సిగరెట్‌ ఇస్తుండగానే లాక్కెళ్లారు | Chain Snatchers Strike Again In Hyderabad Rajendranagar | Sakshi
Sakshi News home page

మగాళ్లను వదలని స్నాచర్లు

Published Sat, Feb 16 2019 2:08 PM | Last Updated on Sat, Feb 16 2019 2:29 PM

Chain Snatchers Strike Again In Hyderabad Rajendranagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో చైన్‌ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇన్నాళ్లు మహిళల్ని టార్గెట్‌ చేసిన స్నాచర్లు తాజాగా మగవారిని కూడా వదలడం లేదు. సిగరెట్‌ ఇవ్వమని అడిగి.. అదే అదునుగా షాపు యజమాని మెడలోంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెల్లిన సంఘటన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. హైదర్‌గూడ న్యూఫ్రెండ్స్‌ కాలనీలో రాఘవ రెడ్డి అనే వ్యక్తి కిరాణ షాపు నడుపుతున్నాడు.

ఈ క్రమంలో స్నాచర్లు శనివారం రాఘవరెడ్డి షాప్‌ దగ్గరికి వచ్చి సిగరెట్‌ కావాలని అడిగారు. సిగరెట్‌ చేతికి ఇస్తుండగా అదును చూసి రాఘవ రెడ్డి మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దాంతో బాధితుడు రాజేంద్ర నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాఘవరెడ్డి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement