చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ శృతిమించిపోతున్నాయి. ఒంటరిగా మహిళలు కనిపిస్తే పాపం.. వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా వారినుంచి విలువైన అభరణాలను అపహరిస్తున్నారు.
చైన్ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకీ శృతిమించుతోంది. మహిళలు ఒంటరిగా కనిపిస్తే పాపం.. వారిపై దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా అందినకాడికి వారినుంచి విలువైన అభరణాలను అపహరిస్తున్నారు. ప్రతిఘటిస్తే మహిళల ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటలేదు. దీంతో మహిళలు ఒంటిరిగా బయటకు రావలంటేనే భయపడుతున్నారు.
నల్లగొండ జిల్లాలోని నకిరెకల్ ప్రాంతంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గతనెల నుంచి ఆరుగురి మహిళల మెడలోంచి బంగారు చైన్లు లాక్కెళ్లినట్టు పోలీసులు పేర్కొన్నారు. స్నాచర్ల ఆగడాలతో నకిరెకల్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.