
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 400 గురుకుల పాఠశాలలకు ప్రతి నెలా చిరుధాన్యాలతో తయారు చేసిన చిరుతిండ్లను అందజేయాలని జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నిర్ణయించింది. ఈమేరకు వర్సిటీ వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
వర్సిటీలోని గృహ విజ్ఞాన కళాశాలలోని ఫుడ్స్, న్యూట్రిషన్ విభాగం ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లు, సేమియాను విద్యా ర్థులకు అందిస్తామన్నారు. కొన్ని గ్రామా లను దత్తత తీసుకొని చిరుధాన్యాల సాగు పెంపును ప్రోత్సహించాలనే ఆలోచన ఉందన్నారు. గురుకుల పాఠశాలలకు చిరుతిండ్లను సరఫరా చేయడానికి మిల్లెట్‌బౌల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.