టీవీల్లో చూసి.. చైన్‌స్నాచింగ్‌లు | 93 crimes .. 3.10 kg of gold theft | Sakshi
Sakshi News home page

టీవీల్లో చూసి.. చైన్‌స్నాచింగ్‌లు

Published Tue, Sep 15 2015 2:19 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

టీవీల్లో చూసి.. చైన్‌స్నాచింగ్‌లు - Sakshi

టీవీల్లో చూసి.. చైన్‌స్నాచింగ్‌లు

* పోలీసులకు పట్టుబడిన భార్యాభర్తలు
* 93 నేరాలు.. 3.10 కిలో బంగారం చోరీ

వరంగల్ క్రైం: ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో బంగారు గొలుసులు లాక్కొని వెళ్లే అంతరాష్ట్ర భార్యాభర్తల దొంగల ముఠాను ఆదివారంరాత్రి వరంగల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 82 లక్షల విలువ చేసే 3.10 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరంగల్ జిల్లా హన్మకొండలోని హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు ఈ వివరాలు వెల్లడించారు.

ఖమ్మం జిల్లా ఇల్లెందు సింగరేణి కాలనీకి చెందిన బానోతు రవి ఖమ్మంలో కారు నడుపుతుండేవాడు. వరంగల్ ఉర్సుగుట్ట ప్రాంతానికి చెందిన డీ-ఫార్మసీ విద్యార్థిని ఎర్రం రాజేశ్వరితో రవికి పరిచయం అరుుంది. ఇద్దరూ   ప్రేమించుకొని, పెళ్లి చేసుకుని వరంగల్ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేటలో ఉంటున్నారు. కారు నడపడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో దానిని విక్రరుుంచాడు.

అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యూరుు. రోజూ టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే నేర కథననాలకు ఆకర్షితుడైన రవి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి డబ్బు సులువుగా సం పాదించ వచ్చని భావించాడు. 2013 ఫిబ్రవరిలో హంటర్‌రోడ్డులో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లాడు. అక్కడి నుంచి  చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. దీనికి ఆయనకు భార్య రాజేశ్వరి సహకరించింది.
 
నిర్మానుష్య ప్రాంతాల్లో దంపతుల రెక్కీ..
నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో రాజేశ్వరి రెక్కి వేసి నిందితుడు రవికి సమాచారం అందించేది. దీంతో రవి ద్విచక్రవాహనంపై బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళల కోసం కాపుకాచి, అవకాశం చూసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇదే తరహాలో దంపతులిద్దరూ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో కలిపి సుమారు 93 చైన్‌స్నాచింగ్‌లు చేశారు.

ఆదివారం రాత్రి హంటర్‌రోడ్డులో క్రైమ్, మిల్స్‌కాలనీ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో నిందితులిద్దరూ తాము చోరీచేసిన బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లో అమ్మేం దుకుగాను ద్విచక్రవాహనంపై ఉర్సుగుట్ట నుంచి హన్మకొండ బస్టాండ్ వైపు వస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వారి వద్ద  బంగారు ఆభరణాలు కనపడడంతో దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. తాము మూడేళ్లుగా వరంగల్ కమిషనరేట్‌తో పరిధితోపాటు ఇతర జిల్లాలో పాల్పడిన నేరాలు అంగీకరించడంతో పోలీసులు వీరి వద్ద చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు.
 
నేరాల చిట్టా ఇదీ..: సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో 24 నేరాలు, హన్మకొండ-14, మిల్స్‌కాలనీ-11, మట్టెవాడ-10, కేయూసీ-6, కాజీపేట-5, ఇంతెజార్‌గంజ్-3, స్టేషన్‌ఘన్‌పూర్-2, వర్ధన్నపేట, రాయపర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలలో ఒక్కొక్క చైన్‌స్నాచింగ్ చేశారు. నేరస్తులను అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ కనపరిచిన క్రైమ్ ఏసీపీ ఈశ్వర్‌రావు బృందాన్ని కమిషనర్ అభినందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement