భార్య కోరికలు తీర్చడం కోసం కొత్త పెళ్లి కొడుకు తిప్పలు | Pune Newlywed Food Delivery Boy Takes To Chain Snatching | Sakshi
Sakshi News home page

భార్య కోరికలు తీర్చడం కోసం కొత్త పెళ్లి కొడుకు తిప్పలు

Published Mon, Jul 12 2021 6:25 PM | Last Updated on Mon, Jul 12 2021 6:32 PM

Pune Newlywed Food Delivery Boy Takes To Chain Snatching - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై: కొత్తగా పెళ్లైంది. భార్యను బాగా చూసుకోవాలనుకున్నాడు. ఆమె ఏం కోరితే అది తెచ్చి భార్యకివ్వాలనుకున్నాడు. కానీ వాస్తవంగా పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. చేసేదేమో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఉద్యోగం. ఆ సంపాదనతో భార్య కోరికలు తీర్చడం కష్టం అని భావించి చైన్‌ స్నాచర్‌గా మారాడు. కట్‌ చేస్తే పోలీసులకు చిక్కి కటకటాల్లో చేరాడు. ఈ సంఘటన మహారాష్ట్ర పుణెలో చోటు చేసుకుంది. 

ఆ వివరాలు.. పుణె వాకడ్‌ ప్రాంతానికి యాదవ్‌ అనే వ్యక్తి ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అతడికి వివాహం అయ్యింది. కొత్తగా పెళ్లైంది.. ఇక భార్య గోముగా తన కోరికల చిట్టా విప్పడంతో యాదవ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఫుడ్‌ డెలవరీ బాయ్‌గా తనకు వచ్చే జీతంతో భార్య కోరికలు తీర్చలేనని అర్థం అయ్యింది. ఈ క్రమంలో ప్రవృత్తిగా చైన్‌ స్నాచింగ్‌ను ఎంచుకున్నాడు. రంగంలోకి దిగడానికి ముందు నెట్టింట్లో పలు చైన్‌ స్నాచింగ్‌ వీడియోలను నిశితంగా పరిశీలించాడు. ఆ తర్వాత రంగంలోకి దిగాడు యాదవ్‌. 

ఇక చైన్‌ స్నాచింగ్‌ చేయడం కోసం యాదవ్‌ రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకునేవాడు. పోలీసులకు చిక్కే వరకు ఏడు ప్రాంతాల్లో చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడి.. సుమారు 121 గ్రాముల బంగారం.. రెండు బైక్‌లు దొంగిలించాడు. ఈ క్రమంలో ఆదివారం వాకడే ప్రాంతాన్ని తన టార్గెట్‌గా ఎంచుకున్నాడు యాదవ్‌. ఆ ప్రాంతంలో రెక్కి నిర్వహించసాగాడు. అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు యాదవ్‌ కదలికల్లో తేడా కొట్టింది. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. యాదవ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement