుబడి హెక్టారుకు 7,500 కిలోలు. పొడవు, సన్నగింజ రకం. పొడవు గింజ రకాల్లో అధిక దిగుబడి ఇచ్చే రకం ఇదే. చేను పొట్టిగా ఉండి పడిపోదు. యాసంగిలో ఈ రకం ధాన్యం మిల్లింగ్ చేస్తే నూకలు తక్కువగా వస్తాయి. 4) జగిత్యాల వరి–2 (జేజీఎల్ 28545): రాష్ట్రంలోని నీటి వసతి గల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలంలో 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. హెక్టారుకు 7,500 కిలోలు దిగుబడి ఇస్తుంది. 5) జగిత్యాల వరి–3 (జేజీఎల్ 27356): రాష్ట్రంలోని నీటి వసతిగల ప్రాంతాలకు సిఫార్సు చేశారు. వానాకాలానికి అనుకూలం. పంట కాలం 130–135 రోజులు. దిగుబడి హెక్టారుకు 7000 కిలోలు వస్తుంది. ఇది అతి సన్నగింజ రకం ఇది. 6) మధిర మినుము–1 (ఎంబీజీ 1070): తెలంగాణ రాష్ట్రం అంతటా పండించడానికి అనుకూలం. వానాకాలం, యాసంగి, ఎండాకాలంలలోనూ పండించవచ్చు. పంటకాలం 75–80 రోజులు. హెక్టారుకు దిగుబడి 1,400–1,500 కిలోలు వస్తుంది. మధ్యస్థ దొడ్డు నలుపు గింజ రకం ఇది. 7) జగిత్యాల తిల్ –1 నువ్వులు (జేసీఎస్ 1020): పంటకాలం 85–95 రోజులు. దిగుబడి హెక్టారుకు 1,050–1,100 కిలోలు వస్తుంది. -
ఆరు నుంచి ముప్పైకి.. వర్సిటీ ప్రతిష్ట కిందకి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యలో ఒక వెలు గు వెలిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కసారిగా తన ప్రభను కోల్పోయింది. భారతీయ వ్యవసాయ పరి శోధన సంస్థ (ఐకార్) కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన వ్యవసాయ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో కిందిస్థాయికి పడిపోయింది. గతంలో ఆరో ర్యాంకు సాధించగా, 2020 సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదల చేసిన జాబితాలో 30వ స్థానానికి పడిపోయింది. వాస్తవంగా ఈసారి తొలి ఒకట్రెండు స్థానాల్లో ఉంటామని కొందరు భావించినట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంత ఘోరంగా పరిస్థితి మారడంపై చర్చ జరుగుతోంది. ఎందుకిలా? తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డాక ఆ పేరు ఏపీకి వెళ్లగా, తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో కొత్త గా ఏర్పడింది. అంటే రాష్ట్రంతోపాటు గత వ్యవసా య విశ్వవిద్యాలయం విడిపోయిందని అనుకోవచ్చు. కొత్త వర్సిటీలో అనేక సంస్కరణలు చేశామని, కొత్త వంగడాలు, పరిశోధనలు, రైతులకు మేలు చేసే అనేక కార్యక్రమాలు చేపట్టామని అధికారులు చెప్పేవారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఫ్యాకల్టీని తీసుకురావడం జరిగిందని అనేవారు. అందుకే వర్సిటీకి ఆరో ర్యాంకు వచ్చిందని చెప్పేవారు. తమకు తక్కువ ర్యాంకు ఎందుకు వచ్చిందో అర్థం కావడంలేదని, కారణాలు తెలుసుకునేందుకు ఐకార్‌కు లేఖ రాసినట్లు వర్సిటీకి చెందిన ఓ కీలకాధికారి చెప్పారు. తమ పరిశోధన పత్రాలు కొన్ని ప్రముఖ జర్నల్స్‌ల్లో అనుకున్న స్థాయిలో ప్రచురితం కాకపోవడం ఒక కారణమన్నారు. ర్యాంకింగ్‌లో విద్యార్థి–అధ్యాపక నిష్పత్తి, పరిశోధనలు, కొత్త వంగడాలు, జాతీయ–అంతర్జాతీయ స్థాయి లో ఒప్పందాలు, ఇతర వర్సిటీల కంటే ప్రత్యేకంగా చేపట్టే కార్యకలాపాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఫిర్యాదుల వల్లనే... వర్సిటీ ర్యాంకు 30వ స్థానానికి పడిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని పలువురు నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆరో ర్యాంకు సాధించినప్పుడు కొన్ని ఇతర రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మన వర్సిటీపై ఐకార్‌కు ఫిర్యాదులు చేశాయని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన కొన్ని వారసత్వాలను కూడా కొత్త వర్సిటీ చెప్పుకుంటోందన్న విమర్శలు అందులో ఉన్నట్లు సమాచారం. అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాల్లో చదివి ఈ వర్సిటీలో అధ్యాపక వృత్తి చేపట్టిన వారి విషయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎన్జీ రంగా వర్సిటీ ఏపీకి వెళ్లిపోగా, అప్పుడు చదివిన వారు ఇప్పుడు వేరే రాష్ట్రం కిందకు వెళ్లడంతో దాన్ని అనుకూలంగా వాడుకున్నారన్న ఫిర్యాదు వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో ర్యాంకు ఖరారులో ఈసారి ప్రతీ అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించారని అందుకే ర్యాంకు దిగువకు పడిపోయిందని ఒక వర్సిటీ అధికారి వ్యాఖ్యానించారు. -
నాణ్యమైన విద్య కోసమే ఫీజుల పెంపు
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన విద్య కోసం సెల్ఫ్ ఫైనాన్స్ వ్యవసాయ కోర్సుల్లో ఫీజులు పెంచక తప్పదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు స్పష్టం చేశారు. ఒకేసారి డొనేషన్ ఫీజు కింద రూ.10 లక్షలు, ఏడాదికి రెగ్యులర్ ఫీజు కింద రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నామన్నారు. ఈవిధంగా వచ్చిన సొమ్మును హాస్టళ్ల అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్పారు. ఇక్కడ కల్పిస్తున్న మౌలిక వసతులు ఫైవ్‌స్టార్ స్థాయిలో ఉనప్పటికీ ఫీజులు మాత్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 20–25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని వివరించారు. కొత్తగా 11 రకాల వంగడాలను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ప్రవీణ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గత ఐదారేళ్లలో 47 రకాల వంగడాలను విడుదల చేశామన్నారు. ఐదు రకాల వరి కొత్త వంగడాలు కొత్తగా విడుదల చేస్తున్న 11 వంగడాల్లో ఐదు వరి రకాలు, రెండు జొన్న, కంది, పెసర, సోయా చిక్కుడు, నువ్వులకు చెందిన వంగడాలు ఒకటి చొప్పున ఉన్నాయని ప్రవీణ్ రావు తెలిపారు. జొన్న రకాల వంగడాలను పండించాక వాటిని తిన్నవారికి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయన్నారు. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుందని, ఇది డయాబెటిస్ రోగులకు ప్రయోజనమన్నారు. చీడపీడల్ని తట్టుకునే వంగడాల రూపకల్పనకి వర్సిటీ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వర్సిటీ విద్యార్థులు ఏటా 30కిపైగా జేఆర్ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిఫ్)లు సాధిస్తున్నారన్నారు. రోబోటిక్స్‌తో కలుపు నివారణ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ వంటి అధునాతన పరిజ్ఞాన వినియోగంలో వర్సిటీ ముందంజలో ఉందని ప్రవీణ్ రావు వివరించారు. ‘రోబోటిక్స్ సాంకేతికతను మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణకు ఉపయోగించుకోవచ్చు. డ్రోన్ పరిజ్ఞానాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలని భావిస్తున్నాం. తద్వారా డ్రోన్లతో పంటలపై పురుగు మందులను పిచికారీ చేయొచ్చు. డ్రోన్లపై నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీలో త్వరలోనే అగ్రిహబ్‌ని ప్రారంభిస్తున్నాం. కేంద్రప్రభుత్వం ఈ మధ్య ఒక జిల్లాకి ఒక పంట పథకంలో భాగంగా మన వర్సిటీకి మూడు జిల్లాలకి రూ.8.4 కోట్లు మంజూరు చేసింది. వాటిని జగిత్యాలలో వరి, మామిడి, వరంగల్ జిల్లాలో పసుపు, మిరప, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చిరుధాన్యాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం’అని వివరించారు. వర్సిటీ తరపున రాష్ట్రంలోని అన్ని జిల్లాల సాయిల్ మ్యాపింగ్ పూర్తయిందని ఆయన చెప్పారు. -
అదిగో చిరుత.. మళ్లీ ప్రత్యక్షం!
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరించినట్టు తెలిసింది. నారం ఫాంహౌస్ వద్ద ఓ ఇంటి కాంపౌండ్‌లోకి చిరుత ప్రవేశించిన దృశ్యాలు, చిరుత కిటికీ ఎక్కి ఇంట్లోకి తొంగిచూస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. చిరుత సంచారంతో ఉద్యోగులు, స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఫాంహౌస్ వద్ద మరో 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, నాలుగు వారాల క్రితం బద్వేల్ సమీపంలో నడిరోడ్డుపై కనిపించిన చిరుత.. ఓ లారీ యజమానిపై దాడి చేసి పారిపోయింది. దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిరుత పాదముద్రల ఆధారంగా అది చిలుకూరు అటవీప్రాంతంలోకి వెళ్లిఉండొచ్చుని భావించారు. తాజాగా చిరుత మరోసారి ప్రత్యక్షం కావడంతో అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. (చదవండి: చిరుత చిక్కలే!) -
రైతన్నదే ముఖ్య భూమిక
రాజేంద్రనగర్: ప్రపంచంలో వ్యవసాయరంగంతోపాటు అన్నదాతది ప్రథమ స్థానమని గవర్నర్, వ్యవసాయ వర్సిటీ చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీలో ఆమె పర్యటించారు. తొలుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో యంత్రాల ద్వారా వరినాట్ల విధానాన్ని, పాలీహౌస్ను, వర్సిటీ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్‌ను పరిశీలించారు. చిరుధాన్యాల ఉత్పత్తుల కేంద్రాన్ని, పర్యావరణహిత గణేశ్ విగ్రహాలు, హోలీరంగుల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఏజీ బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థులు ప్రయోగాత్మకంగా చేస్తున్న సాగుపై గవర్నర్ వివరాలడిగారు. ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పుస్తకాలు ఇచ్చే, తీసుకునే వి«ధానాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. రైతుబిడ్డలుగా విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు రైతుబిడ్డలకీ తల్లిదండ్రులుగా మారాలన్నారు. విద్యార్థులు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. ఐదేళ్లలో అనేక జాతీయ, అంతర్జాతీయ వర్సిటీలు, సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు, వివిధ విత్తనాల రూపకల్పన గురించి వర్సి టీ ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, ఇతర శాస్త్రవేత్తలు ఆమెకు వివరించారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్, పాలకమండలి సభ్యులు, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి ప్రకృతిని కాపాడేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని, పర్యావరణ పరిరక్షణకు తెలంగాణలో హరితహారం కొనసాగుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న నుమాయిష్ ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1938లో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు గొప్ప ఆలోచనతో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో 100 స్టాళ్లతో నుమాయి ష్‌ను ప్రారంభించగా ఎంతో ప్రఖ్యాతి పొందిందని తెలిపారు. సొసైటీ ప్రతినిధులు ఎంతో కష్టపడి పకడ్బందీగా భద్రతా చర్యలతో నుమాయిష్‌ను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సరోజిని నాయుడు జన్మదినం రోజున ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్, ఆర్డీఓ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ వినయ్‌కపూర్‌లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను, సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాసంస్థలలో విద్యను అభ్యసిస్తూ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎన్.సురేందర్, కార్యదర్శి డాక్టర్ ప్రభాశంకర్, సంయుక్త కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
150 కాదు..120 రోజులకే పంట!
సాక్షి, హైదరాబాద్: క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే 3 రకాల వరి వంగడాలను జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ రూపొందించింది. వరిని ప్రధానంగా దోమ పట్టిపీడిస్తోంది. దాన్ని తట్టుకొని నిలబడగలిగే రకాన్ని వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే కందిలోనూ కొత్త రకం వంగడాన్ని రూపొందించారు. వీటికి తామింకా పేర్లు ఖరారు చేయలేదని, ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపినట్లు వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సర్కారు నుంచి అనుమతి వచ్చాక నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని: ప్రస్తుత వరి రకాలు 150 రోజుల కాలపరిమితితో కోతకు వస్తున్నాయి. ఇటువంటి వంగడాలను ముందే వేయాల్సి ఉంటుంది. పైగా సమయం ఎక్కువ తీసుకుంటుండటంతో అకాల వర్షాలతో నష్టం వాటిల్లుతోంది. వీటి వల్ల రైతులు నష్టపోతున్నారు. గతంలో రోహిణి కార్తె తర్వాత వర్షాలు కురిసేవి. కానీ ఇప్పుడు జులై, ఆగస్టుల్లోనే వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల వరి నాట్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో కోతలు ఆలస్యమై నష్టం వాటిల్లుతోంది. తాజాగా కనుగొన్న రకాల వల్ల వరి 120 నుంచి 135 రోజుల్లోనే చేతికి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు అకాల వర్షాలను ఈ వరి తట్టుకోగలుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే తాము అభివృద్ధి చేసిన కొత్త కంది వంగడం ముడత పురుగును తట్టుకోగలుగుతుందని అంటున్నారు. కొత్త వరితో విలువ ఆధారిత ఉత్పత్తులు: కొత్త వరి వంగడాలు అత్యంత నాణ్యమైన సన్నటి రకాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి లక్షణాలను, పేర్లను మాత్రం వెల్లడించడం లేదు. ఈ వరితో అటుకులు సహా ఇతరత్రా వరి ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకోడానికి వీలుంటుందని వివరించారు. గతంలో ఈ వర్సిటీ తయారుచేసిన తెలంగాణ సోనా వరి రకం మధుమేహ రోగులకు ఉపయోగకరంగా ఉంటుందన్న ప్రచారం జరిగింది. దీంతో అవి ఎంతో పేరు పొందాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో వాటికి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు విడుదల చేయబోయే రకాల లక్షణాలను వర్సిటీ వర్గాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నాయి. ఈ 3 రకాల వంగడాలు వరిలో విప్లవాత్మకమైనవని చెబుతున్నారు. ప్రభుత్వం వీటికి అనుమతిచ్చిన వెంటనే మూల విత్తనాలను తక్షణమే విడుదల చేస్తామని అంటున్నారు. ఈ ఖరీఫ్‌లో కొంతమేరకు అందుబాటులోకి తీసుకు రావాలని అనుకుంటున్నామని, వచ్చే రబీ, ఖరీఫ్‌ల నాటికి పూర్తిస్థాయిలో రైతులకు చేర్చుతామని అంటున్నారు. -
‘మొక్కజొన్నపై ఫాల్ ఆర్మీ దాడి!’
సాక్షి, హైదరాబాద్: ఆఫ్రికన్ దేశాల్లో మొక్కజొన్నను నాశనం చేసిన ఫాల్ ఆర్మీ వామ్–స్పొడోప్తెరా ఫ్రూగిపెర్దా అనే పురుగు ఇప్పుడు మన దేశంలోని పంటలపై దాడి చేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ పురుగు ఇటీవల కర్ణాటక శివమొగ్గ ప్రాంతంలోని మొక్కజొన్న పంటలో గుర్తించారు. పంటను అమాంతం నాశనం చేసే ఈ పురుగు విషయంలో అప్రమత్తం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను, జిల్లా వ్యవసాయాధికారులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. ఆఫ్రికన్ దేశాల నుంచి ఇతర దేశాలకు ఇది విస్తరిస్తుందని ఆయన వివరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కర్ణాటక పక్కనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండటంతో ఈ పురుగు ప్రభావం ఎలా ఉంటుందనే భయం అందరినీ కలవరపరుస్తోంది. ఈ పురుగు సోకితే పంటపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. రాష్ట్రంలో 10.78 లక్షల ఎకరాల్లో సాగు... రాష్ట్రంలో ఖరీఫ్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.78 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్ర ఆహారధాన్యాల పంటల్లో వరి తర్వాత అత్యంత కీలకమైన పంట మొక్కజొన్న కావడంతో రైతులు దీనిపై అధికంగా ఆశలు పెంచుకుంటారు. ఆసియాలోనే తొలిసారిగా గత నెలలో కర్ణాటకలో ఈ పురుగును గుర్తించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. -
మూడెకరాల నుంచి ఎకరానికి తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో ప్రవేశానికి ప్రస్తుతమున్న నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో 40 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల రైతు పిల్లలకు రిజర్వేషన్ కల్పించారు. కనీసం మూడెకరాలున్న వారికి మాత్రమే ఆ 40 శాతంలో సీట్లు లభించేవి. దాన్ని ఎకరానికి కుదిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేడో రేపో ఉత్తర్వులు రానున్నాయి. 49 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన ద్వితీయ సం వత్సర పరీక్షల్లో 49 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. మ్యాథ్స్–2ఏ, బోటనీ, సివిక్స్, సైకాలజీ పేపరు–2 సబ్జెక్టులకు జరిగిన పరీక్షలకు 4,37,572 మంది హాజరయ్యారు. 4,57,292 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు రిజిస్టర్ చేసుకోగా, అందులో 19,720 మంది గైర్హాజరయ్యారు. -
అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి అదృశ్యం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థి అదృశ్యమవడం కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో చదువుతున్న రాహుల్ నాయక్ అనే విద్యార్థి సోమవారం నుంచి కనిపించడం లేదు. దీంతో తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో అధ్యాపకులు కావాలనే ఫెయిల్ చేశారని రాహుల్ మనస్థాపం చెందినట్టు తెలుస్తోంది. రాహుల్ అదృశ్యంపై అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
స్విపర్పై లైంగిక వేధింపులు
-
సొంత తిండి పంటలే శాశ్వతం
వనరుల వినియోగంలో స్వావలంబన, ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలన్నది గాంధీజీ ‘గ్రామస్వరాజ్య’ భావన మూల సూత్రం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన శాశ్వత వ్యవసాయం(పర్మాకల్చర్) మూలసూత్రాలు కూడా గాంధీజీ భావనకు దగ్గరగా ఉన్నాయి. ఈ నెల 25–26 తేదీల్లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ పర్మాకల్చర్ సమ్మేళనం(ఐ.పి.సి–2017) జరగనుంది. ఈ పూర్వ రంగంలో అసలు ‘శాశ్వత వ్యవసాయం’ అంటే ఏమిటో.. ఈ అవగాహనతో సాగయ్యే పొలం ఎలా ఉంటుందో.. మనందరికీ తిండిపెడుతున్న చిన్న, సన్నకారు రైతుల బతుకులను ఆకుపచ్చగా మార్చడానికి ఈ చైతన్యం ఎలా దోహదపడుతుందో తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం. పర్మాకల్చర్ నిపుణులు కొప్పుల నరసన్న, పద్మ దంపతులు అంతర్జాతీయ పర్మాకల్చర్ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ(హైదరాబాద్)ను స్థాపించి అనేక జిల్లాల్లో రైతులతో పనిచేస్తున్న వీరు తమ పర్మాకల్చర్ డిజైన్ ప్రకారం నెలకొల్పిన వ్యవసాయ క్షేత్రంలో బహుళ పంటలను పండిస్తున్నారు. వీరితో ఇటీవల ‘సాగుబడి’ ముచ్చటించింది.. ఆ విశేషాలు.. వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించిన కొప్పుల నరసన్న, పునాటి పద్మ తొలి దశలో జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో రిసోర్స్పర్సన్లుగా ఉంటూ రైతులతో పదేళ్లకు పైగా పనిచేశారు. ఆస్ట్రేలియాకు చెందిన బిల్ మాలిసన్ పర్మాకల్చర్ భావనకు, ఆచరణకు పునాదులు వేశారు. ఆయన అనేకసార్లు మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పర్యటించి పర్మాకల్చర్ భావనను చిన్న, సన్నకారు రైతుల కమతాలకు అనుసంధానం చేయటంపై ఆచరణాత్మక ప్రయోగాలు చేశారు. బిల్ భావాలతో ప్రభావితులైన అరోరా, డాక్టర్ వెంకట్ వంటి ఆధ్వర్యంలో పర్మాకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. వారి సాంగత్యంలో శాశ్వత వ్యవసాయాన్ని ఔపోశన పట్టిన నరసన్న, పద్మ అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేసి స్థానిక రైతాంగంలో పర్మాకల్చర్ వ్యాప్తి కృషికి శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం సమీపంలో 1999లో 11.5 ఎకరాలను కొనుగోలు చేసి ‘అరణ్య’ శాశ్వత వ్యవసాయ క్షేత్రాన్ని నెలకొల్పారు. తొలి దశలో టేకు సహా అనేక స్థానిక అటవీ జాతుల చెట్లతోపాటు పండ్లు, కలప జాతుల చెట్లను పెంచుతూ వచ్చారు. శాశ్వత వ్యవసాయ పద్ధతికి ప్రతిరూపంగా గత మూడేళ్లుగా కూరగాయలు, వార్షిక పంటల సాగును ప్రారంభించారు. శాశ్వత వ్యవసాయ పద్ధతిని అమలు చేసే పొలం ఎలా ఉంటుందో ఈ క్షేత్రాన్ని చూసి తెలుసుకోవచ్చు. పంటల వైవిధ్యంతో స్వయం పోషకత్వం ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవటంతోపాటు ప్రత్యేక డిజైన్‌ను రూపొందించుకొని, అమలు చేయటం, పంటల జీవవైవిధ్యం ద్వారా స్వయం పోషకత్వాన్ని సాధించటం పర్మాకల్చర్ మూల సూత్రాల్లో ముఖ్యమైనది. భూసారం పెంపుదల, వాన నీటి సంరక్షణ, పెనుగాలులు, వడగాడ్పుల బారి నుంచి పంటలను, కోతకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవటం, కాంటూరు కందకాలు తీయటం, 12 రకాల అటవీ జాతి చెట్లను పొలం దక్షిణ సరిహద్దులో 6 మీటర్ల వెడల్పున పెంచటం.. గడ్డీ గాదాన్ని, ఆకులు అలములను కాల్చివేయకుండా కంపోస్టు తయారీకి వినియోగించటం.. ఇవన్నీ పర్మాకల్చర్ క్షేత్రానికి ఉండే లక్షణాలు. అడుగు నేలలో ‘అరణ్య’ సేద్యం అరణ్య క్షేత్రం దక్కను పీఠభూమిలో లేటరైట్ (ఎర్ర) నేలలో ఉంది. మట్టి 8–12 అంగుళాల లోతు మాత్రమే ఉంది. అడుగున అంతా లేటరైట్ రాయి ఉండటంతో ఈ పొలంలో పంటల సాగు సవాళ్లతో కూడుకొని ఉంది. డిజైన్ ప్రకారం అనేక జోన్లుగా విభజించి.. ఏడాది పొడవునా సీజనల్ పండ్లు, కూరగాయలతోపాటు ఖరీఫ్, రబీ పంటలను పండిస్తున్నారు. స్నానపు గదులు, వంటకు వాడిన నీటిని వృథా పోనీయకుండా వృత్తాలుగా అనేక రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. వృత్తం వల్ల గాలుల తీవ్రతను తట్టుకోవటం సులువవుతుంది. మట్టి కోతకు గురికావటం తగ్గుతుంది. గాడ్పులు, పెనుగాలులకు చెట్లు పడిపోకుండా సర్కిల్స్ ఉపయోగపడతాయని నరసన్న చెప్పారు. కాంటూరు బోదెలపై కూరగాయలు కూరగాయల విభాగంలో కాంటూరు ప్రకారం ఎస్ ఆకారంలో బోదెలు తోలి అనేక రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు. డ్రిప్‌తో బోరు నీటిని తగుమాత్రంగా అందిస్తున్నారు. బొప్పాయి, మోరింగ, అవిశ, టేకు, ఆముదం, దోస, బెండ, టమాటా, చెర్రీ టమాటా, బీర, చిక్కుడు, కాకర, గోంగూర, మెంతి, చుక్కకూర, కొత్తిమీర, మిరప, బంతి తదితర మొక్కలన్నీ బోదెలపై నాటారు. వీటిని నాటటం/విత్తటం దశల వారీగా చేయటం వల్ల ఏడాది పొడవునా అనుదినం కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటున్నాయని నరసన్న, పద్మ వివరించారు.. కాంటూరు బోదెలను ఎస్ ఆకారంలో ఏర్పాటు చేయటం వల్ల ఎండ, గాలి, నీరు వంటి ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి వీలవుతుంది. కూరగాయల విభాగంలో ఆముదం, బంతి మొక్కలను అక్కడక్కడా వేయటం వల్ల ఎత్తు తక్కువ మొక్కలకు నీడ దొరకటంతోపాటు పురుగులను ఆకర్షించటం ద్వారా పంటలకు నష్టం లేకుండా చూడటం సాధ్యమవుతుంది. ఇటువంటి ఎర పంటలు వేయటం ద్వారా పురుగులకు కావాల్సిన ఆహారం పెడితే అవి పంటల జోలికి రాకుండా ఉంటాయి. ఆకుకూరల ఒరుగులు! ‘అరణ్య’ శాశ్వత వ్యవసాయ క్షేత్రంలో శనగ, కుసుమ మొక్కలను కలిపి ఆకుకూరలుగా సాగు చేయటం, ఈ రెండు రకాల ఆకులను కలిపి వండుకు తినటం విశేషం. అంతేకాదు, గోంగూర, తోటకూర, శనగ, మెంతికూరలను కోసి నీడలో ఎండబెట్టి ఆకుకూరల ఒరుగులు చేసి దాచుకొని, తదనంతరం వంటల్లో వేసుకుంటున్నారు. వీటిని బంధుమిత్రులకూ పంపుతున్నారు. టమాటా, వంగ, బొప్పాయి, ఉల్లి, వెల్లుల్లి వంటి పంటల్లో గడ్డీ గాదంతో ఆచ్ఛాదన మొదటి నుంచీ అవసరమే. నెలా నెలన్నరలో కోసేసే ఆకుకూరల్లో మాత్రం ఆచ్ఛాదన చేయాల్సిన అవసరం లేదు. తేనెటీగల ద్వారా పంటల్లో పరపరాగ సంపర్కాన్ని వేగవంతం చేయడానికి పంటల మధ్యలో గోంగూర, పొద్దుతిరుగుడు, ఆముదం, బంతి, ఉల్లి, బడిమ దోస, ముల్లంగి పెంచుతున్నారు. అరణ్య వ్యవసాయ క్షేత్రంలో కూరగాయలకు మాత్రమే డ్రిప్‌తో నీటిని అందిస్తున్నారు. జొన్న, శనగ, కంది తదితర పంటలను వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. జొన్న ప్రధాన పంటగా, అంతర పంటలుగా శనగ, అవిశ, కుసుమ సాగు చేస్తున్నారు. శనగ ప్రధాన పంటగా, అంతర పంటలుగా కుసుమ, జొన్న, ఆవాలు, కట్టె గోధుమలు వేశారు. జమైకా గోంగూర రేకులతో తేనీరు, జామ్! ఖరీఫ్‌లో పచ్చజొన్న ప్రధాన పంటగా.. అంతర పంటలుగా 5 రకాల కందులు, బొబ్బర్లు, అనుములు, జమైకా గోంగూర పంటను సాగు చేస్తున్నారు. ఇన్ని రకాలు కలిపి సాగు చేసినప్పటికీ వీటి మధ్య ఎండ కోసం తప్ప పోషకాల కోసం పోటీ ఉండదు. ఆరడుగుల ఎత్తు, పెద్ద సైజు ఆకులు, కాయలతో జమైకా గోంగూర పంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోగు కాయల చుట్టూ ఉండే ఎర్రని రేకులలో చక్కని పోషక విలువలున్నాయి. ఈ రేకులతో జామ్ తయారు చేయటంతోపాటు, రేకుల పొడితో ఆరోగ్యదాయకమైన టీ కాచుకుంటున్నారు! విత్తు దాతా సుఖీభవ! పర్మాకల్చర్ సాంఘిక బాధ్యతతో స్థానిక పంటల జీవవైవిధ్యాన్ని పరిరక్షించడాన్ని నేర్పిస్తుంది. అరణ్య ఫామ్‌లో 52 రకాల స్థానిక ఆహార పంటలు, పండ్ల రకాలను సాగు చేస్తూ పరిరక్షిస్తున్నారు. సొంత తిండి పంటల విత్తనాలను నిలబెట్టుకోవటమే రైతుల తొలి కర్తవ్యంగా పర్మాకల్చర్ నొక్కిచెబుతుంది. సొంత విత్తనాన్ని కోల్పోయిన రైతు ఆహార సార్వభౌమత్వాన్నీ కోల్పోయినట్టేనని.. అందుకే, విత్తు దాతా సుఖీభవ అని అనాలంటున్నారు నరసన్న, పద్మ! మార్కెట్ కోసం కాదు, మన కోసమే పండించుకోవాలి! పర్మాకల్చర్ నిపుణుడు కొప్పుల నరసన్నతో ముఖాముఖి ► సేంద్రియ వ్యవసాయానికి పర్మాకల్చర్కు తేడా ఏమిటి? అమెరికా, ఐరోపా దేశాల్లో సేంద్రియ వ్యవసాయంలోనూ ఏక పంటల సాగు జరుగుతోంది (క్యూబాలో ఇప్పుడిప్పుడే పంటల వైవిధ్యం వైపు దృష్టిపెడుతున్నారు). భూసారం గురించి మాట్లాడతారు, కానీ వాన నీటి సంరక్షణ గురించిన స్పృహ ఉండదు. భారీ యంత్రాలు వాడుక మామూలే. పంటను మార్కెట్లో అమ్ముకోవటం గురించి, ఎగుమతుల గురించే ఆలోచిస్తున్నారు. రసాయనాలు వాడకపోవటం అన్నదొక్కటే రసాయనిక వ్యవసాయానికి, సేంద్రియ వ్యవసాయానికి మధ్య ఉన్న తేడా. వ్యాపారులదే పైచేయిగా ఉండటం వల్ల బాగా డబ్బున్న వారికి మాత్రమే సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ కోసమే వ్యవసాయం చేసే వారికి, ప్రజలకు ఏ సంబంధం లేదు. పర్మాకల్చర్ ఉద్యమం అలా కాదు. మన తిండి పంటలను, సొంత విత్తనాలతో పండించుకొని తినాలని, సంబంధ బాంధ్యవ్యాలను కొనసాగించటం ముఖ్యమని పర్మాకల్చర్ చెబుతుంది. అంతర/మిశ్రమ/ఎర పంటల సాగు, వాననీటి సంరక్షణ, చెట్టూ చేమ, పశువులు, కోళ్లు, జీవరాశులన్నీటికీ సంరక్షించుకోవటం, వాటికీ సమాన వాటా ఇవ్వటం ముఖ్యమని భావిస్తాం. స్థానిక సమాజం ఆహారపు అవసరాలు తీరిన తర్వాతే మిగులును అమ్ముకోవాలని భావిస్తాం. దేశవిదేశాల నుంచి నా దగ్గరకు వచ్చి శిక్షణ పొందే వారంతా సొంతంగా ఆహారాన్ని పండించుకునే వారే. ► మన చిన్న రైతులకు పర్మాకల్చర్ ఎలా ఉపకరిస్తుంది? మన రైతుల్లో 80% మంది 2–3 ఎకరాల భూమి కలిగిన వారు. రెక్కల కష్టంతో తమ కోసేమే సొంత విత్తనంతో తిండి పంటలు పండించుకుంటారు. అమ్మటం కోసమే పత్తి తదితర పంటలు వేస్తున్న వాళ్లు అప్పులు, ఆత్మహత్యలపాలవుతున్నారు. ఉన్న పొలంలో కొంత భాగంలో పత్తి వేసినా.. కంది, బంతి, ఆముదం, జొన్న, నిమ్మగడ్డి వంటి అంతర పంటలు తప్పకుండా వేసుకోవాలి. ఒకటి కాదు కొన్ని కలిపి వేసుకోవాలి. పది పంటలు వేస్తే 5 రకాల విత్తనాలైనా రైతు సొంతవై ఉండాలి. ఇప్పుడు 99% కంపెనీల విత్తనాలే వాడుతున్నారు. హైబ్రిడ్ విత్తనాలు కొని వేస్తూ సేంద్రియం/పర్మాకల్చర్ చేస్తున్నామనటంలో అర్థం లేదు. విత్తన సార్వభౌమత్వం పోయాక ఆహార సార్వభౌమత్వం ఎలా ఉంటుంది? బయటి వనరులపై ఆధారపడకుండా వ్యవసాయం చేయటాన్నే డిజైన్ చేసుకోవటం అంటున్నాం. ► పొలాన్ని డిజైన్ చేసుకోవటం అంటే ఏమిటి? రసాయనాలు, అమ్మే పంటలు వచ్చి మన రైతుల సంప్రదాయ వ్యవసాయ డిజైన్‌ను దెబ్బతీశాయి. శాశ్వత ఆస్తి అయిన భూమిని నాశనం చేసుకుంటున్నాం. వాన నీరు బయటకుపోకుండా పొలంలోనే నిలుపుకోవాలి. పొలంలో 40% చోటులో పండ్ల/అటవీ జాతుల చెట్లుండాలి. 60%లో పంటలుండాలి. గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు 60% వాడినా కనీసం 40% మొక్కలు స్థానిక జాతులవి ఉండేలా చూసుకోవాలి. పశువులను మళ్లీ వ్యవసాయంలోకి తేవాలి. ప్రకృతితోటి, సమాజంతోటి అనుబంధాన్ని పెంచుకోవటం ముఖ్యం. ఈ చైతన్యాన్ని మన చిన్న రైతులకు అందించడానికి కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ పర్మాకల్చర్ సమ్మేళనం ఉద్దేశం కూడా ఇదే. 25, 26 తేదీల్లో అంతర్జాతీయ శాశ్వత వ్యవసాయ సమ్మేళనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన పర్మాకల్చర్ సేద్య చైతన్యానికి పుట్టిల్లు ఆస్ట్రేలియా. రెండేళ్లకోసారి ఏదో ఒక దేశంలో అంతర్జాతీయ సమ్మేళనం జరుగుతుంది. 13వ అంతర్జాతీయ పర్మాకల్చర్ (శాశ్వత వ్యవసాయ) సమ్మేళనానికి హైదరాబాద్ తొలిసారి వేదిక అవుతోంది. ఈ నెల 25, 26 తేదీల్లో రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సమ్మేళనం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి విచ్చేసే సుమారు 800 మంది శాశ్వత వ్యవసాయదారులు, ప్రముఖ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సదస్సుల్లో పాల్గొంటారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో ఆసక్తి గలవారెవరైనా పాల్గొనవచ్చు. పర్మాకల్చర్ డిజైన్ కోర్సు పూర్తిచేసి శాశ్వత వ్యవసాయాన్ని అనుసరిస్తున్న వారి కోసం ప్రత్యేక సమ్మేళనం 27 నుంచి డిసెంబర్ 2 వరకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరులోని ‘పొలం’లో జరుగుతుంది. 72 దేశాల నుంచి వచ్చే వందలాది మంది పర్మాకల్చర్ అభిమానులు అనుభవాలను పంచుకుంటారు. పూర్తి వివరాలకు.. ధర్మేంద్ర – 99160 95545, రజని – 79817 55785 www.ipcindia2017.org/ www.facebook.com/IPCIndia2017/ – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: బి.శివప్రసాద్, ఫొటో జర్నలిస్టు, సాక్షి, సంగారెడ్డి -
400 గురుకులాలకు ‘చిరుతిండ్లు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 400 గురుకుల పాఠశాలలకు ప్రతి నెలా చిరుధాన్యాలతో తయారు చేసిన చిరుతిండ్లను అందజేయాలని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నిర్ణయించింది. ఈమేరకు వర్సిటీ వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వర్సిటీలోని గృహ విజ్ఞాన కళాశాలలోని ఫుడ్స్, న్యూట్రిషన్ విభాగం ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లు, సేమియాను విద్యా ర్థులకు అందిస్తామన్నారు. కొన్ని గ్రామా లను దత్తత తీసుకొని చిరుధాన్యాల సాగు పెంపును ప్రోత్సహించాలనే ఆలోచన ఉందన్నారు. గురుకుల పాఠశాలలకు చిరుతిండ్లను సరఫరా చేయడానికి మిల్లెట్బౌల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. -
వ్యవసాయ వర్సిటీకి విదేశీ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ వ్యవసాయ వర్సిటీని గురువారం వివిధ దేశాల ప్రతినిధులు సందర్శిం చారు. భారత్-అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ విస్తరణ, యాజమాన్య సంస్థలో నిర్వహిస్తున్న ‘ఫీడ్ ది ఫ్యూచర్- ఇండియా ట్రయాంగులర్ ట్రైనింగ్’లో పాల్గొనేందుకు వచ్చిన అఫ్గానిస్తాన్, కంబోడియా, ఘనా, కెన్యా, లైబీరియా, మాలవి, మంగోలియా, మొజాంబిక్ దేశాలకు చెందిన 29 మంది వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన విస్తరణాధికారులు వర్సిటీకి వచ్చి పరిశోధనల తీరును పరిశీలించారు. వారికి వర్సిటీ గురించి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాల గురించి వీసీ ప్రవీణ్‌రావు వివరించారు. మిల్లట్ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని కూడా సందర్శించారు.