chain snaching
-
అపార్ట్ మెంట్ లో బరితెగించిన దొంగలు..
-
దొంగలు ఉన్నారు జాగ్రత్తా
-
మహిళ గొలుసును కొట్టేస్తూ కెమెరాకు చిక్కిన దొంగలు: వీడియో వైరల్
ఒక మహిళ గొలుసును బెక్ మీద నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కుని పరారయ్యారు. అందుకు సంబంధించిన సీఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటు చేసుకుంది. వీడియోలో..దుకాణం వద్ద ఉన్న ఒక మహిళ వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తున్నట్లు కనిపిస్తోంది. వారిని చూసి అప్రమత్తమైన మహిళ కేకలు వేస్తూ.. దుకాణం లోపలికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతలో ఆ వ్యక్తులు ఆ మహిళను తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కుని పరారయ్యారు. ఆ దుకాణంలోని వ్యక్తి ఆమెకు సాయం చేద్దామని ముందుకు వస్తాడు కానీ వారి వద్ద ఉన్న తుపాకీని చూసి భయంతో పారిపోతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ దుండగుల ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. Caught On Camera: Thieves Snatch Delhi Woman's Chain At Gunpoint pic.twitter.com/VEX5aGSBAJ — NDTV Videos (@ndtvvideos) April 15, 2023 (చదవండి: విమానం గాల్లో ఉండగా విండ్ షీల్డ్‌కు పగుళ్లు.. సౌదీ ఫ్లైట్ కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్..) -
హైదరాబాద్ సీ‘రియల్’ స్నాచర్ల కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రెండు కమిషనరేట్ల పరిధిలో వరుస స్నాచింగ్స్‌కు పాల్పడిన సీరియల్ స్నాచర్ల వ్యవహారంలో స్పష్టత వస్తోంది. నగరానికి వచ్చిన నలుగురు బవారియా గ్యాంగ్ సభ్యుల్లో ఇద్దరే నేరుగా నేరాలు చేసినట్లు తేలింది. ఏడు గొలుసు దొంగతనాలు, రెండు వాహన చోరీలు వీళ్లే చేయగా.. మిగిలిన ఇద్దరూ పథక రచనలోనే కీలకంగా వ్యవహరించినట్లు, వీరు కేవలం నాంపల్లి రైల్వేస్టేషన్ పరిసరాలకు పరిమితమయ్యారని వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సీరియల్ స్నాచర్లలో ఒకడైన మంగళ్‌ను రాచకొండ పోలీసులు ఇటీవల పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. ఇతడిని కోర్టు అనుమతితో తొమ్మిది రోజుల పాటు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే పలు కీలకాంశాలు వెలుగుచూశాయి. రైలులో వచ్చి.. నాంపల్లిలో దిగి... ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని ఉన్ మండలానికి చెందినదే ఈ బవారియా గ్యాంగ్. ఆ మండలంలోని పలు హామ్లెట్స్లో నివసించే పలు ముఠాలు దేశ వ్యాప్తంగా చైన్ స్నాచింగ్స్ సహా అనేక నేరాలు చేస్తుంటాయి. పంకజ్ అలియాస్ పింకు నేతృత్వంలో మంగళ్, దీపక్ అలియాస్ సెహ్వాగ్, సేవజ్ అలియాస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు. బెంగళూరులో వరుస స్నాచింగ్స్ చేసిన తర్వాత రైలులో గత నెల 7న నగరానికి వచ్చారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో రైలు దిగిన నలుగురూ కాసేపు స్టేషన్ పరిసరాల్లోనే సంచరించారు. ఆ తర్వాత పింకు, మంగళ్ ఆటో ఎక్కగా మిగిలిన ఇద్దరూ స్టేషన్ బయట ఉన్న కేఫ్ వద్ద ఆగిపోయారు. కేవలం కొన్ని గంటల్లోనే తమ ‘పని’ పూర్తి చేసుకునే ఈ గ్యాంగ్ ఫోన్లు వాడదు. తమ వారి నుంచి ఎక్కడ వేరయ్యారో, మళ్లీ అక్కడికే వచ్చి కలుస్తుంటారు. మాస్టర్ ‘కీ’ వినియోగించి మ్యాస్ట్రో.. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆటో మాట్లాడుకున్న పింకు, మంగళ్ నేరుగా చార్మినార్ వద్దకు వెళ్లారు. అక్కడ ఆటోడ్రైవర్‌కు రూ.200 ఇచ్చి పంపేశారు. స్నాచింగ్స్ చేయడానికి అనువైన వాహనాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి తస్కరించడానికి గాలించారు. మిట్టీకా షేర్ వద్ద కనిపించిన మ్యాస్ట్రో వాహనాన్ని తమ వద్ద ఉన్న మాస్టర్ ‘కీ’ వినియోగించి చోరీ చేశారు. దానిపై నాంపల్లి ప్రాంతానికి చేరుకునేసరికే స్నాచింగ్స్ చేయడానికి అనువైందని కాదని భావించారు. అక్కడి శ్రీనివాస గ్రాండ్ హోటల్ వద్దకు అదే రోజు తెల్లవారుజామున 5.10 గంటలకు చేరుకున్న ఈ ద్వయం.. మ్యాస్ట్రో వాహనాన్ని వదిలి, అక్కడ ఉన్న పల్సర్ బైక్‌ను తస్కరించారు. దానిపైనే తిరుగుతూ ఉప్పల్, నాచారం సహా అయిదు పోలీసుస్టేషన్ల పరిధిలో ఏడు గొలుసు దొంగతనాలు చేసి 21 తులాల బంగారం అపహరించారు. తమ వారిని కలిసి తప్పుదారి పట్టిస్తూ.. రామ్‌గోపాల్‌పేట ప్రాంతంలో పల్సర్ వాహనాన్ని వదిలేసిన పింకు, మంగళ్ అక్కడ నుంచి ఆటోలో నాంపల్లి రైల్వేస్టేషన్ వద్దకు వచ్చారు. కేఫ్ సమీపంలో ఉన్న సెహా్వగ్, లక్ష్మణ్‌లను కలిశారు. అక్కడ నుంచి నలుగురూ పోలీసులను తప్పుదారి పట్టించేలా వివిధ ప్రాంతాల్లో తిరిగి చివరకు వరంగల్ జిల్లా కాజీపేట నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ పారిపోయారు. చోరీ సొత్తు మొత్తం లక్ష్మణ్ తీసుకున్నాడని, అక్కడ నుంచి తాము స్వగ్రామాలకు వెళ్లిపోయారని మంగళ్ పోలీసుల వద్ద అంగీకరించాడు. ఇతడిచ్చిన వివరాల ఆధారంగా రాచకొండ పోలీసులు మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు సొత్తు రికవరీ చేయడానికీ సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క మంగళ్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, విచారించడానికి మిగిలిన నాలుగు ఠాణాల అధికారులూ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేశారు. -
కొరియర్ వచ్చిందని చెప్పి..
సాక్షి, లంగర్‌హౌస్: కొరియర్ వచ్చిందంటూ పలు మార్లు ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో బెదిరించి బంగారు గొలుసు లాక్కెళ్లిన యువకుడిని లంగర్‌హౌస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఐ ముజీబ్ ఉర్ రెహమాన్, డీఎస్సై రాఘవేంద్ర స్వామిలతో కలిసి ఆసిఫ్‌నగర్ ఏసీపీ శివమారుతి వివరాలు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన సయ్యద్ హమీద్ మెహిదీపట్నంలోని ఓ హాస్టల్లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన అతను తన తమ్ముడి ఫీజు కట్టడానికి చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను డెలివరీ చేసే ప్రాంతాలను పరిశీలిస్తూ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. నెల రోజుల క్రితం మారుతీ నగర్‌లోని ఓ ఇంట్లో డెలివరీ ఇచ్చాడు. సదరు వృద్ధురాలు ఒక్కరే ఉండటంతో పలుమార్లు అక్కడ చోరీకి ప్రయత్నించిన విఫలమయ్యాడు. ఈ నెల 23న మరోసారి ఆమె ఇంటికి వెళ్లిన హమీద్ కొరియర్ వచ్చిందని చెప్పాడు. అయితే ఆమె డోర్ తీయకుండా తన కుమారుడు వచ్చాకే అతనికే ఇవ్వాలని చెప్పింది. అదే రోజు పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లి కొరియర్ తీసుకోవాలని ఒత్తిడి చేసినా ఆమె నిరాకరించింది. సాయంత్రం అతను వెళ్లిపోయాడని భావించిన వృద్ధురాలు తలుపులు తెరిచి చూడగా పక్కనే దాగి ఉన్న సయ్యద్ ఇంట్లోకి దూరి ఆమెను కత్తితో బెదిరించి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 29న అతడిని అదుపులోకి తీసుకుని, సోమవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులకు రివార్డులు.... సయ్యద్ హెల్మెట్ ధరించి ఎలాంటి ఆధారాలు లేకుండా చోరీ చేసినా పోలీసులు చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు. కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు మొహమ్మద్ మిన్హజుద్దీన్ ఖాన్, వల్లపు క్రిష్ణ, అరవింద్‌కుమార్‌లకు రివార్డులు అందించి అభినందించారు. (చదవండి: ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినా.. ) -
మెదక్: పట్టపగలే దారుణం..
మెదక్ మున్సిపాలిటీ: పట్టపగలు ఇంట్లో చొరబడిన గుర్తు తెలియని దుండగులు మహిళ గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. ఈ ఘటన శనివారం మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెల్దుర్తి మండలం కలాన్‌శెట్టిపల్లి గ్రామానికి చెందిన తలకొక్కుల వెంకటేశం, సుజాత (42) దంపతులు మెదక్‌లోని పెద్దబజార్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శనివారం ఉదయం కూరగాయలు అమ్మేందుకు భార్యభర్తలిద్దరూ వెళ్లారు. ఉదయం 10 గంటల సమయంలో సుజాత ఇంటికి వెళ్లి వంటచేసి భోజనం తీసుకొని వస్తానంటూ వెళ్లింది. మధ్యాహ్నం ఒంటిగంట అవుతున్నా భార్య రాకపోగా, ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడంలేదని వెంకటేశం ఇంటికి వెళ్లాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సుజాతను చూసి భయాందోళనకు గురయ్యాడు. స్థానికుల సహాయంతో వెంకటేశం మెదక్ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, ఎస్ఐ మల్లారెడ్డి, మెదక్ రూరల్ సీఐ విజయ్‌కుమార్, పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం క్లూస్‌టీం, డాగ్‌స్కా్వడ్ రప్పించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఎస్పీ రోహిణీప్రియదర్శిని ఘటనా స్థలానికి చేరుకొని హత్య తీరును పరిశీలించారు. దుండగులను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మృతురాలి కుటుంబీకులకు హామీ ఇచ్చారు. దుండగులు సుజాత మెడను కోసి, ముఖంపై కత్తులతో పొడిచి దారుణంగా చంపారు. ఆమె మెడలోంచి మూడున్నర తులాల పుస్తెలతాడు, చెవి కమ్మలను దోచుకెళ్లారు. -
24 గంటల్లో 6 దొంగతనాలు..16 ఏళ్ల బాలుడు అరెస్ట్!
న్యూఢిల్లీ: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. 20 ఏళ్ల లోపువారే అధికంగా చెడు వ్యసనాల ఉచ్చులో పడి బంగారు జీవితాన్ని కటకటాల పాలు చేసుకుంటున్నారు. ఓ 16 ఏళ్ల బాలుడు 24 గంటల్లో 6 దొంగతనాలకు పాల్పడిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున వెలుగు చూసింది. దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉండగా.. బాలుడు తన చేతివాటాన్ని చూపించాడు. దక్షిణ ఢిల్లీలోని నివాస ప్రాంతాల్లో ఆగస్టు 15వ తేదీన ఈ దొంగతనాలు జరిగాయని, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలుడు డ్రగ్స్‌కు బానిసయ్యాడు. జల్సాల కోసం ఇప్పటికే 13 దొంగతనాలకు పాల్పడ్డాడు. వీధుల్లో ఒంటరిగా వెళ్లే ఆడవాళ్లే అతడి టార్గెట్. బంగారు నగలు, మొబైల్ ఫోన్లు లాక్కెళుతుంటాడు. ఆగస్టు 15న తొలి ఘటన హౌజ్‌ఖాస్ ప్రాంతంలో ఉదయం 8 గంటలకు జరిగింది. స్కూటర్‌పై వచ్చి ఓ మహిళ సెల్‌ఫోన్ లాక్కెళ్లాడు. ఆ తర్వాత సాయంత్రం 5.30 గంటలకు సాకెట్ ప్రాంతంలో ఓ మహిళ పర్స్ లాక్కెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే లాడో సరాయ్ మార్కెట్‌కు వెళ్లి ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడు. నాలుగో సంఘటన మాలవియా నగర్లో జరిగింది. ఆ తర్వాత ఓ మహిళ, ఫుడ్ డెలివరీ వర్కర్ వద్ద దొంగతనానికి పాల్పడ్డాడు. ‘నిందితుడు నీలం రంగు స్కూటర్‌పై వచ్చినట్లు అన్ని ఫిర్యాదుల్లోనూ పేర్కొన్నారు. సీసీటీవీలు పరిశీలించి నిందితుడి కోసం గాలించాం. ఈ కేసులపై ప్రత్యేక నిఘా పెట్టాం. బుధవారం బీఆర్టీ ప్రాంతానికి అదే స్కూటర్‌పై వచ్చినట్లు సమాచారం అందింది. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, పట్టుకున్నాం. అతడి వద్ద రెండు ఫోన్లు ఉన్నాయి. అతడి ఇంట్లో బంగారు ఆభరణాలు లభించాయి. ఉదయం, సాయంత్రం పూట ఒంటరి మహిళలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నాడు. ’ అని దక్షిణ డీసీపీ బెనిత మారీ జైకర్ తెలిపారు. ఇదీ చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం..15ఏళ్ల బాలికను తుపాకీతో కాల్చి పరార్! -
బెయిల్ ఇప్పిస్తాడు... స్నాచింగ్స్ చేయిస్తాడు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసిన ఘరానా స్నాచర్ మహ్మద్ ఫైజల్ షా అలీ జాబ్రీ విషయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇతడి వెనుక ఉండి కథ నడిపేది మహ్మద్ ఖలీల్‌గా తేలింది. వీరిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన శాలిబండ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆసిఫ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫైజల్ సోదరుడు పేరున్న వైద్యుడు. ఇంటర్మీడియట్ మధ్యలో మానేసిన ఇతగాడు కొన్నాళ్లు పంజగుట్టలోని ఓ బ్యాంక్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేశాడు. వ్యసనాలకు బానిసగా మారి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2006 నుంచి చైన్ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టి ఇప్పటి వరకు 138 గొలుసులు తెంపాడు. రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా నమోదైంది. ఇతడు జైల్లో ఉండగా మరో ఘరానా స్నాచర్ ఖలీఫాతో పరిచయమైంది. ఇలా ఖలీఫాను కలవడానికి వచ్చే అతడి సోదరుడు ఖలీల్తోనూ స్నేహం చేశాడు. సింగిల్‌గా చైన్ స్నాచింగ్స్ చేసే ఫైజల్ విషయం తెలిసిన ఖలీల్ అతడిని అడ్డు పెట్టుకుని తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. దీనిని అమలులో పెట్టడం కోసం అతడికి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చాడు. ఇప్పటి వరకు ఫైజల్‌కు రెండుసార్లు బెయిల్ ఇప్పించిన ఖలీల్ అతడికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు చైన్ స్నాచింగ్స్ చేసేలా ప్రోత్సహించాడు. ఇలా తెచ్చిన గొలుసులను అమ్మగా వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకోవడం మొదలెట్టాడు. గతంలో సుల్తాన్‌బజార్ పోలీసులు ఫైజల్‌ను అరెస్టు చేసినప్పుడు కొన్ని నేరాలు చెప్పకుండా చేసి ఆ సొత్తు కాజేశాడు. ఖలీల్ పైనా రెండు స్నాచింగ్ కేసులు ఉన్నాయి. ఒంటరిగా బైక్‌పై సంచరిస్తూ స్నాచింగ్స్ చేసే ఫైజల్ మహిళల మెడలోని గొలుసులు లాగడంలో సిద్ధహస్తుడు. బాధితురాలికి ఏమాత్రం గాయం కాకుండా గొలుసు తెంపేస్తాడు. నేరం చేయడానికి వెళ్లేప్పుడే తనతో మరో షర్ట్ తీసుకువెళ్తాడు. స్నాచింగ్ చేసిన తర్వాత అనువైన ప్రాంతంలో ఆగి చొక్కా మార్చుకుంటాడు. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసినా చిక్కకుండా ఉండేందుకు వీలున్నంత వరకు ప్రధాన రహదారిని వాడడు. రెక్కీ లేకుండా నేరం చేయడం, చొక్కా మార్చుకోవడంతో పాటు గల్లీల్లో తిరుగుతూ తప్పించుకునే ఇతడి ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు ముప్పతిప్పలు పడాల్సి వస్తుంది. ఇటీవల శాలిబండ, నారాయణగూడ, సరూర్నగర్ల్లో మూడు స్నాచింగ్స్ చేసిన ఫైజల్‌తో పాటు సహకరించిన ఖలీల్‌ను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ చాకచక్యంగా పట్టుకుని 120 గ్రాముల బంగారం రికవరీ, నేరాలకు వాడే పల్సర్ బైక్ రికవరీ చేసింది. (చదవండి: 12 సీసీకెమెరాలు పెట్టినా...రూ.40 లక్షలు స్వాహా) -
‘ఆ నేరాలు చేసింది ట్రాన్స్‌జెండర్’
సాక్షి, హైదరాబాద్: మారేడ్‌పల్లి ప్రాంతానికి చెందిన రాజేందర్, కొండాపూర్‌లోని టీఎస్పీఎస్పీ కానిస్టేబుల్ ఈశ్వర్ ప్రసాద్‌ల నుంచి ఆదివారం ల్యాప్‌టాప్, బంగారు గొలుసులు కాజేసింది ట్రాన్స్‌జెండర్‌గా తేలింది. బెంగళూరు నుంచి వచ్చి, లాడ్జిలో బస చేసి, లిఫ్ట్ తీసుకుని ఈ నేరాలకు పాల్పడిన అంజుమ్‌తో పాటు ఆమెకు సహకరిస్తున్న అనుచరుడు బసవరాజ్‌ను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ పట్టుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. బెంగళూరులోని ప్రగతి లేఔట్ ప్రాంతానికి చెందిన అంజుమ్ ఎనిమిదేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా మారింది. చిన్న చిన్న పనులు చేసి పొట్టపోసుకునే ఈమె అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి ట్రాన్స్జెండర్లతో కలిసి ఉండి వెళ్లేది. ఆమెకు ఇటీవల బెంగళూరుకు చెందిన చిరు వ్యాపారి బసవరాజ్‌తో పరిచయం ఏర్పడింది. సన్నిహితంగా ఉంటున్న ఇరువురూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ విలాసవంతంగా జీవిస్తున్నారు. అందుకు అవసరమైన డబ్బు కోసం నేరాలు చేయాలని పథకం వేశారు. ఈ నెల 12న వీరి ద్దరూ విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో బస చేశారు. అదే రోజు రాత్రి రాజేందర్ అనే వ్యక్తి కారులో మారేడ్‌పల్లి నుంచి బేగంపేట వెళ్తుండగా ప్యారడైజ్ సర్కిల్ వద్ద అంజుమ్ లిఫ్ట్ అడిగింది. కారు ఎక్కిన ఆమె రాజేందర్‌తో అసభ్యంగా ప్రవర్తించింది. దీంతో ఆయన సీటీఓ జంక్షన్ వద్ద కారు దిగమన్నాడు. అదును చూసుకున్న అంజుమ్ ఆయన మెడలోని గొలుసు, వెనుక సీటులో ఉన్న ల్యాప్‌టాప్ తీసుకుని ఉడాయించింది. దీనిపై బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. అదే రోజు అమీర్‌పేట మార్కెట్ వద్దకు చేరుకున్న అంజుమ్ అటుగా బైక్‌పై వస్తున్న ఈశ్వర్ ప్రసాద్‌ను లిఫ్ట్ అడిగింది. పంజగుట్ట చౌరస్తా వరకు ప్రయాణించి ఆయన మెడలో ఉన్న చైన్ తస్కరించి దిగిపోయింది. దీనిపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్, బి.అశోక్‌రెడ్డి, జి.శివానందం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. తొలుత ఇది యువతి చేసిన పనిగా భావించారు. అయితే సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ ఆధారంగా ట్రాన్స్‌జెండర్ పనిగా తేల్చారు. ఆ ఆధారాలతో ముందుకు వెళ్లిన పోలీసులు అంజుమ్‌తో పాటు ఆ సొత్తు విక్రయిస్తున్న బసవరాజ్‌ను వారు బస చేసిన లాడ్జి వద్దనే అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులతో పాటు సొత్తును మహంకాళి పోలీసులకు అప్పగించారు. -
ఎంబీఏ చదివాడు.. పాత నేరస్తుడితో కలిసి చైన్ స్నాచింగ్
హిందూపురం: సులువుగా డబ్బు సంపాదించాలనుకుని చైన్‌స్నాచర్‌గా మారిన ఎంబీఏ పట్టభద్రుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలను సోమవారం హిందూపురం రూరల్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమ్య వెల్లడించారు. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన అభిలాష్ ఎంబీఏ పూర్తి చేసి సులువుగా డబ్బు సంపాదించాలనుకుని గుప్త నిధుల కేసులో పాత నేరస్తుడిగా ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెంకటాపురానికి చెందిన జనత్‌కుమార్‌తో చేతులు కలిపాడు. గుప్తనిధులు వెలికి తీసేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు కొనుగోలు చేసేందుకు చైన్‌స్నాచింగ్‌లకు తెరతీశారు. ఈ క్రమంలోనే హిందూపురంలోని పాండురంగనగర్, టీచర్స్‌కాలనీ, శ్రీనివాసనగర్, పెనుకొండలోని ఆల్విన్ కాలనీ, అనంతపురంలోని రాంనగర్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. తాము అపహరించిన బంగారు చైన్లను సోమవారం హిందూపురంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా హిందూపురం రూరల్ సీఐ హహీద్‌ఖాన్, ఎస్ఐ శ్రీనివాసులు గుర్తించి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. వారి నుంచి రూ.1.90 లక్షలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, రూ.15 లక్షలు విలువ చేసే 30.50 తులాల బరువున్న 8 బంగారు మాంగళ్యం చైన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. -
చైన్ స్నాచింగ్‌తో రూ.48 లక్షలు విలువ చేసే ఫ్లాట్, కారు కొన్నాడు!
చాలామంది కష్టపడి సంపాదించడం కంటే ఈజీగా డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషిస్తారు. ఈ క్రమంలో ఎలాంటి అక్రమార్గాల్లో పయనిస్తారో చెప్పలేం. సులభంగా మంచి మార్గంలో సంపాదించడం వేరు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం అంటే అతి కచ్చితంగా తప్పుడు మార్గేమే అవుతుంది. అచ్చం అలానే ఇక్కొడొక యువ ఇంజనీర్ సంపాదిస్తున్న జీతంతో సంతృప్తి చెందక చైన్ స్నాచింగ్‌ల వైపు ఆకర్షితుడయ్యాడు. అయితే ఇదేక్కడ జరిగింది ఏంటో చూద్దాం. (చదవండి: వామ్మె! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం) వివరాల్లోకెళ్లితే.....ముంబైలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు కొడుకు ఉమేశ్ పాటిల్‌గా కనీసం 20 చైన్ స్నాచింగ్‌లు తుషార్ ధిక్లే అనే భాగస్వామ్యంతో మొత్తం 36 గొలుసులు దొంగతనం చేశాడు. ఆ తర్వాత నుంచి పాటిల్ తానొక్కడే చైన్ స్నాచింగ్‌లు చేయడం మొదలు పెట్టాడు. ఈ తరుణంలో పాటిల్ ఒక రోజు ద్విచక్ర వాహనం పై నెమ్మదిగా వస్తూ బంగారు అభరణాలను ధరించిన ఒక మహిళ వద్ద యూటర్న్ తీసుకోవడం ఇద్దరూ పోలీసులు గమినించి అతన్ని వెంబడిస్తారు. ఈ క్రమంలో పోలీసులు తమ ద్విచక్రవాహనాలతో అతని బైక్‌ని ఢీకొడతారు. దీంతో ముగ్గురు కింద పడిపోతారు. అయినప్పటికీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయడం మొదలుపెడతారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ " పాటిల్ 2015లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఒక కాంట్రాక్టర్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు.పైగా తనకు వస్తున్న జీతంతో ఏ మాత్రం సంతృప్తి చెందక చైన్ స్నాచింగ్‌ల చేయడం మొదలు పెట్టాడు. ఈ చైన్ స్నాచింగ్‌లతో సంపాదించిన డబ్బుతో రూ.48 లక్షలు విలువ చేసే ఫ్లాట్, ఒక కారు కొన్నాడు. అంతేకాదు అతని ఇంట్లో సోదా చేస్తే రూ.2.5 లక్షల నగదు, 27 బంగారు గొలుసులు లభించాయి. పాటిల్ మొత్త బ్యాంక్ బ్యాలెన్స్ విలువ రూ.20 లక్షలు." అని వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు పాటిల్‌తో పాటు అతని భాగస్వామి తుషార్ ధిక్లేను నగరానికి చెందిన నలుగురు నగల వ్యాపారులను అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!) -
డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు.. 24 గంటల్లోనే పోలీసులకు చిక్కాడు
హైదరాబాద్: జీవనోపాదిలేక ఎంబీఏ చదివిన ఓ డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు. తను నివసించే ప్రాంతంలోనే చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ జీవనం సాగించేవాడు. అయితే కొంత కాలంగా కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో అతను తప్పుడు దారిలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ పని అతనికి అలవాటు లేకపోవడంతో తప్పు చేసిన 24 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సార్ నగర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లికి చెందిన డి. సుచరిత అనే యువతి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె మధురా నగర్ కాలనీలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. అయితే గురువారం కూడా ఆమె రోజు మాదిరిగానే ఆఫీస్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే సుచరిత మధురానగర్ మెట్రో స్టేషన్ వద్ద లిఫ్ట్ కోసం ఎదురు చూడసాగింది. ఇక అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ యువకుడు సుచరిత మెడలోని రూ. 45 వేలు విలువ చేసే బంగారు గొలుసును దొంగిలించాడు. దీనితో బాధితురాలు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. నిందితుడిని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన చింత వినోద్(27)గా గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడు వినోద్‌ను పోలీసులు దొంగతనం జరిగిన 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేకనే గొలుసు చోరీకి పాల్పడ్డారని, చోరికి పాల్పడటం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. -
బీకాం చదివి..దొంగగా మారి
కర్నూలు: జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి నుంచి 107.5 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకుని నేరానికి ఉపయోగించిన పల్సర్ వాహనాన్ని సీజ్ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సీఐలు కంబగిరి రాముడు, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ తదితరులతో కలిసి డీఎస్పీ కేవీ మహేష్ బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి దొంగల వివరాలు వెల్లడించారు. బీకాం చదివి..దొంగగా మారి: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ప్రధాన నిందితుడు మాచర్ల శ్రీకాంంత్ బీకాం కంప్యూటర్స్ చదువుకుని బట్టల వ్యాపారం చేసేవాడు. వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బు పేకాట, క్రికెట్ బెట్టింగులో పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. జల్సాల కోసం ఇంటి దొంగతనానికి పాల్పడి మొదటిసారిగా ఆదోని సబ్ జైలుకు వెళ్లాడు. అప్పటికే తల్లి హత్య కేసులో అదే జైలులో శిక్ష అనుభవిస్తున్న రెండవ నిందితుడు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన బోయ వీరేష్‌తో పరిచయం పెరిగింది. బెయిల్‌పై బయటికి వచ్చిన తరువాత ఇరువురు కలిసి భారీ దొంగతనాలు చేయడం ప్రారంభించారు. అంతకు ముందు వీరేష్ చిల్లర దొంగతనాలు చేసేవాడు. ఇద్దరూ కలిసి పగలు రెక్కి నిర్వహించి తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని రాత్రిపూట ఇళ్లల్లో చొరబడి అందినకాడికి మూటగట్టుకుని ఉడాయించేవారు. తాళాలు వేసిన ఇళ్లను దోచుకోవడంలో వీరు సిద్ధహస్తులు. బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరించి విలాసవంతమైన జీవితం గడిపేవారు. పోలీసులకు చిక్కారు ఇలా: శ్రీకాంత్, వీరేష్‌పై ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్లో పలు దొంగతనాల కేసులతోపాటు సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి. దీంతో వారిపై అక్కడి పోలీసుల నిఘా పెరగడంతో కర్నూలులోని ముజఫర్ నగర్లో శ్రీకాంత్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. డబ్బు అవసరమైనప్పుడల్లా వీరేష్‌తో కలిసి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవారు. ఈ నెల 2వ తేదీన కర్నూలు బాలాజీ నగర్లో నివాసముంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమాని పాటిల్ హనుమంతరెడ్డి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉంచిన లాకర్‌ను ఎత్తుకెళ్లి ముజఫర్ నగర్‌లోని ఇంట్లో దాచి ఉంచారు. లాకర్‌ను తెరవడానికి సాధ్యం కాక మరో దొంగ సాయం కోరారు. లాకర్‌ను గ్యాస్ కట్టర్‌తో తెరిస్తే వాటా ఇస్తామని ఆశ పెట్టారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు నిఘాపెట్టి కర్నూలు శివారు సుంకేసుల రోడ్డులోని వై–జంక్షన్(తిప్పమ్మ కొట్టాల) వద్ద ఉండగా పట్టుకున్నారు. విచారణలో మరికొన్ని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు బయట పడింది. నేరాల చిట్టా ఇదీ.. కర్నూలు 4వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని ఉద్యోగనగర్‌లో నివాసముంటున్న డాక్టర్ ప్రదీప్, సమీపంలో నివాసముంటున్న ఆనంద్ ఇళ్లల్లో జూలై 15వ తేదీన చోరీలకు పాల్పడ్డారు. అలాగే జనవరి 27వ తేదీన కోడుమూరులోని రాజశేఖర్ రెడ్డి ఇంట్లో 76 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండితో పాటు నగదును లూటీ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఆరు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తమ ప్రతిభను చూపి దొంగలను అరెస్ట్ చేయడమేగాక వారి వద్ద నుంచి భారీగా బంగారు నగలను రికవరీ చేసినందుకు ఏఎస్ఐలు కరీం, నబి, దేవరాజు, శ్రీనివాసులు, యల్లా శివుడు, తిక్కస్వామి తదితరులను డీఎస్పీ అభినందించారు. -
భార్య కోరికలు తీర్చడం కోసం కొత్త పెళ్లి కొడుకు తిప్పలు
ముంబై: కొత్తగా పెళ్లైంది. భార్యను బాగా చూసుకోవాలనుకున్నాడు. ఆమె ఏం కోరితే అది తెచ్చి భార్యకివ్వాలనుకున్నాడు. కానీ వాస్తవంగా పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. చేసేదేమో ఫుడ్ డెలివరీ బాయ్ ఉద్యోగం. ఆ సంపాదనతో భార్య కోరికలు తీర్చడం కష్టం అని భావించి చైన్ స్నాచర్‌గా మారాడు. కట్ చేస్తే పోలీసులకు చిక్కి కటకటాల్లో చేరాడు. ఈ సంఘటన మహారాష్ట్ర పుణెలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పుణె వాకడ్ ప్రాంతానికి యాదవ్ అనే వ్యక్తి ఫుడ్ డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అతడికి వివాహం అయ్యింది. కొత్తగా పెళ్లైంది.. ఇక భార్య గోముగా తన కోరికల చిట్టా విప్పడంతో యాదవ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఫుడ్ డెలవరీ బాయ్‌గా తనకు వచ్చే జీతంతో భార్య కోరికలు తీర్చలేనని అర్థం అయ్యింది. ఈ క్రమంలో ప్రవృత్తిగా చైన్ స్నాచింగ్‌ను ఎంచుకున్నాడు. రంగంలోకి దిగడానికి ముందు నెట్టింట్లో పలు చైన్ స్నాచింగ్ వీడియోలను నిశితంగా పరిశీలించాడు. ఆ తర్వాత రంగంలోకి దిగాడు యాదవ్. ఇక చైన్ స్నాచింగ్ చేయడం కోసం యాదవ్ రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడు. పోలీసులకు చిక్కే వరకు ఏడు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి.. సుమారు 121 గ్రాముల బంగారం.. రెండు బైక్‌లు దొంగిలించాడు. ఈ క్రమంలో ఆదివారం వాకడే ప్రాంతాన్ని తన టార్గెట్‌గా ఎంచుకున్నాడు యాదవ్. ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించసాగాడు. అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు యాదవ్ కదలికల్లో తేడా కొట్టింది. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యాదవ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. -
మహిళ మెడలో గొలుసు తెంపుతూ అడ్డంగా బుక్కైన నటుడు
గాంధీనగర్: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతోన్న ఓ నటుడిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. రెండు రోజుల కిత్రం సూరత్‌లో రోడ్డుపై వెళ్తోన్న మహిళ మెడలో నుంచి చైన్ లాక్కుని వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలిశాయి. అరెస్ట్ చేసిన వారిలో ఒక వ్యక్తి బాలీవుడ్ టీవీ సీరియల్ నటుడు మీరజ్ కపాడి కాగా మరొకరిని బిల్లర్ వైభవ్ జాదవ్‌గా గుర్తించారు పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ వల్ల అప్పుల పాలైన వీరిద్దరూ చైన్ స్నాచర్స్‌గా మారారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘ముంబైలో ఉంటున్న నటుడు మీరజ్ కపాడి ఇప్పటికే పలు టీవీ సీరియళ్లలో నటించాడు. అంతే కాదు తన స్నేహితులకు సీరియల్స్‌లో కూడా అవకాశం ఇప్పించాడు. అయితే ఇతడికి క్రికెట్ బెట్టింగ్ అంటే పిచ్చి. దాంతో చాలా డబ్బు పొగొట్టుకోవడమే కాక అప్పుల పాలయ్యాడు. ఇలాంటి సమయంలో ఇంతడికి బిల్లర్ వైభవ్ జాదవ్ పరిచయమయ్యాడు. అతడు కూడా బెట్టింగ్ వల్ల అప్పుల పాలయ్యాడు. దాంతో ఇద్దరు కలిసి సూరత్‌లో ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారు’’ అని తెలిపారు. ఇక ‘‘గత కొద్ది కాలంగా నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు పెరుగుతుండటంతో వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఈ క్రమంలో వీరిద్దరు దొరికారు. పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు మోరా భాగల్ వద్ద బైక్‌పై వెళుతున్న ఈ ఇద్దరని అదుపులోకి తీసుకున్నాం’’ అని తెలిపారు. ఇక వీరి వద్ద నుంచి మూడు తెగిపోయిన గొలుసులతో పాటు 2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుల్లో వైభవ్‌పై ఇప్పిటకే 12 కేసులు నమోదయ్యాయి. రాజ్‌కోట్, కేశోడ్, జునాగఢ్, అహ్మదాబాద్‌లతో సహా వెరవాల్ ప్రాంతాల్లో ఇతడిపై నేరాలు నమోదయ్యాయి. అంతేకాక గతంలో వీరిద్దరూ వీధుల్లో పార్క్ చేసిన కార్లను కూడా దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: సింగిల్ హ్యాండ్ స్నాచర్! -
చైన్ స్నాచింగ్..వృద్ధురాలిపై దొంగల బీభత్సం
సాక్షి, కరీంనగర్ : వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలో గత కొన్నిరోజులుగా పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం ఆటో చోరీ కాగా, అశోక్‌నగర్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలు సత్తెమ్మ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు వచ్చి లాక్కెళ్లారు. ఇద్దరు దుండగుల్లో ఒకరు హెల్మెట్ ధరించగా, మరొకరు మాస్క్ పెట్టుకున్నారు. మంచిర్యాల చౌరస్తా మీదుగా వచ్చి అశోక్ నగర్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 7 తులాల బంగారు గొలుసు చోరీ జరిగినట్లు వృద్ధురాలు సత్తెమ్మ పోలీసుల కు పిర్యాదు చేశారు. దీని ఆధారంగా దుండగుల ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. వీరి ఆచూకి తెలిపిన వారికి నగదు ప్రోత్సాహం ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అదే విధంగా గతనెల 8న స్టార్ హాస్పిటల్ వద్ద ఉంచిన ఆటోను ఎత్తుకెళ్ళిన్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలు నిజామాబాద్ నుంచి పెర్కిట్ వరకు బైక్ పై వచ్చి అక్కడి నుంచి బస్ లో కరీంనగర్ కు చేరుకుని ఆటోను తీసుకుని నిజామాబాద్ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు ఫోటోలు విడుదల చేశారు. మారుతి సుజు ఆటో గురించి తెలిపినవారికి 25000 పారితోషికం ఇస్తామని ప్రకటించారు. దుండగుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. -
సైకిల్‌పై వెంబడించి.. పుస్తెలతాడు చోరీ
సాక్షి, గజ్వేల్: ఒంటరిగా వెళ్తున్న మహిళను సైకిల్‌పై వెంబడించి, కిందపడేసి, చంపుతానని బెదిరించి గుర్తు తెలియని దొంగ నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుకుపోయిన ఘటన గురువారం ఉదయం వర్గల్ మండలం గౌరారం శివారులో జరిగింది. ఈ ఘటనలో మహిళ మెడపై గాయాలయ్యాయి. స్థానికంగా చికిత్స జరిపించుకున్నది. ఘటన స్థలాన్ని గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు, గౌరారం ఎస్సై వీరన్న సందర్శించారు. కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంబడించి.. భయపెట్టి గౌరారం గ్రామానికి చెందిన నగరం శశిరేఖ (58) గురువారం ఉదయం తమ పొలం దగ్గరకు వెళ్లే మార్గంలో పంటి నొప్పి నివారణ చెట్టు ఆకు కోసం బయల్దేరింది. తుమ్మ చెట్లు, పొదలతో కూడిన ఆ బాటలో వెళ్తున్న ఆమెను అదే మార్గంలో సైకిల్‌పై వస్తున్న గుర్తు తెలియని ఆగంతకుడు వెంబడించాడు. ఆమె ఆకుల కోసం చెట్టు వద్దకు చేరుకోగానే చెప్పులు లేకుండా వెళ్తున్నావేంటని ఆ మహిళను ప్రశ్నించాడు. ఆమె తేరుకునేలోగానే కిందపడేసి కొట్టి, ఎక్సా బ్లేడ్ (పైపులు కోసే చిన్న రంపం)తో చంపుతానని బెదిరించాడు. మెడపై గాట్లు పెట్టాడు. భయంతో ఆమె చంపొద్దని వేడుకోగా మెడలో నుంచి పుస్తెలతాడు అపహరించుకుని ఆగంతకుడు సైకిల్ మీద అక్కడి నుంచి ఉడాయించాడు. ఆమె అరుపులు విని అక్కడికి చేరుకున్న వారు ఆగంతకుని కోసం వెతికినప్పటికీ ఫలితం దక్కలేదు. ఘటన స్థలాన్ని రూరల్ సీఐ కోటేశ్వరరావు, గౌరారం ఎస్సై వీరన్న సందర్శించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై రాబరీ కేసు నమోదు చేశామని ఎస్సై వీరన్న తెలిపారు. చైన్ స్నాచర్‌ను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అనుమానిత ప్రాంతాలలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు రూరల్ సీఐ కోటేశ్వరరావు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నామని వివరించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. -
నిర్మానుష్య వీధి.. బాబుతో కలిసి మహిళ వెళ్తుండగా..!
ఆ వీధి నిర్మానుష్యంగా ఉంది. ఓ మహిళ తన చిన్నారి కొడుకుతో కలిసి నడుస్తూ వస్తోంది. ఓ చేతిలో కొడుకు స్కూల్ బ్యాగు. మరో చేతిలో బాబును పట్టుకొని ఉంది. వారిని వెంబడిస్తూ ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చారు. వీధి నిర్మానుష్యంగా ఉండటం.. ఆ ఇద్దరు మాత్రమే నడుచుకుంటూ వెళ్లడం గమనించారు. ఇంతలోనే ఆమెను దాటి వెళ్లి కాస్త ముందు బైక్‌ను ఆపారు. ఒకడు బైక్ దిగి ఆమె నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించాడు. ఆమె కాస్త ముందుకు వెళ్లగానే.. అమాంతం వెనుక నుంచి వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని బలంగా లాగేసుకొని పారిపోయాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో షాక్ తిన్న ఆ మహిళ అతన్ని వెంబడించేందుకు ప్రయత్నించింది. కానీ, గొలుసు లాక్కొని వెళ్లినవాడు.. తన కోసం ఆగిన బైక్ ఎక్కి చక్కా పారిపోయాడు. ఢిల్లీలోని ఛావ్లా ప్రాంతంలో శుక్రవారం పట్టపగలు జరిగిన ఈ చెయిన్ స్నాచింగ్ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
సిగరెట్ ఇస్తుండగానే లాక్కెళ్లారు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. ఇన్నాళ్లు మహిళల్ని టార్గెట్ చేసిన స్నాచర్లు తాజాగా మగవారిని కూడా వదలడం లేదు. సిగరెట్ ఇవ్వమని అడిగి.. అదే అదునుగా షాపు యజమాని మెడలోంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కెల్లిన సంఘటన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. హైదర్‌గూడ న్యూఫ్రెండ్స్ కాలనీలో రాఘవ రెడ్డి అనే వ్యక్తి కిరాణ షాపు నడుపుతున్నాడు. ఈ క్రమంలో స్నాచర్లు శనివారం రాఘవరెడ్డి షాప్ దగ్గరికి వచ్చి సిగరెట్ కావాలని అడిగారు. సిగరెట్ చేతికి ఇస్తుండగా అదును చూసి రాఘవ రెడ్డి మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దాంతో బాధితుడు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాఘవరెడ్డి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దొరికిన దొంగల బండి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో తీవ్ర కలకలం రేపిన చైన్ స్నాచర్ల బైక్‌ను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇరవై నాలుగు గంటల్లో 11 ప్రాంతాల్లో ఓ ముఠా చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన అలజడి సృష్టించిన విషయం తెలిసింది. దీనిపై గ్రూపులుగా విడిపోయి గాలింపు చేపట్టిన పోలీసులు పాతబస్తీలోని భవానీ నగర్ వద్దగల ముళ్లపొదల్లో బైన్‌ను గుర్తించారు. అయితే దొంగలు బైక్‌ను అక్కడ వదిలి వేరే ప్రాంతానికి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బైక్ నెంబర్ ఆధారంగా యజమానిని అదుపులోకి తీసుకుని విచారించగా.. రెండేళ్ల క్రితమే తాను ఆ బైక్‌ను అమ్మినట్లు తెలిపారు. దీంతో దోపిడిగా పాల్పడిన ముఠా హైదరాబాద్ వారే కావొచ్చనన్న కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవారియా గ్యాంగ్ పనిగా అనుమానించిన రాచకొండ పోలీసులు ఆకోణంలో విచారిస్తున్నారు. రాచకొండలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు -
పెళ్లి వేడుకలో మహిళకు చేదు అనుభంం
-
పెళ్లి వేడుకలో మహిళకు చేదు అనుభవం
బెంగళూరు : వివాహ వేడుకకు హాజరైన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. కళ్యాణ మంటపం దగ్గర నిల్చున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లాడు ఓ దుండగుడు. మహిళ వెనకే నిల్చున్న ఆ వ్యక్తి అదును చూసి మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లాడు. ప్రతిఘటించడానికి ప్రయత్నించిన మహిళను పక్కకు తోసి బయటకు పారిపోయాడు. ఈ అనూహ్య సంఘటనతో షాక్‌కు గురయిన మహిళ తేరుకుని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఈ లోపే నిందుతుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నమ్మించి మోసం చేసిన గుర్తు తెలియని వ్యక్తి
పరకాల : మాయమాటలతో వృద్ధురాలి మెడలోని రెండు తులాల పుస్తెల తాడు అపహరించిన సంఘటన ఆదివారం పరకాల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. శాయంపేట మండలం జోగంపల్లి గ్రామానికి చెందిన గోరంట్ల కమలమ్మ అనే వృద్ధురాలు ఆదివారం సంత కావడంతో పరకాల పట్టణానికి చేరుకుంది. ఎండకు భరించలేక కాసేపు సేదతీరేందుకు బంగారం దుకాణం ముందు కూర్చున్న సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి .. తెలిసిన వ్యక్తిలా ఎంతో అప్యాయంగా పలకరించాడు. ‘బాగున్నావా.. అంటే బాగున్నాను..’ అంటూ సమాధానం ఇచ్చింది. కొంతసేపు ముచ్చటపెట్టినట్టే పెట్టి తన భార్య ఫొటో దిగుతుందని..మెడలో పుస్తెల తాడు ఇస్తే మళ్లీ తీసుకొచ్చి ఇస్తానని నమ్మపలికాడు. అరగంట సేపయినా తిరిగి రాకపోవడంతో వృద్ధురాలు లబోదిబోమనటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ జానీ నర్సింహులు, ఎస్సై రవీందర్‌లు వృద్ధురాలు కూర్చున్న స్థలం వద్ద బంగారం దుకాణం ఉండటంతో సీసీ çఫుటేజీని పరిశీలించారు. వృద్ధురాలి మెడలో పుస్తెలు తాడు ఉన్న మాట వాస్తవంగా నిర్ధారణ చేసుకొని..మాయమాటలతో ఎత్తుకెళ్లిన వ్యక్తి గురించి గాలించారు. తెలిసిన వ్యక్తే వృద్ధురాలి పుస్తెలు తాడు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
అడ్రస్ అడిగే నెపంతో చైన్‌స్నాచింగ్
బనశంకరి: అడ్రస్ అడిగే నెపంతో దుండగులు ఓ మహిళ మెడలోని చైన్ లాక్కెళ్లిన ఘటన జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు... మరియప్పనపాళ్య నివాసి హంసవేణి శుక్రవారం ఉదయం తన ఇంటిలోని చెత్తను బీబీఎంపీకి చెందిన వాహనంలో వేసి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ చీటీ చూపి చిరునామా అడుగుతూ ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు చైన్ లాక్కెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. -
బీహార్ దొంగల అరెస్ట్
బంగారు గొలుసు, సెల్ఫోన్లు స్వాధీనం నంద్యాల : మహిళను బెదిరించి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన బీహార్ దొంగలను అరెస్టు చేసినట్లు నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం పట్టణంలోని తాలూకా పోలీస్ స్టేషన్లో దొంగలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. డీఎస్పీ కథనం మేరకు.. ఈ నెల 8న మహానంది మండలం అబ్బీపురంలో బీహార్‌కు చెందిన దేవేంద్రకుమార్, రాకేష్‌కుమార్ బంగారుకు మెరుగు పౌడర్ ఇస్తామని పావని అనే వివాహిత ఇంటి వద్దకు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి కత్తితో బెదిరించి ఆమె మెడలోని 3.1 గ్రాముల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన తాలూకా సీఐ రామకృష్ణారెడ్డి, మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు నిందితులను అరెస్టు చేశారు. ఈసందర్భంగా వారి నుంచి బంగారు గొలుసు, పల్సర్ బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగలకు వేలల్లో జీతాలు.. బీహార్‌కు చెందిన కొందరు యువకులను ఓ గ్యాంగ్‌గా ఏర్పాటు చేసి వారికి నెలనెల వేతనాలు వారి ఖాతాల్లో జమ చేస్తారని డీఎస్పీ తెలిపారు. వీరి జీతం నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుందన్నారు. కాని జీతం ఇచ్చేది ఎవరో వీరికే తెలియదని, కాని వారు చోరీ చేసిన సొమ్ము ఆ ముఠానాయకుడికి వెళ్తుందన్నారు. వీరు చోరీ చేసిన వెంటనే పక్కనున్న వ్యక్తికి ఇచ్చేస్తారని, సొమ్ము తీసుకున్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయి ముఠా సభ్యులకు చేరవేస్తారన్నారు. పక్కాప్లాన్ ప్రకారమే చోరీలకు తెగబడతారని తెలిపారు. ప్రస్తుతం అరెస్టయిన వారిపై తెనాలి రూరల్‌లో, ఒజిలి, ఆత్మకూరు, ముత్తుకూరు‡, నెల్లూరు త్రీటౌన్‌లో పరిధిలో ఆరు చోరీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
కర్మన్‌ఘాట్‌లో చైన్ స్నాచింగ్
హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. సరూర్ నగర్ పీస్ పరిధి కర్మన్ ఘాట్ శుభోదయకాలనిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. స్వాతి అనే మహిళ స్కూల్లో చదువుతున్న పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి రోడ్డుపక్కన వెళ్తుండగా పల్సర్ బైక్ వచ్చిన ఇద్దరు యువకులు ఆమె మెడలోని మూడు తులాల పుస్తెలతాడును తెంపుకుని పరారయ్యారు. ఈ క్రమంలో ఆమె కేకలు వేస్తూ దుండగులను నిలువరించేందుకు ప్రయత్నించగా మెడపై స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
74-ఉడేగోళంలో చైన్‌స్నాచింగ్
రాయదుర్గం రూరల్ : మండలంలోని 74-ఉడేగోళంలో చైన్‌స్నాచింగ్ జరిగింది. గ్రామానికి చెందిన టెంకాయల మల్లికార్జున భార్య గిరిజమ్మ మరికొందరు మహిళలు బుధవారం తెల్లవారుజామున వాకింగ్ కోసం బయలుదేరారని పోలీసులు తెలిపారు. కేటీఎస్ డిగ్రీ కళాశాల వరకూ వచ్చి ఇంటికి తిరుగు పయనమయ్యారు. అంతలోనే ఇద్దరు అపరిచిత్తులు బైక్‌పై వెనక నుంచి వచ్చి గిరిజమ్మ మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును అపహరించుకుని క్షణాల్లో మాయమయ్యారు. గమనించిన తోటి మహిళలు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకుండాపోయింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రాత్రి బైటకెళ్లిన భార్యాభర్తలకి చేదు అనుభవం
సుల్తాన్ బజార్: బంధువుల ఇంట్లో పూజకు వెళ్లి తిరిగొస్తున్న మహిళ పుస్తెలతాడును దుండగులు లాక్కెళ్లారు. సోమవారం సుల్తాన్ బజార్ పోలీసుల కథనం ప్రకారం... చిక్కడపల్లి జవహార్‌నగర్‌కు చెందిన మాధవి ఆమె భర్త రవికుమార్ ఆదివారం చంచల్గూడలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన పూజకు వెళ్లారు. రాత్రి 11.45కి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా కుద్బిగూడలో ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉన్న ఇద్దరు దుండగులు వారిని బైక్‌పై వెంబడించారు. అదను చూసుకొని మాధవి మెడలో ఉన్న 3 తులాల పుస్తెలతాడును తెంచుకొని వేగం గా పారిపోయారు. బాధితులు అదే రోజు రాత్రి సుల్తాన్ బజార్ ఠాణాకు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పుస్తెలతాడు చోరీ
రాజాం : నగర పంచాయతీ పరిధిలోని మెంటిపేట గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని అగంతుకుడు ఓ మహిళ మెడలో రెండు తులాల బంగారు పుస్తెల తాడు చోరీ చేశాడు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న ఇంటికి సంబంధించి వరండాలో మెంటి పోలమ్మ నిద్రపోగా ఇంట్లో మెంటి సుజాత నిద్రపోయింది. సుజాత భర్త ధర్మారావు నైట్ డ్యూటీకి వెళ్లగా ధర్మారావు తండ్రి రామారావు ఆరు బయట నిద్రపోయాడు. దీనిని గుర్తించిన అగంతుకుడు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ముందుగా వరండాలో నిద్రపోతున్న పోలమ్మ మెడలో ఉన్న తాడుని కట్ చేయగా అది పసుపుతాడు కావడంతో దానికి ఉన్న అర తులం పుస్తెలను తీసుకొన్నాడు. అనంతరం ఇంట్లో నిద్రిస్తున్న సుజాత మెడలో ఉన్న తులమున్నర బంగారు పుస్తెల తాడు చోరీ చేసి పరారయ్యాడు. ఇంతలో మెలుకువ రావడంతో దొంగ దొంగ అని అరవగా అప్పటికే దొంగ పరారైపోయాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలపగా బీట్ కానిస్టేబుళ్లు హుటాహుటిన వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం దొరకకపోవడంతో ఆదివారం ఉదయం సీఐ శంకరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురు చైన్స్నాచర్లపై పీడీ యాక్ట్
సాక్షి, సిటీబ్యూరో: నేరం చేసి అరెస్టు కావడం...బెయిల్‌పై బయటకు వచ్చి.. మళ్లీ విజృంభించి ప్రజలను భయబాంత్రులకు గురి చేస్తున్న ముగ్గురు చైన్స్నాచర్లపై సైబరాబాద్ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. జంట పోలీసు కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలో పదేపదే చైన్‌స్నాచింగ్‌లు, దొంగతనాలు చేస్తున్న బీదర్‌కు చెందిన టకీ అలీ, సల్మాన్ అలీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోవింద్‌లపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ‘దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు సంబంధించి 66 కేసుల్లో ప్రమేయమున్న టకీఅలీ, 113 కేసుల్లో ప్రమేయమున్న సల్మాన్ అలీ కొంత మంది చైన్స్నాచర్లలతో కలిసి పంజా విసురుతున్నారు. రాజేంద్రనగర్ శాస్త్రిపురంలో నివాసముంటున్న గోవిద్ జంట పోలీసు కమిషనరేట్లలో 27 చైన్ స్నాచింగ్‌లు చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నార’ని సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్ తెలిపారు. -
వీడు సామాన్యుడు కాదు..!
అంతర్రాష్ట్ర గొలుసు దొంగ అరెస్టు 25 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం యూపీ నుంచి వచ్చి చోరీలు నలుగురితో ముఠా ఏర్పాటు పరారీలో మరో ముగ్గురు నిందితులు అత్తాపూర్: వరుస చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతరాష్ట్ర చైన్స్నాచర్ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతని నుంచి 25తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు ముఠా సభ్యులకోసం ప్రత్యేక బలగాలు గాలిస్తున్నాయి. శనివారం శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గత కొన్నినెలలుగా శంషాబాద్ డివిజన్ పరిధిలో చైన్‌స్నాచింగ్‌లు ఎక్కువ కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం కిస్మత్పూర్లో వాహన త నిఖీలు నిర్వహిస్తుండగా చైన్‌స్నాచర్లు గోవింద్(23), సంజయ్(25) తారసపడడంతో పోలీసులు వారిని వెంబడించగా సంజయ్ పారిపోయాడు. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ యాదయ్య గోవింద్‌ను పట్టుకున్నాడు. అతడిని విచారించగా చేసిన నేరాలను అంగీకరించడంతో ఇతని వద్ద నుంచి 25తులాల బంగారు ఆభరణాలు, పల్సర్‌బైక్(యూపి11జెడ్6289)ను స్వాధీనం చేసుకున్నారు. అతని ముఠా సభ్యులైన హబీర్, మన్‌ప్రీత్, సంజయ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి పట్టుకున్న క్రైం కానిస్టేబుల్ యాదయ్యకు రూ.50వేల రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, ఇన్ ్సస్పెక్టర్ ఉమేందర్, డీఐ వేణుగోపాల స్వామీ ఎస్పై వెంకట్‌రెడ్డి, నర్సింహ్మ, రవీందర్ నాయక్‌లు పాల్గొన్నారు. యూపీ నుంచి వచ్చి ..... ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామిలిజిల్లా ఖాన్పూర్ గ్రామాని కి చెందిన గోవింద్ మరో ముగ్గురితో కలిసి కొన్ని నెలల క్రితం రాజేంద్రనగర్‌కు వచ్చాడు. దుస్తుల విక్రేతలుగా పరిచయం చేసుకుని శాస్త్రీపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఉదయం రెక్కి నిర్వహించి మహిళలు ఒంటరిగా తిరుగుతున్న ప్రాంతా ల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవారు. ఇప్పటి వరకు 27 స్నాచింగ్‌లు చేశాడని అందులో 17 చోరీలు శంషాబాద్ డివిజన్‌లోనే చేసినట్లు సమాచారం.రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8, మైలార్‌దేవ్‌పల్లిలో 5, శంషాబాద్‌లో 4, లంగర్‌హౌస్‌లో 4, కులుసుంపురాలో 2, టప్పచపుత్రలో 1, చత్రినాకాలో 1, మీర్‌చౌక్ 1, కామటిపురాలో 1 స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. పట్టుబడింది ఇలా.. గొలుసు దొంగలపై నిఘా వేసిన రాజేంద్రనగర్ పోలీసులు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా సేకరించిన నిందితుల ఫోటోలతో గాలింపులు చేపట్టారు. ఇం దులో భాగంగా శనివారం కిస్మత్పూర్ గ్రామంలో ఇన్స్‌స్పెక్టర్ ఉమేందర్, డీఐ వేణుగోపాల్,క్రైం ఎస్సై వెంకట్‌రెడ్డి తనిఖీలు నిర్వహిస్తుండగా బండ్లగూడ వైపు నుంచి పల్సర్‌బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించిన కానిస్టేబుల్ యాదయ్య వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్ వెనుక కూర్చున సంజయ్ పారిపోయాడు. బైక్ నడుపుతున్న గోవింద్‌ను పట్టుకున్నాడు. నలురుగు ముఠాగా ఏర్పడి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. -
ఒంటరి మహిళలే లక్ష్యం
చైన్‌స్నాచర్ అరెస్ట్ రూ.4 లక్షల 50 వేల విలువైన చోరీసొత్తు స్వాధీనం బెంగళూరు(బనశంకరి) : ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్‌స్నాచింగ్‌లు, ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న గంగొండనహళ్లి కి చెందిన సయ్యవ్నాసీర్ను కళాసీపాళ్య పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.4 లక్షల 50 వేల విలువైన చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. సయ్యవ్నాసీర్ గత నెల 26 తేదీ కలాసీపాళ్యలోని ఎల్బీఎప్ రోడ్డులో స్నేహితుడు సాజిద్‌తో కలిసి బైక్ విక్రయిస్తుండగా గస్తీ పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో ఆ ఇద్దరూ ఉడాయించారు. ఎట్టకేలకు పోలీసులు గాలింపు చేపట్టి సయ్యవ్నాసీర్ను అరెస్ట్ చేసి 155 గ్రాముల 7 బంగారుచైన్లు, చెవికమ్మలు, జుమీకీలు కలిపి రూ.4లక్షల 50 వేల విలువ చేసే చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్‌తో 7 చైన్‌స్నాచింగ్ కేసులు, ఓ ఇంటి చోరీ తో పాటు 8 కేసులు వెలుగుచూశాయి. సయ్యద్నాజీర్ తన స్నేహితుడు సాజిద్ తో కలిసి బసవేశ్వరనగర, విజయనగర, కామాక్షీపాళ్య, హుళిమావు తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలను గుర్తించి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని డీసీపీ.లాబూరామ్ తెలిపారు. పరారీలో ఉన్న సాజిద్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
తెంపుడుగాళ్లతో వణికిపోతున్న మహిళలు
-
గొలుసంటే అలుసా
చైన్‌స్నాచింగ్..పోలీసులకు సవాల్ గుంటూరు, విజయవాడల్లో గొలుసు దొంగతనాలు జోరు పట్టించుకోని పోలీసులు... భయపడుతోన్న మహిళలు రాజధాని బందోబస్తు, వీఐపీల సేవలోనే తరిస్తున్న పోలీసులు ఇప్పటివరకు ఏర్పాటుకాని యాంటీ చైన్ స్నాచింగ్ బృందాలు సాక్షి, గుంటూరు : రాజధాని అమరావతి పరిధిలోని గుంటూరు, విజయవాడ నగరాల్లో గొలుసు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చోరులు రెచ్చిపోతున్నారు. ఆభరణాలను ధరించిన వారిని చంపడానికి సైతం వెనుకాడడం లేదు. కొన్నినెలలుగా విజయవాడ,గుంటూరులో ఇటువంటి సంఘటనలు ఎక్కువవుతున్నాయి. అయినాసరే పోలీసులు మాత్రం వీటిపై దృష్టి సారించడం లేదు. రాజధానిని ప్రకటించినప్పటి నుంచి బందోబస్తు, వీవీఐపీల సేవలో తరిస్తున్న పోలీసులు ఈ చోరీలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో అంతర్రాష్ట్ర దొంగలు ఇక్కడ మకాం పెడుతున్నారు. అదే పని.. విజయవాడలో నెలకు 20 నుంచి 25 చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయి. గుంటూరులో వీటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు గొలుసు దొంగలపట్ల అప్రమత్తంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీఎస్, బ్లూకోట్స్ టీంలతోపాటు మఫ్టీల్లో నిఘా పెడుతున్నారు. అయినా గుంటూరులో నెలకు పది వరకు గొలుసు దొంగతనాలు జరుగుతున్నాయి. ఆరు నెలల కిందటైతే రోజుకు 3 నుంచి 4 చైన్ స్నాచింగ్ సంఘటనలు జరిగేవి. దీంతో ఆభరణాలు ధరించి బయటకు రావడానికి మహిళలు జంకే పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు పెరుగుతున్న నేరాలతో అర్బన్ జిల్లా పోలీస్‌లకు కునుకు ఉండడంలేదు. ప్రజల్లో పరువు పల్చబడుతుండడంతో ఏంచేయాలో తెలీయక తలలు పట్టుకుంటున్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో నూతన రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ మొదలు పెట్టినప్పటి నుంచి విజయవాడ, గుంటూరు నగరాల్లో వీవీఐపీల పర్యటనలు అధికమయ్యాయి. దీంతో పోలీసులు వీవీఐపీల భద్రత, సభలు, సమావేశాల సందర్భంగా బందోబస్తులు, వివిధ పార్టీల ఆందోళనల నేపథ్యంలో అదే పనిపై విధులు నిర్వహిస్తున్నారు. దీంతోబయట ప్రాంతాలనుంచి దొంగల ముఠాలు సులువుగా ఈ రెండు ప్రాంతాల్లోకి దిగుతున్నాయి. యాంటీ చైన్‌స్నాచింగ్ టీంలేవి? చైన్‌స్నాచింగ్‌లు అధికంగా జరుగుతున్నా యాంటీ చైన్‌స్నాచింగ్ టీంలను అధికారులు ఏర్పాటు చేయలేదు. గుంటూరులో కమిషనరేట్ ఏర్పాటైతే స్టేషన్లు పెరగడంతోపాటు, సిబ్బంది పెరిగే అవకాశం ఉంది. అయితే కమిషనరేట్ ఏర్పాటు ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఉన్న సిబ్బంది చాలక నేరాల నియంత్రణ సవాల్‌గా మారింది. రాజధాని అయ్యాక తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివసిస్తున్నారు. దీంతో అర్బన్ జిల్లా పరిధిలోని ఒక్కో స్టేషన్ సీఐ ఆయన ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తుండడంతో సిబ్బంది సమస్యలు మరింత పెరుగుతున్నాయి. ఆభరణాల చోరీల ముఠాలు విజయవాడ, గుంటూరు నగరాల్లో పెరగకుండా పోలీసులు దృష్టిపెట్టాల్సి ఉంది. -
అతి సమీపం నుంచి కాల్చారు..
అది వనస్థలిపురం ఆటోనగర్ లోని సుష్మా సాయినగర్. సోమవారం ఉదయం. ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ రోడ్డుపై నడిచి వెళుతున్న అనూరాధ అనే మహిళ మెడలో గొలుసును లాగే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ రోడ్డుకు ఇరువైపులా ఇద్దరు యాంటీ చైన్ స్నాచింగ్ వింగ్ పోలీసులు మాటు వేశారు. మహిళ మెడపై చెయ్యివేసిన మరుక్షణం అప్రమత్తమైన పోలీసుల్లో ఒకరు దుండగులను పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే, రోడ్డుకు అటువైపున్న మరో బృందం పోలీసులు.. నడుము వెనుక భాగంలో ఉన్న తుపాకిని తీసి, అతి సమీపం నుంచి స్నాచర్లపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా కాల్పుల నుంచి తప్పించుకున్న దుండగులు బైక్ వేగం పెంచి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు కూడా వారిని వెంటాడారు. కానీ దుండగులు తెలివిగా తప్పించుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలోని ఓ షాపులో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. కాగా, దుండగుల్లో ఒకరు కచ్చితంగా గాయపడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వనస్థలిపురంలో కాల్పుల సంఘటన హైదరాబాద్ నగరవ్యాప్తంగా కలకలం రేపింది. ఇదిలా ఉండగానే అల్వాల్ ప్రాంతంలో ఒక మహిళ మెడలో బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. -
చైన్‌స్నాచింగ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ
-
జల్సా దొంగలు
కడప అర్బన్ : తల్లిదండ్రుల చాటున పెరిగిన పిల్లలు.. దురలవాట్లకు బానిసలై.. డబ్బు సులభంగా సంపాదించాలనే అత్యాశతో దొంగతనాలకు పాల్పడుతూ చివరకు సీసీఎస్ పోలీసుల అదుపులోకి చేరారు. కడప నగరంతోపాటు జిల్లాలోని పలు చోట్ల తాళాలు వేసిన ఇళ్లను, ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడం వీరి వృత్తిగా చేసుకున్నారు. కడప నబీకోట పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓ ముఠా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్ముతో ఏరోజుకారోజు బెంగళూరు నగరానికి చేరుకుని పబ్బుల్లో విలాసవంతంగా గడపడం అలవాటుగా చేసుకుంది. ఆ డబ్బు అయిపోగానే తిరిగి చోరీలకు, చైన్‌స్నాచింగ్‌లకు తెగబడుతున్నారు. నబీకోటలోని శివాలయం సమీపంలో ప్రతి రోజు కొంత మంది యువకులతో జతకట్టి పక్కా ప్రణాళికను తయారు చేసుకుంటారు. మొదట తాళాలు వేసిన ఇళ్లను గమనించి రావాలని దొంగల ముఠా నాయకుడు పంపిస్తాడు. తర్వాత తాము అనుకున్న ఇంటిని టార్గెట్‌గా చేసుకుని దోపిడీకి పాల్పడుతారు. వరుస చోరీలు: ఇటీవల కాలంలో కడప తాలూకా పరిధిలోని శివాలయం ఎదురు సందులో నివసిస్తున్న ఓ కుటుంబం తమ చిన్నారికి ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూడగా, తమ ఇంటి ప్రధాన ద్వారంగా ఉన్న ఫ్లైవుడ్‌తో తయారు చేసిన తలుపును పగులగొట్టి బంగారు నగలు, నగదును దోచుకెళ్లారు. అలాగే రవీంద్రనగర్‌లో మరో నాలుగు రోజుల తర్వాత ఓ ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ఆ సంఘటన జరిగిన మరో నాలుగు రోజులకు నబీకోట-మరాఠి వీధి మధ్యలో ఉన్న ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో రాయవేలూరుకు వెళ్లి ఆ రోజు రాత్రి ఇంటిలో లేడు. ఆ విషయాన్ని గమనించిన దొంగలు మరుసటిరోజు సాయంత్రం ఆ వ్యక్తి వచ్చే సమయానికి దొంగతనానికి పాల్పడి భారీగా దోచుకెళ్లారు. స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నించినా.. చైన్‌స్నాచింగ్‌ల విషయానికి వస్తే చిన్నచౌకు, వన్‌టౌన్, తాలూకా పోలీసుస్టేషన్ల పరిధిలో మహిళలు ఎక్కడ ఒంటరిగా వెళుతున్నా వారి వెనుకవైపు నుంచి వెళ్లి మెడపై దడేలున కొట్టి వారు తేరుకునే లోపు బంగారు ఆభరణాలను దోచుకెళుతున్నారు. నబీకోటలో వారం రోజుల క్రితం పట్టపగలు 10.30 గంటల సమయంలో ఒంటరిగా వెళుతున్న ఓ వృద్ధురాలు మెడపై కొట్టి చైన్‌ను లాక్కొని వెళుతుండగా వారిని స్థానిక యువకులు ద్విచక్ర వాహనంలో వెంబడించారు. గువ్వలచెరువు ఘాట్ వరకు వెంట పడ్డారు. అంతలోపు స్థానిక యువకుల ద్విచక్ర వాహనం పంచరు కావడంతో ఇబ్బంది పడ్డారు. సదరు చైన్ స్నాచర్లు అలాగే రాయచోటి వైపు పరారయ్యారు. ప్రకాశ్‌నగర్‌లో ఓ న్యాయవాది సతీమణి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఆమె మెడపై కొట్టి తేరుకునేలోపు బంగారు ఆభరణాన్ని దోచుకెళ్లారు. ఎట్టకేలకు కటకటాల పాలు: ఇలా చోరీలకు పాల్పడుతూ బంగారు ఆభరణాలను తీసుకొచ్చిన వాటిని సదరు ముఠా నాయకుడికి అప్పగిస్తారు. ఆయన తనకు తెలిసిన బంగారు నగల దుకాణాలలోనూ లేక ప్రైవేటు బ్యాంకులలోనూ తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులో తానూ కొంత భాగాన్ని దోచుకొచ్చిన యువకులకు మరికొంత భాగాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఈ ముఠాను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ జట్టులో లీడర్‌తోపాటు ఆరుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా రికవరీ కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. -
టీవీల్లో చూసి.. చైన్‌స్నాచింగ్‌లు
* పోలీసులకు పట్టుబడిన భార్యాభర్తలు * 93 నేరాలు.. 3.10 కిలో బంగారం చోరీ వరంగల్ క్రైం: ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో బంగారు గొలుసులు లాక్కొని వెళ్లే అంతరాష్ట్ర భార్యాభర్తల దొంగల ముఠాను ఆదివారంరాత్రి వరంగల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 82 లక్షల విలువ చేసే 3.10 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరంగల్ జిల్లా హన్మకొండలోని హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు ఈ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు సింగరేణి కాలనీకి చెందిన బానోతు రవి ఖమ్మంలో కారు నడుపుతుండేవాడు. వరంగల్ ఉర్సుగుట్ట ప్రాంతానికి చెందిన డీ-ఫార్మసీ విద్యార్థిని ఎర్రం రాజేశ్వరితో రవికి పరిచయం అరుుంది. ఇద్దరూ ప్రేమించుకొని, పెళ్లి చేసుకుని వరంగల్ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేటలో ఉంటున్నారు. కారు నడపడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో దానిని విక్రరుుంచాడు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యూరుు. రోజూ టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే నేర కథననాలకు ఆకర్షితుడైన రవి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి డబ్బు సులువుగా సం పాదించ వచ్చని భావించాడు. 2013 ఫిబ్రవరిలో హంటర్‌రోడ్డులో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లాడు. అక్కడి నుంచి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. దీనికి ఆయనకు భార్య రాజేశ్వరి సహకరించింది. నిర్మానుష్య ప్రాంతాల్లో దంపతుల రెక్కీ.. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో రాజేశ్వరి రెక్కి వేసి నిందితుడు రవికి సమాచారం అందించేది. దీంతో రవి ద్విచక్రవాహనంపై బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళల కోసం కాపుకాచి, అవకాశం చూసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇదే తరహాలో దంపతులిద్దరూ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో కలిపి సుమారు 93 చైన్‌స్నాచింగ్‌లు చేశారు. ఆదివారం రాత్రి హంటర్‌రోడ్డులో క్రైమ్, మిల్స్‌కాలనీ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో నిందితులిద్దరూ తాము చోరీచేసిన బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లో అమ్మేం దుకుగాను ద్విచక్రవాహనంపై ఉర్సుగుట్ట నుంచి హన్మకొండ బస్టాండ్ వైపు వస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వారి వద్ద బంగారు ఆభరణాలు కనపడడంతో దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. తాము మూడేళ్లుగా వరంగల్ కమిషనరేట్‌తో పరిధితోపాటు ఇతర జిల్లాలో పాల్పడిన నేరాలు అంగీకరించడంతో పోలీసులు వీరి వద్ద చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరాల చిట్టా ఇదీ..: సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో 24 నేరాలు, హన్మకొండ-14, మిల్స్‌కాలనీ-11, మట్టెవాడ-10, కేయూసీ-6, కాజీపేట-5, ఇంతెజార్గంజ్-3, స్టేషన్‌ఘన్‌పూర్-2, వర్ధన్నపేట, రాయపర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలలో ఒక్కొక్క చైన్‌స్నాచింగ్ చేశారు. నేరస్తులను అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ కనపరిచిన క్రైమ్ ఏసీపీ ఈశ్వర్రావు బృందాన్ని కమిషనర్ అభినందించారు. -
నల్లకుంటలో చైన్ స్నాచింగ్
నల్లకుంటః నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. వివరాలు.. నల్లకుంట మోరం క్యారీలో నివాసం ఉండే ఆర్.రేణుక దేవి (41) నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు పుస్తెల తాడును పట్టి లాగారు. వెంటనే అప్రమత్తమైన ఆమె గొలుసు గట్టిగా పట్టుకోవడంతో గొలుసులోని కొంత భాగం తెగి ఆమె చేతికి చిక్కింది. కాగా మరో చైన్ ముక్కతో ఆగంతకులు పరారయ్యారు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నా గొలుసు కొట్టేసింది.. కేసు పెట్టండి
కాన్పూర్: కోతి చేష్టలతో అందరికీ ఇబ్బందే. అంతమాత్రాన వానరాలను పోటా లాంటి చట్టాల కింద అదుపులోకి తీసుకోవాలంటే ఎలా? సరిగ్గా ఇలాగే డిమాండ్ చేసి వార్తల్లో నిలిచింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ. తన మెడలోని బంగారు గొలుసును దొగిలించిన కోతిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టింది. ఆమె ఒత్తిడికి తలొగ్గి ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధమైన పోలీసులు.. అసలు ఏ చట్టం ప్రకారం కోతి గారిని నిందితుడిగా తేల్చాలో తెలియక సతమతమవుతున్నారు. యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఉర్మిళా సక్సేనా అనే మహిళ సోమవారం సాయంత్రం గుడికి వెళ్లింది. పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో ఓ కోతి అమాంతం ఆమెపై దూకి.. మెడలోని బంగారు గొలుసును తెంచే ప్రయత్నం చేసింది. ఉర్మిళా కూడా కాస్త ధైర్యంగా ఆ కోతి చర్యను అడ్డుకుంది. దీంతో బంగారు గొలుసు రెండు ముక్కలైంది. ఒక భాగం ఉర్మిళ చేతిలోనే ఉండిపోగా, మరో సగాన్ని కోతి పట్టుకెళ్లింది. ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించినా కోతి కనిపించలేదు. 'చేసేదేమీ లేదు.. పదమ్మా.. నిన్ను ఇంటిదగ్గర దిగబెడతాం' అంటూ ఉర్మిళను ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాత్రం కోతిపై కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టింది. 'వానరంపై ఏయే సెక్షన్ల కింద కేసులు పెట్టొచ్చో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. ఉన్నతాధికారులకు కూడా వివరాలు తెలియజేశాం. వారి నుంచి వచ్చే స్పందనను బట్టి కోతిపై తదుపరి చర్యలు తీసుకుంటాం' అని నజీరాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జీ అఖిలేశ్ గౌర్ మీడియాకు చెప్పారు. ఇంతకీ కేసు ఎందుకు? కొన్ని సినిమాల్లో చూపించినట్లు జంతువులకు శిక్షణ ఇచ్చి దొంగతనాలకు పాల్పడే ముఠాలు నిజంగానే ఉంటాయని, వాళ్లే ఈ పని చేసి ఉంటారని ఉర్మిళ వాదిస్తోంది. కోతిపై కేసు పెట్టడం ద్వారా ఇలాంటి ముఠాల ఆటకట్టించవచ్చనేది ఆమె అభిప్రాయం. -
సరూర్‌నగర్‌లో చైన్‌స్నాచింగ్
సరూర్‌నగర్ : గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ సంఘటన ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీబీ కాలనీలో జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన అక్బర్ అనే వ్యక్తి భార్య ఫాతిమా(30) శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను బచ్పన్ స్కూల్ నుంచి బైక్‌పై తీసుకొని వస్తుంది. సరిగా ఇదే సమయంలో ఆమెను అనుసరిస్తున్న ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసు లాక్కొని వెళ్లారు. నిందితులు నేరుగా జాతీయరహాదారి - 65 పై పరారయ్యారని బాధితురాలు తెలిపారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా, నిందితులు వేసుకున్న టీషర్ట్ మాత్రమే తను గుర్తించినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
చైన్ స్నాచింగ్ ముఠా అరెస్టు
కాకినాడ క్రైం : కాకినాడ డీప్ వాటర్ పోర్టులో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను కాకినాడ క్రైం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. త్రీ టౌన్ క్రైం పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్ తెలిపిన వివరాలిలావున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరామ్‌పురానికి చెందిన నేరెళ్ల వెంకటశివప్రశాంత్ బీఎస్సీ చదివాడు. అతడు కాకినాడ సీ పోర్ట్సు లిమిటెడ్ (డీప్ వాటర్ పోర్టు)లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటూ కాకినాడ రూరల్ మండలం వలసపాకల సాయిబాబా గుడి వద్ద అద్దెకు ఉంటున్నాడు. తాళ్లరేవు మండలం నీలపల్లికి చెందిన రేవు వెంకటరమణ మూర్తి కూడా పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కాకినాడ డెయిరీఫారం సెంటర్లోని రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నాడు. కాకినాడ జగన్నాథపురం శివారు ఆంధ్రా పాలిటెక్నిక్ సమీప ప్రాంతానికి చెందిన బల్లా వీరవెంకట సాయి రంజిత్ కుమార్ వారితో పాటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన ముగ్గురూ డబ్బు సంపాదనకు చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. మోటారు సైకిల్ చోరీ చేసి దానిపై తిరుగుతూ మహిళల మెడల్లోని బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాకినాడ నగర, రూరల్ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోవడంతో ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఆదేశాల మేరకు క్రైం పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. చైన్ స్నాచింగ్ ముఠాలను గుర్తించేందుకు బృందాలుగా ఏర్పడ్డారు. ప్రధాన సెంటర్లలో రెక్కీ నిర్వహించి ఎట్టకేలకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా చైన్ స్నాచింగ్‌ల విషయం వెలుగు చూసింది. ప్రశాంత్, రమణమూర్తి, రంజిత్ కుమార్ కాకినాడ టూ టౌన్, సర్పవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ ఏడు చోరీలకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 3.25 లక్షల విలువైన 17 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటుపడిన ముగ్గురూ సెక్యూరిటీ గార్డులుగా పనిచేసుకుంటూనే ఖాళీ సమయంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నందున వారిని గుర్తించడం కష్టతరమైందని చెప్పారు. చోరీ చేసిన సొత్తును టూ టౌన్, యానాం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఓ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి ఆ సొమ్ముతో జల్సాలు చేశారన్నారు. ముఠాను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన టూ టౌన్ క్రైం ఎస్సై ఎండీఎం ఆర్ ఆలీఖాన్, హెడ్ కానిస్టేబుల్స్ గోవిందు, శ్రీను, కానిస్టేబుల్స్ శ్రీరామ్, వర్మ, చిన్నలను డీఎస్పీ సోమశేఖర్ అభినందించారు. -
మహిళ మెడలోని గొలుసు చోరీ
కరీమాబాద్: ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కరీమాబాద్ మండలం రంగశాయిపేటలో ఆదివారం సాయంత్రం జరిగింది. నగరంలోని ఎల్బీనగర్కు చెందిన రాగులపల్లి స్వతంత్ర అనే మహిళ రంగశాయిపేటలో ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్న సమయంలో బైక్‌మీద వచ్చిన దుండగులు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమె అరిచినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దుండగులు లాక్కెళ్లిన గొలుసు మూడు తులాలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు తెలిపారు. -
జల్సాల కోసమే చైన్‌స్నాచింగ్‌లు
అనంతపురం సిటీ: జులాయిగా తిరుగుతూ జల్సాల కోసం చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.18 లక్షలు ఉండవచ్చుని నిర్థారించారు. అ నంతపురం వన్‌టౌన్ పరిధిలో పట్టుబడి న ఈ నలుగురిని ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదివారం విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఎస్పీ రాజశేఖర్‌బాబు కథనం ప్రకా రం.. నగరంలో గిరిప్రసాద్కాలనీకి చెంది న పాముల మోహన్(28), పాములసూరి(24), పాముల సుధాకర్ అలియాస్ ధూళి (25), రాణినగర్‌కు చెందిన షేక్‌నూర్ బాషా అలియాస్ మున్నా (23) నలుగురు బృందంగా ఏర్పడ్డారు. వీరు ఇద్దరు ఇద్దరు చొప్పున ఒంటరిగా వెళ్లే శివా రు ప్రాంతాల మహిళలు, ఇళ్ల ముందు కసువు ఊడ్చేమహిళలను టార్గెట్ చేసి పగలు, రాత్రి తేడా లేకుండా అదను చూసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యేవారు. కొన్ని నేరాల్లో ద్విచక్రవాహనాలను వినియోగించి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. అలాగే బస్టాండు, బస్సుల్లో జేబు దొంగతనాలకు పూనుకున్నారు. ఇలా ఏడాది కాలంగా తాడిపత్రి జిల్లా కేంద్రంలోని తాడిపత్రి బస్టాండు, హౌసింగ్ బోర్డు, ఎంఐజీకాలనీ, పాతూరు కూరగాయల మార్కెట్, అశోక్‌నగర్, రాణినగర్, వేణుగోపాల్‌నగర్, భైరవనగర్, సంఘమేష్నగర్, కురబవీధి, గుత్తి రోడ్డు, శ్రీకంఠం సర్కిల్ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వీటితో పాటు కదిరి పట్టణంలో ఒక నేరం చేశారు. ఒక దొంగ-ఒక పోలీస్ నినాదంతో నిందితుల ఆటకట్టు.. జిల్లాలో ఇటీవల జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ఎస్పీ ఆదేశాలతో ఒక దొంగ-ఒక పోలీస్ నినాదంతో కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగానే అనంతపురం డీఎస్పీ మల్లికార్జునశర్మ పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ గోరంట్లమాధవ్, ఎస్ఐలు విశ్వనాధ్చౌదరి, జకీర్‌హుస్సేన్, ఏఎస్ఐ ప్రవీణ్, హెడ్‌కానిస్టేబుళ్లు నాగరాజు, సూర్యనారాయణ, షెక్షావలి, రాజకుళ్లాయప్ప, వెంకటేష్, సుధాకర్‌రెడ్డి, కానిస్టేబుళ్లు రమేష్, ప్రసాద్, ధనుంజయ, రాజేష్, పోతన్న, భీమేష్, నాగార్జున, గిరి, రామస్వామి, బాలాజీనాయక్, హోంగార్డులు పీరా, నాగభూషణం ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా ఉంచారు. సీఐ గోరంట్ల మాధవ్‌కు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఇద్దరిని స్థానిక వెంకటేశ్వర థియేటర్ సమీపంలో, మిగిలిన ఇద్దరిని శివకోటిదేవాలయం సమీపంలో అరెస్ట్ చేశారు. సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు : చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పక్కా సమాచారంతో పట్టుకుని వారి నుంచి రూ.18లక్షలు విలువ చేసే 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న వన్‌టౌన్ సీఐ, ఎస్ఐల బృందాన్ని ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. -
భీమవరంలో తుపాకీ కాల్పుల కలకలం
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మావూళ్లమ్మ గుడి సమీపంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బైకుపై వచ్చిన ముగ్గురు బీహారీ యువకులు ఓ మహిళలో బంగారపు తెంచుకుపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు ప్రతిఘటించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా నాటు తుపాకీ కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దొంగల్లో ఒకరిని స్థానికులు పట్టుకున్నారు. మిగతా ఇద్దరు పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భీమవరంలో ఉంటున్న పది మంది బీహార్ యువకులను పోలీసుస్టేషన్ కు పిలిపించారు. పారిపోయిన ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పెరిగిన చైన్ స్నాచింగ్ ల వెనుక బీహారీ గ్యాంగుల హస్తం ముందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
వృద్ధ మహిళలే లక్ష్యంగా...
ఖమ్మం క్రైం: జిల్లాలో వరుస చోరీలతో సతమతమవుతున్న పోలీసు శాఖకు.. కొన్ని రోజులుగా చైన్ స్నాచింగ్ ముఠా పెద్ద తొలనొప్పిగా తయారైంది. గతంలో కేవలం యువతులు, మధ్య వయసు మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను మాత్రమే చైన్ స్నాచర్లు చోరీ చేసేవారు. వీరు ఇటీవలి కాలంలో రూటు మార్చారు. వీరు ప్రధానంగా వృద్ధ మహిళలనే లక్ష్యం గా చేసుకుంటున్నారు. యువతులు, మధ్య వయసు మహిళలైతే ప్రతిఘటిస్తారు. దొంగలను గుర్తుపడతారు. వారి వాహనం నంబరు.. ఆనవాళ్లు గుర్తించగలరు. అదే వృద్ధ మహిళలైతే.. శారీరక బలహీనత, దృష్టి లోపం కారణంగా ప్రతిఘటన శక్తి ఉండదు. అందుకే, వీరినే లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ ముఠా ఆగడాలు సాగిస్తోంది. ఇటీవలి కాలంలో జరిగి న కొన్ని ఘటనల వివరాలు చూడండి... నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెంలో దంపతులు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. వారిని వెనుకగా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వెం బడించారు. నిర్మానుష్య ప్రాంతంలోకి రాగానే... వెనుకగా కూర్చున్న ఆమె (మధ్య వయస్కురాలు) మెడలోని బంగారపు గొలుసును లాక్కుని పరారయ్యారు. ఆమె వాహనం పైనుంచి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని రాజేంద్రనగర్ పార్క వద్ద ఓ వృద్ధురాలు (కల్పనేని రత్నమ్మ) ఉదయం వాకింగ్ చేస్తుండగా ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఆమె మెడలోని బంగారపు గొలుసును లాక్కుని పరారయ్యారు. ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని పంపింగ్‌వెల్ రోడ్డులో ఓ వృద్ధురాలు (సీతమ్మ) తన ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని అగంతకుడు గమనించాడు. చుట్టుపక్కల ఎవరూ లేనిది గమనించి ఆమె ఇంటి ముందుకు వెళ్లి మంచినీళ్లు అడిగాడు. నీళ్లు తాగేసిన వెంటనే ఆమె మెడలోని బంగారపు గొలుసు లాక్కుని ద్విచక్ర వాహనంపై క్షణాల్లో బాయమయ్యాడు. ఖమ్మం టూటౌన్ పరిధిలోని బుర్హాన్‌పురంలో ఓ వృద్ధురాలు ఉదయమే తన ఇంటి ముందు చెట్టుకు పూలు కోస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి, ఆమె మెడలోని బంగాపు గొలుసును గుంజుకుని పారిపోయారు. కొత్తగూడెంలో ఓ వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌పై దగ్గరగా వచ్చి ఆగారు. ఫలానా అడ్రస్ ఎక్కడంటూ అడిగారు. ఆమె సమాధానం చెబుతుండగానే... మెడలోని బంగారపు గొలుసును లాక్కుని మెరుపు వేగంతో పారిపోయారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. జిల్లాలో పలుచోట్ల ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. బాధితుల్లో అత్యధికులు వృద్ధులే ఉన్నా రు. ఇటీవల నమోదైన ఈ కేసుల్లో దొంగలను పోలీసులు ఇప్పటివరకూ పట్టుకోలేకపోయారు. -
డెకాయ్ పార్టీలతో దొంగలకు చెక్
సాక్షి, నెల్లూరు : భద్రతా సిబ్బంది కొరత, అధిక పనిభారం, ఉదాశీనత.. కారణాలు ఏవైనప్పటికీ ఇటీవల కాలంలో పలు రైళ్లలో దోపీడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, బ్యాగ్ లిఫ్టింగ్‌లు అధికమయ్యాయి. అదును చూసి దుండగులు తమ పంజా విసురుతున్నారు. రైళ్లల్లో ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణకు ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) సిబ్బంది ఉన్నారు. అయితే కొద్ది కాలంగా ఈ విభాగంలో భద్రతా సిబ్బంది నియామకం తగ్గింది. అదే సమయంలో రైళ్ల సంఖ్య గణనీయంగా పెరిగాయి. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు ఆర్పీఎఫ్ గస్తీ తిరుగుతుంటారు. అయితే ఒక రైలుకు ఇద్దరు ముగ్గురు సిబ్బందిని భద్రత కోసం పంపిస్తుండటంతో వారు పూర్తి స్థాయిలో గస్తీ తిరగలేకపోతున్నారు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని ప్రత్యేక రైళ్లలో గస్తీ తిరిగే పరిస్థితి లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని దుండగులు రైలు ప్రయాణికులను దోచుకుంటున్నారు. ఇటీవల కొడవలూరు మండలం తలమంచి వద్ద దుండగులు పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఇటీవల రైళ్లలో వరుస దోపిడీలు ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు, సిబ్బందికి కం టి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎలాగైనా నేరస్తుల ఆట కట్టించేందుకు రాష్ట్ర స్థాయిలో పోలీసు అధికారులు పకడ్బం దీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న రైల్వేపోలీసు విభాగానికి అదనంగా ప్రతి జిల్లాకు 20 మంది సిబ్బందిని కేటాయించారు. వీరితో పాటు మొబైల్ పార్టీలు, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఏపీఎస్పీకి చెందిన ఒక ప్లటూన్ సిబ్బందిని కూడా కేటాయించారు. రైళ్లలో డెకాయ్ విభాగాలు ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు రైళ్లల్లో దోపీడీ దుండగలు ఆట కట్టేందుకు డెకాయ్ విభాగాలు ఏర్పాటు చేయాలని గుంతకల్ రైల్వే డివిజన్ ఎస్పీ ఎస్జే జనార్దన్ నిర్ణయించారు. ఈ డివిజన్ పరిధిలోని ఏడు జిల్లాల్లో కొత్తగా డెకాయ్ పార్టీలను నియమించారు. నెల్లూరు సబ్ డివిజన్లో చెన్నై మార్గంలో తడ, తిరుపతి మార్గంలో శ్రీకాళహస్తి వరకు, విజయవాడ మార్గంలో స్టూవర్ట్‌పురం వరకు ఈ డెకాయ్ పార్టీలను సమర్థవంతంగా నిర్వహించేలా నెల్లూరు రైల్వే డీఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్ చర్యలు చేపట్టారు. డెకాయ్ పార్టీలంటే.. రైళ్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది గస్తీతో సంబంధం లేకుండా కొన్ని రైళ్లలో పోలీసు అధికారులు ప్రత్యేకంగా కొందరు మహిళలు, పురుషులను ప్రయాణికుల్లా పంపుతారు. వారు అధికంగా బంగారు ఆభరణాలను ధరించి రైళ్లలో కిటికీల పక్కనే కూర్చుని ప్రయాణిస్తూ నేరస్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. వారితో పాటు సమీపంలో మరో ఇద్దరు ముగ్గురు సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు నిఘా ఉంచుతారు. నేరస్తుడు వారిని సాధారణ ప్రయాణికుల్లా భావించి నేరాలకు పాల్పడితే వారిని పట్టుకోవడం లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాల్చి వేస్తారు. ఓ వైపు రైళ్లలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, బ్యాగ్ లిఫ్టింగ్‌లకు పాల్పడిన పాత నేరస్తుల వేటలో ఉంటూ మరో వైపు కొందరు అదనపు సిబ్బందిని ఈ డెకాయ్ పార్టీలో సభ్యులుగా చేర్చారు. అదనపు సిబ్బంది రాకతో రాత్రి వేళల్లో అన్ని రైళ్లలో (స్పెషల్ రైళ్లతో పాటు) ఆయుధాలు కలిగిన పోలీసు అధికారులు, సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. ఓ వైపు గస్తీ నిర్వహిస్తూనే మరో వైపు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తూ, రైల్వే ఫ్లాట్‌ఫాంలపై తనిఖీలు నిర్వహించనున్నారు. భద్రత కల్పిస్తాం : డీఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్ ప్రయాణికులకు అన్ని విధాలా భద్రత కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం. కొత్తగా సిబ్బంది కేటాయింపుతో కొరత కూడా తీరింది. ఇటీవల బిట్రగుంటకు చెందిన పాత నేరస్తుడు (బ్యాగ్ లిప్టర్) అనిల్‌కుమార్‌ను అరెస్ట్ చేసి 250 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశాం. గూడూరు వద్ద మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పాతనేరస్తుడు (చైన్‌స్నాచర్)ను కూడా అరెస్ట్ చేశాం. రైళ్లలో ప్రయాణించే మహిళలు నేరాలు జరిగేందుకు ఆస్కారం ఇవ్వకూడదు. సహ ప్రయాణికులు ఇచ్చే కూల్‌డ్రింక్‌లు, తినుబండారాలు, మంచి నీటిని సైతం తిరస్కరించాలి. ప్రయాణికులను చైతన్య వంతులను చేయడం, అప్రమత్తం చేసే చర్యలతో పాటు రైలు పట్టాలు దాటేటప్పుడు, రైలు దిగేటప్పుడు తదితర సందర్భాల్లో జరిగే ప్రమాదాలపై మేము ప్రత్యేకంగా ఒక షార్ట్ ఫిల్మ్‌ను చిత్రీకరించాం. ప్రస్తుతం దాన్ని రైల్వేస్టేషన్లలో ఫ్లాట్‌ఫాంలపై ఉండే టీవీల్లో ప్రదర్శిస్తున్నాం. -
జల్సాల కోసం దొంగలయ్యారు
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: వారంతా స్నేహితులు..కూలీ, నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు..సంపాదించిన సొమ్ము జల్సాలకు, కుటుంబపోషణకు సరిపోక వక్రమార్గం పట్టారు..ఇటీవల కాలంలో అందరి నోళ్లలో నానుతున్న గొలుసు దొంగతనాల(చైన్ స్నాచింగ్)పై దృష్టిపెట్టారు. ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా ఎంచుకుని గొలుసు దొంగతనాలకు తెగబడ్డారు. అందు కోసం మూడు బైక్‌లను కూడా అపహరించారు. చోరీ చేసిన సొత్తును అమ్మి జల్సాగా తిరుగుతూ చివరకు పోలీసులకు చిక్కిపోయారు. అరెస్ట్ చేసిన నలుగురు నిందితులు, వారు చేసిన నేరాల వివరాలను ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు కిసాన్‌నగర్‌కు చెందిన పాత్రాలపాటి సువేకానంద, ఎన్టీఆర్నగర్ రాయపుపాళేనికి చెందిన ఎస్కే కరిముల్లా, నవాబుపేట లక్ష్మీపురానికి చెందిన మాణిక్యం మల్లికార్జున, కోటమిట్టకు చెందిన సయ్యద్ అంజాద్ స్నేహితులు. బేల్దారి పనులు చేసుకునే వీరు ఖాళీ సమయాల్లో ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలా సంపాదించిన సొత్తు జల్సాలు, కుటుంబపోషణకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలపై దృష్టిసారించారు. ఈ క్రమంలో ఇటీవల తరచూ చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్నాయని, బైక్‌లపై వెళుతూ మెడల్లోని గొలుసులను లాగేస్తున్నారని తెలుసుకుని, ఇలాంటి దొంగతనాలకు పాల్పడాలని నిర్ధారించుకున్నారు. అందులో భాగంగా మొదట ఇళ్ల ముందు నిలిపివున్న మూడు బైక్‌లను అపహరించారు. అనంతరం నెల్లూరు, కోవూరు, కొడవలూరు మండలం రేగడిచెలిక ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. నిందితులు ఈనెల 14వ తేదీ ఉదయం 9గంటలకు కోవూరు జాతీయరహదారి సమీపంలోని సాయిబాబాగుడి వద్ద వెళుతుండగా స్థానిక సీఐ మాణిక్యరావు ఆధ్వర్యంలో కోవూరు, కొడవలూరు ఎస్సైలు ఎం. గంగాధర్‌రావు, జగన్మోహన్ అరెస్ట్ చేశారు. విచారణలో పలు నేరాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. నేరాలు ఇవే.. చోరీల కోసం మొదట యమహా క్రక్స్, హోండా షైన్‌ను చోరీ చేశారు. గతేడాదిలో జనవరి 19న రేగడిచెలికలో ఎం.గోవిందమ్మ మెడలోని రెండున్నర సవర బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఏప్రిల్ 19న నెల్లూరు కుసుమదళితవాడలో ఒంటరిగా నడిచివెళుతున్న నంబారూ రత్నమ్మ మెడలోని రెండున్నర సవర్ల బంగారు గొలుసు, నవంబర్ 12న నెల్లూరు బ్యాంక్ కాలనీలో బండారు అంజలికుమారి మెడలోని రెండున్నర సవర్ల గొలుసు, అదేనెల 21న కోవూరు శాంతినగర్‌లో ఇండ్ల హైమావతి మెడలోని రెండు ముక్కాలు సవర్ల గొలుసు, డిసెంబర్ 11న కోవూరు శాంతినగర్‌లో వేలూరు ప్రవీణ మెడలోని ఆరు గ్రాముల గొలుసు, బాలాజీనగర్ నిర్మల్‌నగర్‌లోని చిట్టి ఇందిరాదేవి మెడలోని రెండు ముక్కాలు సవర గొలుసును లాక్కెళ్లారు. అదే నెల 17న కాపువీధిలో కాకుమాని విజయ మెడలోని రెండు ముక్కాలు సవర్ల గొలుసు, 24వ తేదీ నెల్లూరు వీఎంఆర్ నగర్లో మేటికాల నరసమ్మ మెడలోని ఆరు సవర్ల గొలుసు, ఈ ఏడాది జనవరి నాల్గో తేదీన కోవూరులోని ఆర్టీసీ జోనల్ వర్క్‌షాపు వద్ద దార్ల ఆదినారాయణకు చెందిన హోండా షైన్బైక్ను అపహరించారు. మొత్తంగా నిందితుల నుంచి రూ.4 లక్షల విలువచేసే 182 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షల విలువచేసే మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సస్పెక్టడ్ షీట్లు తెరవనున్నట్లు ఎస్పీ తెలిపారు. సిబ్బందికి రివార్డులు నిందితులను పట్టుకోవడానికి కృషిచేసిన నెల్లూరు రూరల్ డీఎస్పీ వీఎస్ రాంబాబు, కోవూరు సీఐ మాణిక్యరావు, కోవూరు, కొడవలూరు ఎస్సైలు గంగాధర్, జగన్మోహన్, ఐడీ పార్టీ సిబ్బంది ఐ.వెంకటేశ్వర్లు, ఏఎస్సై కె. సురేంద్ర, పి.వి.కృష్ణయ్య, పి.విజయప్రసాద్, షేక్ సిరాజ్, షేక్ రియాజ్, శ్రీనివాసులు, జి.ఓంకార్ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. -
నేరం..ఘోరం
సాక్షి, ఒంగోలు : జిల్లాలో ఈ ఏడాది రహదారులు రక్తంచిందాయి. వాహన ప్రమాదాలతో వందల మంది మృత్యువాతపడ్డారు. అదేస్థాయిలో గాయాలపాలయ్యారు. రైళ్లు సైతం ప్రయాణికులపై పగబట్టాయి. పట్టాలపై ఎంతోమందిని విగతజీవులుగా మార్చాయి. భారీ వర్షాలు కూడా ప్రజలను పొట్టనపెట్టుకున్నాయి. వరదల్లో చిక్కుకుని, వాగుల్లో గల్లంతై పలువురు ప్రాణాలు విడిచారు. ఈత సరదా..అనేకమంది చిన్నారులను బలితీసుకుంది. కేవలం ఈ నెలలోనే నలుగురు విద్యార్థుల ఉసురుతీసింది. 24వ తేదీ కందుకూరు మండలం మహదేవపురం పంచాయతీ పరిధిలోని మాల్యాద్రికాలనీలో చెందూరి సిద్ధార్థ (12) ఈతకు వెళ్లి కుంటలోపడి మృతిచెందగా, ఆ తర్వాతరోజే వలేటివారిపాలెం మండలం శ్యామీరపాలెంలో పాలడుగు వెంకటనాగరాజు (12), వంశీ (9)లు తూమలేరు వాగులోని కుంటలో ఈత కొట్టేందుకు దిగి మునిగిపోయి మరణించారు. అదేరోజు అద్దంకి మండలం వెంపరాల గ్రామంలో పదో తరగతి విద్యార్థి కంచర్ల రాంబాబు గుండ్లకమ్మలో ఈతకు వెళ్లి మృతిచెందాడు. ఇలాంటి సంఘటనలు ఇంకా అనేకం చోటుచేసుకున్నాయి. వీటితో పాటు మోసాలు, అపహరణలు, నగదు డిపాజిట్లు..అధిక వడ్డీల పేరుతో చీటింగ్‌లు, బైక్ చోరీలు, చైన్‌స్నాచింగ్‌లతో నేరగాళ్లు రెచ్చిపోయారు. జిల్లాలో సుమారు 10 ప్రైవేట్ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకుండా బోర్డులు తిప్పేశాయి. అగ్నిప్రమాదాల్లో 11 మంది మరణించగా, కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. 180 మందిని బలితీసుకున్న రైలు ప్రమాదాలు... జిల్లాలో ఈ ఏడాది జరిగిన రైలు ప్రమాదాల్లో మొత్తం 180 మంది మరణించారు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని కొంతమంది, రైలులో తలుపుల వద్ద కూర్చుని ప్రమాదవశాత్తూ పట్టాలపైపడి ఇంకొంతమంది, కదులుతున్న రైళ్లు ఎక్కబోయి మరికొంతమంది ప్రమాదాలకు గురయ్యారు. 71 మంది హతం... జిల్లాలో మానవత్వం మంటగలుస్తోంది. మనిషిని మనిషే చంపుకునే సంస్కృతి పెరిగిపోతోంది. ఈ ఏడాది జిల్లాలో 71 మంది హత్యకు గురికాగా, వారిలో 31 మంది మహిళలు ఉన్నారు. వివాహేతర సంబంధాలు, డబ్బుపై మోజు, పాతగొడవలు, అనుమానాలే అందుకు ప్రధాన కారణంగా ఉన్నాయి. 224 గృహహింస కేసులు.. 8 వరకట్న మరణాలు... జిల్లాలో ఈ ఏడాది 224 గృహహింస కేసులు నమోదు కాగా, 8 వరకట్న మరణాలు సంభవించాయి. ఇవన్నీ అధికారిక లెక్కల ప్రకార మే. కేసుల వరకూ రాని వేధింపులు కోకొల్లలుగా ఉన్నాయి. మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోంది. గృహహింస నివారణ, నిర్భయ చట్టాలు సైతం మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. భర్త, అత్తమామలే శత్రువులుగా మారుతున్నారు. రోడ్లపై అర్ధరాత్రి కాదుకదా..పట్టపగలు ఇళ్లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. నిత్యం ఏదోకచోట రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే మహిళలు చైన్‌స్నాచింగ్‌కు గురవుతున్నారు. ఈ ఏడాది కందుకూరు, ఒంగోలు ప్రాంతాల్లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయి పోలీసులకు సవాల్ విసిరారు. 219 గృహచోరీలు... జిల్లాలో గత జనవరి నుంచి ఇప్పటి వరకూ 219 గృహాల్లో చోరీలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదుకాని చిన్నాచితకా చోరీలు అనేకం ఉన్నాయి. ఇళ్లలోనే కాకుండా దుకాణాలు, బంకులు, షాపుల్లో 646 చోరీలు జరిగాయి. లక్షల రూపాయల్లో సొత్తు అపహరణకు గురైంది. ఇళ్లు, షాపులకు తాళాలువేసి రెండుమూడు రోజులు ఎక్కడికైనా టూర్ వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. చోరీలతో పాటు దోపిడీలూ జరుగుతున్నాయి. ఇళ్లలో పడి దాడిచేసి గాయపరిచి బెదిరించి మరీ దోచుకుంటున్నారు. మహిళలపై అఘాయిత్యాలూ అధికమే... మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి ఈ ఏడాది 34 కేసులు నమోదయ్యాయి. కేవలం మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి ఒంగోలు నగరంలోని జిల్లా జైలులో 72 మంది నిందితులు శిక్ష అనుభవిస్తున్నారంటే ఈ రకం నేరాలు జిల్లాలో ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. లైంగికదాడులకు గురైన అనేకమంది.. బయటకు తెలిస్తే భవిష్యత్తుకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయకపోవడంతో ఇంకా అనేక సంఘటనలు వెలుగులోకి రావడం లేదు. ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. రక్తం తాగుతున్న రహదారులు... ఈ ఏడాది జిల్లాలోని పలు రహదారులపై 1,463 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 445 మంది దుర్మరణం పాలయ్యారు. 500 మందికిపైగా తీవ్ర గాయాలకు గురయ్యారు. మద్యం సేవించి వాహనాలు నడపటం, అతివేగం ప్రధాన కారణాలు కాగా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం వల్ల కూడా అనేక వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది మృతిచెంది వారి కుటుంబాలు రోడ్డున పడుతుండగా, గాయాలపాలైన వారు వికలాంగులుగా మారుతున్నారు. జీవితాంతం నరకం అనుభవిస్తున్నారు. బోర్డు తిప్పేసిన సంస్థలు... జిల్లా ప్రజలు ఈ ఏడాది పెద్దఎత్తున బోగస్ సంస్థల బారినపడ్డారు. తాము దాచుకున్న మొత్తాన్ని కోల్పోయారు. మాయమాటలు చెప్పి సంస్థల్లో పెట్టుబడులు, డిపాజిట్లు చేయించుకున్న అనేక సంస్థలు బోర్డు తిప్పేసి ప్రజలను నిలువునా మోసం చేశాయి. ఈ ఏడాది జిల్లాలో అక్షర గోల్డ్, ఎన్‌మార్ట్, ప్రగతి, నక్షత్ర, ఆర్ఎంపీ, మైత్రీ, సంచయ ఇన్‌ఫ్రాలు బోర్డు తిప్పేశాయి. అదే విధంగా కోట్లాది రూపాయలకు కుచ్చుటోపీ పెట్టి చీటీల నిర్వాహకులు మొహంచాటేశారు. 59.30 శాతం రికవరీలు... చోరీలు, దోపిడీలు, మోసాలపై నమోదైన కేసులకు సంబంధించి ఈ ఏడాది జిల్లాలో 59.30 శాతాన్ని పోలీసులు రికవరీ చేశారు. గతంతో పోలిస్తే రికవరీ శాతం బాగానే ఉన్నప్పటికీ దొంగతనాలను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. -
ఈ ఏడాది పోలీస్ శాఖ కొన్ని మరకలను మూటగట్టుకొంది
కర్నూలు, న్యూస్‌లైన్: శాంతిభద్రతల పరిరక్షణలో ఈ ఏడాది పోలీస్ శాఖ కొన్ని మరకలను మూటగట్టుకొంది. ప్రధానంగా దోపిడీలు, చైన్‌స్నాచింగ్ వంటి నేరాలను అదుపు చేయలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. అయితే చోరీ సొమ్ము రికవరీలో మాత్రం రెండేళ్ల కంటే కాస్త ఊరట కల్పించారు. దొంగల పాలైన సొత్తు రూ.6.50 కోట్లు కాగా, రూ.4.50 కోట్లు రికవరీ చేశారు. రోడ్డు ప్రమాదాలు గతంలో మాదిరే ఈ ఏడాదీ పునరావృతమయ్యాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే వాటి సంఖ్య ఈ ఏడాది కాస్తతగ్గింది. రాజకీయ నాయకులతో కొంతమంది పోలీస్ అధికారులు సన్నిహిత సంబంధాలు పెంచుకున్నట్లు ఆరోపణలు వచ్చా యి. ముఖ్యంగా ఫ్యాక్షనిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన నిఘా విభాగాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న విమర్శలు లేకపోలేదు. సల్కాపురం సమీపంలో కోడుమూరుకు చెందిన ఎరుకలి రామాంజనేయులు, ఆయన కుమారుడు వెంకట్రాముడు, కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన సహకార సంఘం అధ్యక్షుడు ఆలం బాషా దారుణ హత్యలు పోలీసుల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేశాయి. క్రిష్ణగిరి సహకార బ్యాంకు సీఈఓ చిన్నసోమన్న అదృశ్యం కేసును ఇప్పటికీ ఛేదించలేకపోయారు. ఈ ఏడాదిలో ఆరునెలలపాటు ఎస్పీగా చంద్రశేఖర్ రెడ్డి పనిచేశారు. ఆయన తరువాత రఘరామిరెడ్డి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎస్పీ రఘురామి రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా రీపోలింగ్ జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్యాక్షనిస్టులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి సంబంధించిన సెల్ఫోన్లకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బందోబస్తును పర్యవేక్షించారు. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలైంది. ఉద్యమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెల్లెలు ఆస్తికి రక్షణగా ఉన్నాడన్న కోపంతో డోన్ మం డలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డిని బంధువు లే దారుణంగా హత్య చేశారు. కర్నూలు నుంచి చిన్నమల్కాపురం వెళ్తుండగా ఎర్రగుంట్ల బ్రిడ్జి వద్ద స్కార్పియో వాహనాన్ని అడ్డగించి కత్తులతో నరికి చంపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సల్కాపురం సమీపంలో జంట హత్యలు పోలీసు శాఖను కుదిపేశాయి. ఎరుకలి వెంకట్రాముడు, ఆయన కుమారుడు రామాంజనేయులు గూడూరు నుంచి కర్నూలు కోర్టుకు వెళ్తుండగా ప్రత్యర్థులు వెంబడించి దారుణంగా హత్య చేశారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి లభిస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక డోన్ పట్టణానికి చెందిన కడిమెట్ల కృష్ణ అలియాస్ కిట్టును ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. కిట్టు తండ్రి లక్ష్మన్న సహకార సంఘం ఎన్నికల్లో డోన్ ఒకటవ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి డెరైక్టర్‌గా పోటీ చేశారు. అధికార పార్టీ నాయకులకు మింగుడుపడక కిరాయి హంతకుల చేత హత్య చేయించారు. అవుకు మండలం గుండ్ల శింగవరం సబ్‌స్టేషన్ వద్ద తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆలమూరు రాముడు, బనగానపల్లె మద్దిలేటి, ఇమ్రాన్, ఆటోడ్రైవర్ మొదీన్ బాషా మృతిచెందారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ముద్ర ఉన్న నేరస్తులపై ఎస్పీ రఘురాం రెడ్డి కఠినంగా వ్యవహరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడ్డారనే కారణంపై కప్పట్రాళ్ల మద్దిలేటి నాయుడు, మరికొంతమంది అనుచరులను పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. కర్నూలు కేంద్రంగా పెద్ద ఎత్తున పేకాట జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు బుధవారపేటకు చెంది న మట్కాడాన్ స్థావరంపై దాడి చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 58 మందిని అదుపులోకి తీసుకుని రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రఘురాం రెడ్డి జిల్లాలో ‘మీతో మీ ఎస్పీ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు శాంతిభద్రతల పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చెప్పుకునే అవకాశం కల్పించారు. కొంతమంది సిబ్బంది దీని నీరుగారుస్తున్నారు. అయ్యలూరు గ్రామానికి చెందిన న్యాయవాది సర్వేశ్వరరెడ్డికి, గంగవరం గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డికి మధ్య ఉన్న పొలం తగాదా కారణంగా కోర్టుకు వెళ్లి వస్తున్న సర్వేశ్వరరెడ్డి వాహనాన్ని జీపుతో ఢీకొట్టి వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. నిరుద్యోగ యువత ఫ్యాక్షన్ బారిన పడకుండా ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో ఫ్యాక్షన్ విస్తరించడానికియువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడమేనని గుర్తించారు. కృష్ణపట్నం పోర్టులో సెక్యూరిటీ ఉద్యోగాల ఎంపికకు చర్యలు తీసుకున్నారు. పోలీసు శాఖపై అధికార పార్టీ పెత్తనంపై కఠినంగా వ్యవహరిం చిన ఎస్పీ రఘురామి రెడ్డిని హైదరాబాదు సౌత్‌జోన్ డీసీపీగా బదిలీ చేసి శంషాబాద్ డీసీపీగా ఉన్న రమేష్‌నాయుడును నియమి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిం చారంటూ ఎస్పీ క్యాట్‌ను ఆశ్రయించి తాత్కాలికంగా నిలుపుదల చేయించుకున్నారు. క్రికెట్ బెట్టింగ్, జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చడానికి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడి ఇంజనీరింగ్ విద్యార్థులు హకీం సమీర్, జయసూర్య సింహారెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు కటాకటాలపాలయ్యారు. గుప్త నిధుల వేటలో రంగారెడ్డి జిల్లా పాల్మాకుల గ్రామానికి చెందిన బుర్ర నాగరాజు, రమాదేవి మృత్యు ఒడి చేరారు. డోన్ మండలం వెంకటాపురం బొంతిరాళ్ల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జీవితంలో ఒకేసారి ధనవంతులమైపోదామన్న దురాశతో తమ జీవితాలనే బలి తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోలీస్ దర్బార్ సొంతశాఖ సిబ్బంది సమస్యలపై ఎస్పీ రఘురామిరెడ్డి దృష్టి సారించారు. జిల్లా కేంద్రంతో పాటు సబ్ డివిజన్ స్థాయిలో పోలీసు దర్బార్ నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించేవారితో పాటు అవినీతికి పాల్పడేవారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సొంత శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఖాళీలను బట్టి అడిగిన చోటుకే పోస్టింగ్‌లు ఇస్తూ పైరవీలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. -
చైన్ స్నాచింగ్ కేసుల్లో ముగ్గురి అరెస్టు
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : మహిళల మెడలోంచి బంగారు పు స్తెల తాళ్లు, గొలుసులు దొంగతనానికి పా ల్పడిన ముగ్గురు యువకులను పట్టణ పో లీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. శనివారం స్థానిక పట్టణ పో లీస్‌స్టేషన్‌లో నిందితులను విలేకరుల ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. సంగారెడ్డి పట్టణంలోని మంజీరా నగర్, ప్రశాంత్ నగర్, బృందావన్ కాలనీ, నాగార్జున కాలే జ్ రోడ్డులో, పోతిరెడ్డిపల్లి, కంది గ్రామా ల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడల్లోంచి పలు సందర్భాల్లో ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడకు చెందిన షేక్ అంజద్ , కుమ్మరి శ్రీకాంత్, గుంటూరు మురళీవరప్రసాద్, రాజేష్ కుమార్‌లు దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు. శుక్రవారం పట్టణంలో మార్కెట్ సందర్భంగా నిందితులు స్నాచింగ్‌కు పాల్పడుతుండగా.. తాను క్రైం పార్టీ హెడ్‌కానిస్టేబుల్ ఏ శ్రీనివాస్‌రెడ్డి, కానిస్టేబుల్ నర్సింలు, ఎజాజ్గౌరి, అసద్ అలీ, అశోక్‌లు పట్టుకున్నామన్నా రు. వీరి నుంచి 13 తులాల బంగారు పుసె ్తల తాళ్లు, రెండు గొలుసులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణంలో కా గా నిందితుల్లో రాజేష్‌కుమార్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. జల్సాలకు, వ్యసనాలకు అలవాటు పడి యువకులు పెడతోవ పడుతున్నారన్నారు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.