PD Act case
-
Andhra Pradesh: ప్రశ్నిస్తే.. పీడీ చట్టం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న చంద్రబాబు సర్కారు మరింత బరితెగించింది! యావత్ భారతం ‘రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ’ వేడుకలను జరుపుకొంటున్న తరుణంలో.. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులపై ఉక్కుపాదం మోపే కుట్రలకు కూటమి ప్రభుత్వం తెర తీసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ‘నల్ల చట్టాన్ని’ తీసుకువచ్చింది. ‘పీడీ’ (ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్) చట్టానికి సవరణ ముసుగులో పచ్చ పన్నాగాన్ని పన్నింది. రాజ్యాంగ స్ఫూర్తిని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సైబర్ నేరాలను పీడీ చట్టం పరిధిలోకి తెస్తున్నట్లు చట్ట సవరణ చేసినట్టు డ్రామా ఆడిన చంద్రబాబు ప్రభుత్వం అసలు కుతంత్రం వేరే ఉంది! అసలు సైబర్ నేరాలు అంటే ఏమిటో నిర్వచించకపోవడం ప్రభుత్వ కుతంత్రానికి నిదర్శనం. కేంద్ర ఐటీ చట్టంలోని అంశాలను సైబర్ నేరాలు అంటూ గంపగుత్తగా అధికారిక ముద్ర వేసేసింది. తద్వారా సోషల్ మీడియా పోస్టులను కూడా సైబర్ నేరాలుగా జమ కట్టేసేందుకు తెగించింది. ఆ నెపంతో సోషల్ మీడియా పోస్టులపై ఏకంగా పీడీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లలో మగ్గేలా చేసేందుకు పథకం వేసింది. ఈ దుర్మార్గంపై ఎక్కడికక్కడ బాధితులు, ప్రజాస్వామ్యవాదులు, పౌరహక్కుల సంఘం నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించనున్నారు. ప్రశ్నించే గొంతుల అణచివేతకు కుట్ర...పీడీ చట్టానికి సవరణ పేరుతో పన్నాగంతీవ్రమైన నేరాలను కట్టడి చేసేందుకు 1986లో తీసుకువచ్చిన పీడీ చట్టానికి సవరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రానికి తెరతీసింది. పీడీ చట్టం పరిధిని విస్తృతం చేస్తున్న నెపంతో కథ నడిపించింది. పీడీ చట్టం ప్రకారం ఆరు కేటగిరీల నేరాలపై కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. నాటుసారా, అక్రమ మద్యం తయారీ / సరఫరా / రవాణాదారులు, దొంగతనాలకు పాల్పడే బందిపోటు ముఠాలు, మాదక ద్రవ్యాల తయారీ / సరఫరా / విక్రయదారులు, మానవ అక్రమ రవాణాదారులు, గూండాలు, భూ కబ్జాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగించవచ్చు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో పీడీ చట్టాన్ని సవరించింది. భూ కబ్జాలకు పాల్పడేవారు అనే అంశాన్ని విస్తృతం చేస్తూ దాని పరిధిలోకి మరో 15 అంశాలను చేర్చింది. వాటిలో ‘సైబర్ నేరాలు’ చేర్చింది. సైబర్ నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు అవకాశం కల్పించింది. కేంద్ర ఐటీ చట్టం పరిధిలోని కేసులన్నీ సైబర్ నేరాలట!కూటమి సర్కారు కుట్రచంద్రబాబు ప్రభుత్వం పీడీ చట్టానికి సవరణ చేస్తూ సైబర్ నేరాలకు తనదైన భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉంది. ‘కేంద్ర ఐటీ చట్టం 2000’ పరిధిలోకి వచ్చే నేరాలన్నీ సైబర్ నేరాలే అని గంపగుత్తగా పేర్కొనడం ప్రభుత్వ కుతంత్రానికి నిదర్శనం. ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’లో పొందుపరిచిన నేరాలకు కేంద్ర ప్రభుత్వం పీడీ చట్టం లాంటి తీవ్రమైన చట్టాన్ని ప్రయోగించడం లేదు. ఐటీ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఐటీ చట్టం పరిధిలోని అంశాలను సైబర్ నేరాలుగా పేర్కొంటూ పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడింది.ఒకటికి మించి అక్రమ కేసులు.. వేధింపుల పన్నాగంఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సోషల్ మీడియా అనేది ప్రధాన మాధ్యమంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు సామాన్యులు సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, ఎన్నికల హామీలను అమలు చేయకపోవటాన్ని సోషల్‌మీడియా వేదికగా యాక్టివిస్టులు, ప్రజాస్వామ్యవాదులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వారిని అక్రమ కేసులతో వేధిస్తోంది. తాజాగా ఆ కుట్రలకు మరింత పదును పెట్టేందుకే పీడీ చట్టానికి సవరణ పేరుతో కుట్ర పన్నింది. సోషల్ మీడియా పోస్టులపై అభ్యంతరం ఉంటే ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. ఆ చట్టం ప్రకారం సోషల్ మీడియా పోస్టులు పెట్టినవారికి ‘41 ఏ’ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని పంపించి వేయాలి. ఏకపక్షంగా అరెస్ట్ చేసేందుకు అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేస్తే న్యాయస్థానాలు సమ్మతించవు. రిమాండ్‌ను తిరస్కరిస్తాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు పదును పెట్టింది. ఐటీ చట్టం పరిధిలోకి వచ్చే అంశాలను సైబర్ నేరాలుగా పేర్కొంటూ వాటిని ఏకంగా పీడీ చట్టం పరిధిలోకి తెచ్చింది. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై పీడీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఒకటికి మించి కేసులు నమోదు చేసి... దాన్ని సాకుగా చూపించి వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ కుట్రలో భాగంగానే నెల రోజులుగా ఒక్కో సోషల్ మీడియా కార్యకర్తపై పలు జిల్లాల్లో అక్రమ కేసులను నమోదు చేస్తోంది. వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించి ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించేందుకు పూర్తిస్థాయి కుట్రలకు బరి తెగించింది.ఏడాదిపాటు అక్రమ నిర్బంధానికే...!పీడీ చట్టం ప్రకారం కేసు నమోదైన వారిని గరిష్టంగా ఏడాది పాటు జైలులో ఉంచవచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా, అక్రమ మద్యం దందా లాంటి తీవ్రమైన నేరాలకు తరచూ పాల్పడేవారిపై కఠిన చర్యలకు పీడీ చట్టాన్ని రూపొందించారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను వేధించేందుకు, రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు పీడీ చట్టాన్ని సవరించింది. పీడీ చట్టం కింద నమోదు చేసిన కేసులను రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. కమిటీకి చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. వారిని రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందన్నది గమనార్హం.సోషల్ మీడియాపై పీడీ చట్టం రాజ్యాంగ విరుద్ధంసోషల్ మీడియాపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలన్న ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ద్ధం. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ప్రశ్నించడానికి – దూషించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకపోవడం ప్రభుత్వ పెద్దల వైఫల్యం. రౌడీలు, స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్ మీడియా పోస్టులపై పీడీ చట్టం ఏమిటి? రాష్ట్రంలో కొన్ని టీవీ చానళ్లు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి. న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసులపై డిబేట్లు నిర్వహిస్తూ ఏకపక్షంగా తీర్పులు చెబుతున్నాయి. స్వీయ నియంత్రణ పాటించాలని మీడియా సంస్థలను సుప్రీంకోర్టు అనేకసార్లు హెచ్చరించింది. కొన్ని టీవీ చానళ్లు రాజకీయ పార్టీలతో కలసి ప్రజలను బెదిరించేందుకు యత్నిస్తున్నాయి. సోషల్ మీడియాపై ఆంక్షలు, కేసులు న్యాయస్థానాల్లో నిలవవు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్యానిదే అంతిమ విజయం. – మామిడి సుదర్శన్, ‘సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ – స్ట్రాటజీ (సీపీఆర్‌ఎస్) వ్యవస్థాపకుడుబిల్లు ఆమోదంలోనూ కనికట్టు...ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఉద్దేశించిన పీడీ చట్ట సవరణ బిల్లును టీడీపీ ప్రభుత్వం ఆమోదించుకున్న తీరు తీవ్ర విస్మయం కలిగిస్తోంది. శాసనసభలో ఈ నెల 21న ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. ఆ తరువాత బడ్జెట్ సమావేశాల చివరి రోజు అంటే ఈ నెల 22న శాసన మండలిలో అదనపు అజెండాగా ఈ బిల్లును చేర్చింది. ప్రధాన అజెండాలో దీన్ని పేర్కొనకపోవడం గమనార్హం. తద్వారా ఆ బిల్లుపై విస్తృత చర్చకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది.సైబర్ నేరాలను నిర్వచించని కూటమి ప్రభుత్వంనిజమైన సైబర్ నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే సైబర్ నేరాలు ఏమిటన్నది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్వచిస్తూ పేర్కొంది. అందుకోసం ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ ‘1930’ అందుబాటులోకి తెచ్చింది. ఆ పోర్టల్ పరిధిలోకి వచ్చే అంశాలను అంటే బ్యాంకుల మోసాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలు మొదలైన నేరాలను ఏపీ ప్రభుత్వం పీడీ చట్టం పరిధిలోకి తీసుకువస్తే ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశం సైబర్ నేరాలను అరికట్టడం కాదు. ఆ ముసుగులో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం! ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని అక్రమ కేసులతో వేధించడం. అందుకోసమే పీడీ చట్టానికి సవరణ చేస్తూ సైబర్ నేరాలను అనే అంశాన్ని చేర్చింది. కానీ అసలు సైబర్ నేరాలు అంటే ఏమిటో నిర్వచించకపోవడం ప్రభుత్వ కుట్రకు బట్టబయలు చేస్తోంది.భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం..చంద్రబాబు సర్కారు అరాచక చర్యలు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం దేశ పౌరులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. అయితే సోషల్ మీడియా పోస్టులను పీడీ చట్టం పరిధిలోకి తేవడం ద్వారా కూటమి సర్కారు ఆ హక్కును కాల రాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు కుట్ర పన్నిందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లును ప్రజాస్వామ్యవాదులు సమష్టిగా వ్యతిరేకించాలని, న్యాయ పోరాటం చేయాలని సూచిస్తున్నారు. -
రెండు కేసులకే పీడీ యాక్ట్ సరికాదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: విద్వేషాలు రెచ్చగొట్టాడంటూ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన కేసులో ఆ వ్యక్తిని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టులు పెట్టొద్దంటూ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని అతనికి పలు షరతులు విధించింది. హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన సయ్యద్ అబ్దహు ఖాద్రీ.. రాజాసింగ్ అరెస్టు, విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడంటూ పలు కేసులు నమోదయ్యాయి. దీంతో అతనిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి నిర్బంధంలో ఉంచారు. పోలీసుల చర్యను నిరసిస్తూ అతని తల్లి గజాలా హైకోర్టును ఆశ్రయించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం రిట్ పిటిషన్‌ను అనుమతించింది. కేవలం రెండు కేసుల ఆధారంగా పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. నిర్బంధంలో ఉంచాలంటూ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. -
పొలిటికల్ కారిడార్ : పీడీ యాక్ట్ ఎత్తేయాలని హిందూ సంఘాల డిమాండ్
-
రాజాసింగ్ పీడీయాక్ట్ కేసు.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ బహిష్కృత నేత రాజా సింగ్ పీడీ యాక్టు కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ఈనెల 20లోపు ఎట్టిపరిస్థితుల్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే నాలుగు సార్లు గడువిచ్చామని ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలుకు ఈసారి గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. చదవండి: వీఆర్ఏలపై లాఠీ ఛార్జ్.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉద్రిక్తత -
చర్లపల్లి జైలులో రాజాసింగ్.. పీడీ యాక్ట్ రివోక్‌పై ప్లాన్ ఫలిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదుచేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, రాజాసింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో రాజాసింగ్‌కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. చర్లపల్లి జైలులో ఉగ్రవాద ఖైదీలున్న నేపథ్యంలో రాజాసింగ్‌ను ప్రత్యేక బ్యారెక్‌లో వసతి ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. రాజాసింగ్‌పై నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను రివోక్ చేసేందుకు ఆయన తరఫు లాయర్లు న్యాయస్థానాలను ఆశ్రయించనున్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, రాజాసింగ్ అరెస్ట్‌లో పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం కీలకంగా మారనుంది. పీడీ యాక్ట్ ప్రపోజర్స్ను అడ్వైజరీ బోర్టు కమిటీ పరిశీలించనుంది. నెలలోపు రాజాసింగ్‌ను అడ్వైజరీ కమిటీ విచారించనుంది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, నిందితుడి వివరాలను అడ్వైజరీ బోర్డు కమిటీ పరిశీలించనుంది. ఈ క్రమంలో రాజాసింగ్‌ను ఆయన లాయర్లు ములాఖత్ ద్వారా ఇప్పటికే కలిశారు. కాగా, పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తులు మూడు నెలలు లేదా ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉంది. ఎనిమిదేళ్లలో పోలీసులు.. 2,573 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఏడాది కాలంలో 664 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్‌కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్ కొనసాగుతోంది. రాజాసింగ్ అభిమానులు, హిందూ సంఘాలు.. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. ఇక, భైంసాలో బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: పవర్ఫుల్ పీడీ యాక్ట్.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! -
తీరు మారలేదు... చోరీలు మానలేదు
చిలకలగూడ : పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. పీడీయాక్టుపై శిక్ష అనుభవించాడు. నెల రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలై తన స్నేహితుడితో కలిసి ఆరుచోట్ల పంజా విసిరాడు. చివరకు పోలీసులకు చిక్కి మరోమారు కటకటాల పాలయ్యాడు. ఇరువురు పాత నేరస్తులను అరెస్ట్ చేసి రూ. లక్షల నగదు, నగలు స్వాదీనం చేసుకున్నట్లు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ స్నేహమెహ్రా తెలిపారు. సంతోష్‌నగర్‌కు చెందిన మెహబూబ్‌ఆలీ అలియాస్ కుస్రూ హోటల్ కుక్‌గా పని చేసేవాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. 1996 నుంచి హైదరాబాద్, సైబరాబాద్, నల్గొండ కమిషనరేట్ల పరిధిలో 20 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బెయిల్‌పై బయటికి వచ్చిన వెంటనే చోరీలకు పాల్పడటం పోలీసులకు పట్టుబడడం పరిపాటిగా మారింది. సంతోష్‌నగర్ ఠాణా పోలీసులు 2020లో అతడిపై పీడీయాక్టు ప్రయోగించారు. ఈ ఏడాది జూలై నెలలో జైలు నుంచి విడుదలయ్యాడు. భవానీనగర్ తలాబ్‌కట్ట రాజాగల్లీకి చెందిన స్నేహితుడైన పాత నేరస్తుడు మహ్మద్ ఫిరోజ్‌తో కలిసి చిలకలగూడ, నల్లకుంట, నల్గొండ ఠాణాల పరిధిలో ఆరుచోట్ల ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితులు మెహబూబ్‌అలీ, మహ్మద్ ఫిరోజ్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వీరి నుంచి 130 గ్రాముల బంగారు నగలు, 500 గ్రాముల వెండి, రూ.37 వేల నగదు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారిని చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సీఐ రాఘవేంద్ర, ఎస్ఐలు శ్రీశైలం, నరేందర్, షేక్‌బురాన్, నర్సింహులు, చిలకలగూడ సీఐ నరేష్‌లతోపాటు సిబ్బందిని సౌత్‌జోన్ టాస్‌్కఫోర్స్ డీసీపీ స్నేహమెహ్రా అభినందించి రివార్డులు ప్రకటించారు. (చదవండి: ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు: కేటీఆర్) -
నటి చౌరాసియాపై దాడి కేసులో నిందితుడిపై పీడీ యాక్ట్
PD Act Slapped On Actress Shalu Chourasiya Attack Case: సినీ నటి షాలు చౌరాసియాపై దాడి కేసులో నిందితుడిపై నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. గతేడాది నవబంర్‌లో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియా నడక పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా కొమ్మూరిల బాబు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆమెపై దాడికి పాల్పడి షాలు చౌరాసియా పోన్ ఎత్తుకెళ్లాడు బాబు. ఈ దాడితోపాటు బాబుపై మరో మూడు కేసులు ఉండటంతో పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ప్రస్తుతం చంచల్గూడా జైలులో బాబు శిక్ష అనుభవిస్తున్నాడు. చదవండి: నటి చౌరాసియాపై దాడి: సీసీ కెమెరాలను తప్పించుకుతిరిగాడా? మహబూబ్ నగర్ జిల్లా కుల్కచర్లకు చెందిన బాబు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు నాలుగున్నరేళ్ల క్రితం వచ్చాడు. సినిమాల్లో సెట్లు వేసే వారి వద్ద రోజు కూలీగా చేరాడు. సంపాదన సరిపోక రాత్రివేళల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. కాగా 2021, నవంబర్ 14వ తేదీన సాయంత్రం పూట వాకింగ్ చేస్తున్న షాలూ చౌరాసియాపై బాబు దాడి చేసి తీవ్రంగా కొట్టి రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. ఆమె తన దగ్గర డబ్బులు లేవని పేటీఎం చేస్తానని చెప్పినా వినిపించుకోలేదు. బండరాయి పక్కన కిందకు తోసేసి ఆమెను తీవ్ర ఇబ్బందికి గురి చేశాడు. ఒక సందర్భంలో బండరాయిని ముఖంపై బాది హత్య చేసేందుకు కూడా యత్నించాడు. శక్తిని కూడదీసుకున్న చౌరాసియా తన మోచేతితో నిందితుడిపై దాడి చేసి ఫెన్సింగ్ దూకి బయటికి పరుగులు తీసింది. చదవండి: సినీ నటి చౌరాసియాపై దాడి చేసిన నిందితుడిపై మరో కేసు -
వీడు మామూలోడు కాదు .. బీటెక్ మానేసి.. వందలాది మందితో..
కడప అర్బన్: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇతగాడి పేరు చెన్నుపల్లి ప్రసన్నకుమార్ (23). ప్రశాంత్‌రెడ్డి, రాజారెడ్డి, టోనీ అనే పేర్లతోనూ చలామణి అయిన ఇతడు బీటెక్ ఫస్టియర్‌లో చదువు మానేశాడు. ఆ తర్వాత జల్సాల కోసం దొంగగా మారాడు. చైన్ స్నాచింగ్‌లు చేయడం.. ఇళ్లకు కన్నంవేసి సొత్తు కొట్టేయడం అతడి స్టైల్. చోరీలు చేసి దొరికిపోయిన అతగాడికి బోర్ కొట్టిందో ఏమో.. సోషల్ మీడియాలో రోమియో అవతారమెత్తాడు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో రోమియో అవతారమెత్తి.. యువతులు, మహిళల్ని టార్గెట్ చేశాడు. ఆ తర్వాత వారిని తెలివిగా ముగ్గులోకి దించి నగ్న వీడియోకాల్స్, అసభ్య చాటింగ్ చేయడం.. ఆనక వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది యువతులు, మహిళలపై వలపు వల విసిరి మోసగించడమే కాకుండా భారీగా సొమ్ములు కొల్లగొట్టాడు. ఈ ఏడాది ఆగస్టు 1న పోలీసులకు చిక్కి కటకటాల పాలైన ప్రసన్నకుమార్‌పై కడప ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సిఫారసు మేరకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు శనివారం పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీడు మామూలోడు కాదు ప్రసన్నకుమార్‌పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 26 కేసులున్నాయి. చిన్న వయసులోనే దుర్వ్యసనాలకు బానిసైన ప్రసన్నకుమార్ 2017లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్, చాపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇతనిపై ప్రొద్దుటూరు త్రీటౌన్‌లో సస్పెక్ట్ షీట్ నమోదైంది. ఆ తరువాత ప్రసన్నకుమార్ కడప, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో షేర్‌చాట్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలను టార్గెట్ చేసి వారితో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పేవాడు. అసభ్యకర రీతిలో చాటింగ్ చేసేవాడు. వారికి తెలియకుండా వారి ఫొటోలు, వీడియోలను రికార్డు చేసి, బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి తన గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా డబ్బులు గుంజేవాడు. కొందర్ని శారీరకంగా లోబర్చుకునేవాడు. వందల సంఖ్యలో మహిళలను మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పరువుకు సంబంధించిన విషయం కావడంతో బాధితులెవరూ ఫిర్యాదు చేసేందుకు రాలేదు. ఘరానా మోసగాడు ప్రసన్నకుమార్ చాపాడు, ప్రొద్దుటూరు టూటౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్ల పరిధిలో చైన్‌స్నాచింగ్ కేసులో, 2019లో ప్రొద్దుటూరు వన్‌టౌన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ కేసులో, 2020లో విజయవాడు కమిషనరేట్ పరిధిలోని పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వివాహితను లైంగికంగా వేధించి, డబ్బుల కోసం బెదిరించిన కేసులో, 2020 నవంబర్‌లో శంషాబాద్ పరిధిలోని చౌదరిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో పెనమలూరు తరహాలో నేరం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. వైఎస్సార్ జిల్లాలోని కడప, ఎర్రగుంట్ల, వల్లూరు మండలాల్లోని పలు ఇళ్లలో దొంగతనాలు చేసిన కేసులో ఇతను ప్రధాన∙నిందితుడు. కడప తాలూకా, వన్‌టౌన్, ప్రొద్దుటూరు టూటౌన్ స్టేషన్ల పరిధిలో 2021లో పలు మోటార్ సైకిల్ దొంగతనాల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సోషల్ మీడియా వేదికగా మహిళల్ని మోసగిస్తున్న ప్రసన్నకుమార్‌పై రాష్ట్రంలోనే తొలిసారిగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. -
డబ్బులు తిరిగిచ్చేయమని అడిగితే న్యాయవాది అని బెదిరించారు
సాక్షి,న్యూఢిల్లీ: ఒకటి కంటే ఎక్కువ నేరాల్లో నేరస్తుడు కావడంతోపాటు న్యాయవాదినని పలువురిని బెదిరించడంతోనే పిటిషనర్ భర్తను మళ్లీ అరెస్టు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తన భర్తను పోలీసులు పీడీ యాక్టు కింద అరెస్టు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ బంక స్నేహశీల దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్, జస్టిస్ హృషికేశ్‌రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ.. మార్చిలో బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ ఎలాంటి ఫిర్యాదు రాకపోయినా సెప్టెంబరులో మళ్లీ అరెస్టు చేశారని తెలిపారు. పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన, శాంతి భద్రతల ఉల్లంఘన లేకపోయినా పీడీ యాక్టు కింద అరెస్టు చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. వంద శాతం సొమ్ములు తిరిగి ఇచ్చేస్తామని చిన్నచిన్న వ్యాపారస్తులను మోసం చేశారని ఆరోపించారు. ఎవరైనా సొమ్ములు ఖాతాలో జమచేస్తే వెంటనే తన భార్య ఖాతాకు వాటిని మళ్లించేవారని దీనికి ఆధారాలు ఉన్నాయని రంజిత్‌కుమార్ తెలిపారు. లాభాలు ఇస్తానని హామీనిచ్చి ఎవరైనా సొమ్ములు అడిగితే తాను హైకోర్టు న్యాయవాదినంటూ బెదిరించేవారన్నారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జోక్యం అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. నాగరాజుపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డ మాజీ రంజీ క్రికెటర్ నాగరాజుపై బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంత్రి కేటీఆర్ పేరు చెప్పి నాగరాజు నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పీడీ యాక్ట్ నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు గతంలో ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014– 16 మధ్య ఏపీ రంజీ జట్టుకు ఎంపికైన బుడుమూరు నాగరాజు.. గతంలోనూ అనేక మంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడ్డాడు. బీసీసీఐ మాజీ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌గా పలువురికి ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. కాగా, గతేడాది ఫిబ్రవరిలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటూ నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు తొమ్మిది కార్పొరేట్ కంపెనీల నుంచి భారీగా దండుకున్నాడు. ఈ ఘరానా నేరగాడు నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. గతేడాది నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి స్కెచ్ వేసి సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఇటీవల ఓ ఫార్మా కంపెనీకి ఫోన్ చేసిన కేటీఆర్ పేరు చెప్పి రూ.15 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. ఇలా నాగరాజు నేరాల చిట్టా చాంతాండంత ఉంది. ఇతనిపై బంజారాహిల్స్, ఓయూ, సనత్‌నగర్, మాదాపూర్, బాచుపల్లి, కూకట్పల్లి పోలీస్స్టేషన్లతోపాటు విశాఖపట్నం, నెల్లూరు, మాచవరం, గుంటూరు, న్యూఢిల్లీలలో కేసులు నమోదై ఉన్నాయి. చదవండి: Wrestler Sushil Kumar: తీహార్ జైలుకు తరలింపు.. -
కబ్జాలు చేస్తే ఇక జైలుకే...
సాక్షి, హైదరాబాద్ : ఇటీవలి వరదల్లో హైదరాబాద్‌లో జలవిలయంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. జనం కడగండ్లు, వాటిల్లిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తోంది. గ్రేటర్‌తో పాటు ప్రధాన నగరాల్లో చెరువుల కబ్జాలు, కాల్వల ఆక్రమణల కారణంగా నివాస ప్రాంతాలన్నీ నీటమునిగిన నేపథ్యంలో ప్రధాన శాఖలతో కలిసి చెరువుల పరిరక్షణ చట్టం రూపొందించే కసరత్తు మొదలుపెట్టింది. కబ్జా చేస్తే నేరుగా కటకటాల్లోకి నెట్టేలా, అక్రమ నిర్మాణాలు చేస్తే వారంట్లు లేకుండా అరెస్ట్‌లు చేసేలా... కఠిన చర్యలకు వీలుకల్పిం చే చట్టాన్ని రూపొందించే పనిలో పడింది. అటు కబ్జాలు..ఇటు కన్నీళ్లు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో... చెరువుల సమగ్ర సర్వే ద్వారా రాష్ట్రంలో 46,531 చెరువులను గుర్తించిన సమయంలోనే... వేలాది చెరువుల కింది శిఖం భూములు కబ్జా అయినట్లు నీటి పారుదల శాఖ తేల్చింది. చెరువు పూర్తి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) పరిధిలోకి కబ్జాలు చొచ్చుకురావడంతో చెరువుల పరిధి కుచించుకుపోయిందని నిర్ధారించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కబ్జాలు ఎక్కువగా ఉన్నాయని, ఫీడర్ చానళ్లు, కాల్వలన్నింటినీ ఆక్రమించారని గుర్తించింది. రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఇది ఎక్కువని తేల్చింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 185 చెరువులు ఉండగా ఇందులో సగం చెరువులు ఆక్రమణ దారుల గుప్పిట్లో ఉన్నాయని, 70 శాతానికి మించి చెరువులు కుచించుకుపోయాయని గుర్తించింది. భారీ వరద కొనసాగినప్పుడు కబ్జాల కారణంగా చెరువుల నుంచి నీరు బయటకి వెళ్లే మార్గాల్లేక కట్టలు తెగుతున్నా యి. ఇటీవలి వర్షాలతో గ్రేటర్ పరిధిలోనే 50 చెరువులు దెబ్బతినగా, 20 చెరువులు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మీర్‌పేటలోని పెద్దచెరువు, పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువు, మియాపూర్‌లోని కొత్తకుంట, గగన్ పాడ్‌లోని మామాడికుంట, షేక్‌పేటలోని శాతం చెరువు, అనుంగని చెరువులు ఎక్కువగా దెబ్బతినగా వీటి మరమ్మతులకే రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తంగా హైదరాబాద్ పరిధిలోనే 35 వేలకు పైగా కుటుంబాలు కొన్ని వారాల పాటు నీటి ముంపుతో అల్లల్లాడాయి. నాలాల పునరుద్ధరణ, ఆక్రమణలను తొలగించడం ద్వారా గ్రేటర్ పరిధిలో వరద ప్రవాహాన్ని క్రమబద్ధీకరించవచ్చని, తద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు ఇంజనీర్లు, నిపుణులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్, మున్సిపల్, జీహెచ్ఎంసీలు కలిసి చెరువుల రక్షణకు కొత్తచట్టాన్ని ఓ కొలిక్కి తెచ్చే పనిలో పడ్డాయి. అవసరమైతే పీడీ యాక్ట్ చెరువు పరిధి, శిఖం భూమిని కబ్జా చేస్తే నేరుగా జైలుకు పంపేలా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురానుంది. కబ్జాలతో పాటు చెరువులను కలుషితం చేసే, దెబ్బతీసే ఎలాంటి చర్యలకు పాల్పడినా శిక్ష పడనుంది. నీటి వనరులు కాపాడేలా గతంలో పార్లమెంట్ స్టాడింగ్ కమిటీలు చేసిన సిఫార్సులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చెరువుల ఆక్రమణల నివారణ చట్టాలను అధ్యయనం చేస్తోంది. ప్రభుత్వవర్గాల సమాచారం మేరకు చట్టంలోపొందుపర్చనున్న అంశాలివీ... ►ఎలాంటి వారంట్ లేకుండా అరెస్ట్ చేసేలా, కనీసం ఏడాది జైలుశిక్ష పడేలా ముసాయిదాను రూపొందిస్తోంది. ►చెరువులను నీటి నిల్వ కోసం మినహాయించి ఏ ఇతర అవసరాల కోసం వాడినా కఠినచర్యలుంటాయి. ► చెరువు సరిహద్దు నుంచి 30 మీటర్ల దూరం లోపల ఉన్న భూముల్లో ఎలాంటి వాణిజ్య, గృహ, పారిశ్రామిక సముదాయాలు నిర్మించొద్దు. అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. ► చెరువుల్లోకి నీరు వచ్చే ప్రవాహమార్గాలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దు. మున్సిపల్ వ్యర్థాలు కానీ, బురద, రసాయన వ్యర్థాలను చెరువులో వేయొద్దు. ► ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువు పరిధిలో ఎలాంటి రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం చేపట్టొద్దు. ► శుద్ధి చేయని జలాలను చెరువుల్లోకి పంపొద్దు. ► వీటిని ఎక్కడైనా ఉల్లంఘిస్తే.. ఆ ఆక్రమణకు ఉపయోగించే పరికరాలు, వస్తువులు, వాహనాలను సీజ్ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు. ► ఆక్రమణదారులను ఎలాంటి వారంట్ లేకుండానే అరెస్టు చేసే, పీడీ యాక్టు పెట్టే అధికారం కూడా ఉంటుంది. ఈ చట్టం కింద నేరం రుజువైతే కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా నిబంధనలు విధించారు. -
నకిలీ గల్ఫ్ ఏజెంట్‌పై పీడీయాక్ట్
గల్ఫ్‌కు పంపిస్తానని మోసం చేసిన మునుకుంట్ల వెంకటేశ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం యెకిన్‌పూర్ గ్రామానికి చెందిన మునుకుంట్ల వెంకటేశ్ గల్ఫ్ దే శాలకు పంపిస్తామని వీసాలు, ఉద్యోగాలు ఇస్తామని అమాయక ప్రజలు, నిరుద్యోగ యువత నుంచి భారీ మొత్తంలో వసూలు చేయడంతో పాటు అనేక నేరాలకు పాల్పడ్డాడు. గల్ఫ్ ఏజెంట్లు, గల్ఫ్ దేశాల వీసాల ప్రక్రియ, ఆన్లైన్ సేవల గురించి పరిజ్ఞానం కలిగిన వెంకటేశ్ నకిలీ వీసాలు, టికెట్లను సృష్టించి ధనవంతులైన వ్యక్తుల నుంచి, నిరుద్యోగ యువకుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశాడు. జిల్లా పరిధిలో ఇతనిపై వ ఫ్రాడ్ కేసులు నమోదు అయ్యాయి. ఈక్రమంలో అతడిపై జగిత్యాల కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్భంద ఉత్తర్వులు చేశారు. దీంతో కరీంనగర్ జిల్లా జైలు అధికారి సమక్షంలో మల్యాల సీఐ నాగేందర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేశారు. పీడీయాక్ట్ నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించిన మల్యాల సీఐ, ఎస్సై ఉపేందర్‌ను ఎస్పీ సింధూశ ర్మ అభినందించారు. గురువారం వెంకటేశ్‌ను కరీంనగర్ నుంచి వరంగల్ జైలుకు తరలించారు. -
దాడులకు పాల్పడ్డ ‘తోట’పై పీడీయాక్ట్
గోదావరిఖని(రామగుండం): రాజకీయ నాయకుడి ముసుగులో గుండాయిజానికి పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చ ట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న మాజీ కార్పొరేటర్ తనయుడు తోట వేణుపై పీడీయాక్టు అమలు చేసి, గోదావరిఖనిలో వేళ్లూనుకున్న గుండాయిజానికి చెక్‌పెడు తూ కఠిన చర్యలకు పూనుకున్నారు పోలీసులు. వి వరాల్లోకి వెళ్తే రామగుండం కమిషనరేట్ పరిధిలో గొడవలు సృష్టిస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, రాజకీయం ముసుగులో డబ్బులు వసూలు చే స్తున్న తోట వేణుపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ రా మగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ బుధవారం ఉత్వర్తులు జారీ చేశారు. స్థానిక శి వా జీనగర్‌కు చెందిన వేణుపై 12క్రిమినల్ కేసులు న మోదైనట్లు పేర్కొన్నారు. అతడు గతంలో ఎమ్మె ల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కుటుంబంపై దాడిచేసి జైలులో.. ఇటీవల శివాజీనగర్‌లో పూల వ్యాపారం చేసుకునే వారిని రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం, టేలాను ధ్వంసం చేసి కుటుంబంపై దాడి చేసిన కేసులో వేణు ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ దాడి ఘటన పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో పలు దాడుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ పత్రికా కార్యాలయంపై దాడి చేసి విలేకరిపై హత్యాయత్నం చేశాడన్న అభియోగంపై కూడా అతడిపై కేసు నమోదైంది. వీటితో పాటు పోచమ్మ మైదానంలో వ్యాపారులను బెదిరించాడని, తదితర కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడి ప్రవర్తనపై రామగుండం సీపీ సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల పలు డివిజన్లలో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులను గొడవలకు పురిగొల్పడంతో శాంతిభద్రతల సమస్యగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో వేణుపై పీడీయాక్ట్ నమోదు చేయడంతో అరాచక శక్తులకు పోలీసులు గట్టి హెచ్చరిక చేసినట్లైంది. ఈమేరకు గోదావరిఖని వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్ జైలులో ఉన్న తోట వేణుకు బుధవారం పీడీ యాక్టు ఉత్తర్వులు అందజేశారు. -
ఏడాది పాటు జైల్లోనే రాకేష్ రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. జయరాం హత్యతోపాటు నగరంలో గత మూడేళ్లుగా బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడటంతో జూబ్లీహిల్స్ పోలీసులు పీడీయాక్ట్ అమలు చేశారు. పీడీ యాక్ట్‌కు సంబంధించి అన్ని కేసుల వివరాలు, శాస్త్రీయ ఆధారాలు ప్రతిపాదిత నివేదికలో జతపర్చారు. ఇటీవలే రాకేశ్‌రెడ్డితోపాటు మరో ఏడుగురు నిందితులపై పోలీసులు నాంపల్లిలోని 17వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 70 మంది సాక్షులను విచారించిన పోలీసులు 388 పేజీల చార్జిషీట్ రూపొందించారు. శాస్త్రీయ ఆధారాలతోపాటు ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సేకరించిన రిపోర్టును కూడా చార్జిషీట్‌తోపాటు జతపర్చారు. రాకేశ్‌రెడ్డితోపాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్యప్రసాద్, కిషోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై చార్జిషీట్ దాఖలైంది. ఈ ఏడాది జనవరి 30న చిగురుపాటి జయరాంను జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి హనీట్రాప్ చేసిన రాకేశ్‌రెడ్డి రోడ్ నం.10లోని తన ఇంటికి రప్పించి 31వ తేదీన ఉదయం 11.30 గంటలకు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆధారాలు తారుమారు చేసి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించే నిమిత్తం ముగ్గురు పోలీసు అధికారుల సలహాలు తీసుకొని జయరాం కారులోనే హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో నందిగామ శివార్లకు చేరుకున్నాడు. మృతదేహాన్ని అక్కడే పడేసి బస్సులో అదే రాత్రి జూబ్లీహిల్స్‌కు వచ్చి ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం కుత్బుల్లాపూర్ చింతల్‌లోని తన ఇంటికి వెళ్లాడు. పక్కా ఆధారాలు సేకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని ఫిబ్రవరి 7న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరింత సమాచారం, పురోగతి కోసం ఫిబ్రవరి 13 నుంచి 26వ తేదీ వరకు రాకేశ్‌రెడ్డిని కస్టడీకి తీసుకొని సమాచారాన్ని క్రోడీకరించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాకేష్ రెడ్డిపై పీడీయాక్ట్ నమోదుతో మరో ఏడాదిపాటూ జైల్లోనే ఉండనున్నాడు. -
కలప స్మగ్లర్‌పై పీడీ కొరడా!
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం హెచ్చరించినట్లుగానే కలప స్మగ్లర్‌పై పీడీ యాక్టు నమోదు కు పోలీసు శాఖ సమాయత్తమైంది. నిజామాబాద్ నగరానికి చెందిన వాజిద్‌పై ఈ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు నిర్మల్ పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గత నెలలో నిర్మల్ పోలీసులు నమోదు చేసిన కలప స్మగ్లింగ్ కేసులో వాజి ద్ మొదటి నిందితు డు. నిజామాబాద్ నగరాన్ని అడ్డాగా మార్చు కుని గత కొన్నేళ్లుగా కలప స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అడవులను నరకడం.. కలపను స్మగ్లింగ్ చేయడాన్నే వృత్తిగా మార్చుకున్న ఆదిలాబాద్ ముల్తానీలతో వాజిద్ చేతులు కలిపి ఈ దందాను కొనసాగిస్తున్నారు. వాజిద్‌పై నిజామాబాద్ జిల్లాతో పా టు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వివిధ పోలీస్స్టేషన్లలో కలప స్మగ్లింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, నేరడిగొండ పోలీస్స్టేషన్లలో వాజిద్‌పై గతంలో కలప స్మగ్లింగ్ కేసులున్నట్లు తేలింది.నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి కేసులుండటంతో పీడీ యాక్టు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ చట్టం కింద కేసు నమోదు చేయాలంటే ప్రత్యేక నిబంధనలున్నాయి. వాజిద్‌పై ఉన్న కేసులను పరిశీలిస్తే పీడీ చట్టం వర్తిస్తుం దని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. పరారీలోనే డిప్యూటీ మేయర్.. నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న కలప స్మగ్లింగ్‌పై సర్కారు ఉక్కుపాదం మోపింది. ఇం దులో భాగంగా ఆదిలాబాద్ వైపు నుంచి నిజామాబాద్ నగరానికి తరలిస్తున్న కలప వాహనాన్ని జనవరి 20న నిర్మల్ పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. కేసు తీగ లాగితే నగరంలోని సామిల్లుల్లో గుట్టుగా సాగుతున్న కలప స్మగ్లింగ్ దందా బట్టబయలైంది. ఆయా సామిల్లుల్లో కలప నిల్వలను పరిశీలిస్తే అక్రమ కలప నిల్వలు బయటపడ్డాయి. నిజామాబాద్ నగర డిప్యూటీ మేయర్ ఫయీం వంటి నేతల సామిల్లుల్లోనూ కలప స్మగ్లింగ్ జరిగినట్లు గుర్తించారు. ఈ స్మగ్లింగ్‌లో ఏఆర్ ఎస్ఐ షకీల్ పాషకు కూడా భాగస్వామ్యం ఉందని తేలడం ఆ శాఖ వర్గాల్లో కలకలం రేగిన విషయం విదితమే. ఇటు అటవీశాఖ అధికారుల హస్తం కూడా ఉండటంతో కొందరిపై వేటు పడిన విష యం తెలి సిందే. ఈ ఘటనలో మొత్తం 21 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ ఫయీంతో పాటు, సామి ల్లుల యజమానులు కూడా ఇప్పటికీ పరారీలో నే ఉన్నారు. వీరితో పాటు ఏడుగురు ముల్తానీలను సైతం పోలీసులు అరెస్టు చేయాల్సి ఉంది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
యాచకురాలిపై లైంగికదాడి..హత్య
సాక్షి, సిటీబ్యూరో: యాచకురాలిపై లైంగికదాడికి పాల్పడి దారుణంగా హత్య చేసిన కేసులో ఇద్దరు కామాంధులపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం పీడీ యాక్ట్ ప్రయోగించారు. బాలానగర్‌కు చెందిన కొండవీటి సాయికిరణ్, జీడిమెట్ల చింతల్లో ఉంటున్న మెదక్ జిల్లావాసి గజ్జగల్లా రాజులపై కఠిన చర్యలు తీసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసలైన వీరు గతేడాది ఏప్రిల్ 9న అర్ధరాత్రి సమయంలో బలానగర్ హనుమాన్ మందిర్‌కు సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో మద్యం తాగి గంజాయి సేవించారు. అదే సమయంలో అక్కడ గుడిసెలో యాచకురాలు బోయిన లక్ష్మమ్మ(35), ఆమె తల్లి దుర్గమ్మ(75) నిద్రిస్తుండటాన్ని గమనించారు. వృద్ధురాలైన దుర్గమ్మను బెదిరించి లక్ష్మమ్మను తమ వెంట తెచ్చుకున్న గమ్ టేప్‌తో చేతులు వెనక్కి కట్టేసి అరవకుండా నోటికి గమ్‌టేప్ వేసి ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడికి పాల్పడ్డారు. ముఖం, ముక్కుకు గమ్‌టేప్ ఉండటంతో శ్వాస అడక ఆమె మృతి చెందింది. అయినా వారు ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిని ప్రత్యక్షంగా చూసిన అక్కడే ఉన్న ఐడీపీఎల్‌వాసి బెంగళూరు ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ సిపాయి బాలా నర్సింగ్‌రావు నిందితులు సాయికిరణ్, రాజులు వెళ్లిపోయిన అనంతరం అతను కూడా లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదుచేసిన బాలానగర్ పోలీసులు గతేడాది ఏప్రిల్ 23న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే యాచకురాలు చనిపోయిన తర్వాత కూడా ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన సీపీ సజ్జనార్ నిందితులు సాయికిరణ్, రాజులపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. నిందితులు నేరాలు చేయాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలోనే కొందరు రేపిస్ట్‌లపై పీడీ యాక్ట్‌లు ప్రయోగించినట్లు ఆయన పేర్కొన్నారు. -
రౌడీషీటర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి
కర్నూలు: ఎన్నికల వేళ నేతల ముసుగులో రౌడీషీటర్లు రెచ్చిపోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే వారి కదలికలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం జిల్లా పోలీసు శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆరు మాసాల క్రితం కర్నూలు శివారులోని సుంకేసుల రోడ్డులో వీకే వైన్‌షాప్ వద్ద రౌడీషీటర్ చాకలి రాముడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇతన్ని ఆదిత్య నగర్లో నివాసముంటున్న మరో రౌడీషీటర్ మతిన్ బాషా బీరు బాటిల్‌తో పొడిచి..బండరాయితో మోది పరారయ్యాడు. అలాగే ఈ నెల 8వ తేదీన సాయిబాబా సంజీవయ్య నగర్‌కు చెందిన రౌడీషీటర్ చెన్నయ్య దారుణహత్యకు గురయ్యాడు. ఇతని కళ్లల్లో ఇసుక చల్లి, బండరాళ్లతో మోది, కత్తులతో పొడిచి తుంగభద్ర నది ఒడ్డున దారుణంగా హత్య చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీకి చెందిన అభిరుచి మధు అనే వ్యక్తి కత్తి పట్టుకుని హల్చల్ చేశాడు. జిల్లాలో కొందరు రౌడీషీటర్లు నేతల పంచన చేరి ఇలా అరాచకం చేస్తున్నారని పోలీసులు అంచనాకు వచ్చారు. నెల రోజుల నుంచి రౌడీషీటర్లను జిల్లా వ్యాప్తంగా స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇక మీదట ఎలాంటి వివాదాల్లో తలదూర్చబోమని, ప్రశాంతంగా జీవనం సాగిస్తామని ప్రమాణ పత్రాలు తీసుకుంటున్నారు. ముగ్గురిపై పీడీ యాక్ట్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేర ప్రవృత్తి గల ముగ్గురు వ్యక్తులపై పోలీసులు జిల్లాలో మొదటిసారిగా పీడీ యాక్ట్ నమోదు చేసి.. కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలం, చిన్నకందుకూరు గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉండటంతో గూడూరు సంజీవరాయుడు, పెద్దిరెడ్డి కొండారెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు పూర్వపు నేర చరిత్రను పరిశీలించి.. వారిపై పీడీ యాక్టు నమోదు చేసి రాత్రికి రాత్రే కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అహోబిలం గ్రామానికి చెందిన గూడూరు సంజీవరాయుడుపై 1993 నుంచి ఇప్పటివరకు 12 కేసులు ఉన్నాయి. ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్లో ఈ ఏడాది రౌడీషీట్(షీట్ నంబర్ 199) తెరిచారు. ఇదే గ్రామానికి చెందిన నాసారి వెంకటేశ్వర్లు అలియాస్ సీసా వెంకటేశ్వర్లుపై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. 1996 నుంచి రౌడీషీట్ (నంబర్ 71) ఉంది. అలాగే చిన్నకందుకూరు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి కొండారెడ్డిపై తొమ్మిది కేసులు నమోద య్యాయి. నలుగురిని హత్య చేసినట్లు పోలీసు రికార్డులకెక్కాడు. 2006 నుంచి ఆళ్లగడ్డ రూరల్ స్టేషన్లో రౌడీషీట్ (షీట్ నంబర్ 165) నమోదై ఉంది. కదలికలపై దృష్టి జిల్లాలో రౌడీషీటర్ల వ్యాపకం ఎలా ఉంది, వారు స్థానికంగానే ఉంటున్నారా, ఒకవేళ బయటకు వెళితే తిరిగి ఎన్ని రోజులకు ఇళ్లకు చేరుకుంటున్నారు, నేతలతో ఎలా అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు వంటి సమస్త సమాచారాన్ని స్టేషన్ల వారీగా సేకరిస్తున్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లను ఆ స్టేషన్ సిబ్బంది కనిపెట్టి ఉండేలా బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల సమయంలో రౌడీషీటర్ల మాటున నేతలు హల్చల్ చేసిన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా పోలీసు బాస్ ఇప్పటికే సబ్ డివిజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచి జిల్లాలో పనిచేసిన సీఐలను ఎన్నికల నేపథ్యంలో పొరుగు జిల్లాలకు సాగనంపారు. కొత్తగా వచ్చిన సబ్ డివిజన్ స్థాయి అధికారులతో పాటు ఇన్స్పెక్టర్లకు రౌడీల ఆగడాలపై పెద్దగా అవగాహన ఉండదని భావించిన ఎస్పీ ఫక్కీరప్ప రౌడీషీటర్లు టార్గెట్‌గా ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా వారి ప్రతి కదలికను ఎప్పటికప్పుడు డీఎస్పీలతో పాటు స్టేషన్ ఇన్స్పెక్టర్కు చేరవేసే బాధ్యతను కానిస్టేబుళ్లకు అప్పగించాలని అన్ని సబ్ డివిజనల్ అధికారులను ఆదేశించారు. 3,496 మంది రౌడీషీటర్లు జిల్లాలో రౌడీషీట్లు కలిగినవారు 3,496 మంది, కేడీ షీట్లు కలిగినవారు సుమారు 1,500 మంది ఉన్నారు. వీరిలో క్రియాశీలకంగా ఉండేవారు జిల్లా మొత్తం మీద 150 మందికి పైగా ఉన్నారు. ఏ+, ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి..వారు రెండు వారాలు లేదా నెలకు ఒకసారి స్టేషన్‌కు వచ్చి కనపడేలా చర్యలు చేపట్టారు. అయితే.. కొందరు సక్రమంగా రాకపోవడం, మరికొందరు అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నామని చెబుతుండటంతో.. వారు చెప్పే కారణాలు సహేతుకమేనా అనే విషయాన్ని కానిస్టేబుళ్లు వారి ఇళ్లకు వెళ్లి విచారించేలా బాధ్యతలు అప్పగించారు. స్టేషన్ల వారీగా నిఘా: కానిస్టేబుళ్లు రాత్రి గస్తీ (నైట్ బీట్) విధులు నిర్వహించేటప్పుడు, పాత కేసులకు సంబంధించిన వివరాల సేకరణకు వెళ్లినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న రౌడీషీటర్ల ఇళ్లను కచ్చితంగా టచ్ చేసి.. వారి కుటుంబీకులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని రావాలి. కానిస్టేబుళ్లు వెళ్లిన సమయానికి రౌడీషీటరు ఇంటి వద్ద లేకపోతే ఎక్కడికి వెళ్లారో కుటుంబ సభ్యులతో పాటు ఇరుగూ పొరుగు వారితో ఆరా తీయాలి. స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్ల వ్యాపకాలను పరిశీలించే కానిస్టేబుళ్ల నిఘా లోపమున్నట్లు తేలితే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఆదేశాలు ఇచ్చారు. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో నేతలు రౌడీషీటర్లను అన్ని విధాలా ప్రోత్సహించే అవకాశం ఉంటుందని భావించి రాజకీయాలకు అతీతంగా ఉక్కుపాదం మోపుతున్నామని ఓ సబ్ డివిజన్ అధికారి చెప్పారు. -
అత్యాచారయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
విజయనగరం టౌన్: బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు గంధవరపు గోపీని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ జి. పాలరాజు తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక ఆర్మ్డ్ పోలీస్ సమావేశ మందిరంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎస్,కోట మండలం బొడ్డవరలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని తోటి స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్‌పై వచ్చి బాలికను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి వాహనం ఎక్కించుకున్నాడని తెలిపారు. ఇంటికి తీసుకెళ్లకుండా సమీపంలో ఉన్న నవోదయ పాఠశాల సమీపంలో గల మామిడి తోటలోకి తీసుకెళ్లి మానభంగం చేసేందుకు ప్రయత్నించగా బాలిక పెద్దగా అరవడంతో నిందితుడు భయపడి పారిపోయాడని చెప్పారు. దీంతో బాలిక అక్కడ నుంచి ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పిందన్నారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.కోట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు. సంఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న బొడ్డవర జంక్షన్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా బైక్‌పై వచ్చిన వ్యక్తిని కొంతమంది బాలికలు గుర్తించారని తెలిపారు. వాహనం నంబర్‌ను ట్రేస్ చేసి విచారించగా ఆ వాహనం రెండు రోజుల కిందట జామి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి గురైందన్నారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడు గంట్యాడ మండలం పెంట శ్రీరామపురానికి చెందిన గంధవరపు గోపిగా గుర్తించామని చెప్పారు. వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో గాలించగా నిందితుడు ఎస్.కోట మండలం కొట్యాడ జంక్షన్ వద్ద గురువారం పట్టుబడ్డాడని తెలిపారు. పలు కేసుల్లో నిందితుడే.. నిందితుడు గంధవరపు గోపిపై ఇప్పటికే గంట్యాడ పోలీస్ స్టేష¯Œన్లో రెండు కేసులు, వన్‌టౌన్ పీఎస్‌లో ఒక బైక్ దొంగతనం కేసు, పెందుర్తి పీఎస్‌లో ఒక బైక్ దొంగతనం కేసు, గుర్ల పీఎస్‌లో ఒక చైన్ స్నాచింగ్ కేసు నమోదయ్యాయని ఎస్పీ పాలరాజు తెలిపారు. గోపి కొన్ని రోజుల కిందట విజయవాడ వెళ్లిపోయి నాలుగు రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చాడన్నారు. రెండు రోజుల కిందటే జామి పోలీస్‌స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనం చేశాడని.. ఆ తర్వాత బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడి పట్టుబడ్డాడని చెప్పారు. నిందితుడ్ని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన విజయనగరం డీఎస్పీ డి.సూర్యశ్రవణ్ కుమార్, ఎస్‌కోట సీఐ బి.వెంకటరావు, ఎస్‌కోట ఎస్సై అమ్మినాయుడు, గంట్యాడ పోలీసులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు, డీఎస్పీ సూర్యశ్రావణ్‌కుమార్ ఎస్‌కోట సీఐ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. -
పీడీ యాక్ట్ ప్రయోగించినా మారని బుద్ధి
సాక్షి, సిటీబ్యూరో: ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూనే ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి పీడీ యాక్ట్ ప్రయోగించినా అతడి బుద్ధి మారలేదు...జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ ఇళ్లలో చోరీలు చేస్తూ కుషాయిగూడలో మల్కాజ్గిరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..ఆటోడ్రైవర్‌గా పనిచేసే మహేష్ మద్యానికి బానిసై చోరీల బాట పట్టాడు. తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు కుటుంబసభ్యులతో కలిసి ఊరుకు వెళుతున్నారన్న విషయం తెలుసుకొని ఆయా ఇళ్లకు కన్నం వేసేవాడు. 2017లో తొలిసారిగా జవహర్‌నగర్ పోలీసులకు చిక్కిన అతడిని విచారించగా తొమ్మిది ఇళ్లలో చోరీలు చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి 32 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించి పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ సందర్భంగా అతడికి 12 రిసీవర్ సొల్లెటి శంకరాచారితో జైల్లో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది జూలైలో జైలు నుంచి విడుదలైన మహేష్ మళ్లీ చోరీలు చేస్తూ బంగారు ఆభరణాలను శంకరాచారికి అప్పగించి సొమ్ము చేసుకునేవాడు. జూలై నుంచి ఇప్పటివరకు 14 ఇళ్లలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు అతడి కదలికలపై నిఘా ఉంచారు. సోమవారం కుషాయిగూడలోని రాధిక ఎక్స్ రోడ్స్ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో అతను కుషాయిగూడలో నాలుగు, కీసరలో నాలుగు, జవహర్‌నగర్‌లో మూడు, అల్వాల్‌లో మూడు చోరీలు చేసినట్లు అంగీకరించాడు. -
జబర్దస్త్ ఫేం హరిపై పీడీ యాక్టు
చంద్రగిరి: ఎర్రచందనం కేసులో ముద్దాయిగా ఉ న్న యల్లంపల్లి హరిబాబు అలియాస్ జబర్దస్త్ ఫేం హరిపై పీడీయాక్టు నమోదు చేసినట్లు చంద్రగిరి సీఐ ఈశ్వరయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం కేసులో ముద్దాయిగా పలు కేసులు ఉన్న హరిని జులై 17వ తేదీన తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ మేరకు అతన్ని పీటీ వా రెంట్‌పై కోర్టులో హాజరుపరచడంతో తిరుపతి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నట్లు తెలి పారు. కాగా హరిపై పీడీ యాక్టు నమోదు చేయాలని అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నను కోరారు. కాగా కలెక్టర్ మంగళవారం పీడీ యాక్టును అమలు చేస్తూ.. ఆదేశాలు జారీ చేశారన్నా రు. ఈ మేరకు కడప జిల్లా కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఆయన తెలిపారు. -
రెండేళ్లు..100 ‘పీడీ’లు
సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పడిన రెండేళ్లలో 100 మంది నిందితులపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ ప్రయోగించి నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. చైన్‌స్నాచర్లు, రౌడీషీటర్లు, తరచూ చోరీలకు పాల్పడే దొంగలు, సైబర్ నేరగాళ్లు, మాదక ద్రవ్య నేరగాళ్లు, నకిలీ విత్తనాల కేటుగాళ్లు, భూకబ్జా రాయుళ్లు వరకు ఈ చట్టాన్ని ప్రయోగించి ఊచలు లెక్కించేలా చేస్తున్నారు. తొలుత గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరులపై పీడీ చట్టాన్ని ప్రయోగించిన పోలీసులు.. అభం శుభం తెలియని బాలికలను ఉపాధి పేరిట నగరానికి తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న వారిపైనా ఈ తరహా కేసులు నమోదు చేశారు. ఈ చట్టం ప్రయోగిస్తే ఏడాదిపాటు జైలుకే పరిమితం కావాల్సి వస్తుండడంతో ఇప్పుడిప్పుడే నేరాలు అదుపులోకివస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన రాపోలు వెంకట శివకుమార్ అలియాస్ శివ బీటెక్ కోర్సు మధ్యలోనే ఆపేసి ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. భార్య శాంతితో కలిసి వ్యభిచారాన్ని వ్యాపారంగా ఎంచుకున్నారు. చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీలో గది అద్దెకు తీసుకొని అమ్మాయిలను ఏపీనుంచి రప్పించి వ్యభిచార దందాకు తెరలేపారు. పోలీసులు దాడులు చేయడంతో మకాన్ని బోడుప్పల్‌లోని రాఘవేంద్రనగర్ కాలనీకి మార్చి వ్యవహారం కొనసాగించారు. ఈ విషయం తెలిసి పోలీసులు దాడులు చేయడంతో తప్పించుకపారిపోయిన ఈ దంపతులు పోలీసులకు ఎట్టకేలకు చిక్కి చర్లపలి జైల్లో ఊచలు లెక్కెడుతున్నారు. వీరు మళ్లీ బయటకు వచ్చినా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉండటంతో ఈ దంపతులపై శనివారం పీడీ యాక్ట్ ప్రయోగించారు. అభం శుభం తెలియని అమ్మాయిలకు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామంటూ నగరానికి తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న వీరిపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తాజాగా తీసుకున్న చర్యలతో పీడీ యాక్ట్‌లు విధించిన నేరగాళ్ల సంఖ్య 100కు చేరుకుంది. ఉమ్మడి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడం...ఇప్పటివరకు ఏకంగా 100 మంది నిందితులపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ ప్రయోగించి నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. చైన్‌స్నాచర్, రౌడీషీటర్లు, తరచూ చోరీలకు పాల్పడే దొంగలు, సైబర్‌నేరగాళ్లు, మాదక ద్రవ్య నేరగాళ్లు, నకిలీ విత్తనాల కేటుగాళ్లు, భూకబ్జారాయుళ్లు, వ్యభిచార గృహ నిర్వాహకులు నుంచి మొదలుకొని బడా నేరస్తుల వరకు జైలు నుంచి బయటకు రాకుండా నియంత్రిస్తూ నేరాలు అదుపు చేసే దిశగా పనిచేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులపై కూడా... 2016 ఆగస్టు ఎనిమిదిన పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులను కూడా వదిలిపెట్టడం లేదు. హత్యలు, మోసాలు, కిడ్నాప్‌లు, బెదిరింపు డబ్బు వసూళ్లు, భూ కబ్జాలకు పాల్పడిన శ్రీధర్ గౌడ్, సామసంజీవరెడ్డి, పొలిమెటి శ్రీహరిపై కూడా సీపీ మహేశ్ భగవత్ అవే చర్యలు తీసుకున్నారు. హత్యలు, మోసాలు, ఫోర్జరీ, భూకబ్జాలు చేస్తూ గుండాయిజం చేస్తున్న బైరు రాములు గౌడ్, లక్ష్మణ్ గౌడ్, యెగ్గె భిక్షపతిలపై పీడీ యాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకే పరిమితం చేశారు. దీనిద్వారా ఎటువంటి కరుడుగట్టిన నేరస్తుడినైనా వదిలేదే లేదని, నేరం చేసి అరెస్టు కావడం, బెయిల్ పొంది బయటకు రావడం, మళ్లీ పంథా కొనసాగించేవారిని ఉపేక్షించేదే లేదని సీపీ తన చర్యల ద్వారా చెబుతున్నారు. జైలుకే పరిమితం చేస్తున్నారు... ఇప్పటికే రాచకొండలో దాదాపు 100 మంది వరకు కరుడు గట్టిన నేరగాళ్లు జైల్లోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ చట్టం ప్రయోగిస్తే ఏడాదిపాటు జైలుకే పరిమితం కావాల్సి వస్తుండడంతో ఇప్పుడిప్పుడే నేరాలు కొంతమేర అదుపులోకి వస్తున్నాయి. ఉమ్మడి సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా ఈ వ్యవహరాన్ని తీవ్రంగా పరిగణించి పీడీ యాక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. అయితే రెండేళ్ల క్రితం సైబరాబాద్ కమిషనరేట్ విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన రాచకొండ పోలీసు కమిషనరేట్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ భగవత్ కూడా అదే పంథాతో ముందుకెళుతున్నారు. కోర్టు మానిటరింగ్‌పై ప్రత్యేక దృష్టి... కోర్టుల్లో కేసులను రుజువు చేసే దిశగా ‘కోర్టు మానిటరింగ్ సిస్టమ్’ను అమలు చేయడంపై సీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్, అభియోగపత్రం దాఖలు చేసినప్పటి నుంచి తుది తీర్పు వచ్చేవరకు పకడ్బందీగా పర్యవేక్షణ ఉండేలా ఫోకస్ పెట్టారు. నేరగాళ్లపై కఠిన చర్యలు...రాచకొండలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలు నిరోధించాలనే లక్ష్యంతో పీడీ యాక్ట్‌ను సమర్థంగా అమలుచేస్తున్నాం. ఆన్లైన్ ద్వారా మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు, సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్న రోజువారీ వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్ మోసాలకు పాల్పడుతున్నవారిపైనా కూడా ప్రయోగిస్తున్నాం. ఇప్పటికే మహిళల్ని వేధిస్తున్న పొకిరీలపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేశాం. అమాయక యువతులను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న నిర్వాహకులపై పీడీ యాక్ట్‌లు ప్రయోగించి మరోసారి నేరాలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. –మహేష్ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్ -
బందిపోటు ముఠా నాయకుడిపై పీడీ యాక్ట్
సాక్షి, సిటీబ్యూరో/దూద్‌బౌలి: పాతబస్తీలోని పేట్లబురుజులో ఉన్న నిథాయిదాస్‌కు చెందిన బంగారు నగల తయారీ కర్మాగారాన్ని కొల్లగొట్టిన మహారాష్ట్రకు చెందిన బందిపోటు ముఠా నాయకుడు అమ్జద్ ఖాజా అమీన్ షేక్‌పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ కొత్వాల్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్రలో అతడిపై 17 ఉన్నాయని, ఈ నేర చరిత్రను పరిగణలోకి తీసుకుని పోలీసు కమిషనర్ పీడీ యాక్ట్ నిర్ణయం తీసుకున్నట్లు చార్మినార్ ఏసీపీ బి.అంజయ్య గురువారం తెలిపారు. ముంబైకి చెందిన ఓ జ్యువెలరీ డిజైనర్ తరచూ నిథాయిదాస్‌కు చెందిన కార్ఖానాలకు వచ్చి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన, తాను రూపొందించిన డిజైన్లను చూపించేవాడు. ఈ నేపథ్యంలోనే ఇతడు పేట్లబురుజులోని కార్ఖానాలకు అనేకసార్లు వచ్చాడు. అక్కడ జరుగుతున్న లావాదేవీలు, సెక్యూరిటీ ఏర్పాట్లు తక్కువగా ఉన్న విషయం గుర్తించిన ఈ విషయాన్ని తన స్నేహితుడైన ముంబైలోని థానే వాసి అమ్జద్ ఖాజాకు చెప్పాడు. సదరు కార్ఖానాలో బంగారు నగల్ని ఏ ఇనుప పెట్టెలో దాస్తారనేది ఉప్పందించాడు. అప్పటికే పలు దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్న అమ్జద్ జ్యువెలరీ డిజైనర్ ఇచ్చిన సమాచారంతో గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ కార్ఖానాను టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ముంబైలో వివిధ ప్రాంతాలకు చెందిన పాత నేరగాళ్లు, స్నేహితులైన ఏడుగురితో ముఠా కట్టిన అమ్జద్ మార్చ్ 6న పంజా విసిరి 3.5 కేజీల బంగారు ఆభరణాల బందిపోటు దొంగతనానికి ఒడిగట్టాడు. నిందితుల కోసం వేటాడిన టాస్క్‌ఫోర్స్, చార్మినార్ పోలీసులు అదే నెలలో అమ్జద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. -
పల్లెల్లో మద్యం పడగ
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : నిండు వర్షాకాలంలో మంచి నీటి ఎద్దడి ఎదుర్కొనే పల్లెలు ఉండొచ్చేమో గాని.. మద్యానికి మాత్రం ఎలాంటి కొదువ లేదు. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపుతూ.. పెద్దఎత్తున దాడులు చేయిస్తోంది.. వ్యాపారులు, తయారీదారులపై పీడీ యాక్టు అమలుచేస్తోంది. ఫలితంగా సారా తయారీ, అమ్మకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఈ స్థానాన్ని బెల్టు దుకాణాలు ఆక్రమించాయి. ఏ మూల చూసినా అవే దర్శనమిస్తున్నాయి. వీటిపై నియంత్రణ కొరవడడంతో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. కిరాణం, శీతల పానీయాల దుకాణాలు, హోటళ్లు, పాన్ డబ్బాల్లో మద్యం వాసన గుప్పుమంటోంది. ఇంత జరుగుతున్నా ఆబ్కారీ, పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బెల్టుల సాయంతో అక్రమార్జన మహబూబ్‌నగర్ జిల్లాలో బెల్టు దుకాణాల సం ఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మద్యం వ్యాపారులు ఎక్కువ శాతం ఈ దుకాణాలపైనే దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో 66 వైన్స్ దుకాణాలుండగా ఒక్కోదానికి సగటున 20 నుంచి 40 బెల్టు దుకాణాలతో సంబంధాలుండటం విశేషం. మరికొంద రు దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి పల్లెల్లో ఇళ్ల దగ్గర, చిన్నపాటి హోటళ్లు, కిరాణ దుకాణాల్లో దర్జాగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ పేరుతో బోర్డులు తగిలిస్తున్న వ్యాపారులు బెల్టుల సాయంతో అక్రమార్జనకు తెరలేపుతున్నారు. ప్రతి రోజు వైన్స్‌తో సమానంగా బెల్టు దుకాణాల్లో వ్యా పారం సాగుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకో వచ్చు. జిల్లాలో బెల్టు దుకాణాల ద్వారా నిత్యం రూ.50 లక్షల వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలు స్తోంది. ప్రత్యేకంగా కొన్ని వైన్స్ దుకాణాలు ఇదే పనిగా ముందుకు సాగుతున్నాయి. అధికారికంగా డిపో నుంచి సరుకు తెచ్చుకుని రికార్డుల్లో నమో దు చేస్తూ బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. నాసికరం మద్యం.. బెల్టు దుకాణాల్లో అమ్మకాలు నాసిరకం మద్యానికి దారి తీస్తున్నాయి. వైన్స్ దుకాణాల నుంచి తీసుకొచ్చిన దానికి దుకాణదారులకు చెల్లించిన దానికంటే అదనంగా రూ.20 నుంచి రూ.30 ధర పెంచి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా సీసాల్లో మద్యాన్ని తొలగించి నీళ్లు కలుపుతున్నారు. బెల్టు దుకాణాల్లో బీర్లు కొనుగోలు చేయాలన్నా అదనంగా రూ.40 చెల్లించాల్సిందే. ఎక్కువ శాతం చీప్‌లిక్కర్ తాగే వారి కోసం బెల్టు దుకాణాల్లో కొన్ని బ్రాండ్లను అసలు ధర కంటే అదనంగా రూ.40కి విక్రయాలు సాగిస్తున్నారు. జిల్లాలో సుమారు 2 వేల కంటే ఎక్కువ సంఖ్యలో బెల్టు దుకాణాలు గల్లీగల్లీలో విస్తరించాయి. బెల్టు దుకాణారులకు మద్యాన్ని సరఫరా చేయడంతో సిండికేటు దందా సాగించే వారికి రోజువారీగా సగటున రూ.20 లక్షల ఆదాయం అదనంగా సమకూరుతోందని అంచనా. రూ.లక్షలు వెచ్చించి టెండర్ల ద్వారా దుకాణాలు దక్కించుకున్నందుకు లాభసాటిగా ఉండాలనే తాపత్రయంతో నిలువునా ముంచేస్తున్నారు. మరోపక్క అదనంగా డబ్బులు చెల్లించి బెల్టు దుకాణాలను కొనసాగించినందుకు మాకు లాభం లేకపోతే ఎలా? అనే ధోరణితో బెల్టు దుకాణం నకిలీ మద్యంతో మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. లేబుల్స్ తొలగించి విక్రయాలు ఎక్సైజ్ అధికారులు నిబంధనలు మాత్రం బేషుగ్గా ఆదేశిస్తున్నారు. మద్యం సీసాలను ఏ దుకాణానికి ఏ లేబుల్‌తో పంపిణీ చేశారో అధికారికంగా రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. ఆ దుకాణానికి సరఫరా చేసిన సీసాలను అక్కడే విక్రయించాలనే ఆదేశాలు సైతం జారీచేశారు. ప్రత్యేకంగా ఒక్కో దుకాణానికి ఒక్కో కోడ్‌ను కేటాయించారు. ఈ తతంగమంతా మద్యం గొలుసుకట్టు దుకాణాల విస్తరణకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే. ఆచరణలో చూస్తే కేవలం కాగితాలకే ఆ నిబంధనలను పరిమితం చేసి అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా వీధుల్లో మద్యం ఏరులై పారుతోంది. మరో పక్క ఏంచక్కా సీసాలకు ఉన్న లేబుల్స్‌ను తొలగించి విచ్చలవిడిగా బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ కూర్చోబెట్టి.. గ్రామాల్లో ఎక్కడ పడితే సిట్టింగ్ రూంలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల పోలీసులు ఏకంగా వైన్స్ సిట్టింగ్ రూంల వద్ద వాహనాలు తనిఖీ చేసి, బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు చేసి కేసులు చేస్తున్నారు. దీంతో మందుబాబులు ప్రధాన మద్యం దుకాణాలను వదిలి గ్రామాల బాట పడుతున్నారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం విక్రయాలకు అనేక నిబంధనలున్నాయి. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు చేపట్టాలి. నిల్వ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలి. కంప్యూటరైజ్ స్కానింగ్ చేయాలి. దీంతో ఏ రకం ఎక్కడి నుంచి ఎంత మొత్తంలో విక్రయించింది తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెద్దమొత్తంలో ఒకేసారి మద్యం విక్రయాలు చేస్తే సంబంధిత దుకాణంపై నిఘా ఉంచుతారు. అయితే జిల్లాలో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదని తెలుస్తోంది. బెల్టు దుకాణాల్లో మద్యంతోపాటు నీటి ప్యాకెట్లు, ప్లాస్టిక్ గ్లాసులు సైతం విక్రయిస్తూ అక్కడే మద్యం తాగేలా ప్రోత్సహిస్తున్నారు. -
హైదరాబాద్‌లో కిలాడీ లేడీ అరెస్ట్
-
ఘరానా మహిళ అరెస్టు.. 3 నెలల్లో 17 దొంగతనాలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఓ మహిళ 2009 నుంచి దొంగతనాలు చేస్తోంది. అందరి కళ్ళు కప్పి తప్పించుకుని తిరిగసాగింది. చివరికి పోలీసులకు చిక్కింది. వివరాలివి.. నగరంలో బ్యూటీ ప్లారర్లో దొంగతనాలకు పాల్పడుతున్న డైసి అనే ఘరానా మహిళను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె స్వస్థలం కడప. బ్యూటీ పార్లర్లే టార్గెట్‌గా మహిళ దొంగతనాలు చేసేది. డైసీ బీఏ లిటరేచర్ చదివింది.. దొంగతనాలకు అలవాటు పడింది. ఆమె నుంచి రూ. 17 లక్షల విలువ చేసే 63 తులాల బంగారాన్ని మారేడుపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి మాట్లాడుతూ.. ఆమె 2009 నుంచి నగరంలో దొంగతనాలు చేస్తోంది. మూడు నెలల్లోనే 17 దొంగతనాలు పాల్పడిందని తెలిపారు. ఆమె హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9, సైబారాబాద్‌లో 5, రాచకోండలో 3 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు డీసీపీ చెప్పారు. నగరంలో ఆమె దొంగలించిన సోత్తును మొత్తం రికవరీ చేశామన్నారు. అంతేకాక ఆ మహిళపై పీడీ యాక్ట్ పెడుతామని డీసీపీ సుమతి తెలిపారు.