Gold chains
-
స్వామీజీ కార్యక్రమంలో భారీ చోరీ.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం..
ముంబై: స్వయంప్రకటిత స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భారీ చోరీ జరిగింది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు మీరా రోడ్‌లోని సలసార్ సెంట్రల్ పార్కు గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ నిర్వహించారు. స్వామీజీ ఆశీర్వాదం కోసం దాదాపు రెండు లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. ఆయితే నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇక్కడ దాదాపు తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. వేలమంది భక్తులు మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది. సరిగ్గా ఈ సమయంలోనే భక్తుల మెడలో ఉన్న బంగారు గొలుసులు మాయమయ్యాయి. మొత్తం 36 మంది బాధితులు తమ బంగారు ఆభరణాలను ఎవరో దొంగిలించారని లబో దిబోమన్నారు. స్వామీజీ కార్యక్రమంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన మెడలో మంగళసూత్రం కూడా పోయిందని ఓ మహిళా భక్తురాలు కన్నీటిపర్యంతమైంది. స్వామీజీ రోగాలను నయం చేస్తారని ఫోన్లో వీడియోలు చూసి ఇక్కడకు వెళ్లినట్లు చెప్పింది. తన రెండేళ్ల బిడ్డ ఆరోగ్యం బాగాలేదని, స్వామీజీ దగ్గరకు తీసుకెళ్తే నయం చేస్తారని కార్యక్రామానికి వచ్చినట్లు పేర్కొంది. కానీ తోపులాట జరిగి మంగళసూత్రం పోగొట్టుకోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమైంది. కాగా.. కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఒక్కరు మాత్రమే గాయపడ్డారు. బంగారు ఆభరణాలు పోయినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. శాంతాబెన్ మిథాలాల్ జైన్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని మూఢనమ్మకాల వ్యతిరేక సంస్థలు వ్యతిరేకించాయి. ఈ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ పోలీసులకు శుక్రవారం మెమోరాండం కూడా సమర్పించాయి. చదవండి: నీట్‌గా స్కెచ్ వేశాడు.. నకిలీ పత్రాలతో బ్యాంకులోకి వెళ్లి -
మరోమారు పెద్దమనసు చాటుకున్న విశాల్.. వారందరికీ బంగారు చైన్లు
సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న తన అభిమాన సంఘాల నిర్వాహకులను ప్రోత్సహించేలా నటుడు విశాల్, వారికి బంగా రు చైన్లు బహూకరించారు. విశాల్ ప్రజా సంక్షేమ సంఘం తరఫున రాష్ట్రవ్యాప్తంగా నిర్వాహకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వి షయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల స్థానిక మాధవరంలో తిరువళ్లూరు జిల్లాకు చెందిన విశాల్ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు కన్నన్, చెన్నై విశాల్ ప్రజా సంఘం ప్రజాసంక్షేమ సంఘం కార్యదర్శి హరికుమార్ ఆధ్వర్యంలో 11 పేద జంటల ఉచిత వివాహం జరిపించారు. కాగా ఇలా రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తన సంఘం జిల్లా అధ్యక్షులను మరింత ప్రోత్సహించేలా నటుడు విశాల్ వారికి బంగారు చైన్లను బహూకరించా రు. బుధవారం చెన్నైలో జరిగిన ఈ వేడుకల్లో తిరువళ్లూరు జిల్లా విశాల్ ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు కన్నన్, చెన్నై జిల్లా అధ్యక్షుడు రాబర్ట్, యువజన విభాగం అధ్యక్షుడు గురువాయూర్, ఉత్తర చెన్నై సంఘం అధ్యక్షుడు శీ ను, రాయపురం సంఘం అధ్యక్షుడు అన్బు, జి ల్లా కార్యదర్శి యువరాజ్ తదితరులకు విశాల్ బంగారు చైన్లను కానుకగా ఇచ్చారు. అంతకుముందు విశాల్ ప్రజా సంక్షేమ సంఘాల నిర్వాహకులు ఆయన్ని సత్కరించారు. చదవండి: (విశాల్‌తో ప్రేమలో నటి అభినయ.. త్వరలో పెళ్లి కూడా?) -
బప్పి లహరికి బంగారం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా?
Why Bappi Lahiri Used To Wear So Much Gold: అలోకేశ్ లహిరి అలియాస్ బప్పి లహరి.. బాలీవుడ్‌కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన లెజెండరీ సింగర్. సంగీత ప్రపంచంలో బప్పీలహరి స్టైల్ ప్రత్యేకం. తన గానంతో మెస్మరైజ్ చేసిన బప్పీలహరి పాటలతోనే కాకుండా ప్రత్యేకమైన ఆహార్యంతోనూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. చేతికి గోల్డ్ రింగ్స్, నల్లని కళ్లద్దాలు, మెడలో కిలోల కొద్దీ బంగారు గొలుసులు.. అసలు ఆయన నడిచొస్తుంటే బంగారమే కదిలొస్తున్నట్లు కనిపించేది. ఇదే ఆయనకు మరింత ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. బంగారం లేకుండా అసలు బప్పీలహరిని ఊహించుకోలేం. బప్పిలహరికి బంగారంపై ఎందుకంత ప్రేమ అంటే.. వయసు దాటినా ఎప్పుడూ తరగని ఉత్సాహం, చెరగని చిరునవ్వుతో కనిపించే బప్పీలహరి బంగారం లేకుండా అసలు కనిపించేవారు కాదు. ఆయనకు బంగారం అంటే అంత ఇష్టం మరి. `గోల్డ్ ఈజ్ మై గాడ్` అంటుండేవారాయన. ఆయన మెడలో ఎప్పుడూ బంగారు ఆభరణాలు మెరుస్తూ ఉండేవి. దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఓ హాలీవుడ్ పాప్ సింగర్‌ను చూశాక తనకు బంగారం మీద ప్రేమ పెరిగిందనీ, అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందనీ చెప్పేవారు. 'ఓ సాంగ్ రికార్డింగ్ సమయంలో దేవుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ని మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది. పెళ్లయ్యాక కూడా నా భార్య ఓ గణపతి లాకెట్ కూడిన బంగారు గొలుసును ఇచ్చింది. నా మెడలోని గణపతి నన్ను ఎప్పుడూ సరక్షితంగా ఉంచుతుంది అని నమ్ముతాను. అంతేకాకుండా నా కెరీర్ ఎదుగుతున్న కొద్దీ నా బంగారం మరింత రెట్టింపయ్యింది' అని పేర్కొన్నారు. -
బంగారు చెయిన్లు గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దన్న (అన్నాత్తె) సినిమాతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తనకింత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు శివకు ఆ మధ్య బంగారు చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన రజనీ తాజాగా పెద్దన్న టీమ్ సభ్యులందరికీ విలువైన కానుకలిచ్చాడు. ఈ సినిమా రిలీజై 50 రోజులైన సందర్భంగా అన్నాత్తె మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్యుయేల్‌తో పాటు ప్రధాన టెక్నీషియన్లందరికీ బంగారు చెయిన్లను బహుమతిగా అందించాడు. రజనీకాంత్ తమ శ్రమను గుర్తించి సర్ప్రైజ్ గిఫ్ట్‌లు పంపడంపై తెర వెనుక పనిచేసిన టెక్నీషియన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా రజనీకాంత్, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్లో వచ్చిన ‘అన్నాత్తై’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీ సరసన నయనతార హీరోయిన్గా నటించగా కీర్తి సురేశ్ సోదరి పాత్రలో కనిపించింది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగులో పెద్ద హిట్ కాకపోయినప్పటికీ తమిళంలో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది. Such a sweet gesture from Our Superstar @rajinikanth Ayya! To honour the chief technicians of Annaatthe with a Gold chain! His special mention about every craftsmanship was so obliging! Thanks to Siva Sir and @sunpictures Kalanithi Maran Sir! A Memorable Day! Praise God! pic.twitter.com/DvGzsF5Jg2 — D.IMMAN (@immancomposer) December 23, 2021 -
బాబు బాగా రిచ్.. జుట్టు కోసం 14 కోట్లు ఖర్చు
పడమటి దేశాల్లో కొందరు బంగారంలాంటి జుట్టు అంటే మోజుపడతారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం బంగారంతోనే జుట్టు ఉండాలని అనుకున్నాడు. అనుకోవడమే కాదు. దానిని నిజం కూడా చేసుకున్నాడు. సుమారు రెండు మిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో రూ.14 కోట్లు ఖర్చు చేసి తన తలపైభాగం మొత్తం వివిధ బంగారు గొలుసులతో అమర్చుకున్నాడు. అయితే, వీటిని శాశ్వతంగా లేక తాత్కాలికంగా అమర్చుకున్నాడో చెప్పలేదు. కానీ, తన బంగారు జుట్టు కలను మాత్రం నిజం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఈ మధ్యనే సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. ఇంతటి విచిత్ర సాహసాన్ని చేసిన అతడెవరో కాదు. ప్రముఖ మెక్సికన్ ర్యాపర్ డాన్ సుర్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కొంతమంది నెటిజన్లు ‘అతని జుట్టు పీకితేచాలు లైఫ్ సెట్’, ‘గోల్డన్ స్కల్’ అంటూ ఫన్నీ కామెంట్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. -
నగరంలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
హైదరాబాద్: నగరంలో చైన్‌స్నాచర్లు మరోఎసారి రెచ్చిపోయారు. సోమవారం ఉదయం ఒక్క వనస్థలిపురం పరిధిలోనే మూడు చోట్ల ముగ్గురు మహిళల నుంచి 12.5 తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఎన్జీఓస్ కాలనీలో అలివేలు మంగమ్మ అనే మహిళ మెడలోని ఐదున్నర తులాల బంగారు గొలుసు, కుసుమకుమారి అనే మహిళ మెడలో మూడున్నర తులాల బంగారు గొలుసు, హుడాసాయినగర్ కాలనీలో కృష్ణవేణి అనే మహిళ మెడలో 4 తులాల బంగారు గొలుసులను బైక్‌లపై వచ్చిన దుండగులు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
విమానాల్లో వచ్చి ‘టకీ’మని చోరీలు..!
-
విమానాల్లో వచ్చి ‘టకీ’మని చోరీలు..!
సాక్షి, హైదరాబాద్: అతడు చదివింది మూడో తరగతి వరకే.. చదువు అబ్బకపోవడంతో రోడ్డుపక్కన కళ్లద్దాలు అమ్మాడు.. రెండు పెళ్లిళ్లు.. ఆర్థిక ఇబ్బందులు.. అప్పులు.. అన్నీ నెత్తినపడటంతో ఈజీ మనీపై కన్నేసి దొంగతనాల బాట పట్టాడు. ఇప్పుడు చోరీలు చేసేందుకు విమానాల్లోనే చక్కర్లు కొడుతున్నాడు. సైబరాబాద్ పోలీసులకు చిక్కిన ఇరానీ గ్యాంగ్ నాయకుడు టకీ అలీ నేపథ్యం ఇదీ. టకీకి సోదరుడైన సల్మాన్ బంగారు గొలుసులు లాగడంలో మాత్రం దిట్ట. లగ్జరీ లైఫ్ కోసం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన టకీ అలీ, సల్మాన్ అలీ తండ్రి ఒక్కరే సర్దార్ యూసుఫ్ అలీ. అయితే తల్లులు మాత్రం వేరు. యూసుఫ్ అలీకి ముగ్గురు భార్యలు, 18 మంది పిల్లలు. రెండో భార్య కశ్మీరీ బేగంకు టకీ అలీ నాలుగో కుమారుడు. బీదర్‌లోని సలాభాను ప్రైమరీ స్కూల్లో మూడో తరగతి వరకు చదువుకున్నాడు. చదువుపై ఇష్టంలేక రోడ్లపక్క కళ్లద్దాలు విక్రయించేవాడు. ముంబైలోని యాంబీవాలీకి చెందిన ఫిజాని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మహమ్మూద్(9) అనే కుమారుడు ఉన్నాడు. 2008లో సుకైనాని రెండో పెళ్లి చేసుకున్నాడు. పెద్ద కుటుంబం కావడం, లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడటంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో సన్నిహితుల వద్ద అప్పులు చేశాడు. వీటిని తీర్చలేక నేరాలబాట పట్టాడు. అందరూ బంధువులే.. సల్మాన్ అలీతో కలసి 2008లో ముఠాగా ఏర్పడ్డారు. వీరికి మరో ఏడుగురు తోడయ్యారు. వీరంతా దగ్గరి బంధువులే. బైక్ నడపడంలో సిద్ధహస్తులైన టకీ, సల్మాన్ తొలుత ఢిల్లీ, బెంగళూరుల్లో అటెన్షన్ డైవర్షన్, చైన్ స్నాచింగ్ చేశారు. బీదర్‌లో స్నూకర్ బిజినెస్ చేస్తున్న రాధే, గులామ్, అబ్బాస్, మెందిని కూడా తనవైపునకు తిప్పుకున్నాడు. వీరు చోరీలు చేయాలనుకునే నగరాలకు ముందుగానే వెళ్లి అక్కడ బైక్‌లను దొంగతనం చేసి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో పార్క్ చేసి టకీ, సల్మాన్‌లకు సమాచారం ఇచ్చేవారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ విమానాల్లో అక్కడికి చేరుకుని ఒక్క రోజులోనే ఏడెనిమిది స్నాచింగ్‌లు చేసి బైక్‌లను వదిలేసి వెళ్లిపోయేవారు. హైదరాబాద్‌లో 2012 నుంచి జంట పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 189 చోరీలకు పాల్పడ్డారు. అబూబకర్‌కు స్నేహితులు.. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులకు 4 నెలల క్రితం చిక్కిన అబూబకర్‌కు టకీ, సల్మాన్ స్నేహితులు. మరో ముఠా నాయకుడైన అబూబకర్‌ను కలిసేందుకు టకీ వస్తున్నాడన్న సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు అక్కడికెళ్లారు. అయితే అప్పటికే అబూబకర్‌ను హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో టకీ అక్కడికి రాలేదు. చివరకు టకీ గ్యాంగ్ సభ్యులు వాడిన సెల్‌ఫోన్ ఆధారంగా అతడి కొత్త నంబర్‌ను కనుగొన్న పోలీసులు అతడిని పట్టుకునేందుకు నెల క్రితం ఢిల్లీ వెళ్లారు. ఓ షాపింగ్ మాల్ కారు పార్కింగ్‌లో వాహనం ఎక్కుతున్న టకీని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి.. కారు నంబర్ ఆధారంగా అతడు ఉంటున్న ప్రాంతానికి వెళ్లి అక్కడి అపార్ట్మెంట్ యజమాని సహకారంతో టకీని పట్టుకున్నారు. ఆ తర్వాత జైపూర్‌లో స్నాచింగ్‌కు వస్తున్నానని టకీతోనే చెప్పించి సల్మాన్‌ని రప్పించి అరెస్ట్ చేశారు. తర్వాత వారిద్దరిని ప్రత్యేక వాహనంలో నగరానికి తీసుకొచ్చారు. వీరిని పీటీ వారంట్‌పై తీసుకునేందుకు నగర పోలీసులు సిద్ధమవుతున్నారు. -
టీవీల్లో చూసి.. చైన్‌స్నాచింగ్‌లు
* పోలీసులకు పట్టుబడిన భార్యాభర్తలు * 93 నేరాలు.. 3.10 కిలో బంగారం చోరీ వరంగల్ క్రైం: ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో బంగారు గొలుసులు లాక్కొని వెళ్లే అంతరాష్ట్ర భార్యాభర్తల దొంగల ముఠాను ఆదివారంరాత్రి వరంగల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 82 లక్షల విలువ చేసే 3.10 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వరంగల్ జిల్లా హన్మకొండలోని హెడ్‌క్వార్టర్స్‌లో పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు ఈ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు సింగరేణి కాలనీకి చెందిన బానోతు రవి ఖమ్మంలో కారు నడుపుతుండేవాడు. వరంగల్ ఉర్సుగుట్ట ప్రాంతానికి చెందిన డీ-ఫార్మసీ విద్యార్థిని ఎర్రం రాజేశ్వరితో రవికి పరిచయం అరుుంది. ఇద్దరూ ప్రేమించుకొని, పెళ్లి చేసుకుని వరంగల్ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేటలో ఉంటున్నారు. కారు నడపడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో దానిని విక్రరుుంచాడు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యూరుు. రోజూ టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే నేర కథననాలకు ఆకర్షితుడైన రవి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి డబ్బు సులువుగా సం పాదించ వచ్చని భావించాడు. 2013 ఫిబ్రవరిలో హంటర్‌రోడ్డులో ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లాడు. అక్కడి నుంచి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. దీనికి ఆయనకు భార్య రాజేశ్వరి సహకరించింది. నిర్మానుష్య ప్రాంతాల్లో దంపతుల రెక్కీ.. నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో రాజేశ్వరి రెక్కి వేసి నిందితుడు రవికి సమాచారం అందించేది. దీంతో రవి ద్విచక్రవాహనంపై బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళల కోసం కాపుకాచి, అవకాశం చూసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇదే తరహాలో దంపతులిద్దరూ వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో కలిపి సుమారు 93 చైన్‌స్నాచింగ్‌లు చేశారు. ఆదివారం రాత్రి హంటర్‌రోడ్డులో క్రైమ్, మిల్స్‌కాలనీ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో నిందితులిద్దరూ తాము చోరీచేసిన బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లో అమ్మేం దుకుగాను ద్విచక్రవాహనంపై ఉర్సుగుట్ట నుంచి హన్మకొండ బస్టాండ్ వైపు వస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో వారి వద్ద బంగారు ఆభరణాలు కనపడడంతో దంపతులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. తాము మూడేళ్లుగా వరంగల్ కమిషనరేట్‌తో పరిధితోపాటు ఇతర జిల్లాలో పాల్పడిన నేరాలు అంగీకరించడంతో పోలీసులు వీరి వద్ద చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరాల చిట్టా ఇదీ..: సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో 24 నేరాలు, హన్మకొండ-14, మిల్స్‌కాలనీ-11, మట్టెవాడ-10, కేయూసీ-6, కాజీపేట-5, ఇంతెజార్గంజ్-3, స్టేషన్‌ఘన్‌పూర్-2, వర్ధన్నపేట, రాయపర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలలో ఒక్కొక్క చైన్‌స్నాచింగ్ చేశారు. నేరస్తులను అదుపులోకి తీసుకోవడంలో ప్రతిభ కనపరిచిన క్రైమ్ ఏసీపీ ఈశ్వర్రావు బృందాన్ని కమిషనర్ అభినందించారు. -
వృద్ధురాలిపై దాడి... బంగారం దోపిడీ
ప్రొద్దుటూరు : బీరువాలు తయారు చేసే వ్యక్తిలా ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు వృద్ధురాలిపై దాడి చేసి రెండు బంగారు చైన్లను లాక్కుని పరారయ్యాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శుక్రవారం ఉదయం జరిగింది. స్థానికంగా వసంతగడ్డలో సరోజమ్మ(75) ఇంటికి శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. తాను బీరువాలు తయారు చేస్తానని, రిపేర్ ఉందా అంటూ సరోజమ్మను ప్రశ్నించాడు. అవసరం లేదని చెప్పేలోపలే దుండగుడు ఆమె తలపై బలంగా కొట్టాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యాడు. గాయపడ్డ సరోజమ్మ కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెలరేగిన చైన్ స్నాచర్లు
బెంగళూరు : కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే బెంగళూరు చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కొని ఉడాయించారు. మంగళవారం సాయంత్రం ఆరు నుంచి 6.40 గంటల్లోపు చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా.... సిగ్నల్‌లో : హెచ్ఎస్ఆర్ లేఔట్‌కు చెందిన లెజీనా అనే మహిళ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు కారులో సిల్క్ బోర్డు మీదుగా బయలుదేరారు. సిల్క్‌బోర్డు జంక్షన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్‌లో కారు అద్దం తీసి వేచి ఉన్నారు. ఆ సమయంలో బైక్‌లో అటుగా వచ్చిన ఇద్దరు కారులో ఉన్న ఆమె మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఇంటికి వెలుతుంటే : హెచ్ఆర్బీఆర్ లేఔట్లో నివాసం ఉంటున్న భారతి అనే మహిళ ఏజీఎస్ అనే కార్యాలయంలో పని చేస్తున్నారు. ఈమె మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యలో హెచ్ఆర్బీఆర్ లేఔట్లో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలో ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు లాక్కోని పరారైనారు. ఇంటి ముందు నిలబడి ఉంటే : త్యాగరాజనగరలోని శాస్త్రినగరలో పద్మావతి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి ముందు నిలబడి ఉన్నారు. ఆ సమయంలో బైక్‌లో వెళ్లిన ఇద్దరు నిందితులు అడ్రస్ అడిగే నెపంతో పద్మావతి మెడలో ఉన్న 60 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. విద్యుత్ బిల్లు కట్టి వెలుతుంటే : చిక్కమారనహళ్ళికి చెందిన కోమల మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు తన ఇంటి సమీపంలోని బెంగళూరు ఒన్ కేంద్రంలో విద్యుత్ బిల్లు కట్టి తిరుగు ప్రయానమయ్యారు. మార్గ మధ్యలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 45 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. పక్కింటి మహిళతో మాట్లాడుతుంటే : కుమారస్వామి లేఔట్‌లోని హర్ష లేఔట్‌కు చెందిన శారద, మంగళవారం సాయంత్రం 6.40 గంటలకు తన పక్కింటి మహిళతో మాట్లాడుకుంటుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె మెడలోని 65 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాచు. ఈ ఘటనలపై మడివాళ, హెణ్ణూరు, బెంగళూరు సెంట్రల్, త్యాగరాజనగర, కుమారస్వామి లేఔట్లో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం కూడా... విజయనగర సమీపంలోని గోవిందరాజనగరకు చెందిన ఈశ్వరీ బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు తన ఇంటి ముందు నిలబడి ఉండగా బ్లాక్ పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమెను పలకరించి, అడ్రస్ అడిగే నెపంతో సమీపించారు. ఆమె తనకు తెలియదు అని చెప్పే లోపు ఆమె మెడలో ఉన్న 45 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనలో ఈశ్వరీ కిందపడడంతో ఆమె గాయాలయ్యాయి. ప్రశాంత నగర్లోనూ ఉషా అనే మహిళ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తన ఇంటి నిలబడి స్నేహితురాలితో మాట్లాడుతుండగా బ్లాక్ పల్సర్‌పై వచ్చిన ఇద్దరు అడ్రస్ అడిగే నెపంతో ఆమె మెడలోని 70 గ్రాముల బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసినట్లు విజయనగర పోలీసులు తెలిపారు. -
నకిరెకల్లో రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్లు
చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ శృతిమించుతోంది. మహిళలు ఒంటరిగా కనిపిస్తే పాపం.. వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా అందినకాడికి వారినుంచి విలువైన అభరణాలను అపహరిస్తున్నారు. ప్రతిఘటిస్తే మహిళల ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటలేదు. దీంతో మహిళలు ఒంటిరిగా బయటకు రావలంటేనే భయపడుతున్నారు. నల్లగొండ జిల్లాలోని నకిరెకల్ ప్రాంతంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గతనెల నుంచి ఆరుగురి మహిళల మెడలోంచి బంగారు చైన్లు లాక్కెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. స్నాచర్ల ఆగడాలతో నకిరెకల్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్థులిలా దొంగలైన వేళ..
-
బైక్‌ను అటకాయించి దంపతులపై దాడి
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నగర శివారుల్లో దోపిడీ ముఠాలు విజృంభిస్తున్నాయి. ఒంటరి వ్యక్తులపై దాడులు చేయడం, వాహనదారులను అటకాయించి దోచుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా రూరల్ పరిధిలోని వడ్డుపల్లి సమీపంలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న కృష్ణవేణి, బాలకృష్ణ దంపతులను అటకాయించి బంగారు నగలను దోచుకెళ్లారు. బాధితులు రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని కోణాపురానికి చెందిన దంపతులు, మంగళవారం వ్యక్తిగత పని నిమిత్తం నగరానికి వచ్చారు. బుధవారం సాయంత్రం బంధువుల ఇంటి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. వడ్డుపల్లి గ్రామ సమీపంలో వెళుతుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వారిని ఆపారు. వాహనం వేగాన్ని తగ్గించగానే దుండగులు ఆ దంపతులపై దాడి చేశారు. కృష్ణవేణి మెడలోని పుస్తెలతో పాటు బంగారు గొలుసులు(ఆరు తులాలు బంగారు) లాక్కుని ఉడాయించారు. నిర్మానుష్య ప్రదేశంలో వారి అరుపులు అరణ్య రోదనగానే మిగిలాయి. దుండగులు ద్విచక్ర వాహనాల్లో వెళ్లి పోయినట్లు బాధితులు తె లిపారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, అటుగా వెళుతున్న వాహనదారుల సాయంతో బాధిత దంపతులు నగరానికి చేరుకున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసి స్వగ్రామానికి వెళ్లారు. ఇటీవల కక్కలపల్లి క్రాస్‌లో ద్విచక్ర వాహనదారుడిపై కత్తితో దాడి చేసి వాహనంతో సహా సెల్ ఫోన్, నగదు అపహరించుకు వెళ్లిన ఘటన మరవకనే, నేషనల్ పార్కు సమీపంలో జాతీయ రహ దారిపై దంపతులపై దాడి చేసిన జరగడం నగర వాసుల్ని ఆందోళనకు గురి చేసింది. తాజాగా వడ్డుపల్లి సమీపంలో దంపతులను దోచుకోవడంతో ఉలికి పడ్డారు.