Why Bappi Lahiri Used To Wear So Much Gold, Full Details Here - Sakshi
Sakshi News home page

Bappi Lahiri : 'అప్పటినుంచి బంగారం మీద ప్రేమ పెరిగింది.. గోల్డ్ ఈజ్ మై గాడ్‌`

Published Wed, Feb 16 2022 1:00 PM | Last Updated on Wed, Feb 16 2022 1:36 PM

Why Bappi Lahiri Used To Wear So Much Gold Here - Sakshi

Why Bappi Lahiri Used To Wear So Much Gold: అలోకేశ్‌ లహిరి అలియాస్‌ బప్పి లహరి.. బాలీవుడ్‌కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన లెజెండరీ సింగర్‌. సంగీత ప్రపంచంలో బప్పీలహరి స్టైల్‌ ప్రత్యేకం. తన గానంతో మెస్మరైజ్‌ చేసిన బప్పీలహరి పాటలతోనే కాకుండా ప్రత్యేకమైన ఆహార్యంతోనూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. చేతికి గోల్డ్‌ రింగ్స్‌, నల్లని కళ్లద్దాలు, మెడలో కిలోల కొద్దీ బంగారు గొలుసులు.. అసలు ఆయన నడిచొస్తుంటే బంగారమే కదిలొస్తున్నట్లు కనిపించేది. ఇదే ఆయనకు మరింత ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. బంగారం లేకుండా అసలు బప్పీలహరిని ఊహించుకోలేం. 

బప్పిలహరికి బంగారంపై ఎందుకంత ప్రేమ అంటే..
వయసు దాటినా ఎప్పుడూ తరగని ఉత్సాహం, చెరగని చిరునవ్వుతో కనిపించే బప్పీలహరి బంగారం లేకుండా అసలు కనిపించేవారు కాదు. ఆయనకు బంగారం అంటే అంత ఇష్టం మరి. `గోల్డ్ ఈజ్ మై గాడ్‌` అంటుండేవారాయ‌న‌. ఆయ‌న మెడ‌లో ఎప్పుడూ బంగారు ఆభ‌ర‌ణాలు మెరుస్తూ ఉండేవి. దీని వెనుకున్న సీక్రెట్‌ ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా..

ఓ హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ను చూశాక తనకు బంగారం మీద ప్రేమ పెరిగిందనీ, అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందనీ చెప్పేవారు. 'ఓ సాంగ్‌ రికార్డింగ్‌ సమయంలో దేవుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ని మా అమ్మ నాకు బహుమతిగా ఇచ్చింది. పెళ్లయ్యాక కూడా నా భార్య ఓ గణపతి లాకెట్‌ కూడిన బంగారు గొలుసును ఇచ్చింది. నా మెడలోని గణపతి నన్ను ఎప్పుడూ సరక్షితంగా ఉంచుతుంది అని నమ్ముతాను. అంతేకాకుండా నా కెరీర్‌ ఎదుగుతున్న కొద్దీ నా బంగారం మరింత రెట్టింపయ్యింది' అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement