
పడమటి దేశాల్లో కొందరు బంగారంలాంటి జుట్టు అంటే మోజుపడతారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం బంగారంతోనే జుట్టు ఉండాలని అనుకున్నాడు. అనుకోవడమే కాదు. దానిని నిజం కూడా చేసుకున్నాడు.
సుమారు రెండు మిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో రూ.14 కోట్లు ఖర్చు చేసి తన తలపైభాగం మొత్తం వివిధ బంగారు గొలుసులతో అమర్చుకున్నాడు. అయితే, వీటిని శాశ్వతంగా లేక తాత్కాలికంగా అమర్చుకున్నాడో చెప్పలేదు. కానీ, తన బంగారు జుట్టు కలను మాత్రం నిజం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఈ మధ్యనే సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు.
ఇంతటి విచిత్ర సాహసాన్ని చేసిన అతడెవరో కాదు. ప్రముఖ మెక్సికన్ ర్యాపర్ డాన్ సుర్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
కొంతమంది నెటిజన్లు ‘అతని జుట్టు పీకితేచాలు లైఫ్ సెట్’, ‘గోల్డన్ స్కల్’ అంటూ ఫన్నీ కామెంట్స్‌తో ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment