
ముగ్గురు చైన్‌స్నాచర్లపై పీడీ యాక్ట్
సాక్షి, సిటీబ్యూరో: నేరం చేసి అరెస్టు కావడం...బెయిల్‌పై బయటకు వచ్చి.. మళ్లీ విజృంభించి ప్రజలను భయబాంత్రులకు గురి చేస్తున్న ముగ్గురు చైన్‌స్నాచర్లపై సైబరాబాద్ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. జంట పోలీసు కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలో పదేపదే చైన్‌స్నాచింగ్‌లు, దొంగతనాలు చేస్తున్న బీదర్‌కు చెందిన టకీ అలీ, సల్మాన్ అలీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోవింద్‌లపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ‘దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు సంబంధించి 66 కేసుల్లో ప్రమేయమున్న టకీఅలీ, 113 కేసుల్లో ప్రమేయమున్న సల్మాన్ అలీ కొంత మంది చైన్‌స్నాచర్లలతో కలిసి పంజా విసురుతున్నారు.
రాజేంద్రనగర్ శాస్త్రిపురంలో నివాసముంటున్న గోవిద్ జంట పోలీసు కమిషనరేట్లలో 27 చైన్ స్నాచింగ్‌లు చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నార’ని సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్‌డీ నవీన్ కుమార్ తెలిపారు.