కరీమాబాద్: ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కరీమాబాద్ మండలం రంగశాయిపేటలో ఆదివారం సాయంత్రం జరిగింది. నగరంలోని ఎల్బీనగర్‌కు చెందిన రాగులపల్లి స్వతంత్ర అనే మహిళ రంగశాయిపేటలో ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్న సమయంలో బైక్‌మీద వచ్చిన దుండగులు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు.
చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమె అరిచినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దుండగులు లాక్కెళ్లిన గొలుసు మూడు తులాలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు తెలిపారు.