
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దన్న (అన్నాత్తె) సినిమాతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తనకింత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు శివకు ఆ మధ్య బంగారు చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన రజనీ తాజాగా పెద్దన్న టీమ్ సభ్యులందరికీ విలువైన కానుకలిచ్చాడు. ఈ సినిమా రిలీజై 50 రోజులైన సందర్భంగా అన్నాత్తె మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్యుయేల్‌తో పాటు ప్రధాన టెక్నీషియన్లందరికీ బంగారు చెయిన్లను బహుమతిగా అందించాడు. రజనీకాంత్ తమ శ్రమను గుర్తించి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు పంపడంపై తెర వెనుక పనిచేసిన టెక్నీషియన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా రజనీకాంత్, మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘అన్నాత్తై’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేశ్ సోదరి పాత్రలో కనిపించింది. ఖుష్బూ, మీనా, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగులో పెద్ద హిట్ కాకపోయినప్పటికీ తమిళంలో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది.
Such a sweet gesture from Our Superstar @rajinikanth Ayya! To honour the chief technicians of Annaatthe with a Gold chain! His special mention about every craftsmanship was so obliging! Thanks to Siva Sir and @sunpictures Kalanithi Maran Sir! A Memorable Day! Praise God! pic.twitter.com/DvGzsF5Jg2
— D.IMMAN (@immancomposer) December 23, 2021
Comments
Please login to add a commentAdd a comment